ఆదివారం 31 జనవరి 2010

శ్రీక్రిష్ణార్జునుల సఖ్యత

రామాయణ, మహాభారతాలు ఇతిహాసాలు, ప్రజలందరి సొమ్ము కాబట్టి ఎవరు రకంగానయినా నిర్వచిందుకోవచ్చు. యార్లగడ్దకి ద్రౌపది యమ నచ్చింది కాబట్టి వారికోణంలో వారు నవల వ్రాసేసారు - అవార్డూ ఇవ్వాలనుకున్నారు. మరి మనక్కూడా ఇష్టాలుంటాయి కదా. భారతంలో నాకు బాగా నచ్చే పురుషులు శ్రీకిట్టుడూ, అర్జునుడూనూ. విశేషమేమిటంటే  వారిద్దరికీ  మంచి స్నేహం, సఖ్యతానూ.  నిన్న కత్తి మహేశ్ గారు వారిద్దరి సఖ్యత గురించి వివరించారు. వివరాలకు నా గత టపా చదవండి.
యార్లగడ్డ పండితులు కాబట్టి ఆ నవల వ్రాసేరు - ఓ పది మంది చదివారూ - దానికి అవార్డ్ ఇవ్వాలనుకున్నారు - పౌర 'తొక్కల' సంఘం లేకుంటే ఇప్పటికి అవార్డ్ చేతిలో పడివుండేదేమో. మరి మనం వ్రాస్తే ఎవరు చదువుతారు? మీరు చదువుతారు! మీకోసమని ఓ నవల వ్రాసేయలేనుకదా. అందుకే ఓ పేరాతో తృప్తి పడిపోదామని డిసైడ్ చేసా.
అర్జునుడు

క్రిష్ణుడి పడగ్గది సీను:

అర్జునుడు ముసిముసి నవ్వులు  నవ్వుతూ క్రిష్ణుడి కాళ్ల దగ్గర కూర్చున్నాడు. తలదగ్గర కూర్చున్న దుర్యోధనుడికి అర్జునుడి  ముసిముసినవ్వులు చూస్తూవుంటే యమకంపరంగా వుంది. అయినా మనవాడు అర్జునుడు  శ్రీక్రిష్ణ ముఖారవిందం చూస్తూ మరింత దుర్యోధనుడి గురించి పట్టించుకోలేదు. బెడ్రూము కిటికీనుండి ఏటవాలుగా వచ్చి పడుతున్న కిరణాలు అర్జునుడి బుగ్గమీద పడి తెగముద్దులిచ్చేస్తున్నాయి. ఇంకా క్రిష్ణుడు గారు లెగకపోయేసరికి అసలే ఆత్రంగా వున్న అర్జునుడు బావ లేవాలని ముసిముసినవ్వులు పెంచేశాడు. ఆ నవ్వులు దుర్యోధనుడికి గుర్రపు సకిలింతల్లాగా వినిపించి, అనిపించి విసుక్కున్నాడు. ఇంతసేపటి నుండి వెయిటు చేస్తున్నా ఆ మహాశయులు లేవకపోయేసారికి దుర్యోధనుడు విసుగ్గా నిట్టూర్పులు  విడుస్తూ కూర్చున్నాడు. బావగారు ఇంకా లేవకపోయేసారికి సిగ్గుపడుతూనే అర్జునుడు శ్రీక్రిష్ణుడి గారి పాదాలు తాకేడు. క్రిష్ణుడు కళ్ళు తెరచి చూస్తే ఎదురుగ్గా అర్జునుడు. వెంటనే 'బావా, ఎప్పుడు వచ్చితీవు...' అని దీర్ఘం తీసుకుంటూ ఆనందపరవశుడయి అర్జునుని సాదరంగా ఆహ్వానించాడు. శ్రీ ముందూ వెనుకలూ చూడకుండా ఇవాళ మరీ ఇంత ఆత్రంగా వున్నాడేంటీ, నన్ను చూడక చాల్రోజులయ్యింది కదా అందుకేనేమో అనుకున్నాడు అర్జున్. శ్రీని వారించడం ఎలాగో తెలియక చిన్నగా దగ్గాడు. అయినా మనోడు పట్టించుకోలేదు. చేతులు చాచి హగ్ కోసం ఆహ్వానిస్తూనేవున్నాడు. అర్జునుడు మరింత ఖంగారు పడి ఆ గదిలో మరొకరు కూడా వున్నారని చెప్పాలని కొద్దిగా గట్టిగా  దగ్గాడు. అర్జునుడు ఎందుకు దగ్గుతున్నాడో లైటు  వెలుగక, ఎందుకయినా మంచిదని తన చేతులని అలాగే సాచి వుంచి విండోల దగ్గర ఎవరయినా వున్నారేమో అని చూసాడు. లే, ఎవ్వరూ కనపడలే. మళ్ళీ చేతులు ముందుకు సాచాడు. మళ్ళీ ఖంగారుగా అర్జునుడు ఇంకాస్త గట్టిగా  దగ్గాడు. ఓ అర్జునుడి గొంతులో ఖిచ్ ఖిచ్ అనుకొని హాల్స్ అడుగుతున్నాడేమో అనుకొని తలగడ క్రింద దాచుకున్న హాల్స్ తీసి చాలా ప్రేమతో అర్జునుడికి ఇవ్వబోయాడు. అర్జునుడు సన్నగా విసుక్కొని బావా అని ప్రేమగా పిలిచి 'నేను దగ్గుతున్నది హాల్స్ కోసం కాదు బావా' అని సెలవిచ్చాడు. 'మరెందుకు!?' అన్నాడు శ్రీక్రిష్ణుడు మురిపెంగా. తలదగ్గర దేభ్యం ముఖం వేలాడేసుకొని కూర్చున్న దుర్యోధనుడిని చూపించాడు. ఇప్పటిదాకా  వీళ్ళిద్దరిని  చూస్తూ మండిపడుతున్న  దుర్యోధనుడి ముఖం చూసి నీరు  కారిపోయిన క్రిష్ణుడు ఏడవలేక నవ్వుతూ అతగాడిని పలకరించాడు. 

