పుస్తకం ప్రింటింగుకి

నా గే పుస్తకం ఈ సోమవారం నుండీ ప్రింటింగుకి వెళుతోంది. వారం పదిరోజులు పట్టొచ్చన్నారు ప్రింటర్స్. ఇక డిస్ట్రిబ్యూటరుని వెతుక్కోవాలి.  ఆ పుస్తకం అమ్మగల ధైర్యం వున్న బుక్ డిస్టిబ్యూటర్స్ ఎవరయినా వుంటే సూచించండి.   

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు కేవలం తమ పుస్తకాలనే డిస్ట్రిబ్యూట్ చేస్తారా లేక ఇతరులవి కూడా చేస్తారా? 

దయ్యాలతో నా సహవాసం!

ఎవరయినా ఒంటరిగా ఈ సమయంలో ఈ భవనంలో పై అంతస్తుకి వెళ్ళి రాగలరా?

భువనగిరిలో తొమ్మిదవ తరగతి చదువుకుంటున్న రోజులవి. ఒక దగ్గర రాత్రి ట్యూషన్లు చెబుతుండేవారు. అందులో పగలంతా ప్రైవేటు పాఠశాల నడుస్తుండేది. ఆ భవనం రెండు అంతస్తులు వుంటుంది. ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలు కావస్తోంది. సైన్స్ ట్యూషన్ అయిపోయింది. మాస్టారు ఏదో లోకాభిరామాయణం మాట్లాడుతూండగా టాపిక్ దయ్యాల మీదికి మళ్ళింది. అప్పుడు పై విధంగా మా సైన్స్ మాస్టారు సవాలు చేసారు.  ఒక్క విద్యార్ధి కానీ, విద్యార్ధిని కానీ ఆ సవాలుని స్వీకరించలేదు. నేను దయ్యాలను నమ్మను గానీ అవంటే చచ్చేంత భయ్యం.

ఎందుకు సారు అలా ఛాలెంజ్ చేస్తున్నారు? వెళితే ఏమవుతుంది అని నా పక్కనున్న అబ్బాయిని అడిగాను. రాత్రి పూట ఈ భవనంలో పై అంతస్తులో దయ్యాలు తిరుగుతుంటాయి అని చెప్పాడు. నా పై ప్రాణాలు పైనే పోయాయి. నిజ్జంగా అని అడిగాను నా కంగారు అణుచుకుంటూ. నిజమేనట, చాలా మందికి దయ్యాలు తిరుగున్నట్లుగా దాఖలాలు కనిపించాయిట. అందుకే ఈ భవనంలో రాత్రి ఎవ్వరూ ఒంటరిగా వుండరు అని చెప్పాడు.   కెవ్వ్ అనే కేకని బలవంతంగా అణుచుకున్నాను.    

ఇదంతా ఎన్ని ఏళ్ళనుండి జరుగుతుందేమిటి అని అడిగాను మనస్సు చిక్కబట్టుకుంటూ. దాదాపు ఏడెనిమిది ఏళ్ళనుండీ జరుగుతోందిట అన్నాడు వాడు. మరో సారి కెవ్వ్ ని ఆపేసాను. మరి అంతకుముందు ఏమయ్యిందట? అప్పుడు ఈ భవనం ప్రశస్తి దయ్యాలకి తెలియదటనా అని కంగారుగా అడిగాను. ఈ స్కూలు పెట్టకముందు ఈ భవనంలో కొత్త డాక్టర్లు ఎవరో వైద్యశాల పెట్టారనీ వాళ్ళు అనుభవం తెచ్చుకుంటున్న క్రమంలో కొంతమంది పేషెంట్లు టపా కట్టారనీ వాళ్ళే దయ్యాలయిపోయారనీ వివరించాడు.   మరోసారి కూడా నా కెవ్వుని బలవంతంగా అదిమివేసాను.    

ఇన్ని సార్లు నేను కెవ్వు కెవ్వు మనడానికి ఒక బలీయమయిన కారణం వుంది. అదేంటంటే ఆ భవనంలో ఒక రెండేళ్ళ క్రితం కొన్ని నెలలు గడిపాను! ఆ విషయం నా పక్కనున్న అబ్బాయికి తెలియదు. ఈ భవనంలో దయ్యాలున్నాయనే విషయం నాకు అప్పటివరకూ తెలియదు.  దయ్యాలున్నాయని తెలిస్తే ఆ భవనంలో చచ్చినా వుండేవాడిని కాదు. నన్ను మోసం చేసి, నిజాలు దాచి నన్ను ఆ భవనంలో ఒకరు వుంచారు. ఆ వ్యక్తికి నా భయాలు తెలిసీ నన్ను మభ్యపెట్టి ఆ భవనంలో ఎందుకు వుంచారో కనుక్కోవాలని స్ట్రాంగుగా డిసైడ్ అయ్యాను.

ఆ వ్యక్తి కూడా అక్కడే మరో సబ్జెక్టులో ట్యూషను చెబుతారు. క్లాసు నుండి బయటకి రాగానే వారు కలిసారు. ఇద్దరం కలిసి ఇంటి వైపు నడిచాము. అప్పుడు ప్రస్థావించాను ఈ విషయాన్ని. "నాన్నా, ఈ భవనంలో దయ్యాలు వున్నాయట కదా" అని అడిగాను
"అవును అలాంటి ప్రచారాలు వున్నాయి"
"మరి అప్పుడు మనం ఈ భవనంలో నివసించినప్పుడు ఎందుకు చెప్పలేదు?"
"చెబితే నువ్వు భయపడతావని చెప్పలేదు. అయినా దయ్యాలు అనేవి ఒక అభూత కల్పన. నీకు తెలుసుకదా"
నాకు తెలుసుగానీ దయ్యాలకు అవి లేవన్న విషయం తెలియదు కదా అని మనస్సులో అనుకున్నాను. "మరి ఈ భవనంలో దయ్యాలున్నాయని అందరూ ఎందుకనుకుంటున్నారు?"
"మనం వుండక ముందు చాలామంది ఇక్కడ కిరాయికి వుండేవారు. వారికి రాత్రి ఎవరో నడుస్తున్నట్లు, చెక్క మెట్ల మీద నడుస్తున్నట్లు కిర్రు కిర్రు శబ్దాలు అలా అలా ఏవేవో ధ్వనులు వినిపించేవిట. అందుకే అలా భయపడ్డారు" 
"మరి మనం వున్నప్పుడు ఆ శబ్దాలు వినిపించలేదా?"
"వినిపించాయి. కానీ నేను దయ్యాలని నమ్మను కాబట్టి భయపడే బదులు ఆ శబ్దాలు ఎక్కడినుండి వస్తున్నాయో పరిశీలించాను" అని మా నాన్నగారు అన్నారు
"మరి ఏం తేలింది?"
"ఈ భవనం పక్కనే బార్ వుందికదా. అందులో వాళ్ళు మెట్లు ఎక్కుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, ఇతర పనులు చేస్తున్నప్పుడు వచ్చే రిసౌండే ఆ శబ్దాలు"
"మరి నాకెందుకు ఆ శబ్దాలు వినిపించలేదు"
"ఈ భవనంలో దయ్యాలు వున్నాయని నీకు తెలిసివుంటే నీకు కూడా ఆ శబ్దాలు వినిపించివుండేవి" అన్నారు మా నాన్నగారు నవ్వేస్తూ.   

