అయిననూ చూసి తీరవలె...


హమ్మ, హమ్మ ఎంత కుట్ర, హెంత కుట్ర! బ్లాగులోకంలో నాకు తసమదీయులు వున్నారని తెలుసుగానీ ఇంతమంది తసమదీయులు వున్నారనిన్నూ, ఇంతలా నా మీద కుట్రలు చేస్తారనిన్నూ ఊహించలేకపోయాను. గత టపాలో 'అదుర్స్' అనే చిత్రరాజమును చూస్తే బాగుండేదేమో అన్న కోరికను కొద్దిగా బయటపెట్టాను. అంతే నా శ్రేయోభిలాషుల ముసుగులో నా శత్రువులు అంతా చేరి నన్ను ఆ చిత్రాన్ని చూడొద్దు చూడొద్దు అనే ఒహటే రకరకాల వర్ణనలతో భయపెట్టారు. 

నేను ఎక్కడ Jr. NTR స్టెప్పులకు పడిపోతానో లేక మా బ్రాహ్మి కామెడీకి పరవశించిపోతానో లేక షీలా అందాలను మైమరచిపోతానో అని ఈ అందరి కుట్ర, దగా. పోనీ వద్దులెండి అని అందరూ మామూలుగా చెప్పారా? లేదు, రకరకాలుగా ఆ సినిమాను వెగటుగా వర్ణించి చెప్పారు. హమ్మ హమ్మ ఇంతమంది నా మీద కుట్ర చేసి ఆ సినిమా చూడవద్దంటున్నారూ అంటే ఆ సినిమా తప్పకుండా గొప్పదయ్యే వుంటుంది.  అలా అని నేనేదో Jr. NTR వీరాభిమానిని అనుకునేరు - అస్సలు కాదు. అలా అని షీలాకు వీరాభిమానిని కాదు గానీ ఆమె కాస్త నచ్చుతుంది. ఇదివరలో ఈ చిత్రరాజాన్ని చూడాలని పెద్దగా వుండేది కాదు కానీ మీరందరూ కట్టగట్టుకొని వద్దంటున్నారు కాబట్టి నాలో ఆ సినిమా చూసి తరించాలనే పట్టుదల పెరిగింది. నేను ఆ సినిమా చూడాల్సిందే, నన్నాపకండి, నన్నాపకండి.  

పాపం పవన్ ఒక్కడే నా నిజమయిన శ్రెయోభిలాషి. అతనొక్కడే ఆ సినిమా ధైర్యంగా చూసెయ్యమని నైతిక ధైర్యం ఇచ్చేడు.  అతగాడిని చూసి నేర్చుకోండి అందరూనూ. ప్రోత్సాహం అంటే అలా వుండాలి! నామీద ఎంత కోపం వున్నా ఇలా ఓ చక్కటి చిత్రాన్ని నాకు దూరం చేయాలని మీకు ఎలా అనిపించిదీ అని నిలదీసి ప్రశ్నిస్తున్నా! మీకే కనుక హృదయం వుంటే నన్ను ఈ సినిమా చూడమని వెంఠనే ప్రోత్సహిస్తారు.   

మీరెంత నిరుత్సాహపరచినా నేను ఆ సినిమా చూడటం ఆగను. నన్ను ఎవరు ఆపుతారో చూస్తాను! చూసి మీ కుట్రలన్నింటినీ భగ్నం చేయకపోతే నా పేరు శరత్తే కాదు. రండి, ఎవరు నా హితులో లేక శత్రువులో ఇప్పుడే తేలిపోవాలి. మీరు ఎటువైపు అనేది ఇప్పుడే, ఇక్కడే తక్షణం నిర్ణయించుకోండి. ఎవరయితే అదుర్స్ చూడవద్దంటున్నారో వారిని తసమదీయుల లిస్టులోకి వెళతారు. అనగా బ్లాకు లిస్టన్నమాట. అనగా నల్లకాగితం మీద తెల్లగా మీ పేర్లన్నీ వ్రాసి పెట్టుకుంటానన్నమాట. 

అవునూ మాయాబజార్ సినిమా చూసి చాలాకాలమయ్యింది. తసమదీయులు అంటే ప్రత్యర్ధి వర్గం వారే కదా?

14 comments:

 1. ఇంత చెప్పినా చూస్తానంటే .... ఏం అంటాం? ... ఎవరి - - కి వారే - - - అని ఊరుకుంటాం ...

  ఇక మీ తస్మదీయులు కి అర్థం అదే అనుకుంట ...

  ReplyDelete
 2. శరత్ గారు.
  సినిమా చాలా బాగుంది..అతీ హింస .డబ్బుల్ మీనింగ్ డైలాగ్స్ ఏక్కడ లేవు.
  కోందరు అంటున్నట్టు మరి చేత్తగా లేదు..
  చారి పాత్ర లో ఏన్.టి.అర్ ఇరగదిసిండు.
  కధ పాతదే అయినే వీనాయక్ ప్రజేంట్ చేసిని తీరు బాగుంది.
  ఫ్యామీలి తో ఏటువంటి ఇబ్బంది లేకుండా చుడవచ్చు.
  డాన్స్ ల గురుంచి వేరే చేప్పకరలేదు..ఏన్.టి.అర్ బాగున్నాడు..
  బ్రహ్మి కామేడి సుపర్...