28 comments:

అజ్ఞాత చెప్పారు...

endannoo...atu itu tippi fitting maaku pedutunnav gaa, NTV annanduku

మంచు పల్లకీ చెప్పారు...

ఇదేమాత్రం సమంజసంగా లేదు శరత్ గారు.. మీకయినా ఎవరికయినా హిందువుల మనోభావాలంటే చాల చులకనగా చూడటానికి ఎమాత్రం హక్కులేదు.. మీరు దిస్క్లైమర్ పెట్టినంతమాత్రాన అది కరెక్ట్ అవదు.. మీరు ఉదహరించినవారి మూర్ఖత్వం గురించి, హిందు ద్వేషం గురించి , హిందువుల నమ్మకాలను గేలి చేసి తను పొందె పైశాచిక ఆనందం గురించి ఇక్కడ అందరకి తెలుసు కాబట్టి అతనితొ వాదించడానికి ఎవరికి మనస్కరించదు.. మీరు అలాంటివారిని చూసి స్పూర్తిని పొందడం చాల బాధాకరం.. మిమ్మల్ని ఈ పొస్ట్ తీసెయ్యమని నేను అభ్యర్దిస్తున్నా.. మీరు ఈ పొస్ట్ ఇలాగే వుంచే వుద్దేస్యం వుంటె మీ బ్లొగ్లొ ఇదే నా లాస్ట్ కామెంట్.. మిమ్మల్ని ఇలా బ్లాక్మైల్ చెయ్యడం నా వుద్దేస్యం కాదు.. నాకన సీన్ లేదు .. కానీ ఇది మత్రం నేను స్పొర్టివ్ గా తీసుకొలేకపొతున్నా ..గుడ్ లుక్

పవన్ చెప్పారు...

శరత్ గారు,
ప్లీజ్ మనల్ని మనం లోకువచేసుకోవద్దు..మీరు మన పూరణాలను ,గ్రంధాలని గౌరవించక పోయిన పరవలేదు దయచేసి లోకువ మాత్రం చేయవద్దు..
ఇక మీ ఇష్టం..

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ మంచుపల్లకి, పవన్
చాలా మార్పులు చేసి జస్ట్ సజెస్టివ్ గా మాత్రమే వుంచాను - ఓ సారి చూడండి.

Sarat చెప్పారు...

gay ness ni enduku evaraina support chestaaro telusukovachaa.? hw can they do sex ? if it is not abt sex.. why is it nt friendship.. so it is only abt sex. Hw can they do it ?

hw did u do it ?

అజ్ఞాత చెప్పారు...

you following foot steps of kathi is not appreciated ! ee post evvarikee nachchaledu(idea ichchina okkariki takka) ani maatram cheppagalanu.