మా నాన్నగారిని ఈ విషయం అడగడానికి రెండేళ్ళకు పూర్వం  నేను మా స్వగ్రామంలో చదువుకునేవాడిని. మా నాన్నగారు భువనగిరిలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తూండేవారు. క్రింద ప్రైవేటు పాఠశాల నడుస్తుండేది. దయ్యాలకు భయపడి పైన ఖాళీగా వుంటుండటంతో, ఆ స్కూల్ ప్రిన్సిపాల్ మంచి మిత్రులు అవడంతో వారిని అడిగి మా నాన్నగారు అక్కడ నివసిస్తుండేవారు. అప్పుడు ఒక సారి మా నాన్నగారితో పాటు నేను కూడా భవనగిరికి వచ్చి కొన్ని నెలలు ఆ భవనంలో వున్నాను. ఆ తరువాత ఒక ఏడాదికి  మా అమ్మ , నేను కూడా భువనగిరి వచ్చి వేరే ఇల్లు తీసుకొని వుంటూ వచ్చాము. 

మరి ఇంత తెలిసాకనయినా ఆ భవనంలోని పై అంతస్తులోకి రాత్రి పూట ఒంటరిగా వెళ్ళాలనుకున్నానా? అంత దృశ్యం లేదు నాకు :(

బెల్జియంలో బురఖా బ్యాన్

బెల్జియం దిగువ సభ పబ్లిక్ ప్రదేశాలలలో బురఖాను వేసుకొని తిరగడన్ని నిషేధిస్తూ చట్టం ఆమోదించింది. వ్యక్తి యొక్క ముఖం చూడలేకపోవడం వల్ల భద్రతా పరమయిన సమస్యలు ఉత్పన్నమవుతాయనీ, మహిళలను అణగద్రొక్కే విధానమనీ కారణాలు చూపి ఆ నిర్ణయం తీసుకున్నారు.   అలాంటి నిషేధమే అన్ని దేశాలతో సహా ఇండియాలో కూడా రావాలనీ, ముస్లిం మహిళలకూ స్వేఛ్ఛ వుండాలనీ కోరుకుంటున్నాను.

అలాగే మగవారికి అన్ని మతాలు ఒక్కటేననీ అన్ని మతాల స్త్రీల ముఖార విందాలను దర్శించే భాగ్యం మగవారికి వుండి తీరాలనీ సెలవిస్తున్నాను.  అంతకు కావాలంటే ఆడవారి చూపులు పడకుండా లేదా నాలాంటి మగవారి చూపులు పడకుండా మగ ముస్లిములు బురఖాలేసుకొని తిరగవచ్చనీ సూచిస్తున్నాను.   

 అయినా ఇదేం అన్యాయమండీ? మగాళ్ళను ఆడాళ్ళు ఎంచక్కా బురఖాలోంచి చూసెయ్యొచ్చు కానీ ఆడవారిని మగవాళ్ళు చూడకూడదా! ఇది ఆడ మగ సమానత్వం కాదు. నేనొప్పుకోను. వెంఠనే ఆడవారికి బురఖాలు ఎత్తెయ్యాలి లేకపోతే మగవారికి కూడా బురఖాలు దించెయ్యాలి. సమానత్వం జిందాబాద్.       

కెనడాలో లైంగిక విద్య

ఓంటారియో రాష్ట్రంలో ప్రతిపాదించబడి పలు నిరసనల వల్ల మళ్ళీ తిరిగి వ్రాయడానికై ఆగిపోయిన  పాఠ్యాంశాలలోని కొన్ని ముఖ్య విషయాలు:

ఆరోగ్యం మరియు శారీరక విద్య సబ్జెక్ట్ క్రింద ఇవి బోధించాలనుకున్నారు:
మొదటి తరగతి: శరీరంలోని ఇతర భాగాలకు తోడుగా జననాంగాలను కూడా ఏమంటారో తెలియజేస్తారు.
మూడవ తరగతి: హోమో సెక్సువాలీటీ అంటే ఏమిటి?
ఆరవ తరగతి: హస్త ప్రయోగం గురించి
ఏడవ తరగతి: ఓరల్ సెక్స్ మరియు అనల్ సెక్స్


మిగతా వివరాలకై ఈ క్రింది లింక్ చూడండి:


దానిమీద వ్యాఖ్యలకై ఈ క్రింది లింక్ చూడండి:

'ఆట' ఆగితే ఆనందమే

నేను తెలుగు ప్రొగ్రామ్స్ పెద్దగా చూడను. ఆట ఒక రెండు సార్లు చూసివుంటాను. నాకు ప్రొగ్రాం కానీ, ఓంకార్ కానీ, అతని భాష కానీ, ప్రొగ్రాం నిర్వహించేతీరు కానీ ఏమాత్రం నచ్చలేదు. నేను ఎక్కువగా ఆ ప్రోగ్రాం చూడలేదు కాబట్టి ఆ పిల్లలు వేసినవి అసభ్య నృత్యాలో కావో నాకు తెలియదు కానీ పిల్లలమీద పనికిమాలిన వత్తిడి పెంచే కార్యక్రమాలు ఆగిపోవాలి.   పిల్లలకు సహజంగానే ఆసక్తి వుంటే మాత్రమే శాస్త్రీయ నృత్యమయినా, పాశ్చాత్య నృత్యమయినా నేర్పించాలి.  ఎలాగూ బడుల్లో పిల్లలకు బోలెడంత వత్తిడి వుంటుంది కాబట్టి తల్లితండ్రులు తమ అభిరుచులు అన్నీ పిల్లల మీద తీర్చుకుంటూ, అవీ ఇవీ నేర్పిస్తూ మరింత ఒత్తిడి పిల్లలకి కలగజేసే ధోరణి తొలగిపోవాలి.   పిల్లలకు నిజమయిన ఆసక్తి వున్న వాటికి వీలయినంతంగా మనం సహకరించాలి అని నా అభిప్రాయం.

