నేను 'ప్రస్థానం' ఇంకా ఎందుకు చూడలేదంటే...

ఏదయినా సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మా చిన్నపాప నా అభిప్రాయం అడుగుతుంది. నేను బావుంది అన్నది కాక మరొకటి తాను తీసుకుంటుంది. ఇలాక్కాదని నాకు నచ్చనిది చెప్పడం ప్రారంభించాను. అప్పుడు మాత్రం నేను చెప్పిందే తీసుకుంటుంది :(

అలాగే వారికి నచ్చని వ్యాఖ్యాతల IPలు బ్లాక్ చేసే సైటు వారు ఈ సినిమా బావుందన్నప్పుడు ఈ సినిమా చూద్దామనుకున్నాను. కానీ... ఆ సినిమా గురించి అదే పనిగా మెడకో డోలు కట్టుకొని తెలుగు సినిమా సమీక్షలు చేయం అన్న ఆ సైటు వారు ఈ తెలుగు సినిమాకు మాత్రం డప్పు కొడుతూ, సమీక్షల పోటీలూ పెడుతూ హడావిడి చేస్తుండే సరికి ఎందుకయినా మంచిదని చూడకుండా ఆగాను.   

నా అనుమానానికి తగ్గట్టే వీరి హైప్ ని చూసి ఆ సినిమాకు వెళ్ళిన కొందరు ఆ సినిమానీ, ఈ IP అడ్రసు బ్లాకింగ్ సైటునీ  తిట్ల దండకం అందుకున్నారు. మీరు చెప్పింది విని సినిమా చూసి ఇన్నిన్ని రూపాయలు తగలేసామని మండిపోయారు. ఇంకా నయ్యం - నష్టపరిహారం క్రింద ఈ IP బ్లాక్ తరంగం మీద వారు దావా వెయ్యలేదు! మరి కొందరు ఈ సినిమాని ఆ సైటు వారు ప్రమోట్ చేయడంలో నకిలీ కణికుడి వ్యవస్థ వుందేమో లేక రామోజీ రావు హస్తం వుందేమో అని కాన్స్పిరసీ థియరీలు అల్లారు! గ్యారంటీగా వీరి ఐపిలు బ్లాకయి వుంటాయి.  మరి కొంతమంది ఆ సినిమాని మెచ్చుకున్నారు కూడా. దానితో 'టు డూ ఆర్ నాట్ టు డు' అన్న ధర్మ సందేహంలో పడిపోయాను. చివరికి రాజీ మార్గానికి వచ్చేసాను. ఈ సినిమాను  ఎందుకయినా మంచిదని అన్ని డబ్బులు పెట్టి సినిమా హాలుకు వెళ్ళి చూడొద్దనీ, ఆ సైటు వారు మరీ మరీ ఎగదోసి చెప్పారు కాబట్టి ఒఖ్ఖ డాలరు మాత్రం పెట్టి పైరేటేడ్ సినిమా మాత్రం చూడాలనీ డిసైడ్ అయిపోయాను. ఎలా వుందంటారు నా నిర్ణయం? 

IB (ఐ.పి. బ్లాక్) తరంగం వారు ఓ తెగ రికమెండ్ చేసిన సినిమా పైరేటేడ్ కాపీలు ఇంకా మా దగ్గరకు రాలేదు. నిన్న వెళ్ళి చూసాం కానీ ఈ సినిమా కాపీలు కనిపించలేదు.  కాపీ వచ్చాక సినిమా చూసి ఆ ఒఖ్ఖ డాలరూ తగలెట్టానని ఆ IBT (తరంగం) సైటు వారిని నేను కూడా తిట్టుకుంటానో లేక ఆ డాలరుకి కనీస న్యాయం జరిగిందనిపించిందో మీకు చెబుతానులెండి.  ఈ సినిమా చూసాక IBTకి  సమీక్ష రూపంలో నా అభిప్రాయాన్ని పంపితే ఓ 500 రూపాయలు నా ముఖాన విసిరేస్తారంటారా? అప్పుడు నాకు కనీసం తొమ్మిది డాలర్లు లాభం అవుతుంది.    

16 comments:

  1. తమకి కావాలంటే నాదగ్గర torrent ఉన్నది అద్భుతమైన క్వాలిటీ ..... మెయిల్ పంపెడను

    ReplyDelete
  2. matter naaku peddagaa nachaka poyinaa pics matram kevvvvvvv :)

    ReplyDelete
  3. Srinivas gaaru can u send me da torrent link raghav.karanam@gmail.com

    ReplyDelete
  4. నాకు నచ్చక పోవడానికి నా own రీజన్స్ వున్నాయి. BUT డైరక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ కు కనెక్ట్ అయితే సినిమా సూపర్.

    ఎడిటడ్ వర్షన్ చూడండి. సీరియస్ సినిమాలు ఇష్టపడితే, నచ్చే అవకాశాలు ఎక్కువే.

    ReplyDelete
  5. www.tollytorrents.com

    ReplyDelete
  6. @ శ్రీనివాస్,
    ఒఖ్ఖ డాలరూ ఎందుకు దండగంటారా? నాకు అలా డవున్లోడ్ చేసుకొని చూసేంత ఓపిక లేదులెండి. అయినా పైరేటెడ్ సినిమా చూస్తుంటే వచ్చే మజానే వేరు లెండి :)

    @ రాఘవ్
    ఏదో ఒకటి నచ్చింది కదా మీకు ఈ టపాలో. నా బ్లాగు మొఖానికి అదే పదివేలు :)

    @ డ్రీంస్
    బెగ్గర్ కెన్నాట్ ఛూజ్ అన్నట్లుగా నేను చూడబోయేదే పైరేటెడ్ కాపీ - ఇంకా అందులో మరీ ఎడిటెడ్ వర్షనే కావాలని పట్టుబడితే కొంచెం బావుండదేమో :) ఒకవేళ ఆ కాపీనే ఎడిటెడ్ ది అయితే సంతోషమే.