అజ్ఞాత చెప్పారు...

భగవద్ 'గే'త మొదటి అధ్యాయం సమాప్తం. భక్తులు మళ్ళీ రేపు విచ్చేయగలరు.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ అజ్ఞాత
:) మీకు సంబధించిన వాక్యాలు కూడా తీసేసాలెండి.

@ శరత్
గే జీవిత విధానం గురించి తెలుసుకోవడానికి ఈ బ్లాగు వేదిక కాదు. నాకు ఈమెయిల్ ఇవ్వండి.

@ అజ్ఞాత
అలా ఏమీ లేదు - నా అడుగుజాడలు నాకున్నాయి. అన్నీ అందరికీ నచ్చవు -అందరినీ ఎల్లప్పుడూ సంతృప్తి పరచలేము.

@ అజ్ఞాత
:) అలాగే

Rajesh చెప్పారు...

hmm ... ఈ ఆర్టికల్ ని మీ ఆవిడ కి చూపించారా? తప్పక చూపించండి ... అప్పటికయినా తీస్తారనుకుంటున్నా!! :)

కత్తి మహేష్ కుమార్ చెప్పారు...

మీరేదో రాస్తే నామీదపడి ఏడుస్తారేంటి వీళ్ళు?
బ్లాగుల్లో నన్ను వ్యతిరేకించి అదేదో హైందవధర్మ పరిరక్షణ అనుకుంటున్న వీళ్ళ మూర్ఖత్వానికి మీ కెలుకుడుతోడై మహారంజుగా ఉంది. కానివ్వండి.

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

ఏ మత గ్రంధాలయినా,పురాణాలయినా ఆయా మతాలకు సంబంధించిన ప్రజలకి మార్గదర్శకాలుగా రూపొందాయని భావిస్తాను నేను.వాటిని పాటించాలా లేదా అనేది వారి వారి స్వభావాల్ని బట్టి ఉంటుంది కూడా(వాటిని ఆచరించాలా, విమర్శించి సరదా తీర్చుకోవాలా,అలా విమర్శించాడానికి కొలమానం ఏమిటీ అనేదీ వాటిని అర్ధం చేసుకోడాన్నిబట్టే ఉంటుంది కూడా).

ఏది ఏమయినా మన రాతలు మన మనసుకి అద్దాల్లాంటివే కాబట్టి,అద్దం మురికిగా ఉంటే అందులో ప్రతిబింబం కూడా అలానే కనిపించడం సహజం.ఇప్పుడు మీరు రాసిన పోస్టూ,నేను రాసిన వ్యాఖ్యా లాగే.

రాసింది మంచా చెడ్డా అనేది గ్రహించగలిగే వ్యక్తిత్వం మీకుందనే అనుకుంటున్నా.

(ఒకటి మాత్రం నిజం.ఏ మత విశ్వాసాల్నీ వాటికి సంబంధించిన గ్రంధాల్నీ ఎవరెంత పీకి పాకంపడదామని ప్రయత్నించినా వాటి మనుగడని ఏమీ చెయ్యలేరు.ఎందుకంటే అదొక నమ్మకం,అదొక విశ్వాసం అంతే,మిగతాదంతా చరిత్రే)

Rajesh చెప్పారు...

హైందత్వాన్ని పరిహసించేస్తే ఏదో గొప్ప మేధావివి అయిపోయావా కత్తీ ...ఎళ్ళి సినిమా రివ్యూస్ చూస్కోమ్మా మూర్ఖశిఖామణి ... (నీ పోస్టు ని ఒప్పుకున్న ఇంకో మూర్ఖశిఖామణికి ఒక నమస్కారం ... చెత్త బ్లాగు ... ఈ బ్లాగు ని పరిచయం చేసిన వాడిని అనాలి ముందు ...ఛస్)

అజ్ఞాత చెప్పారు...

అందర్ని సంత్రుప్తి పరచకపొయినా పర్లేదు, కించపరచకూడదుకదా !!!

అజ్ఞాత చెప్పారు...

చుస్తూ చుస్తూ నీమీద రాయేవడెస్తాడు కత్తి..

నాగప్రసాద్ చెప్పారు...

శరత్ గారూ, మిమ్మల్ని ఈ పోస్టును డిలీట్ చెయ్యమని అభ్యర్థిస్తున్నా. నేను మీ పోస్టును మార్పులు చెయ్యకముందే చదివా. అప్పటికీ, ఇప్పటికీ పెద్దగా తేడా ఏమీ లేదు.

