డామినో ఎఫెక్ట్

ఉదయం లంచ్ బాక్సులోకి చపాతీలు లేవు. అన్నం వుంది కానీ దానిని బాక్సు కట్టేంత ఓపిక, సమయం లేవు. మరి మీ ఆవిడ ఏం చేస్తోందీ అని తొట్టి ప్రశ్నలు అడక్కండి.    ఇవాళ ఆఫీసు కేఫిటేరియాలో తినక తప్పేట్లుగా లేదు అనుకొని ఆఫీసుకి వచ్చేసాను. లంచ్ టైముకి ఆఫీసు కేఫిటేరియాకి వెళదామనుకునేంతలో అది శుక్రవారం తెరచి వుండదని గుర్తుకు వచ్చింది. బయటకి వెళ్ళి తినేయాలని అర్ధమయ్యింది. బయటకి వెళ్ళేదెప్పుడూ తినేదెప్పుడూ, అది అరిగేదెప్పుడూ, నేను లంచ్ అవర్లో జిమ్ము కెళ్ళేదెప్పుడూ అని బెంగపడుతూ బయటకి వెళ్ళి ఫూట్‌లాంగ్ సబ్ మొత్తం తినేసాను.  అలా ఫుడ్డు ఫుల్లుగా లాగించి జిమ్ముకెళ్ళలేదే అని చింతిస్తూ మన్ను తిన్న పాములాగా నెట్టు బ్రవుజ్ చేస్తూ ఇలా ఇలా వ్రాస్తూ కాలక్షేపం చేస్తున్నాను.  

చూసారా ఇంట్లో ఒక్క రెడీమేడ్ చపాతీ లేకపోవడం వల్ల వచ్చిన కాస్కేడింగ్ ఎఫెక్ట్!   ఇంకా దీని సీక్వెన్స్ ప్రభావం ఇంకా వేటివేటి మీద పడుతుందో ఏమో ఈరోజు.  అందుకే ఎప్పుడూ అనుకుంటాను మొదటే జాగ్రత్త పడాలని కానీ అన్ని సార్లు సాధ్యం కాదనుకోండి. మరో సారి తెలిసివచ్చింది. మీకు కూడా చాలా సార్లు ఇలాంటి ఎఫెక్ట్ పడివుండొచ్చు కదూ. 

11 comments:

  1. సాధారణంగా ముందు రోజు రాత్రి మర్నాటి లంచ్ రడి చేసుకోవడం అలవాటు చేసుకుంటే ఇలాంటి ఇబ్బందులు రావు. కాస్తంత జాగ్రత్తగా ఉండాలి బయట తినేటప్పుడు. ఇంకో చిట్కా. బయట తినడానికి వెళ్ళేటప్పుడు నాలుగు డాలర్లకన్నా ఎక్కువ డబ్బులు జేబులో పెట్టుకోకండి. చచ్చినట్టు చిన్న శాండ్ విచ్ తినవల్సి వస్తుంది. అయినా డిసిప్లిన్ లేకపోతే అంతే.

    నా మటుక్కి నేను ఆఫీసులో మాగీ నూడిల్స్ లాంటివి ఉంచుకుంటాను అత్యవసర పరిస్థితుల్లో పనికొస్తుందని.

    ReplyDelete
  2. @ అజ్ఞాత
    నిజమే. ముందు రాత్రి లంచ్ ప్రిపేర్ చేసుకోవడం ఉత్తమం. ఆ అలవాటు చేసుకోవాలి.

    ఇంకొద్ది రోజులు జిమ్ము కెళితే నాకు, నా మనస్సుకు క్రమశిక్షణ వస్తుంది లెండి. వ్యాయామంలో ఉన్న మంచితనం ఏమిటంటే శరీరంతో పాటు మనస్సూ గట్టిపడుతుంది.

    ReplyDelete
  3. బద్దకిస్తే అంతేమరి:)

    ReplyDelete
  4. @ Prerana
    నాది బద్దకం అంటారా! మరి మీ ప్రొద్దునే లేచిపోవడం ఎంతవరకు వచ్చిందో మళ్ళీ చెప్పారు కాదు :)

    ReplyDelete
  5. ఒక్క శుక్రవారానికే ఇలా బాధపడితే ఎలా? ప్రతీ శుక్రవారం నాకు సబ్వేనే గతి!

    ReplyDelete
  6. పొద్దున్నే 5 కి లెచి lunch ready చెసుకుంటే, ఇబ్బంది ఎమీ వుండదుకదా !

    ReplyDelete
  7. ఏమిటండి సబ్ మంచిదే కదా అంత బాధ పడతారేమిటి మీరు మరీను అదేదో పిజ్జా హట్ కెళ్ళీ బఫే తిన్నట్లు...

    ReplyDelete
  8. @Bhavana:

    Subway manchidaa ? Evarandee aa maata annadi.Sandwich (veg) aithene comparitively takkuva calories untaayi. Plus veg ainaa non-veg ainaa,aa sauce lu annitlo mayonese untundi.Mayonese has lot of fat.If you google for mayonese, you will know how high calorie and also unhealthily fatty it is.

    ReplyDelete
  9. btw, sharattu babu, what do you eat along with chapathis ? koora untundaa intlo roju lunch box loki? lepote kuratho thinu, pachadi tho kanna, baruvu taggutaav.

    ReplyDelete
  10. @ అజ్ఞాత
    :)) అర్ధమయ్యింది మీ సమస్య! ప్చ్. ఏంచేస్తాం. సర్దుకుపోవాలి మరి.

    @ శ్రీరాం
    ఆఫీసుకి సమయానికి లేచివెళ్లడమే ఎక్కువ. ఇంకా అయిదు గంటలకు లేవడమా. నావల్ల కాదు బాబూ.

    @ బావన
    నా ఏడుపు మీకు సరిగ్గా అర్ధం కాలేదండీ. ఆరించుల సబ్ తిని నేను వుండొచ్చుగా - జిమ్ముకు వెళ్ళలేకపోయాననే బాధతో, విచారంతో ఫూట్‌లాంగ్ లాగించాను. నాకు సంతోషం వేసినా, విచారం వేసినా ఆకలి ఎక్కువవుతుంది లెండి. అయినా ఫరవాలేదులెండి. ఎప్పుడూ వెజ్ సబ్ తీసుకుంటాను.

    @ అజ్ఞాత
    కూర ఇంట్లో వుంటుంది కానీ అది పెట్టుకునేంత ఓపిక. తీరిక వుండదు కనుక ఆఫీసులో ఒక పచ్చడి బాటిల్ పెట్టుకున్నాను. రాత్రే లంచ్ ప్యాక్ చేసుకుంటే కూర పెట్టుకోవడానికి కూడా తీరిక వుంటుంది లెండి. అలవాటు పడాలి.

    ReplyDelete
  11. koora ekkuva tinte, chapathilato baruvu taggutaaru. Endukante,kooralaki metabolic rate penche shakti undi.adee sangathi anniah.

    ReplyDelete