ప్రపంచ వ్యాప్తంగా గే ట్రెండ్ ఇలా వుంది


స్వలింగ వివాహాలు ఈ క్రింది దేశాలు ఆమోదించాయి:
కెనడా, స్పెయిన్, నెదర్లాండ్స్, బెల్జియం, నార్వే, స్వీడన్, దక్షిణ ఆఫ్రికా మరియు కొన్ని ఇతర దేశాలు
ఈ దేశాలల్లో స్వలింగ సంపర్కాలకు మరణ శిక్ష:
ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్, మారిటానియా మరియు నైజీరియా , సూడాన్ లలోని కొన్ని ప్రాంతాలు.
ఈ క్రింది దేశాలలో స్వలింగ సంపర్కులపై నిబంధనలు సరళీకృతం అవుతున్నాయి:
చైనా, సింగపూర్, క్యూబా, నేపాల్

ఈ క్రింది దేశాలలో నిబంధనలు కఠినతరం అవుతున్నాయి.
బురుండీ, నైజీరియా, రష్యా, ఉగండా
 
యుఎస్ లో మసాచుసెట్స్, కెనెక్టికట్, ఐయోవా, వెర్మాంట్, న్యూ హాంప్షెయిర్ మరియు కొలంబియా జిల్లాలలో స్వలింగ వివాహాలకు ఆమోదం వుంది. అల్బేనియా దేశంలో గేల పట్ల వివక్ష చూపకుండా చట్టం వచ్చింది. ఇండియాలోని న్యూ ఢిల్లీలో స్వలింగ సంపర్కం మీద నిషేధాన్ని ఒక కోర్టు తిరస్కరించింది. నేపాలులో గే టూరిస్టులను ఆకర్షించేందుకు గాను ఈ ఏడాది స్వలింగ వివాహాలను చట్టబద్దం చేయనుంది. చైనాలో ప్రభుత్వపరంగా మొట్టమొదటి గే బార్ డిసెంబరులో మొదలయ్యింది.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ 80 దేశాలలో స్వలింగ సంపర్కం చట్టవ్యతిరేకం. కనీసం ఏడు దేశాలు ముఖ్యంగా ముస్లిం దేశాలు ఇందుకు మరణ శిక్ష విధిస్తాయి.

`సోర్స్: హ్యూమన్ రైట్స్ వాచ్, ఇంటర్నేషనల్ గే అండ్ లెస్బియన్ రైట్స్ కమీషన్

డామినో ఎఫెక్ట్

ఉదయం లంచ్ బాక్సులోకి చపాతీలు లేవు. అన్నం వుంది కానీ దానిని బాక్సు కట్టేంత ఓపిక, సమయం లేవు. మరి మీ ఆవిడ ఏం చేస్తోందీ అని తొట్టి ప్రశ్నలు అడక్కండి.    ఇవాళ ఆఫీసు కేఫిటేరియాలో తినక తప్పేట్లుగా లేదు అనుకొని ఆఫీసుకి వచ్చేసాను. లంచ్ టైముకి ఆఫీసు కేఫిటేరియాకి వెళదామనుకునేంతలో అది శుక్రవారం తెరచి వుండదని గుర్తుకు వచ్చింది. బయటకి వెళ్ళి తినేయాలని అర్ధమయ్యింది. బయటకి వెళ్ళేదెప్పుడూ తినేదెప్పుడూ, అది అరిగేదెప్పుడూ, నేను లంచ్ అవర్లో జిమ్ము కెళ్ళేదెప్పుడూ అని బెంగపడుతూ బయటకి వెళ్ళి ఫూట్‌లాంగ్ సబ్ మొత్తం తినేసాను.  అలా ఫుడ్డు ఫుల్లుగా లాగించి జిమ్ముకెళ్ళలేదే అని చింతిస్తూ మన్ను తిన్న పాములాగా నెట్టు బ్రవుజ్ చేస్తూ ఇలా ఇలా వ్రాస్తూ కాలక్షేపం చేస్తున్నాను.  

చూసారా ఇంట్లో ఒక్క రెడీమేడ్ చపాతీ లేకపోవడం వల్ల వచ్చిన కాస్కేడింగ్ ఎఫెక్ట్!   ఇంకా దీని సీక్వెన్స్ ప్రభావం ఇంకా వేటివేటి మీద పడుతుందో ఏమో ఈరోజు.  అందుకే ఎప్పుడూ అనుకుంటాను మొదటే జాగ్రత్త పడాలని కానీ అన్ని సార్లు సాధ్యం కాదనుకోండి. మరో సారి తెలిసివచ్చింది. మీకు కూడా చాలా సార్లు ఇలాంటి ఎఫెక్ట్ పడివుండొచ్చు కదూ. 

ఇండోర్ బ్లాగర్లూ - అవుట్డోర్ బ్లాగర్లూ!

