వైశ్య - వేశ్యనా చిన్నప్పుడు ఆరోతరగతిలోనో, ఏదో తరగతిలోనో రఘుపతి వెంకటరత్నం నాయుడు గురించి తెలుగులో ఒక పాఠం వుండేది. అందులో ...నాయుడు గారు వైశ్యావృత్తిని రూపుమాపడానికి ఎంతగనో కృషిచేసెను అని వుంది. అది చదివాక నాకు చాలా విచారంగా అనిపించింది. ఆయనగారి కృషే గనుక విజయవంతం అయ్యుంటే నాకు చాలా
చిక్కొచ్చేది. కోమటోల్ల దుకాణాలు నడవకుంటే చాక్లెట్లు, బిస్కట్లూ, బలపాలూ ఎక్కడ కొనుక్కోవాలి. అదీగాక అలా దుకాణాల మీదనే బ్రతుకు వెళ్ళదీస్తున్న మా క్లోజ్ ఫ్రెండ్ సురేందర్ వాళ్ళ ఇల్లు ఏమయిపోవాలి. నాయుడు గారు చేసింది నాకేమీ నచ్చలా. 

చిరాగ్గా మా అన్నయ్యను అడిగాను - నాయుడుగారికి వైశ్యులంటే ఎందుకంత మంట అని. మా అన్నయ్యకు అర్ధం కాక నా పుస్తకం తీసుకొని చదివి బాగా నవ్వి అతను రూపుమాపడానికి ప్రయత్నించింది వైశ్యావృత్తి కాదనీ వేశ్యా వృత్తి అనీ చెప్పాడు. 
వేశ్యావృత్తి?! అదేంటి? నేనెక్కడా వినలేదే అని మా అన్నయ్యని అడిగాను. 

మళ్ళీ ఫక్కున నవ్వి అటూ ఇటూ చూసి నెమ్మదిగా చెప్పాడు - 'లం...'  అని! దాంట్లో మాత్రం తప్పేంటో అని మనస్సులో సన్నగా గొణుక్కున్నట్టున్నాను.

9 comments:

 1. మరీ ఆరో తరగతి ఏడో తరగతిలో కూడా తెలియక పోతే ఎలాగండీ? :-)

  ReplyDelete
 2. ఇలా కులం పేరుతో ఎగతాళి చేయడం సమంజసమేనా??
  మీకిష్టమైనట్టుగా ఎలా ఐనా మీరు మీ బ్లాగ్ ని నిర్వహించవచ్చు. కానీ మరికరికి ఇబ్బంది కాకూడదు కదా మీ స్వేచ్చ.

  ReplyDelete
 3. @ సురేష్
  పల్లెటూరిలో పుట్టి పెరిగాను కదా - అప్పట్లో అంత జి కె లేదులెండి :)

  @ Kirrrrr
  బాబూ మరీ అంత అమాయకంగా అడిగి నన్ను బుక్కు చేద్దామనే!అసలు పదం వ్రాస్తే సెన్సార్ సభ్యులకు కోపం వస్తుందమ్మా. సరే మీ కోసం ఇంకో పదం వాడుతాను - వేశ్యావృత్తి అంటే సాని వృత్తి. అంటే ఏమిటని మళ్ళీ నన్ను అడగకు సుమా!

  @ అజ్ఞాత
  గాడిద గుడ్డేమీ కాదు? అంతలేదు! మరోసారి టపా తీరికగా, ఓపికగా చదవండి.

  ReplyDelete
 4. కొందరు మూర్ఖుల తొ వచ్చిన తంటాయే ఇది. పాము చావకుండా కట్టె విరక్కుండా మాట్లాడతారు.
  కులాలతొ కుళ్ళు జోకులు వేసుకొవటం ఎందుకో. అంత రిమ్మగా వుంటే ....నో ....నో అడిగివుంటె తెలిసేది కదా!

  ReplyDelete
 5. @ గుప్తా
  ...నో, ..నో దగ్గరకో మీరు వెళ్ళి తీరికగా అర్ధం అడిగి నా సందేహం తీర్చండేం!

  ReplyDelete
 6. గొణుక్కునేఉంటారు ;)

  ReplyDelete
 7. శరత్ గారు,
  పై టపా లో ఏవరి మనోబావాలు దేబ్బ తినే విషయాం లేకున్న కోందరికి ఏక్కడో కాలింది ఏందుకంటారు..

  నాకు కనపడని మంట ఉందా ఏమిటి?...
  మీమల్ని నమ్మడానికి లేదు ..ఉండండి ఇంకోసారి సదివి వస్తా

  మీకు సంక్రాంతి శుభాకాంక్షలు

  ReplyDelete
 8. ఇంతకీ ఎవరికీ కాలిన్దంటారు వారికా? లేక వీరికా ?

  ReplyDelete