కత్తి గారికి మహారంజుగా ఉందంట. అలాగలాగే. మరి మిమ్మల్ని, శరత్ గారిని కలిపి ఒక "గే" స్టోరి రాయమంటారా? :) :) :)

కామెడీకి కామెడి పంచ్‌కు పంచ్ కెలుకుడుకు కెలుకుడు తోడై మహా మహా మహా రంజుగా ఉంటుంది మరి. :) :) :). ఫర్లేదు కాస్త సంస్కారవంతంగానే రాస్తా.

శివ చెరువు చెప్పారు...

నాకు నచ్చలేదు.. ఒక వెక్కిరింత లా అనిపించింది..ఇతర పాత్రల పైన (భారతంలో చెడ్డ పాత్రల పైన )..రాసి వుండవచ్చేమో. కానీ ఎవరినైతే నర నారాయణులంటామో వారికి / పై ఈ రకమైన రచన తప్పని నా అభిప్రాయం.. మీ ఆలోచనలు మీ దగ్గరుండొచ్చు.. ఇతరుల నమ్మకాలపై మాట వెయ్యనంత వరకు.. బయటకు రావచ్చు..

అజ్ఞాత చెప్పారు...

......ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే (you gay, you gay)........

ధర్మ స్థాపన కొరకు ప్రతి యుగమున నువ్వు 'గే' లాగ మారమని భగవద్ 'గే'త సారము.

(ఇప్పటినుండి వీళ్ళు ఎప్పుడు ఈ శ్లోకం విన్నా వీళ్ళకి ఇదే గుర్తుకు వస్తుంది.)

-----------

శరత్ గారు, మీరు బెదిరింపులకు బయపడి పోస్ట్ తీసేస్తారా? మీకు ధైర్యం ఉంటే ఈ పోస్ట్ ఉంచండి.....!!!!!

పవన్ చెప్పారు...

కత్తి గారికి,
ఎంటొ మహా రంజుగా ఉందంట..ఏం చుశారో మరి..
అడ్డదిడ్డంగా వాదించి గేలి చేయడం తేలివితేటలు అనుకుంటున్నా కత్తి గారు మీతొ వాదించడం అనవసరం కాబట్టి ఉరుకుంటున్నారు అంతే కాని చేతకాక కాదు..
మీ కిరిస్తాని నీ మీ దగ్గర పేట్టుకోండి..

శరత్ 'కాలమ్' చెప్పారు...

ఆఫీసులో పని :( వున్నందున అందరికీ స్పందించే తీరిక ప్రస్తుతం లేదు.

@ నాగప్రసాద్
హిందువులకే వుంటాయా మనోభావాలు? హేతువాదులకు వుండవా? హేతువాదులకు మండదా? టన్నుల కొద్దీ హేతువాదుల మీద, గౌరవనీయులయిన ఇన్నయ్యగారు మరియు ఇతరుల మీద ఎంత చెత్త వ్రాసినా నవ్వేసి ఊరుకున్నాం. అన్ని మతస్తులకు, అందరికీ కూడా అలాంటి సహనం వుండాలి/ రావాలి. భావస్వేఛ్ఛ వుండాలి.

వ్రాయండి :)) ఎలా అయినా సరే అందరూ ఇలాంటి విషయాలపై డిసెన్సిటైజ్ కావడమే నేను కోరుకునేది. మీరు వ్రాసేది అందుకు ఉపకరిస్తుంది. మరీ ఒక్కరితోనేనా, కనీసం అయిదుగురు అయితే ఇంకా రంజుగా వుంటుంది ;)

కత్తి మహేష్ కుమార్ చెప్పారు...

పవన్ వాదనా..ఛా మరీ జోకుతున్నారే!!
ఇక్కడ మనోభావాలంటూ గుండెలు బాదుకోవడం,తార్కికంగా విశ్లేషిస్తే కిరస్తానం అంటూ లేకిమాటలు మాట్లాడటం మినహా మీరు చేస్తున్న వాదనలేమిటో మీకొచ్చిన చేతనైనతనమేమిటో దాని ఆనవాలుకూడా నాకు చిక్కడం లేదు. లేని నమ్మకాల్ని, అపోహల్ని మించిన మనోభావాల్ని మోసుకుని తిరుగుతూ అదేదో మహాకార్యమనుకునే మీ అల్పత్వానికి నా జోహార్లు. Be happy in that ignorance and arrogance.