మేము జంతు పరిరక్షణ శాల నుండి పిల్లిని పెంపకానికి తెచ్చుకున్నప్పుడల్లా పిల్లిని ఇంట్లోనే వుంచమనీ, బయటకి వదలొద్దనీ వారు సలహాలిస్తుంటారు. నేను అమాయకంగా ఎలానయితే భావ స్వేఛ్ఛను సమర్ధిస్తానో అలానే పిల్లి స్వేఛ్ఛను అక్కడ సమర్ధించినా నా భావాలు కొట్టిపారేస్తారు. ఇంటిలోపలే వుండే పిల్లి వల్ల ఈ క్రింది సమస్యలు వుండవు అని ఈ క్రింది విధంగా సెలవిస్తారు.
  1. Injury or death by vehicles
  2. Poisoned intentionally or accidentally
  3. Injury or death by fighting with other cats
  4. Infectious diseases contracted from other cats: FIP,FIV,FeLV,URIs
  5. Parasites: fleas, ticks, ringworm
  6. Injury or death by sadists
  7. Injury or death by dogs or predators
  8. Killing of wildlife by outdoor cats
  9. Getting lost, picked up by A/C
  10. Theft for sale as laboratory animals or "bait" for illicit gaming
  11. Problems with neighbors: cats littering their yards 
అవన్నీ చదివాక ఔరా ఇవన్నీ నిజమే కదా అనుకున్నా. ఇవే మన బ్లాగర్లకి కూడా వర్తిస్తాయని ప్రగాఢంగా నమ్ముతూ బ్లాగర్లందరూ పాటించాల్సిందిగా కోరుతున్నాను. నేను ఎలాగూ ముందు నుండీ వైల్డ్ క్యాట్ లాంటి వాడినే కాబట్టి నాలాంటి వారు ఎలాగూ అవుట్ డోర్ బ్లాగర్లే అనుకోండి. అందుకే నాకు ఈ విషయాలు వర్తించవని మనవి చేసుకుంటున్నాను.    

మీ సౌకర్యం కోసం ఇప్పుడు ఒక్కొక్క పాయింటు వివరంగా చూద్దాం. అవుట్ డోర్ బ్లాగర్ మీరయితే :

1. నిరంకుశ బ్లాగు అగ్రిగేటర్ల యాజమాన్యం చేత మీ బ్లాగు తొలగింపబడవచ్చు
2. మీ బ్లాగుకి ఎవరయినా వైరస్ ఎక్కించేయవచ్చు
3. ఇతర బ్లాగర్లతో ముఖ్యంగా రౌడీ లాంటి వారితో గొడవ పడ్దప్పుడు మీ మనోభావాలు గాయపడవచ్చు. అప్పుడు 'యూ ఆర్ నాట్ వెల్కం హియర్!' అన్న బోర్డు బ్లాగులో పెట్టుకోవాల్సివస్తుంది.
4. బ్లాగర్లతో వ్యక్తిగత పరిచయాలు ఎక్కువయ్యి ఎయిడ్స్ రావచ్చు
5. సుఖ వ్యాధులూ రావచ్చు
6. శరత్తు లాంటి శాడిస్టు బ్లాగర్ల చేతిలో మీ బ్లాగు పడొచ్చు
7. కొన్ని విదేశీ శక్తుల ప్రభావం వల్ల మీ టెంప్లేట్ పనికి రాకుండా పోవచ్చు
8. మీకే ఆనందం ఎక్కువయ్యి ఇతర బ్లాగర్ల మనోభావాలను రక్కేయాలనిపించవచ్చు. 
9. బ్లాగు మాంత్రికుల చేతిలో పడి మీ బ్లాగు అదృశ్యం అవచ్చు
10. కెబ్లాస లాంటి వారు మీ బ్లాగుతో ఒక ఆట ఆడుకోవచ్చు. మీ బ్లాగుని బకరా బ్లాగుగా చేసుకొని ప్రయోగాలు చేయవచ్చు. 
11. మీకు పక్క వారి బ్లాగులో ... చేయాలనిపించవచ్చు. (డ్యాష్ మీరే పూరించుకోండి) 
ఇండోర్ బ్లాగరుగా వుంటే ఎన్ని లాభాలో అర్ధమయ్యింది కదా.  పై సమస్యలు ఏమీ మీకు రావు.  అసలు ఇండోర్ బ్లాగరంటే ఏంటో మీకు తెలిసివచ్చిందా లేదా? ఏ సంకలినిలోనూ తమ బ్లాగు రాకుండా జాగ్రత్త పడేవారే ఇండోర్ బ్లాగర్లు. అస్సలు బ్లాగు ఫీడే బయటకి రానీయకుండా, బ్లాగు అడ్రస్సు ఎవరికీ చెప్పకుండా తమ బ్లాగుని తాము మాత్రమే చదివి మురిసిపోయే బ్లాగర్లే నిజమయిన ఇండోర్ బ్లాగర్లు. వారికి నా వందనాలు!    

బలవంతపు బ్లాగు బ్రహ్మచర్యం


నా ఆత్మాభిమానానికి ఎక్కడా పెద్దగా సవాళ్ళు ఎదురుకావు ఒకవేళ ఎదురుపడినా నా అత్మాబిమానం ముందు మరేదీ లెక్కచేయకుండానే నెట్టుకొస్తున్నాను కానీ...కూడలి, జల్లెడల ముందు మాత్రం చతికిలపడిపోయాను. అవి సాంప్రదాయకపు బ్లాగులు కావడంతో, స్వాతి లాంటి సకుటుంబ పత్రికలలో వచ్చేటటువంటి విషయాలు వ్రాసినా బ్లాగు పిల్లలు హడలి ఛస్తారు కాబట్టి  అలాంటి బ్లాగులు వేసుకోము, టపా మీరితే తోక కోస్తామంటారు కాబట్టి కాస్త వళ్ళు దగ్గరపెట్టుకొని శరత్కాలం బ్లాగులో వ్రాస్తూ వస్తున్నాను. కాస్త జూలు విదిల్చినప్పుడు సి బి రావు గారు లాంటి నా బ్లాగు శ్రేయోభిలాషులు హెచ్చరిస్తూ నన్ను తగ్గిస్తూవస్తున్నారు. 

ఇలా బ్లాగుల్లో నాకు నచ్చినట్టు వ్రాసుకోకుండా సంకలినుల షరతులకి లోబడి నా భావ స్వేచ్చను అదిమి పెట్టుకొని బలవంతంగా బ్లాగు బ్రహ్మచర్యం పాటిస్తూ  రోజులు నెట్టుకొస్తున్నాను. ఈలోగా అడపాదడపా రసజ్ఞ బ్లాగులో వ్రాస్తూనేవున్నాను కానీ అది హారంలో మాత్రమే రావడంతో అలా వచ్చే హిట్స్. తిట్స్ ఎక్కువగా వుండవు.   మనలో విషయం వుంటే సంకలినులు అవసరమా అని కొందరంటారు కానీ సంకలినులలో రాకపోతే జనాలకి ఫోకస్ పోతుందనేది నా నమ్మకం. ఉదాహరణకు కొత్తపాళి గారివి, అరుణ పప్పు గారివి సంకలినులలో రావడం లేదు కదా. స్వయంగా నేను వారి బ్లాగులకి వెళ్ళి చూసి చదివే సందర్భాలు తక్కువే. అలా కాకుండా అగ్రిగేటర్లలో కనపడితేనే నాకు చదవడానికి ఈజీగా వుంటుంది.  అందుచేత సంకలినులను తూచ్ అనేంత దృశ్యం మనకు లేక అనువు కానప్పుడు అధికులమనరాదు కదా అణిగిమణిగి వ్రాస్తూ వస్తున్నాను.

