గురువారం 25 ఫిబ్రవరి 2010

లీడర్ ఉదయభాను

లీడర్ సినిమా గురించి మన బ్లాగ్మిత్రులు కొందరు సమీక్షలూ, అభిప్రాయాలూ వ్రాసారు కానీ ఉదయభాను ఐటెం సాంగ్ గురించి ఎవరూ వ్రాసినట్లు లేరే. అంతటి ముఖ్యమయిన విషయం వదిలేస్తే ఎలానండీ? అలాగే హీరోయిన్ రిచా గురించి కూడా ఎవరూ వ్రాసినట్లు లేరు. నాకయితే ఆ ముద్దుగుమ్మ ఫోటోల్లో మాత్రం ప్రియాంకా చోప్రాలా భలే నచ్చింది. మీకు ఎలా అనిపించింది మరి? మీరు సినిమా గురించి వ్రాసేటప్పుడు నాలాంటి రసికులని కూడా దృష్టిలో పెట్టుకొని వ్రాయకపోతే ఎలా?   

ఐశ్వర్య 'కజ్రారే' పాట లెవల్లో లీడర్ సినిమాలో భాను నర్తించిందని కొందరూ, అంత దృశ్యం లేదని కొందరు అంటుండగా అక్కడక్కడా చూసాను. మరి భాను నృత్యం గురించి లీడర్ చూసిన బ్లాగర్లు ఏమంటారు? నేను ఇంకా ఆ సినిమా చూడలేదు. మీరు మన భాను గురించి, రిచా గురించి చెప్పేదాన్ని బట్టి ఆలోచిస్తా. త్వరపడండి మరి! 

14 comments:

బాటసారి చెప్పారు...

ఓకె ఓకె. అంత గొప్పగా ఏమీ లేదు

venu... చెప్పారు...

udayabhanu is ok sir.. sizzling.. kaane richa aithe keka.. ;)..

అక్షర మోహనం చెప్పారు...

Udayabhanu..so naaty
taking so ..so..variety
Leader..good mooooooove

jeevani చెప్పారు...

యుగానికి ఒక్కడు చూశారా?

భావన చెప్పారు...

చండాలం గా వుంది శరత్ గారు వుదయ భాను. యాక్. మీరైతే ఆమెను మీ డబ్బులతో జిమ్ కు పంపుతారు. నా మాట నమ్మండి. :-)

రమణి చెప్పారు...

హహహ్హ :) నేనీమెని 'లీడర్‌' లో కాదు కాని ఒరిజినల్ గానే ఒక టి వి షో షూటింగ్‌లో చూసాను . ఎడారిలోంచి కొట్టుకొచ్చినట్లుంటుంది. ఆమెని చూసినవాళ్ళు, తెలియని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఇంత కరువుకాటకాలతో ఉందా అని అనుకోకమానరు. ఒంట్లో కనీసం కేజి కండన్నా ఉంటుందా అన్న అనుమానం రాక మానదు. కచ్ఛితంగా మీలాంటివాళ్ళకి నచ్చదు 100% భరోసా నాది.

sunanda చెప్పారు...

Hi Sarat ji,
I was reading the comments of veelu e rakam ammayilu.U'r comments are very matured and Logical.

RK Veluvali చెప్పారు...

నెంబర్ వన్ చెత్తలా ఉంది.

పవన్ చెప్పారు...

లిడర్ మాత్రం అదిరింది..లిడర్ సుపర్ .....తప్పక చుడండి

పరిమళం చెప్పారు...

మంచి చక్రపొంగలి తింటూ ఉండగా పంటికింద రాయిపడ్డట్టు ఉంది ..ఇక మీ ఇష్టం !ఇక రిచా ఫర్వాలేదేమో ..

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ బాటసారి, వేణు
హ్మ్. ఒకేనే అన్నమాట.

@ అక్షర మోహనం
సో, భాను నాటీ అంటారు :)

@ RK వెలువలి
స్టిల్స్ మాత్రం ఆకుపచ్చ చీరెలో అదిరాయి.

@ జీవని
యుగానికి ఒక్కడు చూడలేదండి. మా దగ్గరికి ఆ చిత్రం రాలేదనుకుంటా. ఎందుకడిగారు? అందులో కూడా భాను వుందా?

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ భావన
అంతేనంటారా! భాను నిధి అని విరాళాలు పోగుచేసి ఆమెను జిమ్ముకు పంపేస్తా :) మీ చందా ఎంత?

@ రమణి
అదేంటండీ అలా అంటారూ. మా భాను స్టిల్స్ లోనూ, టివిల్లోనూ బాగా పుష్టిగానే కనపడుతుందే :))

@ సునంద
ధన్యవాదాలండి

@ పవన్
ఈ సినిమా డివిడిగా చూడటానికి ఎక్కువ, సినిమాగా చూడటానికి తక్కువలా వుందే. అయినా మా హోం మినిస్ట్రీ ఈ సినిమా చూడాలని ఏమీ ఆరాటపడటం లేదు కాబట్టి ఇక డివిడిలో మాత్రమే చూస్తామనుకుంటా. ఇప్పుడు ఇంట్లో డిమాండు 'ఏ మాయ చేసావే' కోసం వుంది.

@ పరిమళం
హ్మ్. మొత్తం మీద ఆడలేడీసు అందరూ నా భాను మీద నీళ్ళు చల్లారు. ఏం చేస్తానూ - ఇక డివిడిలో చూసుకుంటానూ.

అజ్ఞాత చెప్పారు...

richa is just okay, other heroine priya looks good.

udayabhanu looks great in the song( the song itself is "inspired" from kajrare tune, and bhanu imitated ash in dress and dance in the song !

According to Ramani gaaroo, anyone who looks slim(but not too lean ),including aishwarya rai and katrina kaif represent starvation of india. May be she likes chubby people better, in heroines I'm guessing she'd like only madhuri dixit(in devdas),and savithri, and recently baby shamili in oye !

Lokobhinna ruchi kadaa !

అజ్ఞాత చెప్పారు...

Meeru anukunentha vishyam aithe ledu .I dont like her .Dance chesinattuga ledu edo cheyali kabatti chesanu annattlu vundi.