అజ్ఞాత చెప్పారు...

రామాయణంలో లక్ష్మణుడు ఎప్పుడూ రాముడి వెంటే ఎందుకు ఉండేవాడు? అప్పుడే పెళ్ళైనా, ఊర్మిళను ఒదిలి అన్నవెంట అడివికి ఎందుకు వెళ్ళాడు? రాముడు కూడా లంక నుండి సీతను తెచ్చుకొని ఒక్క సంవత్సరంలో మళ్ళీ ఎందుకు అడివికి పంపాడు? ఆమెను లక్ష్మణుడే వెళ్ళి ఎందుకు అడివిలో వదిలిపెట్టి వచ్చాడు?

కొంచెం లోతుగా ఆలోచిస్తే మీకు ఇక్కడ కూడా కావలసినంత మేత దొరుకుతుంది.
కెలికి ఒదిలిపెట్టండి.

శ్రీమద్రమారమణ గోవిందో హరి.... :) :)

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ రాజేష్
మా ఆవిడకి నా గురించి అంతా తెలుసు కాబట్టి ఈ పోస్టు చూపించినా ఇబ్బంది లేదండీ.

@ కత్తి
:)

@ శ్రీనివాస్ పప్పు
అవును. అందుకే ఇలాంటి వ్రాతలని చూసి నవ్వి వదిలివేయాలి.

@ అజ్ఞాత
దానిదేముందీ మేము కూడా కించపరచబడ్డాం.

@ అజ్ఞాత
కత్తిగారు రాయి పడేస్తే ఓకే - నామీద కత్తి పడేస్తేనే కష్టం :)

@ శివచెరువు
మీరన్నది నిజమే కావచ్చు. మతవాదులు కూడా హేతువాదుల మీద పడి ఏడవకుండా వాళ్ళ పని వాళ్ళు చూసుకోవడం ఉత్తమం.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ అజ్ఞాత
హ హ. అలా 'గే' :)

@ అజ్ఞాత
నేను మరీ అలా కావాలని ఒకరి విశ్వాసాలని కెలికేవాడినేం కాదులెండి - ఏదో ఇలా సమయం, సందర్భం వచ్చినప్పుడు అంతే.

శరత్ 'కాలమ్' చెప్పారు...

ఇద్దరు బావామరుదుళ్ళ మధ్య స్నేహాన్ని, పరాచికాలనీ వ్రాస్తే ఎక్కువమంది ఎందుకు ఉలిక్కిపడుతున్నారో నాకయితే అర్ధం కావట్లేదు. డబుల్ మీనింగుతో కాకుండా సింగిల్ మీనింగుతో తీసుకోవచ్చుకదా!

నాగప్రసాద్ చెప్పారు...

శరత్ గారు, మనోభావాలు అనేవి హిందువులకు, హేతువాదులకు అనే కాదు ఈ ప్రపంచంలో ప్రతి మనిషికీ ఉంటాయి.


కానీ హేతువాదులు చెప్పేది సరిగ్గా చెబితే ఎవరికీ మండదు. మొదట ఎవరు ఎవరి మనోభావాలు దెబ్బతీశారో తెలుసుకోండి. పురాణాలను విమర్శించొచ్చు. కానీ కావాలనే హిందువులు చేసేవన్నీ తప్పు, దానికి ఒక కారణమంటూ ఏదీ లేదంటేనే మాకూ మండేది. అలాగే సీతా రాములను భక్తితో మేము కొలుస్తాం. కానీ "సీత రామునికి అక్క అవుతుంది" అని ఒక పిచ్చి కథ రాస్తే మండదా? పురాణాలను తప్పంటారు బానే ఉంది, కానీ ఓ పిచ్చి కథను తీసుకొచ్చి ఇది వాస్తవమంటే ఎలా ఉంటుంది? దేనికీ సరైన ఆధారం లభించనప్పుడు (నా ఉద్దేశ్యంలో సైంటిఫిక్‌గా), ఆధారం లభించేవరకు ఆ విషయం మీద రీసెర్చి అయినా చెయ్యాలి లేదా నోర్మూసుకొని అయినా ఉండాలి. అలా కాకుండా మనోభావాలు దెబ్బతీసేలా కథలు రాస్తే?