అత్మాభిమానం, భావ స్వేఛ్చ ముఖ్యమా లేక ప్రజాదరణ ముఖ్యమా అన్న రంధిలో మొత్తమీద నా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి కూడలి, జల్లెడలలో నిభాయించుకువస్తున్నాను. కూడలి, జల్లెడలు ప్రైవేటు వ్యక్తులవి కాబట్టి ఎక్కువగా విమర్శించలేము. కావాలంటే నువ్వే ఓ అగ్రిగేటర్ పెట్టేస్కో అంటారు. అలా నేను ప్రయత్నించీ  చతికిల పడ్డాను. ఎవరికి ఏది నచ్చకపోయినా విమర్శించకూడదు, స్వంతంగా పెట్టేసుకోవాలి అంటే మనం ఒక దినపత్రికనూ, ఛానాల్నూ, సినిమా హాలునూ వగైరాలనూ పెట్టేసుకోవాలి లేకపోతే ఉన్న వాటినే తిట్టేసుకుంటూ చూస్తూపోవాలి కదా. అందుకే  అలా మనకు నచ్చినా నచ్చకపోయినా, ఇష్టమయినా, కష్టమయినా అలా అలా ఇప్పటివరకూ ఆయా సంకలినులల్లో వుంటూ వస్తున్నాను. అలాంటి ఇరుకు సంకలినులల్లో మనగలడం ఇబ్బందే అయినా అది మన గరుజు కాబట్టి భరించకతప్పలేదు.    

హారంకు తోడుగా ఇప్పుడు మాలిక సంకలిని కూడా వచ్చింది కాబట్టి నాకు, నాలోని భావావేశానికీ కొద్దిగా ఆశలు రెక్కల్లా విచ్చుకున్నాయి. అలా అని పూర్తిగా కూడలి, జల్లెడలలోనుండి వైదొలుగుతానని కాదు గానీ కొంతకాలం పాటు ప్రయోగాత్మకంగా వాటిల్లో నా బ్లాగును అసెంబ్లీలాగా సుప్తచేతనావస్థలోనో, సుషుప్తావస్తలోనో (inactive) వుంచేయమని త్వరలో కోరి నా శరత్ కాలం బ్లాగులో నాదైన పద్ధతిలో వ్రాస్తూపోవాలని, మా ఉద్యమ గళం కూడా అందరికీ వినిపించాలని, మా హక్కులు కూడా అందరూ గుర్తెరగాలని ఆశిస్తున్నాను. హారంకి వలనే మాలికలో కూడా భావ ప్రకటనా స్వేఛ్ఛ ఎక్కువంటున్నారు కాబట్టి మనకు ఇబ్బందులు ఎదురుకావనే ఆశిద్దాం.  అయితే ఈ బ్లాగులో రసజ్ఞ అంత ఘాటుగా విషయాలు వుండవని తెలియజేసుకుంటున్నాను. మడిగట్టుకొని వున్నవారు మడిగట్టుకొని వున్న అగ్రిగేటర్లని చూస్తారు కానీ మనం మాత్రం ఫ్రీడం ఆఫ్ ఎక్స్ప్రెషనుని, వైవిధ్యాన్ని, వివిధ హక్కులని ప్రోత్సహించే సంకలినులని ఎక్కువగా ఆదరించాల్సిన అవసరం వుంది.  

నాతో తోత తావాలి!

అవతార్ సినిమాలో నవిలకు తోకలెందుకు పెట్టారూ అని దర్శకుడు కేమరూనిని అడిగితే తోకలకు వున్న ప్రాముఖ్యత పెంపుడు జంతువులను పెంచుకుంటున్నవారెవరికయినా అర్ధమయిపోతుంది అన్నారుట. అలాగే నాకూ మా పోకిరి పిల్లి యువరాజావారిని దత్తత తీసుకున్నదగ్గరినుండీ అర్ధం అవసాగింది.  అవతారం సినిమా చూసాక తోకల్ని శ్రద్ధగా పరిశీలించే గుణం అబ్బటంతో మా పిల్లిగారు మా ఇంట చేరిన దగ్గరినుండీ ఆ తోకగారి యొక్క చిత్ర, విచిత్ర విన్యాసాలను కళ్ళారా వీక్షిస్తూవస్తున్నాను.  

అబ్బో దానితో మా యువరాజావారు ఎన్ని హొయలు వలికిస్తారూ? మగ పిల్లి అయ్యింది కాబట్టి ఇంకా బాగా వయ్యారాలు పోవడంలేదేమోనని నాకో డవుటు. వారు తమ తోకగారితో ఎన్నెన్ని విన్యాసాలు, ఎన్నెన్ని మెలికలు, ఎన్నెన్ని పొజిషన్లు, ఎన్నెన్ని, ఎన్నెన్ని!! ఆ తోకనే చూస్తూ అబ్బురపడుతూ బ్లాగులు రాయడం మానివేసి దేశసేవకి పుల్‌స్టాప్ పెట్టాలనిపిస్తుంది కానీ నా అభిమానులు ఊరుకోరు (పనికి వెళ్ళకపోతే మా ఆవిడా ఊరుకోదు) కాబట్టి కదలాల్సివస్తోంది.  

అస్సలే మగతోకవారు కదా. మళ్ళీ యువరాజావారాయే. అబ్బో ఏం రాచఠీవి, ఏం రాచఠీవి. ఏమి హుందాతనం, ఏమి దర్పం! బ్రిటన్ ముసలి యువరాజు ఛార్లెస్ లాగా కాకుండా మా యువరాజు మళ్ళీ వయస్సులో వున్న కుర్రాడాయే. వారెలా చురుగ్గా చంగుచంగున గంతులేస్తారో వారి తోకగారు కూడా వారితో పోటీ పడుతూ కదులుతూవుంటారు. 

