నా గత టపా ఇది :
http://sarath-kaalam.blogspot.com/2010/01/3.html
కొద్దిరోజుల క్రితం 'జడివాన' బ్లాగర్ శిశిర "ఓ 'బంగారం' కథ " సిరీస్ వ్రాసారు. అందులో బంగారం అనే అమ్మాయికి 16 ఏళ్ళకే తల్లితండ్రులు ఇష్టం లేని పెళ్ళి చేస్తారు. నా గత టైటిలులో బంగారం అని పెట్టడానికి కారణం అది గుర్తుకు తేవడమే కానీ ఎవరూ అది క్యాచ్ చేసినట్లు లేరు - చేసినా బావోదేమోలే అని మిన్నకున్నారేమో. నేను చెప్పాలనుకున్న భావం చెప్పినా, ఫోటో కూడా సూటబుల్ ఫోటో పెట్టినా టైటిల్ మరో రకంగా పెట్టేసరికి నేను చెప్పాలనుకున్న భావం చదువరులకు అందకుండా పోయింది. తెలుగు సినిమా స్టొరీల్లాగా శుభం కార్డు వేసినట్లయ్యింది కానీ వాస్తవాలు అలా వుండవు కదా. అదే కాకుండా నేను చెప్పేది చేసేదొకటి, గౌరవించేదొకటి అన్నది ధ్వనిస్తూ హిపోక్రాటుగా అనిపించాను కొందరికి. అదీ కాకుండా నేను హైలైట్ చేయదలుచుకున్న విషయానికి ఫోకస్ లేకుండా అయిపోయింది. పెళ్ళి విషయంలో అమ్మాయి ఇష్టాయిష్టాలని గమనించకుండా తమ సెంటిమెంట్లూ, ఇష్టాలూ తల్లితండ్రులు రుద్దితే ఫలితం ఎలా వుంటుందన్నదే నేను చెప్పాలనుకున్న విషయం. కనీసం పెళ్ళీడు కొచ్చిన అమ్మాయి వున్న ఒక్క తండ్రి అన్నా, తల్లి అన్నా ఈ టపా వల్ల ఆ విషయం గుర్తుంచుకోకపోతారా అన్నదే ఈ సిరీస్ వ్రాయడానికి, నా వ్యక్తిగత విషయాలను పణంగా పెట్టి వ్రాయడానికి గల కారణం. టైటిల్లోని పొరపాటు వల్ల ఆ ప్రయత్నం, ఫోకస్ వృధా అయ్యింది, అందుకే ఈ సవరణ.
I am sorry for the confusion.
http://sarath-kaalam.blogspot.com/2010/01/3.html
కొద్దిరోజుల క్రితం 'జడివాన' బ్లాగర్ శిశిర "ఓ 'బంగారం' కథ " సిరీస్ వ్రాసారు. అందులో బంగారం అనే అమ్మాయికి 16 ఏళ్ళకే తల్లితండ్రులు ఇష్టం లేని పెళ్ళి చేస్తారు. నా గత టైటిలులో బంగారం అని పెట్టడానికి కారణం అది గుర్తుకు తేవడమే కానీ ఎవరూ అది క్యాచ్ చేసినట్లు లేరు - చేసినా బావోదేమోలే అని మిన్నకున్నారేమో. నేను చెప్పాలనుకున్న భావం చెప్పినా, ఫోటో కూడా సూటబుల్ ఫోటో పెట్టినా టైటిల్ మరో రకంగా పెట్టేసరికి నేను చెప్పాలనుకున్న భావం చదువరులకు అందకుండా పోయింది. తెలుగు సినిమా స్టొరీల్లాగా శుభం కార్డు వేసినట్లయ్యింది కానీ వాస్తవాలు అలా వుండవు కదా. అదే కాకుండా నేను చెప్పేది చేసేదొకటి, గౌరవించేదొకటి అన్నది ధ్వనిస్తూ హిపోక్రాటుగా అనిపించాను కొందరికి. అదీ కాకుండా నేను హైలైట్ చేయదలుచుకున్న విషయానికి ఫోకస్ లేకుండా అయిపోయింది. పెళ్ళి విషయంలో అమ్మాయి ఇష్టాయిష్టాలని గమనించకుండా తమ సెంటిమెంట్లూ, ఇష్టాలూ తల్లితండ్రులు రుద్దితే ఫలితం ఎలా వుంటుందన్నదే నేను చెప్పాలనుకున్న విషయం. కనీసం పెళ్ళీడు కొచ్చిన అమ్మాయి వున్న ఒక్క తండ్రి అన్నా, తల్లి అన్నా ఈ టపా వల్ల ఆ విషయం గుర్తుంచుకోకపోతారా అన్నదే ఈ సిరీస్ వ్రాయడానికి, నా వ్యక్తిగత విషయాలను పణంగా పెట్టి వ్రాయడానికి గల కారణం. టైటిల్లోని పొరపాటు వల్ల ఆ ప్రయత్నం, ఫోకస్ వృధా అయ్యింది, అందుకే ఈ సవరణ.