ఉదాహరణకు ఈ పోస్టు చూడండి: http://naprapamcham.blogspot.com/2009/09/blog-post_24.html

ఈ పోస్టులో కేవలం సూర్యనమస్కారాలను విమర్శించాలనే ఉద్దేశ్యమే తప్ప, వేరే ఏదైనా మార్గదర్శనం చేసే మ్యాటర్ ఉందా? ఆ రాసినాయనకి సూర్యనమస్కారాలేంటో తెలియదు. తెలిస్తే ఖచ్చితంగా అలా రాయడు. నేను సూర్యనమస్కారాలను చేస్తాను కాబట్టి నాకు తెలుసు. వాటి గురించి, అవి చేస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటో. నేను అనుభవంతో తెలుసుకున్నాను, ఆయన ఏమీ తెలియకుండానే విమర్శనాత్మక దృష్టితో రాశాడు. నా సంస్కృతి మీద ఎదుటి వాళ్ళు కావాలనే దాడి చేస్తున్నప్పుడు, నా స్థాయిలో నేను ఎదుర్కోవడానికి వెనుకాడను.


అలాగని నేనేమీ ఆధునిక విజ్ఞానానికీ, సైన్సుకు వ్యతిరేకం కాదు. అది నా "శాస్త్ర విజ్ఞానం" బ్లాగు చూస్తేనే మీకు అర్థం అవుతుంది.

ఇంకొక్క విషయం. ఇక్కడ మీరు కొత్తగా ఎవ్వరినీ డిసెన్సిటైజ్ చెయ్యాల్సిన పని లేదు. ప్రజలు ఎప్పుడో డిసెన్సిటైజ్ అయిపోయారు. కాని సమాజమన్నాక, నలుగురికీ ఇబ్బందులు కలుగకుండా కొన్ని హద్దులు పాటించాలి కాబట్టి పాటిస్తున్నారు.


ఇక మీ డిసెన్సిటైజ్ విషయానికొస్తే, ధూమ్, కాగడా రాతలని మీరు అంగీకరించలేకపోయారు గుర్తుందా? వాళ్ళు రాసింది ఎవరి మీదనో, కానీ మీ మనస్సు ఆ రాతలని అంగీకరించలేకపోయింది. ఎందుకు? ఆ రాతలకు మీ మనోభావాలకు సంబంధం లేదు. ఎవరో ఎవరో ఎవరెవరిదో గొడవ. కానీ పాపం.సాటి బ్లాగర్లనంటున్నారేనన్న ఒకరకమైన ఫీలింగ్ మనల్ని వాటిని అంగీకరించకుండా ఆపింది. అది కూడా కాదు, ఆ రాతల్ని accept చేసే రేంజులో మీరు డిసెన్సిటైజ్ కాలేదు మరి. :)


ఇప్పటికే చాలా రాశాను. ప్రస్తుతానికి ఇక్కడితో ఆపేస్తాను.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ నాగప్రసాద్
డిసెన్సిటైజ్ అన్న విషయాన్ని నేను అన్నది ఒక కోణంలో, మీరు తీసుకున్నది మరో కోణంలో. అందరూ ఎక్కువగా గే ల గురించి మాట్లాడుకుంటే ప్రజల దృష్టిలో అవి సాధారణం అయిపోయి వ్యతిరేకత తగ్గుతుంది. అందుకే మిమ్మల్ని కూడా వ్రాయమని ప్రోత్సహించింది ;)

నాగప్రసాద్ చెప్పారు...

’గే’ ల విషయం ప్రజల దృష్టిలో పడాల్సిన అవసరం ఏముంది? అని నాకు అనుమానం. ఇద్దరు మగాళ్ళు ఉంటే సాధారణంగానే ఎవ్వరికీ అనుమానం రాదు. వాటికీ హక్కులూ, కోర్టులూ, గట్రా ఎందుకో నాకస్సలు అర్థం కావడం లేదు. సైలెంటుగా పని కానిచ్చుకుంటే థ్రిల్లుండదా? :)) లేదా ఈ వ్యతిరేకత వల్ల మంచి మంచి అబ్బాయిలను అనుభవించలేకున్నామనే బాధనా. :)))

సరే నేను డిస్కషన్ పెట్టాను మరి. ;) మీరు ఈ విషయం మీద ఎంత మాట్లాడతారో మాట్లాడండి. :)

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ నాగప్రసాద్
ఈ విషయాల గురించి ఎక్కువగా మాట్లాడితే సెన్సార్ సభ్యులకు కోపం వస్తుంది. అందుకే చర్చ పొడిగించడం లేదు.