తోకగారి కష్టాలు: అప్పుడప్పుడు అత్యుత్సాహంతో అస్మదీయులెవరో, తస్మదీయులెవరో మరిచిపోయి మా ఆవిడ పడుకున్నప్పుడు వారియొక్క తోక అలా అలా అలవోకగా మా రాణిగారి ముఖం మీద విశ్రాంతికి ఇచ్చినప్పుడు మాత్రం మా యువరాజావారి కళ్ళు బైర్లు కమ్ముతాయి. అర సెకనులో వెయ్యోవంతులో మాహావేగంతో వారెక్కడికో విసిరివేయబడుతారు. నాకేమయ్యిందబ్బా, నేనెక్కడున్నానబ్బా అని యువరాజావారు తమ తోకని ప్రశ్నార్ధకం లాగా పైకెత్తి పెట్టి తత్వ విచారం చేస్తుండటం కద్దు.      

వారి తోకకి ఇంకా చిన్న చిన్న కష్టాలు వున్నాయిలెండి. మా ఇంటి అద్దాలలోనుండి ఉడుతలో, తొండలో బయట చెట్ల క్రింద చూసినప్పుడు తోకని అలెర్టుగా పెట్టి ఎటాక్ పొజిషన్లో వుండిపోతుంది కానీ ఏం లాభం వారు ఇండోర్ యువరాజావారాయే. తమ తోక పప్పులుడక్క కళ్లతొ మాత్రమే వాటిని వేటాడాగలిగి తోకవాల్చేసి నాలుక తడుపుకుంటూ మ్యావ్ అంటూ మూలుగుతుంది.

ఇలా తోకని పరిశీలిస్తుంటే కలుగుతున్న పరవశంతో నాకు కొన్ని గొప్ప గొప్ప ఆలోచనలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరి తోకలని ఊప్స్ తోక వున్న ప్రతి జంతువు తోకలని పరిశీలిస్తూపోయి దానిమీద ఒక ఉద్గ్రంధం వ్రాస్తే ఎలా వుంటుందని!  మీరు 'కొని' చదువుతానని హామీ ఇస్తే సీరియస్సుగా ఆలోచిస్తా! లోకంలో ఎన్నో హాబీలు వున్నాయి. ఇలా తోకాధ్యయనం కూడా ఒక హాబీగా ఎందుకు వుండకూడదు? కొంపదీసి ఆల్రెడీ ఇది హాబీగా వుందా? దానికో పేరు కూడా వుందా? పేరు గనుక లేకపోతే మనమే ఓ పేరు పెట్టేద్దాం. అలా మన పేరు తోక శాస్త్రంలో చిరస్థాయిగా వుండిపోతుంది. జంతు పరిశీలనలో భాగంగా జంతు శాస్త్రజ్ఞులు వాటి తోకలని కూడా అధ్యయనం చేస్తారు కానీ అలా సైంటిఫిక్ పనుల కోసం కాకుండా సరదాగా తోకలను పరిశీలించే హాబీ ఏదయినా వుందా అన్నది నా ప్రశ్న. మీకు నా అంత ఆనందం లేకపోయినా ఈ టపా చదివిన స్ఫూర్తితో దగ్గర్లో వున్న తోకల్ని ఓ చూపు చూడండి. గమనిక: మనుష్యులకు తోకలు వుండవు.   

 ఇలా తోకలు వున్న వున్న జంతువులను చూస్తుంటే నాకు కుళ్ళుగా వుంది. జంతువుగా నయినా పుట్టకపోతిని అని విచారంగా వుంది. నాకే గనుక తోక వుంటే ఎన్నెన్ని పనులు చేసేవాడినో ఆ తోకతో. ప్చ్. నన్ను మనిషిగా పుట్టించి పాపం చేసాడు మీ దేవుడు. తోకేగనుక వుంటే చెట్టుకి ఆ తోకతో తల క్రిందులుగా వ్రేలాడుతూ టపాలు వ్రాస్తుంటే వుంటుందీ..మజా. మాటలతొ చెప్పలేననుకోండి...తోకేగనుక వుంటే వ్రాతలతో చెప్పేవాడిని. నాకే గనుక ఫ్యూచర్లో మీ దేవుడెప్పుడయినా ప్రత్యక్షమయ్యి 'నీకేం కావాలో ఒక్కటే వరం కోరుకో శరత్తూ' అని అడిగితే ఆ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యి మాటలు సరిగ్గా రాక ముద్ద ముద్దగా పలుకుతూ ఇలా అంటాను. 'నాతో తోత తావాలి స్వామీ'      
 

మా ఫ్రెండ్స్ నన్ను తిట్టారు!

నా డెంటల్ ఫ్లాసింగు గురించి కాదులెండి. గత వారాంతం మా ఇంటికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వస్తే వాళ్లని 'విలేజులో వినాయకుడు' సినిమా చూసారా అని అడిగాను. చూడలేదు, ఏం అన్నారు. అందులో మా బ్లాగర్ ఫ్రెండ్ నటించారు. అందుకే ఆ సినిమా చూడాలని డివిడి తెచ్చుకున్నా అని పొరపాటున చెప్పాను. అప్పుడు అందుకున్నారు. ఎప్పుడూ ఆ ఫ్రెండు నటించాడు, ఈ ఫ్రెండ్ నటించాడు అని మీరు మాకు చెప్పుకోవడమేనా? మేము అలా చెప్పుకోవద్దా. మా పరువులు పోతున్నాయి. మీరు వెంటనే ఏదయినా సినిమాలో నటిస్తే మీ గురించి కూడా మా స్నేహితులకి చెప్పుకుంటాము కదా! అని అందరూ కలిసి దులిపారు.