I am sorry for the confusion.

25 comments:
old post was better... this is much more confusing.
@ అజ్ఞాత
సవరణను మరింత సవరించాను చూడండి.
Is that ""Bangaaram" This bangaaram are one??
am really sorry if am wrong..
>>"పెళ్ళి విషయంలో అమ్మాయి ఇష్టాయిష్టాలని గమనించకుండా తమ సెంటిమెంట్లూ, ఇష్టాలూ తల్లితండ్రులు రుద్దితే ఫలితం ఎలా వుంటుందన్నదే నేను చెప్పాలనుకున్న విషయం."
ఫలితం ఏముంది మీరు మంచోరే దిరికారు కదా? అలా కాదని చెప్పండి, ఒప్పేసుకుంటాం. :)))))
తల్లి దండ్రులు తమ సెంటిమెంట్లూ, ఇష్టాలని రుద్దడమనేది, అమ్మాయిలవరకే పరిమితం కాదు. అబ్బాయిలకు కూడా ఇంతే. పెళ్ళి విషయంలో అబ్బాయిలు కూడా చాలా వరకు కాంప్రమైజ్ కావాల్సొస్తుంటుంది. :(((
అయినా, అభిప్రాయాలను, ఇష్టాలని గమనించుకుంటూ పోతే పెళ్ళి చేయడం చాలా కష్టం. సాధారణంగా, ఏ ఇద్దరి అభిప్రాయాలూ కలవవు. అలాంటప్పుడు ఎన్ని పెళ్ళి చూపులని ఏర్పాటు చేస్తారు. వెంటనే నచ్చిన అబ్బాయి దొరికితే ఫర్వాలేదు. అలా కుదరలేదనుకో, ప్రతీసారీ, పెళ్ళి చూపుల కోసం చేసే మర్యాదల వలన ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించారా. ఇంకా, ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు అమ్మాయిలు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి.
ఇలాంటి సమస్య ఒకటి ఉంటుందని తెలిసే, ప్రకృతి ఒక ఏర్పాటు చేసింది. ఆరునెలలు కలిసుంటే, వారు వీరయ్యేటట్లుగా అన్నమాట. :)))
కానీ, మన భారతీయ వివాహ వ్యవస్థలో ఒకప్పుడు ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళకు సంబంధించిన వాళ్ళనే చేసుకుంటారు కాబట్టి పెద్ద సమస్య ఉండేది కాదు. ఎందుకంటే, ఇరువురి కులవృత్తి, అలవాట్లు,ఆచారాలు, పద్ధతులు వగైరా అన్నీ ఒకటే కాబట్టి, అమ్మాయి మెట్టినింటికి వెళ్ళినప్పుడు పెద్దగా ఇబ్బందిపడేది కాదు. కానీ, ప్రస్తుతకాలంలో పరిస్థితిలో మార్పు వస్తోంది.
ఈ విషయం పైన ఇంకా చాలా రాసేది ఉంది. ప్రస్తుతానికి నాకు ఓపిక లేదు. ఇక్కడితో అసంపూర్ణంగా ఆపేస్తున్నా.
@ అజ్ఞాత
హ హ. కాదులెండి. కొన్ని పోలికలు అంతే.
@ నాగప్రసాద్
నేను మంచోడినా? మీరూ, నేనూ అలా అనుకుంటే సరిపోద్దా :))
నిజమే, అబ్బాయి అయినా, అమ్మాయి అయినా ఎవరిమీదా తమ అభిప్రాయాలు బలవంతంగా తల్లితండ్రులు రుద్దవద్దు. నా విషయంలో నేనే నా అభిప్రాయాలని నా తల్లితండ్రుల మీద రుద్దేవాడిని. హి హీ.
పెళ్ళిచూపుల ఖర్చులు ఎక్కువవుతాయని పెళ్ళి బలవంతంగా రుద్దేస్తారుటండీ. హమ్మ, హమ్మా, ఇప్పుడర్ధమయ్యింది మా మాంగోరి మనస్సు - పెళ్ళిచూపుల ఖర్చు తప్పించడం కోసం మొదటిసారికే పెళ్ళి చూపులు ఓకే కావాలనే సెంటిమెంటు పుట్టించివుంటాడు. హమ్మ, నా మామా!!
