మరో ఎత్తు చూపులు


నా ఒకానొక కోడలిని ఎత్తు కారణంగా పెళ్ళికి తిరస్కరించానని చెప్పాను కదా. మళ్ళీ అలాంటిదే ఒకటి అయ్యింది. మా ఫ్రెండ్ వేణుకి తెలిసిన అమ్మాయి ఈమె. పేదవారు. సూర్యాపేటకు దగ్గర్లోనే ఒక పల్లెటూరు వాళ్ళది. ఈమె మాత్రం హైద్రాబాదులో ఏదో చిరుద్యోగం చేసుకుంటూ వుండేది. తండ్రి వీర తాగుబోతు. ఆ అమ్మాయి మీద రకరకాల పుకార్లు వున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాపం ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి ఎవరూ రావడం లేదు. 

ఆ అమ్మాయితో ఇదివరకు నాకు కొద్దిగా పరిచయం వుంది. సూర్యాపేటలో ఒక సామాజిక సేవా సంస్థలొ ఆమె పనిచేస్తున్నప్పుడు కొద్దిరోజులు నేను కూడా స్వచ్చందంగా ఆ సంస్థలో పని చేసాను. అప్పుడు కలిసి పనిచేసాము. వాళ్ళు పేదవారయినా, తండ్రి తాగుబోతు అయినా, ఆమెకు ఇతరులతో పెళ్ళికి ముందు ప్రేమలున్నా, సంబంధాలున్నా అది మనకు సమస్య కాదు. ఆ అమ్మాయిని ఇదివరకే చూసాను కాబట్టి ఎలా వుంటుందో తెలుసు. గొప్ప అందగత్తె కాకపోయినా ఫరవాలేదు. నాకు నచ్చింది. కాకపోతే నాకంటే ఎత్తు ఏమో అన్న సంశయం.   

ఆమెతో మాట్లాడి అలాగే ఎత్తు విషయం చూడటానికని వాళ్ళ ఇంటికి పెళ్ళి చూపులకు వెళ్ళాను. చక్కగా మాట్లాడుకున్నాము. ఆమ్మాయీ, మర్యాదా, మన్ననా అన్నీ నచ్చాయి. నిలబడి ఎత్తు చూసుకున్నాము. హ్మ్. నాకంటే ఎత్తే! నాకు ఎటూ పాలుపోలేదు. నా నిర్ణయం మా ఫ్రెండు ద్వారా తెలియజేస్తానని చెప్పి బయటపడ్డాను.

నా దగ్గరి స్నేహితులతో చర్చించాను కానీ ఎటూ నిర్ణాయించుకోలేకపోయాను. ఆమెతో కొద్ది పరిచయం ఇదివరకే వుంది కనుక ఆ అమ్మాయి మంచిదని నాకు తెలుసు. ఆమెను పెళ్ళిచేసుకుంటే ఒక పేద కుటుంబానికి సహాయం చేసినట్లవుతుందనీ తెలుసు. ఎటూ నిర్ణయించుకోలేక నిర్ణయాన్ని కొద్ది రోజులువాయిదా వేసాను.

ఇలా పెళ్ళి చూపులు జరిగిన విషయం వాళ్ళ ఆఫీసులో తెలిసిందిట. ఈ సంబంధం అన్నా కుదురుతుందేమోనని ఆఫీసులోని ఆమె శ్రేయోభిలాషులు తరచుగా ఈమెను కనుక్కుంటుండేవారట. ఇంకా నిర్ణయం రాలేదని చెప్పేసరికి వారు ఈమె మీద జాలిపడేవారుట. ఈ విషయాలు ఆమె నా ఫ్రెండుకి చెప్పింది. అతని ద్వారా ఈమె సంగతులు తెలుస్తుండేవి.    

అనేక తర్జనభర్జనల మీదట ఆమెను తిరస్కరిస్తూ నిర్ణయించుకున్నాను. ఇప్పుడామె ఎక్కడ వుందో, ఏం చేస్తుందో తెలియదు. ఆ తరువాత ఆమె ఎప్పుడూ నాకు తటస్థపడలేదు. ఎత్తు కారణంగా మరో చక్కటి అమ్మాయిని దూరం చేసుకున్నానా అనిపిస్తుంది. అవసరం వున్నవారికి సహాయం చేస్తేనే ఆ సహాయానికి సార్ధకత వుంటుంది కదా.  అలాంటి సహాయం చెయ్యగలిగి కూడా... చెయ్యలేకపోయానే అన్నది గుర్తుకువస్తే మనస్సు చివుక్కుమంటుంది.  ప్చ్!

4 comments:

  1. ఇలా మాటిమాటికీ పెళ్ళిచూపులని వెళ్ళి టిఫిన్లు తిని రావడం, ఆ పైన తిరస్కరించనని చెప్పుకోవడం ఏమీ బాగోలేదు!

    ReplyDelete
  2. సహాయం కోసం పెళ్లి చేసుకుని ఉంటే అటు ఆమె, ఇటు మీరు బాధపడే వారు. మీరు అప్పుడు ఏమి చెశారో మీవరకూ అదే కరెక్ట్. ఇప్పుడామె నిజమైన ప్రేమికుని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉందనుకుందాము.

    ReplyDelete
  3. adrustavanturaalu...

    ReplyDelete
  4. @ అజ్ఞాత
    అలా టిఫినీలు మెక్కి వచ్చానని చెప్పి అందర్నీ పెళ్ళాడేస్తే బావుండదేమో!

    @ విజయ్ శర్మ
    నిజమేనండీ.

    @rrrrrr
    +_)(*&&^%$$#@#!

    ReplyDelete