మా ఫ్రెండ్స్ నన్ను తిట్టారు!

నా డెంటల్ ఫ్లాసింగు గురించి కాదులెండి. గత వారాంతం మా ఇంటికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వస్తే వాళ్లని 'విలేజులో వినాయకుడు' సినిమా చూసారా అని అడిగాను. చూడలేదు, ఏం అన్నారు. అందులో మా బ్లాగర్ ఫ్రెండ్ నటించారు. అందుకే ఆ సినిమా చూడాలని డివిడి తెచ్చుకున్నా అని పొరపాటున చెప్పాను. అప్పుడు అందుకున్నారు. ఎప్పుడూ ఆ ఫ్రెండు నటించాడు, ఈ ఫ్రెండ్ నటించాడు అని మీరు మాకు చెప్పుకోవడమేనా? మేము అలా చెప్పుకోవద్దా. మా పరువులు పోతున్నాయి. మీరు వెంటనే ఏదయినా సినిమాలో నటిస్తే మీ గురించి కూడా మా స్నేహితులకి చెప్పుకుంటాము కదా! అని అందరూ కలిసి దులిపారు.

అసలే చిరుతాగుబోతును. అనగా అప్పుడప్పుడు మాత్రమే అదీ కొద్దిగా మాత్రమే తాగి ఆర్గాజం తెచ్చుకునే టైపు మనది. ఒక పెగ్గు మీద వున్నానప్పటికి. వాళ్ళు ఆ రకంగా అంటూ నన్ను తిడుతున్నారో, పొగుడుతున్నారో అర్ధం కాక ముసిముసినవ్వులు రువ్వుతూండిపోయాను.  ఎవరన్నా అర్జంటుగా నాక్కూడా సినిమా ఛాన్స్ ఇప్పించేయండబ్బా.  మరీ హీరో పాత్ర వద్దులే కానీ కామెడీ రోలో, క్యారెక్టర్ రోలో ఇస్తే వేసుకొని తన్మయత్వం చెందుతాను.

ఆ సినిమాలో బ్లాగర్ రవిగారు నటించారని తెలిసి ఎలాగయినా ఆ సినిమా చూడాలని మా ఆవిడ ఆ సినిమా వద్దంటున్నా పట్టుబట్టి డివిడి తెచ్చుకున్నాను కానీ ఏం లాభం? శనివారం ఫస్ట్ షోగా మా ఇంట్లో వేద్దామంటే అబ్బే అది వద్దు లీడర్ చూద్దామని మా ఆవిడ. నన్ను నా సినిమా పెట్టుకోనివ్వలేదు. పోనీ ఆదివారం చూద్దామంటే వల్ల కాదంటూ ఏ మాయ చేసావె పెట్టేసారు. ఏం చేస్తాను. వచ్చే వారాంతానికయినా ఆ సినిమా చూడాలని కంకణం కట్టుకున్నాను. వచ్చే వారాంతం విలేజిలో వినాయకుండు సినిమా ప్రాప్తిరస్తు అని అందరూ దీవించేయండి మరి. ఆ సినిమాలో రవి గారు ఏ పాత్ర వేసారు, ఎలా వేసారు, సినిమా కథ ఏంటి, ట్విస్టులేంటి అని పైత్యతరంగం వారి మాదిరిగా అంతా నాకు చెప్పేయకండి మరి.  

6 comments:

  1. @ అజ్ఞాత
    DR అంటే డాక్టరుగా నటించారని అర్ధమా?

    ReplyDelete
  2. ఈ మద్దినే రెండుమూడుసార్లు మందేసినట్లు కీ బోర్డు జారారు, మళ్ళీ చిరు తాగుబోతునని బుకాయించడం బాలేదేమో :)))

    ReplyDelete
  3. "ఎవరన్నా అర్జంటుగా నాక్కూడా సినిమా ఛాన్స్ ఇప్పించేయండబ్బా." కత్తి గారిని అడగకపోయారా? ;)

    ReplyDelete
  4. Recently, In Zee Telugu, "Viliagelo Vinayakudu" was screened. During that time, I've called to Nagaprasad and asked about the role of "Ravi gaaru".

    ReplyDelete
  5. @ జీవని
    'వాంటేజ్ పాయింట్' సినిమా చూసారా? అందులో ఒకే సన్నివేశాన్ని రకరకాల దృక్కోణాలలో చూపిస్తారు. అలాగే నేను ఈమధ్య తాగింది ఒక పెగ్గేనండి కానీ వివిధ టపాలలో సందర్భానికి తగ్గట్టుగా వాడుతున్నాను. కొన్ని విషయాలల్లో నాకు అల్పానందం ఎక్కువగా వుంటుంది లెండి :))

    @ అజ్ఞాత
    కత్తి గారిని అడిగితే అనుభవించేస్తారు. ఐ మీన్ వారి చిత్రాలను ప్రేక్షకులు అనుభవించేస్తారని నా భయం.

    @ వీరుభొట్ల
    అవునండీ. టివిలో వచ్చిందని రవిగారు తన 'టివి ప్రభావమే ఎక్కువా?' అన్న టపాలో కూడా తెలిపారు.

    ReplyDelete