వ్రాయండి, తీరిక వున్నప్పుడు ఓపికగా ఓ టపా వ్రాయండి.
నాగపెసాద్ గారూ, మీరంటే కొంత అభిమానం ఉండేది ఇదివరలో ( శరత్ గారి పాప కి సలహాలు ఇచ్చినప్పుడు ) ... కానీ ఇప్పుడు.... హ్మ్మం ( బొమ్మరిల్లు లో కానీ ఇప్పుడు ... హమ్ లా పాడుకోగలరు )
ఎవరి అభిప్రాయాలు కలవవు నిజమే, కానీ కొంత మాత్రమే నిజం. అంటే 100% కలవవు. కనీసం 70-80% కలిస్తే, ఇక ఆ జంటకి తిరుగు లేదు. కానీ 50% match కి తగ్గితే, ఇద్దరి జీవితం అధోగతే, అనుభవం మీద తెలుస్తుంది లెండి మీకు. ఇంకా కా 'లేజీ ' కుర్రాడేగా తమరు.
అయినా అభిప్రాయాలు కలవటం అంటే, నాకు పులిహోర అంటే ఇష్టం అంటే, నాకు ఇష్టం లేదు అనటం కాదు. వారి ఇద్దరి జీవిత విధానం ఎలాంటిది, వారి విలువలు మ్యాచ్ అవుతున్నాయ? అనేది చాల ముఖ్యం.
ఒకరికి విలువలు ఎక్కువ, ఒకరికి అస్సలు వాటి విలువ రూపాయి ఉంటుందా అనే రకం ఐతే, మీకు చెప్పిన పెళ్లి చూపుల కర్చు కంటే, చాలానే కర్చు అయిపోతుంది జీవితం - కాదు, కార్చిచ్చు అయిపోతుంది అని చెప్పటమే ఈ సెరీస్ ఉద్దేశం. ఇంత మొత్తుకున్నా శరత్ గారు తన జీవితానుభవం చెప్పి మరీ, మీలాంటి వారు - ఎలాగో కలవవు అభిప్రాయాలూ ఏ ఇద్దరోను, పెళ్లి చూపుల కర్చు కలిసొస్తుంది, లేక బెమ్మచారి ముదిరిపోతే కష్టం కదా, ఎవరో ఒకర్ని చేసుకుంటే పోలా అనటం - ప్చ్, ఎం చెప్పగలం తమ్మీ ?
పెళ్లి చూపుల కర్చు కోసం అయ్యి ఉండదు శరత్ గారూ, ఊరికే సంబంధాలు ఎం వెతుకుతామ్లె, మొదటిదే చేసేస్తే, ఒక 'పని' అయిపోతుంది అనుకునే సగటు వ్యక్తీ మీ 'మాం'గారు.
ఇలాంటి సమస్య ఒకటి ఉంటుందని తెలిసే, ప్రకృతి ఒక ఏర్పాటు చేసింది. ఆరునెలలు కలిసుంటే, వారు వీరయ్యేటట్లుగా అన్నమాట. :)))
అబ్బ, ఛా ! అవునా ? ఐతే, తమరినీ ప్ర.నా ని ( పోనీ ఆడ వెర్షన్ అఫ్ ప్ర.నా ) ని ఒక దగ్గర పెడితే, తమరూ ప్ర.నా లా ఐపోతారు అన్నమాట !
@ nagaprasad
పెళ్ళికి కావాల్సిందేమిటి అన్న విషయం మీద కొన్ని నెలల క్రితం ఒక పోస్ట్ వ్రాసాను - చూడండి.
"వుండాల్సింది మానసిక సారూప్యత"
http://sarath-kaalam.blogspot.com/2009/07/blog-post_27.html
Just a suggestion as to what lead to the confusion by readers.
I think the reason for confusion was your 'fun' writing style,( due to which some people really like you ) when you wanted to convey a serious point, and not 'just' the title.
I'm sure anyone who read it left with a smile.Infact lot of people like reading serious topics conveyed in a fun way.But when you want to convey a strong point and also keep it fun, you could use sarcasam to do it.
Also,I think the ending was abrupt to convey your point ie the effects of both people not changing aren't clear to readers( I understand you didn't want to).If you prolonged it a little with a simple line, in a funny way- for eg: I understood for the first time why human lives are compared to a candle, and marriage brought philosophical views about life in both of us ;-) etc, the readers would have got your point well.I'm not a writer like you, you could put it better.