    ReplyDelete
  7. You dont have to spend even $ 1 for that. It is available online. Check for www.cinetalkies.net

    Siddharth

    ReplyDelete
  8. " సైటు వారు మరీ మరీ ఎగదోసి చెప్పారు కాబట్టి ఒఖ్ఖ డాలరు మాత్రం పెట్టి పైరేటేడ్ సినిమా మాత్రం చూడాలనీ డిసైడ్ అయిపోయాను. ఎలా వుందంటారు నా నిర్ణయం? " సూపరు, బెమ్మాండం గా ఉంది. ఆ సైట్ వాళ్లు ఎగేసుకొని చెప్పారు కాబట్టే, పొరపాటున కూడా ఇంతవరకూ ఆ సినెమా నేను చూడలేదు. ఇలానే చెప్పిన "ఒరే కడల్" అనే మళయాళ సినెమా చూసి కోలుకోవటానికి ఓ వారం పట్టింది. ఇంక ఈ సినెమా వాళ్లు లొగుట్టుగా ఏమి ఇచ్చారో కాని, దానికి బహు"మతులు" కూడా పెట్టారు.
    మంచి నిర్ణయం. పైరేటెడ్ కాపీలు వచ్చాయా అమెరికాలో, ఇంకా రాలేదా? వస్తే ఓ ముక్క ఇక్కడ వ్రాయండి.

    ReplyDelete
  9. @ సిద్ధార్ధ్
    వాళ్ళు సినిమా చూడండహో అని చెవిలో జోరీగలాగా సైటులో చెబితే నేను ఇలా ఒఖ్ఖ డాలరు కూడా పెట్టకుండా ఉచితంగా చూసేస్తే వాళ్ళు నామీద ఇంకా అలుగుతారేమో కదా సిద్ధార్ధ్ :(

    @ అజ్ఞాత
    హమ్మయ్య. ఇప్పటికి మీరొక్కరన్నా నా కఠోర నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. సంతోషం. కాపీ రాగానే కేక వేస్తానులెండి.

    ReplyDelete
  10. one thing i must admit sarath! u r really a nice funny gu(a)y:-).
    some clarification:what i put in()is not mean to hurt you, you can choose whatever. i respect each n every ones choice.

    ReplyDelete
  11. @ క్రిష్ణ
    మీ ప్రశంసకు ధన్యవాదాలు :) నేను గే/బై అని బహిరంగంగా ప్రకటించుకుంటూనే వున్నాను కాబట్టి ఇంకా అందులో నొచ్చుకునేదేమీ లేదు.

    ReplyDelete
  12. శరత్ గారూ
    నవ మానభంగం సైట్ మనమూ పెట్టేస్తే సరి
    వర్డ్ ప్రెస్ కదా :D
    రెండు నిమషాల్లో పని
    సాంకేతిక విషయాలను నాకు ఎవరినా అందించండి అక్కడ కుమ్మేద్దాం

    ReplyDelete
  13. www.navamaanabhangam.com
    రిజిస్టర్ చేసెయ్యండి వెంటనే

    ఆసియా డొమైన్ 616 రూపాయలకే అని చెరసాల శర్మ బ్లాగులో పెట్టాడు
    అతని హెల్ప్ తీసుకుందామా? :)

    ReplyDelete
  14. Nice analysis....:)..Pics super as usual.

    ReplyDelete
  15. అయ్యా బాబో ఇన్ని లెక్కలున్నాయా?ఒక సినిమా చూడాలంటే?అదృష్టవంతుడ్ని..ధియేటర్ లకు వెళ్ళడం మానేశా..ఆహా అసలు సినిమాలు చూడ్డమ్ లేదు....టివి లో అప్పుడప్పుడూ యాడ్ ల మద్య చూడమే..

    ReplyDelete
  16. @ అజ్ఞాత
    పేరు బావుంది. ఆ సైటేదో మీరే రిజిస్టరు చేసెయ్యండి. నేను పుక్కడ్కి అందులో టపాలు వ్రాస్తానేం :)

    @ రిషి
    :)

    @ kvsv
    సర్లెండి. ఇలా లెక్కలెయ్యకుండా పోలో మంటూ ఫ్యామిలీ అంతా బయల్దేరి దాదాపు అరవై డాలర్లు వదిలించేసుకొవడమే కాకుండా అందుకు గాను మనశ్శాంతిని వదిలించుకున్న సందర్భాలు చాలా వున్నయ్. అందుకే ఈమధ్య జాగ్రత్తపడుతున్నాం. నిన్నే హాలు కెళ్ళి డార్లింగ్ చూడాలనే ఆనందం కలిగింది కానీ ఆపుకున్నాం. యాడ్స్ మధ్య సినిమాలు చూసి తరించే మీ పద్ధతేదో బాగానే వున్నట్లుంది కానీ మా ఇంట్లో అన్ని సార్లూ వర్కవుట్ అవదు. అది అదే - ఇది ఇదే అంటారు మా ఇంటోళ్ళు.

    ReplyDelete