పుస్తక సందేహాలు

స్వప్న రాగలీన బ్లాగులోని ఒక టపాకి ఒకరు రోజంతా ఆఫీసులో కూర్చుని ఇలాంటి చెత్త బ్లాగులో పెట్టడం కన్నా ఆ మద్దిన ఎదో పుస్తకం ఏత్తానన్నావ్ కదా అది ఎయ్యకూడదూ?  అని వ్యాఖ్య చేసి నాలో నిద్రపొతున్న బద్దకాన్ని తట్టిలేపారు. పుస్తకం వ్రాయడం, ప్రచురించడం అంటే మాటలా. అసలే మన తెలుగువారిలో చదవడం అన్నది అంతర్ధానమవుతున్న అలవాటు. ఇక చదివేది మిణుకు మిణుకుమంటూ వెలుగుతున్న కొద్దిమంది పుస్తకప్రియులు. పుస్తకం వ్రాయడం ఒక ఎత్తు కాగా ప్రచురించుకోవడం, అవిష్కరించుకోవడం, అమ్ముకోవడం, సన్మానించుకోవడం అవన్నీ ఎత్తులకు పైఎత్తులు.  అవన్నీ మనవల్ల జరిగే పనేనా?  ఒక పబ్లిషర్ నా పుస్తకాన్ని ప్రచురిస్తామన్నారు కానీ కనీసం 200 పేజీలు కావాలంట. నా అనుభవాలు, ఆలోచనలు అన్నీ పూసగుచ్చినట్లు వివరిస్తే తప్ప అన్ని పేజీలు కావు. మరీ అంతగా వివరిస్తే అది బూతు పుస్తకం అంటారు! అందువల్ల వాళ్ళు పబ్లిష్ చేయకపోవచ్చు.

ఎన్ని కష్టాలు పడి అయినా సరే మన పుస్తకాన్ని అచ్చులో చూసుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎవరయినా కొని చదువుతారా అన్నది తరువాత.  చూద్దాం. కొన్నిసార్లు మనకు నచ్చిన పనులను ప్రతిఫలేక్ష లేకుండా నిర్వికారంగా చేస్తూపోవాలి. అందువల్ల కొన్ని డబ్బులు పోవాల్సొచ్చినా అలా నిర్వికారంగా వుండాలి! మన పుస్తకం మనం అచ్చులో చూసుకోవాలనుకున్నప్పుడు కొన్ని రిస్కులు తప్పవు.  ప్రపంచమంతా వీడియో మీడియాకి వెళుతుంటే మనం ఇంకా ఇలా పుస్తకాలంటూ వేలాడటం అవసరమా అని కూడా అనిపిస్తోంది కానీ ఎక్కువగా ఆలోచిస్తే ఏ పనులూ చేయలేము. కొన్ని కొన్ని పనులు కొద్దిగానే ఆలోచించి అలా అలా చేస్తూపోవడమే ఉత్తమం.  ఎనీ వే, పుస్తకం రిలీజ్ అయితే మాత్రం మీరు నాకు సన్మానం చేస్తానని గ్యారంటీ ఇవ్వాలి మరి. లేకపోతే నేనీ పుస్తకం వ్రాయనంతే. ఆ.  సో, మళ్ళీ పుస్తకం మీద పడుతాను. చూస్తాను - ఈ ఆనందం ఎన్ని రోజులో.

కొన్ని సందేహాలు వున్నాయి. ఎవరయినా తీర్చగలిగితే సంతోషిస్తాను.
- వివిధ పత్రికలలో, పోర్టల్లలో ఆయా విషయాలపై వచ్చిన వ్యాసాలను వారికి ధన్యవాదాలు ప్రకటించి నా పుస్తకంలో వేసుకోవచ్చా లేక వారి అనుమతి తీసుకోవాలా?
- తెలుగు వికీ లో వున్న సంబంధిత వ్యాసాలను వారికి క్రిడిట్స్ ఇచ్చి నేను ఉపయోగించుకోవచ్చా లేక అనుమతి తీసుకోవాలా?  

4 comments:

 1. వేరే భాషల్లోవి నొక్కేసి రాసేయడానికి మించిన పద్ధతి వేరొకటి కలదే ఇహలో సుమతీ - అన్నారు. ఇహ కానించేయండి. ఆలూ లేదు చూలూ లేదు బాబుకి పేరేం పెట్టాలి అన్నట్టూ .. రాయటానికి ముందే ఇన్ని సందేహాలొస్తే , తమరు రాసింది తీరిగ్గా చదివిపెట్టే మాకెన్ని రావాలి? ఎవరు తీర్చాలి? ఆఁ !
  :))

  శంకర్ :P

  ReplyDelete
 2. @ శంకర్
  సగం వ్రాసి పక్కకు పెట్టిన పుస్తకాన్ని ఇలా పూరిస్తే ఎలా వుంటుందా అని సందేహాలు వచ్చాయి.

  ReplyDelete
 3. wtf ante enti...??

  ReplyDelete
 4. @అజ్ఞాత
  తొందరలో వాట్ ఇఫ్ అనుకొని వేసాను కానీ ఇప్పుడు మీరడిగితే తీరికగా చూస్తే అదేంటో బోధపడింది. అర్జంటుగా ఫోటో ఎత్తెయ్యాలి :))

  ReplyDelete