నాగా గారు
పై అజ్ఞాత లేడిస్ వోచ్..ఏవరో కుడా నాకు తేలిసిపోయింది బిజినేస్ పనులో బిజి గా ఉన్నా అధారాలు తరువాత బయటపేడతా.లేనిన్ తో కర్ర బీల్ల
శరత్ గారు నాకు సారి చేప్పాలి..నాకు తల నోప్పి వస్తుంది
నాగా ఈ ప్రేమ..పేళ్ళి అంత ట్రష్..మగాళ్ళాని కుక్క పిల్లల్ని అడించినట్టు అడిస్తారు ఈ అడోళ్ళు.....
beaware of marriage
@ పవన్
హే, ఆల్రెడీ ఈ పోస్టులో సారీ చెప్పా కదా. మళ్ళీ మళ్ళీ చిన్న చిన్న దానికి సారీ అంటే కష్టం బాబూ. తలనొప్పి చాలా చిన్న విషయం - ఏదయినా పెద్దది వుంటే చూడకూడదూ - ట్రై చేస్తా!
@ అజ్ఞాత
మీరు చెప్పింది నిజమే - సీరియస్ విషయం చెప్పాలనుకున్నప్పుడు సీరియస్ టోన్ వుండాలి రచనలో. అయితే నేను వాడిన సరదా ఎత్తుగడకి ఒక కారణం వుంది. బ్లాగుల్లో వ్రాతలంటేనే కత్తి మీద సాము వంటివి. ఇక వ్యక్తిగత విషయాలు ప్రస్థావించేటప్పుడు ఎంత జాగ్రత్తగా వుండాలో చెప్పనక్కరలేదు. ఇలాంటి విషయాలు సరదాగా చెబితే ఏదో సరదాగా వ్రాసుకున్నాడులే అనుకుంటారు - సీరియస్సుగా వ్రాస్తే 'ఇంటి పరువు గంగలో కలపదలుచుకున్నావా?', ఇంకా ఇంకా చాలా దండుత్తుతారు. ఇంకా ఏమంటారో ఉదాహరణలు ఇవ్వచ్చు కానీ వద్దులెండి - అనవసరంగా అలాంటి విమర్శకులకి ఆలోచనలు ఇచ్చినట్లు అవుతుంది. అందుకే మింగలేక కక్కలేక ఏదో అలా లాగించేసా!
ఇక ముగింపు విషయంలో మీరన్నదీ నిజమే. గంభీరంగా ఒక పేరా వ్రాసి అవన్నీ ఎందుకులే అని తొలి వాక్యం మాత్రమే ఉంచి సరిపెట్టా. అసలు విషయం సూచన ప్రాయంగా మాత్రమే తెలిపాను. కాస్త సమయం తీసుకొని ముగింపుని మరో విధంగా పరిపూర్ణం చేస్తాను.
అయ్యో! అనవసరంగా, ఈ పోస్టుకు కామెంటు రాసి ఒక అజ్ఞాత అభిమానిని దూరం చేసుకున్నానే. ప్చ్... :(
>>"నాగపెసాద్ గారూ, మీరంటే కొంత అభిమానం ఉండేది ఇదివరలో ( శరత్ గారి పాప కి సలహాలు ఇచ్చినప్పుడు ) "
శరత్ గారి పాపకి ఇవ్వాల్సిన సలహాలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఆయన ఆ సిరీస్ ఇంకా కంటిన్యూ చేస్తాడేమో అనుకొని పూర్తిగా ఇవ్వలేదు. కాస్త నాకు వెసులుబాటు కలగగానే ఇస్తాను.
హ్మ్... అజ్ఞాత గారు, నేను రాసిన వ్యాఖ్యలో చివరి పేరా చదవండి. నా వ్యాఖ్య అసంపూర్ణం అని స్పష్టంగా చెప్పాను. బహుశా సంపూర్ణంగా రాసుంటే మీకు అలాంటి అభిప్రాయం ఏర్పడుండేది కాదేమో.
మీరన్నట్లుగా అభిప్రాయాలు కొంత శాతం మేరైనా కలిస్తే మంచిదే. కాని, మన సమాజంలో అది ఎంతవరకు సాధ్యం అన్నది ఆలోచించాలి. పాశ్చాత్య దేశాల్లోలా కొంతకాలం సహజీవనం చేసి, అభిప్రాయాలు కలిస్తే ఓకే అనేసి, కలవకపోతే మరొకరితో సహజీవనం, ఇలా ఎన్నాళ్ళని చేస్తారు?