  ReplyDelete
 3. @ రాజేష్
  మీరు సరిగ్గా ప్రోత్సహించలేదు. మీ పేరు తసమదీయుల చిట్టాలో వేసా.

  @ పవన్
  అలాగే, చూసేద్దాం. మీరే నాకు అసలుసిసలయిన అసమదీయులు!
  అవునూ, షీలా, షీలా ముఖ్యం నాకు. ఆమె ఇరగ్గదీసిందా లేదా. అదీక్కావాలి మనకు ముఖ్యంగా.

  ReplyDelete
 4. షిలా గురించి చేప్పాలంటె నాకు సిగ్గెంస్తుంది..
  చీ పాడు నేను చేప్పాను బాబు...

  ReplyDelete
 5. //మీరు సరిగ్గా ప్రోత్సహించలేదు. మీ పేరు తసమదీయుల చిట్టాలో వేసా. //

  అస్మదీయుల్ని తస్మదీయులనుకుని యుద్దంలో పరాభవం పొందిన కౌరవులు గుర్తుకు వస్తున్నారు :D

  ReplyDelete
 6. ఈ షీలా ఎవరండి.. ఇంతకు ముందు ఏ సినిమాలొ చేసింది? నాకు బొత్తిగా లొకజ్ఞ్నానం లెకుండా పొతుంది ఈ మద్య.. ముఖ్యమయిన విషయాలు కూడా మిస్ అయిపొతున్నా..:-)

  ReplyDelete
 7. ఈవిడేనా ???

  http://telugumovies.today.com/files/2008/12/sheela-newmay06.jpg

  ఈవిడే అయితే శరత్ గారి ఆత్రం అర్ధం చేసుకొదగ్గదే... :-)
  బాబు పవను.. సిగ్గుపడకుండా కాస్త డీప్ గా చెబుతావా

  ReplyDelete
 8. @ పవన్
  అబ్బా, మీ సిగ్గు సిగతరగ. అయితే అదుర్సే అన్నమాట. ఇంకేం! పైసా వసూల్.

  @ రాజేష్
  అంతేనంటారా? అయితే మీ పేరు ఏ లిస్టులోకో సినిమా చూసాక డిసైడ్ చేస్తా.

  @ మంచు పల్లకీ
  ఆ ఆ. ఆవిడేనండీ బాబూ. మీరు అర్జంటుగా సినిమా GK అప్‌గ్రేడ్ చేసుకోవాలి. మస్కా సినిమాలో హన్సికతో పాటు అమె ఒక హీరోయిన్. ఇంకా దేంట్లో వచ్చిందో నాకు తెలియదు.

  ReplyDelete
 9. మంచు గారు,
  అంత పేద్ద ఇషయాలు నా లంటి చినోడిని అడిగితే ఏం చేప్పగలరు మీరు మరీ డిప్ గా చేప్పామంటే ఏలా?

  శరత్ గారు
  పైసా డబుల్ వసుల్..
  .షిలా .. వామ్మౌ మళ్ళి సిగ్గు...

  ReplyDelete
 10. ఈ సినిమానే చూస్తున్నా ఇప్పుడు, ఇప్పుడే షీలా ఎంటరయ్యింది. ;)))

  అప్పుడే బ్రహ్మానందం లవ్వు. :))

  ఇప్పుడు చంద్రకళ రాబోతోంది. :)

  ReplyDelete
 11. చూస్తే చూడు..లేకపొతే పో...

  ఇప్పుడు నేను అస్మదీయున్నా..తస్మదీయున్నా.. చెప్పుకో చూద్దం.. ముందే చెప్తున్న.. ఇక్కడ ఉన్నవి రెండే టైప్స్. . అస్మదీయులు... తస్మదీయులు...

  ReplyDelete
 12. @ నాగప్రసాద్
  ఎక్కడ, ఎలా చూస్తున్నారు? మన షీలా ఎలా వుంది? ఏం చేస్తోందిప్పుడు? ఇప్పుడు షీలా మనోభావాలు ఎలా వున్నాయి? అక్కడినుండి లైవ్ వెబ్ క్యాస్ట్ ఏమయినా ఇవ్వగలరేమో చూడండి.

  చంద్రకళ కౌన్ హై?

  @ బుచుక్
  మీలాంటి మధ్యతరగతి వారినందరినీ వెయిటింగ్ లిస్టులో పెడుతున్నా. సినిమా చూసాక మీరు ఏ లిస్టో నిర్ణయిస్తా.

  ReplyDelete
 13. "తసమదీయులు అంటే ప్రత్యర్ధి వర్గం వారే కదా? "
  అవును...

  నేనైతే సినిమా చూడలేదు. కాబట్టి నేనేం చెప్పను.
  షీలా మాత్రం నాకు అస్సలు కొంచం కూడా నచ్చదు.
  మస్కా కాకుండా ఇంకా... పరుగు, సీతాకోకచిలుక (తన మొదటి సినిమా), హలో ప్రేమిస్తారా (పూరి జగన్నాథ్ తమ్ముడు హీరో) సినిమాల్లో ఉంది.
  సినిమా చూసాకా మీ అభిప్రాయం చెప్పటం మాత్రం మర్చిపోకండి (చెప్పగలిగే స్టేజిలో ఉంటే ;)).

  ReplyDelete
 14. @ చైతన్య
  పరుగులో వుంది కూడా ఈమేనా? DVD లో చూసా కాబట్టి అంత ఫోకస్ పెట్టలేదు.

  ReplyDelete