అసలే చిరుతాగుబోతును. అనగా అప్పుడప్పుడు మాత్రమే అదీ కొద్దిగా మాత్రమే తాగి ఆర్గాజం తెచ్చుకునే టైపు మనది. ఒక పెగ్గు మీద వున్నానప్పటికి. వాళ్ళు ఆ రకంగా అంటూ నన్ను తిడుతున్నారో, పొగుడుతున్నారో అర్ధం కాక ముసిముసినవ్వులు రువ్వుతూండిపోయాను.  ఎవరన్నా అర్జంటుగా నాక్కూడా సినిమా ఛాన్స్ ఇప్పించేయండబ్బా.  మరీ హీరో పాత్ర వద్దులే కానీ కామెడీ రోలో, క్యారెక్టర్ రోలో ఇస్తే వేసుకొని తన్మయత్వం చెందుతాను.

ఆ సినిమాలో బ్లాగర్ రవిగారు నటించారని తెలిసి ఎలాగయినా ఆ సినిమా చూడాలని మా ఆవిడ ఆ సినిమా వద్దంటున్నా పట్టుబట్టి డివిడి తెచ్చుకున్నాను కానీ ఏం లాభం? శనివారం ఫస్ట్ షోగా మా ఇంట్లో వేద్దామంటే అబ్బే అది వద్దు లీడర్ చూద్దామని మా ఆవిడ. నన్ను నా సినిమా పెట్టుకోనివ్వలేదు. పోనీ ఆదివారం చూద్దామంటే వల్ల కాదంటూ ఏ మాయ చేసావె పెట్టేసారు. ఏం చేస్తాను. వచ్చే వారాంతానికయినా ఆ సినిమా చూడాలని కంకణం కట్టుకున్నాను. వచ్చే వారాంతం విలేజిలో వినాయకుండు సినిమా ప్రాప్తిరస్తు అని అందరూ దీవించేయండి మరి. ఆ సినిమాలో రవి గారు ఏ పాత్ర వేసారు, ఎలా వేసారు, సినిమా కథ ఏంటి, ట్విస్టులేంటి అని పైత్యతరంగం వారి మాదిరిగా అంతా నాకు చెప్పేయకండి మరి.  

అందరూ నన్ను తిట్టండి ప్లీజ్!

ప్రతి ఒక్కరూ తమ తమ మానసిక ఆరోగ్యం బావుండటం కోసం ఏదో ఒకటి చేస్తుంటారు. యోగానో, పూజనో, హిప్నటిజమో లేక మెడిటేషనో లేకపోతే కత్తిలాంటి  కవిత్వమో లేక ఇంకేదన్నానో చేస్తుంటారు. నా మానసిక ఆరోగ్యం బావుండటం కోసం మెంటల్ ఫ్లాసింగ్ చేస్తుంటాను. అలా చేసేటప్పుడు బయటపడేవే నా టపాలు! 

సరే, మెంటల్ ఫ్లాస్ (Mental Floss) సంగతి పక్కకు వుంచేద్దాం. ఈ వారంలో నాకు డెంటల్ పరీక్ష వుంది - బెదురుగా వుంది. వా :((  అంటే నా పళ్ళు పీకుతారో లేదా డబ్బులు పీకుతారో అనే భయం కాదులెండి. తిట్లు పడతాయేమోనని. మనం కస్టమర్లము కాబట్టి గట్టిగా తిట్టాలని అనిపించినా డెంటల్ హైజినిస్టులు అంత గట్టిగా తిట్టలేరు కాబట్టి తిట్టీతిట్టనట్టుగా సన్నాయి నొక్కులు నొక్కుతారు! ఒరే డెంటల్ ఫ్లాస్ చేసుకోరా రోజుకి రెండు సార్లు అని నేను ఈ దేశాల్లో అడుగుపెట్టినప్పటి నుండీ నాకు చెబుతూనేవున్నారు. నామీద జాలిపడి ఒరేయ్ ఒక్కసారన్నా పడుకునేముందు ఫ్లాసింగు చేసి పడుకోరా అని బ్రతిమలాడుతూనేవున్నారు.  

ఈ మొండిఘటం వింటేనా? ఊహు. మనం పళ్ళని తోమడమే ఎక్కువ, సమాజ సేవ. ఇంకా ఓ దారం లాంటిది పట్టుకొని పళ్ళ సందున ఎక్కడెక్కడో ఏం కష్టపడతాము చెప్పండి? అసలే మనకు రాచ కార్యాలు ఎక్కువ కదా. దానికి తోడు ఈమధ్య పైత్యతరంగాన్ని సంస్కరించే పనిలో కూడా పడ్డాను కదా. ఇంకా మనకు తీరికెక్కడ ఏడుస్తుంది చెప్పండి?   దానికి తోడు ఓ పిల్లి ప్రిన్సుకూడా తెచ్చుకున్నాము కదా. 

మొత్తం మీద ఈ డెంటల్ వాళ్ల సణుగుడు భరించలేక మొహమాటం కొద్దీ అడపాదడపా ఫ్లాసింగ్ చేసినా దానిని కంటిన్యూ చేయడం మనవల్ల అయ్యింది కాదు. క్రితం సారి ఆరు నెలల క్రితం నా పళ్ళు తోమినప్పుడు మరింత శ్రద్ధగా ఫ్లాసింగు - దానివలన ఉపయోగములు అని మరింతగా లెక్చరు ఇచ్చారు. నేను బుద్ధిగా తలఊపి రాజకీయనాయకుడి లెవల్లో మీ కోరిక తప్పకుండా తీరుస్తానిన్నూ, తప్పకుండా ప్రతిరోజూ డెంటల్ ఫ్లాసింగు చేస్తాననిన్నూ హామీ ఇచ్చి వచ్చేసాను. మరి హైజినిస్టు కళ్ళళ్ళొ ఆనందం చూడాలి కదా. అందుకే. ఆ హైజినిస్టు కాస్త చూడటానికి బావుందనుకోండి - మనం ఎదురు చెప్పలేము కదా - తల గంగిరెద్దులా ఊపి - తిట్ల లాంటి ఉద్భోదలు ఆనందంగా అనుభవించీ వచ్చేస్తాము కదా.

గత ఆరునెలలనుండీ ప్రతిరోజూ డెంటల్ ఫ్లాసింగు గురించి ఆలోచిస్తూనేవున్నాను కానీ ఫ్లాసింగు అనుభవించడం నా వల్ల అయ్యింది కాదు. ఏంటో కత్తిగారిలా నాకూ ప్రతిదాన్నీ అనుభవించేయడం అలవాటయిపోయింది. మన్నించండి. ప్రతిరోజూ ఫ్లాసింగ్ చేసుకుంటున్నట్లు ఫాంటసీలే గానీ ఒక్కనాడన్న వాస్తవంగా దానిని అనుభవించినవాడిని కాకపోతిని.