లేదా అరేంజ్డ్ మ్యారేజీ విధానం రద్దు చెయ్యాలి మనదేశంలో. అందరూ ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళే వెతుక్కుని చేసుకునే విధంగా "ప్రేమ వివాహ చట్టం" చెయ్యాలి. :)))
కానీ ఈ ప్రేమ విహహాల్లో తీయని మాటలదే పై చేయి. అందంగా ఉన్న అమ్మాయి దగ్గర అందరూ చక్కగానే నడుచుకుంటారు. తీయని మాటలు చెబుతారు, కొండమీద కోతినైనా తెచ్చిస్తారు. కానీ, అదంతా పెళ్ళి కాకముందు వరకే. పెళ్ళయిన తర్వాత "రాదే చెలి...నమ్మరాదే చెలి...మగవారీనిలా నమ్మరాదే చెలి" అని పాటలు పాడుకోవాల్సి వస్తుంది ఆ అమ్మాయి. :)))
ఇక నా వరకైతే ఒక మొండి ఘటాన్ని చేసుకోవాలనుకుంటున్నాను. ప్రతి దానికి ఎడ్డమంటే తెడ్డమనే రకం అన్నమాట. ఎందులోనూ అభిప్రాయాలు అస్సలు కలవకూడదు. ఇంట్లో ఎప్పుడూ గొడవ గొడవగా సందడి సందడిగా ఉండాలి. మా గోల భరించలేక చుట్టు ప్రక్కల ఇళ్ళలో వాళ్ళు ఇళ్ళు ఖాళీచేసేయ్యాలి. అప్పుడే లైఫ్‌లో కిక్కే కిక్కు. :))). ఇప్పుడు చెప్పండి, మా ఇద్దరి అభిప్రాయాలు కలవవు కదా, మరి ఆ సంసారం కార్చిచ్చు అవుతుందా మీ ఉద్దేశ్యంలో. (ఈ మధ్యనే ఈ మొండిఘటం క్యారెక్టర్ బేస్ చేసుకొని "మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన ప్రత్యేక ఉద్యమం" అని ఒక కథ కూడా రాశాను. ;))))). )
నా ఉద్దేశ్యంలో మాత్రం అవుతుంది. అది అభిప్రాయాలు కలవనందుకు కాదు. "నమ్మకం" అనే స్థానంలో "అనుమానం" వచ్చి చేరితే తప్పకుండా అవుతుంది. పెళ్ళంటే నమ్మకం. నమ్మకమున్నంత వరకు, ఎదుటివ్యక్తిని నమ్మినంతవరకు అభిప్రాయాలతో పనిలేదు. ఆ నమ్మకం పోతేనే, "కూరిమి గల దినములలో నేరములు కనపడవు" అనే సుమతీ శతకం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నా దృష్టిలో "అనుక్షణం అనుమానిస్తూ బ్రతకడం కన్నా, నమ్మి నాశనమవడమే ఉత్తమం."
నమ్మకం...నమ్మకం...నమ్మకం..నమ్మకమే లేకుంటే...బ్రతుకేది. :)))
్ఆగప్రసాద్,
చాలా, చాలా బగా చెప్పారు. అబ్భాయి, అమ్మాయి ల ఇష్టాలు కలవాలి అని ఒకటికి, వంద పెళ్లి చూపులు లాంటివి పెట్టి పెళ్లి చెస్తే ఆ వివాహాలు విజయవంతం అవుతున్నాయా? అది మాత్రం అలోచంచరు. అంతెందుకు ఏ మీ పట్టించుకోకుండా కెవలం తల్లి తండ్రులు చూపించిన వారిని చేసుకొంటున్న వారిలో కంటే ఏళ్ళు ఏళ్ళు ప్రెమించేసుకొని, ఒకళ్లను ఒకళ్ళు అర్ధంచేసేసుకొని పెళ్ళి చేసుకొన్న పెళ్ళిళ్ళు ఎక్కువ విజయవంతం నిజంగా అవుతున్నయా?
ఏ వివాహమయినా, ఆ మాటకు వస్తే ఏ ధీర్గకాలిక సంబ్నధం అయినా విజయవంతం కావాలంటే కావాలసింది ఒకరంటే. ఇంకొకరికి ఎక్కడొ కొద్ది అభిమానం, గౌరవం , అవతలి వాళ్ల ఇష్టాలు కూడా గౌరవించాలి అనే సంస్కారం. అన్నిటికంటే కాంప్రమైజ్ కావటమంటే ఓడిపోవటం కాదు అని తెలుసుకొనే తెలివితేటలు ఉండటం, లేదా తల్లి తండ్రులు అది చెబుతూ పెంచి ఉండటం.
