Living in Oblivion

కొద్ది రోజుల క్రితం నవతరంగంలో విప్లవ్ వ్రాసిన ఒక వ్యాసంలో ఈ చిత్రాన్ని ఉదహరించి కొన్ని బిట్స్ ఇచ్చారు. ఆ బిట్స్ చూసాక ఈ సినిమా తప్పక చూడాలని నిర్ణయించుకున్నాను. ఆ వ్యాసాన్ని ప్రశంసిస్తూ అక్కడ వ్యాఖ్యానిద్దామనుకున్నాను కానీ వాళ్ళు నా IP బ్లాక్ చేసారుగా ;)    

ఆ సినిమా బిట్స్ నచ్చడానికి ఒక చిన్న కారణం వుంది. మీకు తెలుసో తెలియదొ శరత్ - ఒక గొప్ప దర్శకుడు! ఓ రెండు చిత్రాలకు(!?) దర్శకత్వం వహించాను. ఆ తరువాత ఆ సినిమాలు ఏమయ్యాయి, నేనేమయ్యాను అని అడక్కండి - వీలు చూసుకొని నేనే చెబుతాను.  చిత్రాలంటే చిత్రాలు కాదులెండి - డివిడి సినిమాలు. క్యాంకార్డర్ తో షూట్ చేసి డివిడిలు చేసి అమ్మాలని అప్పట్లో ప్రయత్నించానులెండి. అందుకే డైరక్టర్లు పడే కష్టాలు నాకు బాగా తెలుసు. ఆ కథా కమీశూ త్వరలోనే వివరిస్తాగా.  లో బడ్జెట్ సినిమా డైరెక్టర్లు పడే కష్టాలని ఆ సినిమాలో చాలా చక్కగా చూపించినట్లున్నారు.

ఈ సినిమాని నెట్‌ఫ్లిక్స్ లో ఆర్డర్ చేసాను. రేపు అందాక చూడాలి. ఆ సైటులో ఆ సినిమా నెట్టులో ఇన్స్టంటుగా చూడటానికి అందుబాటులో లేదు.  ఇలాగే ఏమయినా మంచి ఆంగ్ల సినిమాలు వుంటే సూచించండి. ఈమధ్య నెట్‌ఫ్లిక్స్ కి బాగా అలవాటు అయ్యాను.    అందులో బోలెడన్ని సినిమాలు వున్నాయి కానీ మనం సినీ మేధావులం కాదు కాబట్టి ఏవి మంచి సినిమాలో తెలియడం లేదు.   


Living in Oblivion

1995 R 92 minutes
Living in Oblivion takes you through one hellaciously funny day in the life of small-time independent filmmaker Nick Reve (Steve Buscemi). All Nick wants is to realize his artistic vision within the confines of an extremely low budget. Unfortunately, he keeps encountering a maddening number of obstacles, both real and imagined. Catherine Keener and James LeGros co-star.

3 comments:

  1. విప్లవ్ రెవ్యూ చదివిన తరువాత ఈ మూవీ నేనుకూడా చూశాను. It was surprisingly good. కానీ మన టాలీవుడ్ డైరక్టర్స్ వంశం బాబుల్తో,ముంబాయి బేబీల్తో పడే బాధలతో పోల్చుకుంటే, ఈ డైరక్టర్ పడే బాధలు nothing.

    ReplyDelete
  2. >>నా IP బ్లాక్ చేసారుగా <<

    బాద పడవద్దు. మీకు తోడు నేనున్నాను.మీకు నచ్చిన సినిమా మాత్రమే మంచి సినిమా కాదు అంటే, దొంగ ఐడిలతో రెచ్చగొట్టి మరీ IP బ్లాక్ చేసారు. మనం రాకపొతే వారికి వూడేది ఏమి లేదని వారి ఫీలింగ్.

    సినిమా బాగుంటే మీరు కూడా మీ విశ్లేషన వ్రాయండి.

    ReplyDelete
  3. @ నాగ్
    సో, మీకూ నచ్చిందన్నమాట ఆ సినిమా. ఈ వారాంతం తప్పక చూసి నా అభిప్రాయం చెబుతాను.

    @ డ్రీంస్
    నేనంటే తింగరోడిని కాబట్టి నా ఐపి బ్లాక్ చేసేరంటే ఓ అర్ధం వుంది కానీ మీది కూడానా! ఇంకొకరిది కూడా బ్లాక్ చేసేరట. రౌడీ గారిది కూడా బ్లాక్ చేసే వుంటారు. ఇలా ఒక్కక్కరి ఐపి లు బ్లాక్ చేస్తూ ఆ సైటు దినదిన ప్రవర్ధమానం అవ్వాలని ఆశిద్దాం :))

    మొదట్లో ప్రవీణ్ తనకు నచ్చని వారి ఐపిలు బ్లాక్ చేస్తున్నానని చెప్పుకుంటే మనకు అతని గురించి తెలుసు కనుక అర్ధం చేసుకున్నాం, నవ్వుకున్నాం. ఇప్పుడూ వీళ్ళు కూడా ఆ లెవలుకి ఎదిగిపోయారు. సంతోషం.

    ReplyDelete