ఇప్పుడేమో తొమ్మిదో తారెఖున డెంటల్ క్లీనింగ్. మన నోరు తెరిచి పళ్ళు ఇకిలించగానే మన పరిస్థితి  ఏంటో , పళ్ళ సందుల్లోని పాచి ఎంతుందో అవతలవాళ్ళకి అనగా హైజినిస్టుకి అర్ధమవుతుంది. ఎలాగా చెప్మా? ఈ దంత మూర్ఖుడికి బుద్ధి ఎలా రావాలి చెప్మా! అందుకే మీరందరూ నన్ను తిట్టండి. మంచి అవకాశం మించిన దొరకదు మీకు! అలా అయినా నాకు బుద్ధి వస్తుందేమో చూద్దామేం. అలా అని అవకాశమిచ్చానని మరీ బూతులు తిట్టేయకండి ప్లీజ్. అసలే సున్నితమయిన హృదయం నాది - భరించలేను. మీరు అంతగా తిడితే మళ్ళీ బ్లాగ్ముఖంగా మెంటల్ ఫ్లాసింగు చేసేస్కుంటాను ఏమనుకున్నారో!! 

ఎవరికి వాళ్ళే తిట్టుకొని వాళ్ల మూర్ఖత్వం వదిలించుకోవాలి లేకపోతే ఇంట్లోవాళ్లతో తిట్టించుకోవాలి కానీ ఇలా బయటివారిని బ్లాగుల్లో అడుక్కొని తిట్టించుకుంటే బుద్ధి వస్తుందా అని అంటారా? నేను ఆశావాదిని. మీలాక్కాదు. మార్పు ఎక్కడయినా మొదలవ్వొచ్చు. ఎవరినుండయినా సరే - ఒఖ్ఖ తిట్టు ఒక పన్నునే మార్చేయవచ్చు  - ఎవరు చెప్పగలరు? ఇంక సందేహించకుండా మీరూ తిట్లు లంకించుకోండి. ప్లీజ్.    

మీరు తిట్లు తిడుతూనేవుండండి - నేను అనుభవిస్తూ వుంటాను. వాహ్ తిట్లు! 

కర్చీఫ్ క్యాటగిరీ!

నేను యువకుడిగా వున్నప్పుడు మా మిత్రులతో కలిసి కనిపించిన ఆడవాళ్లని క్యాటగిరీలుగా విభజించి కామెంట్లు చేసుకునేవారం (వాళ్ళకి వినపడకుండానే లెండి). శరీరం బావుండి ముఖం ఛండాలంగా వున్న ఆడాళ్ళు కర్చీఫ్ క్యాటగిరీ అన్నమాట!

సినిమాకి మంచి కథే ప్రాణం అనాల్సిన అభిరుచి(!) కలిగిన బ్లాగు సినీ మేధావులు సినిమాలో కథే పట్టించుకోవద్దని కత్తిలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడంతో నాకు పై విషయం గుర్తుకు వచ్చి ఫక్కున నవ్వు వచ్చింది. ఇంకా నయ్యం కథకి కథే అవసరం లేదు, కవితలో కవిత్వమే అవసరం లేదు అని వక్కాణించారు కాదు.  పోనీ సినిమాకి కనీసం మాటలయినా అవసరమా లేక సినిమాలని గుడ్లప్పగించి అనుభవిస్తూపోవాలా? ఓ కొత్త సినిమాకి ఆ జంట సినీ మేధావులు కలిసి మాటలు వ్రాసారంట.  ఆ సినిమా  విడుదల అయితే గియితే కనుక మరి కథ సంగతేమో గానీ కనీసం మాటలన్నా వుంటాయో లేకపోతే సినిమాకు వెళ్ళి అనుభవించి సినీస్ఖలించాలో(స్వప్నస్ఖలనం లాగా) మరి!   సినిమా కథ మీద, మాటల మీద విశ్వాసం లేకుండానే మాటలు వ్రాసిపడేసిన సినిమా మరి ఎలావుంటుందో ఆసక్తికరమే. ఆ మాటంటే పుష్పక విమానం సినిమా లేదా, ఛార్లీ ఛాప్లిన్ లాంటి మూకీ సినిమాలు లేవా -  మాటలు లేకుండానే ఆయా సినిమాలు హిట్టు కాలేదా అందుకే సినిమాలకి మాటలవసరం లేదని మరో స్టేట్మెంట్ ఇస్తారేమో తెలియదు.  

నాకు తెలిసి ఒక రకం సినిమాలలోనే కథ, మాటలు, సాకేతిక నైపుణ్యం, కెమెరా తదితరాలు పట్టించుకోరు జనాలు. అవి బూతు సినిమాలు, బ్లూ సినిమాలు. ఆయా సినిమాలను అనుభవించడానికి మాత్రమే చూస్తారు కనుక వేరే విషయాలను పెద్దగా పట్టించుకోరు. ఆ బూతు సినిమాలలో కూడా కథ, నిర్మాణపు విలువలు వుంటే ఆ సినిమాలు ఇంకా రంజుగా వుండి ఇంకా బాగా అనుభవించడానికి వీలవుతుంది.  

మంచి సినిమాకి మంచి కథే ప్రాణం అన్న విషయం తెలియడానికి మనం సినీ మేధావులమే కానక్కరలేదు - కామన్ సెన్స్ వుంటే చాలు.   ప్రతి దానికీ మినహాయింపులు వున్నట్లుగా కొన్ని కథ సరిగ్గాలేని సినిమాలు కూడా వివిధ కారణాల వలన విజయాలు సాధిస్తుంటాయి. విజయం సాధించినంత మాత్రాన అన్నీ మంచి సినిమాలు అయిపోవు. 

ఎం బి ఎస్ ప్రసాద్ - ఎం ఎఫ్ హుస్సేన్

గ్రేట్ ఆంధ్రాలో ఎం ఎఫ్ హుస్సేన్ గురించి ఎం బి ఎస్ ప్రసాద్ ఒక సిరీస్ మొదలెట్టారు. ఆసక్తి వున్నవారు చదవచ్చు.   


http://telugu.greatandhra.com/mbs/political/hussain_part1.php