చాలా మంచి కామెంట్ వ్రాసినందుకు అభినందనలు, అర్ధం చేసుకొంటే అందులో చాలా లోతు ఉంది, అర్ధం కాని వారి గురించి పట్టించుకోకండి :))
వారు వీరు అయిన వారిలో ఒకడిగా :((
చివరిగా నాగప్రసాద్ ను మెంటల్ కేసు ను ఒకింట్లో పెడితే వారు వీరు అవుతారా? అని అడిగిన మెతావికి గమనిక, పైన నేను చెప్పినవన్నీ మామూలు మనుషులకు మాత్రమే వర్తిస్తాయ్యి, మానసిక రుగ్మతలు, ముఖ్యంగా చాందస నాస్తికవాద, దొమ్మరి వాద రుగ్మతలు ఉన్న వారి విషయంలో వర్తించవు :))
హ్మ్మ్ .....మీ టపాలోని ఉద్దేశ్యం మంచిది కాబట్టి ఆల్రెడీ ఏర్పడిపోయిన మా "మా .భ .బా .సం " జాక్ ఆమోదించింది . కాని మీరు మారటానికి ఇంకో పదేళ్ళు గడువు పొడిగించడమైంది :) :)
Krishna గారు,
>>"ఒకరంటే. ఇంకొకరికి ఎక్కడొ కొద్ది అభిమానం, గౌరవం , అవతలి వాళ్ల ఇష్టాలు కూడా గౌరవించాలి అనే సంస్కారం. అన్నిటికంటే కాంప్రమైజ్ కావటమంటే ఓడిపోవటం కాదు అని తెలుసుకొనే తెలివితేటలు ఉండటం, లేదా తల్లి తండ్రులు అది చెబుతూ పెంచి ఉండటం."
చక్కగా చెప్పారు. ప్రతి మనిషిలోనూ ఉండవలసింది అటువంటి సంస్కారమే.
మాటి మాటికి మారిపోయే అభిప్రాయాలు కలవాలనడం మంచి పద్ధతి కాదు. పైన అజ్ఞాత గారే, నేను శరత్ గారి పాపకు సలహాలిచ్చినప్పుడు ఒక రకమైన అభిప్రాయంతోనూ, కానీ...ఇప్పుడు..హ్మ్..అంటూ మరో అభిప్రాయంతోనూ ఉన్నారు. కేవలం ఒక కామెంటు తేడాలోనే వారి అభిప్రాయాన్ని మార్చుకున్నారు.
వారే కాదు, జీవితంలో ఎవరి అభిప్రాయాలు కూడా ఎప్పటికీ ఒకే విధంగా ఉండవు. కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, జీవితంలో ఎదురయ్యే అనుభవాలను బట్టి ఎప్పటికప్పుడు మనిషి అభిప్రాయాలు మారిపోతుంటాయి. అలాంటి అభిప్రాయాలను బేస్ చేసుకొని పెళ్ళి చేసుకోవాలనడం మూర్ఖత్వం.
కాలంతో పాటు అంత తొందరగా మారనివి మనిషిలోని బలహీనతలు, వ్యసనాలు, కొన్ని రకాల అలవాట్లు మాత్రమే. ఈ వ్యసనాలు, అలవాట్ల వల్లనే సింహ భాగం గొడవలు జరుగుతూ ఉంటాయి. పెళ్లయ్యాక ఆడోళ్ళు ఆ వ్యసనాలను మాన్పించాలనుకొని, మాన్పించలేక రాజీపడిపోతుంటారు. :)). అంతేకాని మగాడి అభిప్రాయాలతో వాళ్ళకొచ్చే నష్టం పెద్దగా ఏమీలేదు. అవి ఎప్పటికైనా మారిపోయేవే.
శరత్ గారు కూడా తన బలహీనతలను, వ్యసనాలను, అలవాట్లను తన అభిప్రాయాలనుకొని, పెళ్లై ఇన్నేళ్ళయినా, మా ఆవిడ ఎంత పోరు పెట్టినా "నేను మారలేదోచ్" అంటూ గొప్పలు పోతున్నాడేమోనని నా అనుమానం. :)). శరత్ గారు మీరు తక్షణమే ఈ విషయం తేల్చాలి. మీవి అభిప్రాయాలా లేక బలహీనతలు/వ్యసనాలు/అలవాట్లా వగైరా వగైరా నా? ఒకసారి ఆలోచించి చెప్పండి. తెలుగు సినిమాల్లో ఎంత కరుడు కట్టిన విలన్ అయినా, క్లైమాక్స్‌లో మనసు మార్చుకుంటాడు. ఖళ్..ఖళ్...ఖళ్... కేసును ప్రత్యేక కె.బ్లా.స కోర్టులో విచారణకు ఆదేశించడమైనది. కాబట్టి, మీరు నిజాలు చెప్పకుండా తప్పించుకోలేరు. :))
కృష్ణగారూ నన్ను మేతావి అన్నందుకు సంతోషం. ప్లీజ్ జాయిన్ మీ ఇన్ యువర్ క్లబ్ !
నాగప్రసాద్ గారు, మీరు చెప్పినవి నిజమే కొంత వరకూ. నా దృష్టిలో అభిప్రాయాలు అంటే ఏంటో ముందే చెప్పాను. విలువలు అని. మీరు చెప్పింది, నేను చెప్పింది ఒక రకంగా ఒకటే.దానికి సహజీవనమే చెయ్యక్కర్లేదు. ఎంత మందితో సహజీవనాలు చేసినా, పెళ్లి కాగానే పది రోజుల్లో డివోర్స్ తీసుకుంటున్నారు, దీన్ని బట్టి ఒకరి గురించి ఒకరికి ఏమీ తెలియదనేగా. కాకపొతే కనీసం ఒకరి విలువలు, జీవిత విధానం గురించి ఒకరు తెల్సుకోవటం అవసరం అనిపిస్తుంది. ఉదాహరణకు, డబ్బే ప్రపంచం అనుకునే భార్యకి, ఎంత ప్రేమతో భర్త చూసినా తృప్తి ఉంటుందా ? నాకు అవి, ఇవి కొనిపెట్టలేదు అంటూ చిరాకు పడిపోతుంది.అది ఆమె తప్పు కాదు. తన విలువల్లో డబ్బుకి అగ్రస్థానం. అతని విలువల్లో ఇష్టమైన వారితో సమయం గడపటం ముఖ్యం.ఇవి మారిపోయే అభిప్రాయాలు కావు.
మీ సమగ్ర post కోసం ఎదురు చూస్తాను. నేను ప్ర.నా తో compare చేసింది ఎందుకంటే, అలంటి మనిషికి కేవలం ఒక పెళ్లి చూపులు చూసేసి, ఓకే చెప్పేస్తే ఆ అమ్మాయి జీవితం గురించి ఆలోచించండి ఒక సారి. ఆ అమ్మాయి, అతను ఎవరూ మారరు. ప్ర.నా లాంటి గొప్ప వ్యక్తిని గురించాలంటే,( అతని లాంటి అమ్మాయిని గుర్తించాలంటే(hope there's none) ) ఒక అరగంట అయినా కూర్చుని ఒకరి గురించి ఒకరు తెల్సుకోవటంలో తప్పేముంది.అప్పుడు అతనెంతో అమ్మాయికి తెలుస్తుంది కదా.
ఇక పొతే మీరు బాగా సందడి మనిషనుకుంటా,మీకు తగ్గ అమ్మాయి దొరకాలని కోరుకుంటా.
అజ్ఞాత గారు, ప్రనా లాంటి వ్యక్తి గురించి భయపడవలసిన అవసరం లేదండి. అతను నిజాయితీ పరుడు, పైగా మంచి అస్తిపరుడు, జీవితంలో బాగానే సెటిల్ అయ్యాడు. ఏవో కొన్ని చలం, రంగనాయకమ్మ, ఇన్నయ్య తదితరుల అభిప్రాయాలని మోతాదుకు మించి తలలో మోస్తున్నాడు అంతే. అటువంటి వాణ్ణి చేసుకునే అమ్మాయికి కష్టమేమి ఉండదని నేను భావిస్తున్నాను. వ్యసనాలకు బానిసై చిత్రహింసలు పెట్టే భర్తలనే భరించగల్గుతున్నారు ఆడోళ్ళు. వాళ్ళతో పోలిస్తే ఈ ప్రనా ఎంత? ఈకలాంటోడు. :))
>>"డబ్బే ప్రపంచం అనుకునే భార్యకి, ఎంత ప్రేమతో భర్త చూసినా తృప్తి ఉంటుందా ? నాకు అవి, ఇవి కొనిపెట్టలేదు అంటూ చిరాకు పడిపోతుంది.అది ఆమె తప్పు కాదు. తన విలువల్లో డబ్బుకి అగ్రస్థానం. అతని విలువల్లో ఇష్టమైన వారితో సమయం గడపటం ముఖ్యం.ఇవి మారిపోయే అభిప్రాయాలు కావు."
ఇవి మారిపోయే అభిప్రాయాలేనండి. చెప్పేవిధంగా చెప్తే ఖచ్చితంగా మార్చుకుంటారు. ఇటువంటి అభిప్రాయ బేధాలతో గొడవలుపడి విడిపోయి,మారిపోయి దంపతులిద్దరూ క్లైమాక్స్‌లో కలిసిపోయే సినిమాలు బోల్డు వచ్చాయి మన తెలుగులో. :) :) :)
>>"ఇక పొతే మీరు బాగా సందడి మనిషనుకుంటా,మీకు తగ్గ అమ్మాయి దొరకాలని కోరుకుంటా."
అవునండి. ధన్యవాదములు.
కేసు కొర్టులొ పెట్టి .. మీ ఇస్టం వచ్చినట్టు వాదించేసుకుని.. కనీసం జడ్జిమెంట్ వినేవరకూ కూడా ఆగకుండా ఇరుపక్షాలు ఒకరైకొకరు గ్రీటింగ్స్ చెప్పుకొని వెళ్ళిపొయారా.. ఎంత అన్యాయం ??
@ naagaprasad
"ఇక నా వరకైతే ఒక మొండి ఘటాన్ని చేసుకోవాలనుకుంటున్నాను. ప్రతి దానికి ఎడ్డమంటే తెడ్డమనే రకం అన్నమాట. ఎందులోనూ అభిప్రాయాలు అస్సలు కలవకూడదు"
లాభం లేదండీ. తొందరగా మీరు ఆ పెళ్ళేదో మీకు పై విధంగా నచ్చిన అమ్మాయిని చేసుకోవాల్సిందే. ఆ తరువాత రియాలిటీ షోలాగా ఓ రియాలిటీ బ్లాగు పెట్టి మీరు ఎలా జీవిస్తున్నారు, మీ మానసిక భావాలు ఎలా వున్నాయి అనేది మాకు లైవ్ ఇవ్వాల్సిందే.
నా అభిప్రాయాల గురించి: మీలా ఇలా నా కాబోయే భార్య ప్రతిరోజూ వాదించే పరిస్థితి రాకూడదనే, ప్రతిరోజూ సమాధానం చెప్పుకునే పరిస్థితి నాకు రాకూడదనే నా ఇష్టాలతో ఏకీభవించే జతను కోరుకున్నది.
పెళ్లయిన తరువాత కూడా భేదాలు వుంటే కొన్ని సార్లు నమ్మకం తో క్యూర్ కావచ్చు కానీ పెళ్ళయింతరువాత నమ్మకంగా నమ్మకం వుంటుందనే నమ్మకం ఎలా? అందుకే వీలయినంతవరకు భేదాభిప్రాయాలని ముందుగానే పరిష్కరించుకోవడం మంచిది. Prevention is better than cure!
@ మంచుపల్లకి
మీ వ్యాఖ్య అర్ధం కాలేదు! వేరే బ్లాగులో వెయ్యబొయ్యి ఇక్కడ వేసారా పొరపాటుగా?
కాదండి.. పైన కామెంట్లొ (29 జనవరి 2010 4:12 am ) నాగా " ఈ కేసును ప్రత్యేక కె.బ్లా.స కోర్టులో విచారణకు ఆదేశించడమైనది. కాబట్టి, మీరు నిజాలు చెప్పకుండా తప్పించుకోలేరు." అని చెప్పి ఆయన అజ్ఞాత ఫైనల్గా రాజీ పడిపొయారు.. ఇలాయితే ప్ర క్లె బా స మనుగడ ఎలా అని నాగాని అడుగుతున్నా అంతే
అది సరె గానీ ఈ భ .బా .సం ఎమిటండి ?? దానికి కూడా మీరె అద్యక్షులా ??
మంచుపల్లకీ గారు, ఏం చేయమండి. కోర్టు బయట రాజీపడితే తప్ప తేలేలా లేదు విషయం. లేకపోతే వాయిదాల మీద వాయిదాలు పడి కోర్టు ఖర్చులు తడిసి మోపెడయ్యేలా ఉంది పరిస్థితి. :)))
అయినా రాజీపడింది నేనూ, అజ్ఞాత గారు కదా. శరత్ గారితో కాదు కదా. అయినా కోర్టులో కేసు వేసింది శరత్ గారి మీదనే కదా. సమాధానం చెప్పవలసింది శరత్ గారే. అసలు విషయాన్ని పక్కన పెట్టేసి, కేసును తప్పుద్రోవ పట్టించడానికి ఏవేవో చెబుతున్నారు శరత్ గారు.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి