బుధవారం 27 జనవరి 2010

సివరాఖరి పెళ్ళి చూపులు - 3: భిన్న ధ్రువాలు

(మా సంభాషణల్లో ఏమే, ఏమండీ అన్న పదాలు కేవలం నాటకీయత కోసం వాడినవి. నిజంగా అలావాడలేదు. డైలాగ్స్ ఖచ్చితంగా అవేకాకపోయినా భావం మాత్రం అదే.)  

మరునాడు బొప్పికట్టిన తలని తడుముకుంటూ మా ఆవిడని అడిగాను "ఏమిటే తొలిరాత్రే హింత షాకిచ్చావూ"
ముసిముసినవ్వులు నవ్వుతూ "పర్లేదు మీరు మారండి" అంది
"నేను మారనని ముందే చెప్పాగా"
"చెబితే చెప్పారు లెద్దూ"
"లేదు. నేను మారను - మారలేను" ఆకాశంలోకి చూపుడు వేలు చూపిస్తూ చెప్పాను
"అయితే మిమ్మల్ని నేను మార్చుకుంటాను"
"ఏంటీ మార్చుకునేదీ. నిక్కర్లు వేసుకున్నరోజుల్లోనుండే నా మనోభావాలని జాగ్రత్తగా పోషించుకుంటూ వచ్చాను. కుదరదు"
"నా మీద నాకు నమ్మకం వుంది. మిమ్మల్ని నేను మార్చుకుంటానుగా"
"నిన్న పెళ్ళి అయ్యిందోలేదో అప్పుడే నామీద నీకు ఇంత నమ్మకం ఏమిటీ? నేను ఎలా కనిపిస్తున్నానూ?" అని అడిగాను
"అది సరే గానీ మిమ్మల్ని నేను మార్చేస్తా. మీరు ఓకే అనండంతే"
"ఎలాబడితే అలా మార్చుకోవడానికి నా మనస్సు ఏమన్నా చపాతీ పిండి అనుకున్నావా?! అసలే మన మనోభావాలు మహా స్ట్రాంగూ" అని ముఖం గంటుపెట్టుకొని తల అటు తిప్పేసుకున్నాను. 
నా తలవైపుగా వచ్చి "మీరు మారుతున్నారు" అంది
"నేను మారను కానీ ఒక పని చెయ్యి. నువ్వే మారిపో" అని చెప్పాను
"కుదరదు"
"నాకూ కుదరదు"
"నాకూ కుదరదు"
"నాకస్సలే కుదరదు" ఇలా లాభం లేదని "మరి నేను చెప్పిన విషయాలు నీకు నచ్చనప్పుడు ఎందుకు పెళ్ళి చూపుల్లో నేను చెప్పిన వాటికన్నింటికీ గంగిరెద్దులా తల ఊపావు?" అని అడిగాను
"మా నాన్నగారు ఊపమన్నారు"
"అంటే మీ నాన్నగారు చెప్పినంత మాత్రాన ఓ య్యెస్ అనేయడమేనా?"
"అలా అనకపోతే మా నాన్న గారి మనోభావాలు ఇబ్బందిపడుతాయి"
నేను గుడ్లు మిటకరించాను. ఇలాక్కూడా లాభం లేదని శాంతంగా ఇలా అడిగాను "పోనీ నేనంటేనో లేదా నా భావాలంటేనో ఇష్టం లేదని మీ నాన్నగారికే నచ్చచెప్పలేకపోయావా?"
"చెప్పాను కానీ తేలిగ్గా తీసుకున్నారు. వయస్సులో ఇది సహజమని పెళ్ళి అయితే మీరే మారతారనీ చెప్పారు"
"హ!"
"అవును"
"అయినా సరే ఎదిరించకపోయావా?"
"కొద్దిగా అలాక్కూడా ప్రయత్నించాను"
"నిజ్జంగా! మరి ఏమయ్యింది?"
"సెంటిమెంటుతో ఆయింటుమెంటు పూసారు - నా నిరసనకి"
"హా. ఏంటా సెంటిమెంటూ"
"మా ఇంట్లో ఒక సాంప్రదాయం వుంది"
"ఏంటో అది"
"మొదటి పెళ్ళి చూపులే ఓకె కావాలి"
"ఛ"
"అవును. మా పెద్దక్కయ్యకి మొదటి చూపుల్లోనే సంబంధం ఓకె అయ్యింది, మా చిన్నక్కకి కూడా అలాగే అయ్యింది. నాకు కూడా అలాగే కావాలన్నారు"
"నా మొఖంలా వుంది ఈ సెంటి. పోనీ పెళ్ళి చూపుల్లో నువ్వు నాకు చెబితే, మీ వాళ్ళకి నువ్వే నచ్చలేదు అని నేను చెప్పేవాడిని కదా" 
"నేను మీకు నచ్చలేదంటే అది నాకు అవమానం"
"అహబ్బా. మరి ఇప్పుడెలా?" అని మూలకు తిరిగి జుట్టుపీక్కున్నాను. 
"అంత వర్రీ కాకండి. సులభ పరిష్కారం వుంది"
"హేమిటది?" గిరుక్కున మా ఆవిడ వైపు తిరిగాను.
"మీరు మారితే సరిపోతుంది"
మళ్ళీ జుట్టు పీక్కొని "మళ్ళీ మొదటికి వచ్చావా! అది జరిగేపని కాదు గానీ ఇంకోమాట చెప్పు" అన్నాను.
"మీరు ఎన్ని అన్నా మీరు మారక తప్పదు"
"అలాకాదుగానీ ఎంచక్కా విడిపోదాం" అని ఆత్రంగా అడిగాను
"కుదరదు"
"ఎందుకో"
"మా నాన్నగారి మనోభావాలు దెబ్బతింటాయి"
"మరి నా మనోభావాలు?" బేలగా అడిగాను
అదోలా చూసిది. ఆ చూపులో బోలేడు అర్ధాలు కనిపించాయి :(
"మీ మనోభావాల సంగతి నేను చూసుకుంటా కదా" అని దగ్గరికి తీసుకుంది. అలా నా మనోభావాలు కొంతకాలం హైబర్నేట్ అయిపోయాయి. కొత్త పెళ్ళి, కొత్త పెళ్ళాం మరి. తప్పుద్దా.

మొత్తం మీద...నేనూ మారలేదు - తనూ మారలేదు. నేను ఎక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేటు. అనుకున్నవన్నీ జరిగిపోతే, డ్రామా లేకపోతే జీవితాల్లో థ్రిల్లు వుండదేమో. 
(అయిపోయింది)

24 comments:

అజ్ఞాత చెప్పారు...

ఇంతకీ మీ మనోభవాలు ఎంటి మాస్టారు

jeevani చెప్పారు...

మీ కామెంట్ స్పేస్ ను వాడుతున్నందుకు ముందుగా క్షమాపణలు. దయచేసి ఒక్కసారి జీవని వెబ్సైట్ www.jeevanianantapur.org ను చూసి మార్పులు చేర్పులు సూచించవలసిందిగా కోరుతున్నాము. మి అమూల్యమైన సలహా తప్పక ఉపయోగపడుతుంది.
kathasv@gmail.com
jeevani.sv@gmail.com

మీ,

జీవని.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ అజ్ఞాత
అవి తెలుసుకోవాలంటే మీరు నా అడల్ట్ బ్లాగు రసజ్ఞ చదవాలి. లింక్ నా ప్రొఫైల్లో వుంటుంది చూడండి.

అజ్ఞాత చెప్పారు...

evaru maarakundaa vndatame pelli.

bammardi చెప్పారు...

నువ్వు మారావు.. ఎప్పుడో తెలుసా.. తల బొప్పి కట్టింది కదా... అలాంటి సీన్ మళ్ళీ ఎప్పుడైనా జరిగిందా... జరగకపొతే.. అలాంటి పరిస్తితులు రాబోతుంటే మళ్ళీ బొప్పి కట్టకుండా అదుపు చేస్తూ అడ్జస్ట్ అయ్యావు........

అంటే....


హహ హహ హహహహా హహహహహహహ్హహహహ్హహహహహహహా

పరిమళం చెప్పారు...

అంటే కొత్తప్పుడు మారి పాతబడ్డాక మళ్ళీ మామూలా ...మా ( మా.భ .బా.సం ) మనోభావాలూ దెబ్బతిన్నాయి :) :)
ఐనా మీ టైటిల్ చూసి వదిలేస్తున్నాం :)

ప్రేరణ... చెప్పారు...

మొత్తానికి ఇద్దరూ మారలేదు కాని కాలం మారింది అవునా:)

చైతన్య చెప్పారు...

ఎవరిని వారిలా accept చేస్తేనే బాగుంటుంది. ఒకరికి తగ్గట్టు మరొకరు మారిపోతే ఆ లైఫ్ బోర్ కొట్టేస్తుంది :)

అజ్ఞాత చెప్పారు...

>> ఆమెకు 18 ఏళ్ళు నిండాయి.

previous bhaagam lo ilaa you said.Tanaki only 18 yrs enaa ? mee age entha ?

ainaa 18 yrs isn't a very matured age to take life turning decisions, like marriage.

అజ్ఞాత చెప్పారు...

హేవిటో, నాకు బోల్డు సందేహాలు వచ్చేస్తున్నాయి.

"నా మీద నాకు నమ్మకం వుంది. మిమ్మల్ని నేను మార్చుకుంటానుగా"
"నిన్న పెళ్ళి అయ్యిందోలేదో అప్పుడే నామీద నీకు ఇంత నమ్మకం ఏమిటీ? నేను ఎలా కనిపిస్తున్నానూ?" అని అడిగాను

అప్పు తచ్చా ? మీరు తనని అర్థం చేసుకోవటంలో దోషమా ?

ఆవిడ అంది, తన మీద తనకి నమ్మకం ఉందని ( మార్చుకోటం లో ) !!! మీరేమో "నిన్నే పెళ్లి అయ్యింది, నా మీద నీకు నమ్మకం ఏమిటీ" అని ప్రశ్నించటం !!! తలనొప్పి అఫెక్టా ???

ప్చ్ ! పాపం మీ మాం గారు, మీరు మారతారు అని ఎన్నోఓఓఓ ఆసలు పెట్టుకుని కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసారు. మరి మీరు మారలేదని తెలిస్తే, గొడవలు కాలేదా ?

ఎవరూ మారకుండా, ఇద్దరు ఎలా కల్సి మెలసి ఉండగలుగుతున్నారు, యుద్ధాలు జరిగిపోవూ ?

>> అసలే మగ మనోభావాలు, చాలా స్ట్రాంగూ"

ఆడ మనోభావాలు వీక్ అయితే మరి ఆవిడైనా మారి ఉండేదిగా ! దీన్ని బట్టి మీకేం అర్థం అయ్యింది ?

అజ్ఞాత చెప్పారు...

అయినా తమరంత ఇసాల స్వభావం మగ మారాజుల్లోనే లేరు, ఇహ ఆడ రాణుల్లో ఎట్టా ఉంటరనుకున్నా బాసూ?

అయినా ఇంత ఇసాల స్వభావులు, పెళ్లి చేసుకోకుండా లాగించేయ్యోచ్చు కదా బండిని ?

అన్నట్టు మర్చా, తమతో సహజీవనాలు చేసిన అమ్మాయికి ఇట్టాంటి ఇసాల స్వభావాలే ఉన్నాయి గందా, తనూ మీ దృష్టిలో ద్రఔపది లాంటిదే గందా, మరి తననే చేసుకుంటే పోయేదిగా పెళ్ళంటే అంత ఇది ఉంటే ? ఆహా, కుదర్దు, ఆ అమ్మాయి వేరే వాడితో రాత్రి బయటికి వెళ్తే మనకి కోపమోస్తాది , bag తీసి ఏమేమో చేస్తాం.

పైకి మాత్తరం, నేనూ తిరుగాతా, నువ్వూ తిరుగు అని చెప్తాం. అట్టా జరగలేదు గనకే, మా యాబిడ బంగారం బాసూ అని టైటిల్ ఎట్టామని గుసగుసలిక్కడ. నిజమేమిటో మరి !

రమణి చెప్పారు...

:) బాగుంది... "మా ఆయన బంగారం " అని ఆవిడ కూడా అనుకునేలా మీరు మారాలని, ఆవిడ మార్చాలని..మా ఆకాంక్ష.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ అజ్ఞాత
అంతేనంటారా :)

@ బామ్మరిది
ఎంతయినా నువ్వు మీ సోదరి సైడేలే :)

@ పరిమళం
:)
టాపా టైటిల్ మార్చాను ఇప్పుడు మీ భ.బా.సం ఏమంటారో :( మీరేమన్నా అంటే మీకు ఏంటీగా భా.భా.సం జాక్ ఏర్పాటు చేసేస్తాం :)

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ ప్రేరణ
అవునండీ, కాలం తెలుగు సీరియల్లా, తెలంగాణా సమస్యలా, జీడిపాకంలా సాగుతూనే వుంది.

@ చైతన్య
అవునండీ. ఒకరికొకరు ఏక్సెప్ట్ చేసుకుంటే వోకే గానీ ఇద్దరిలో ఎవరు ఏక్సెప్ట్ చేయకపోయినా కూడా తంటానే.

@ అజ్ఞాత
మా పెళ్ళి అయి పదిహేనేళ్ళూ కావస్తోంది. అప్పట్లో అమ్మాయిల పెళ్ళిళ్ళు చాలావరకు 20 ఏళ్ళకి అటో ఇటో జరుగుతుండేవి.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ అజ్ఞాత
అప్పు తచ్చు ఏమీ కాదు - సరిగానే వ్రాసాను. నన్ను మార్చుకునేంత నమ్మకం నీకెక్కడిదని ప్రశ్నించాను.

గొడవలు...ఎందుక్కావూ, యుద్ధాలు..ఎందుకు జరగవూ.. కానీ అవన్నీ ప్రస్థావించడం బావోదేమో, ఇప్పటికే వ్యక్తిగత విషయాలు చాలా చెప్పేసాను.

ఆడ భావాలు...దీనిని బట్టి నాకు చాలా అర్ధమయ్యింది :)

@ అజ్ఞాత
అయ్యా, నా అంత ఇసాల స్వభావులు మగ వాళ్లలో, ఆడవాళ్ళలో ఎక్కువమందికి కాకపోయినా కొద్దిమందికయినా వున్నాయి - కాకపోతే అందరూ నాలా బయటపడరు - బయటకి చెప్పుకోరు.

"పెళ్లి చేసుకోకుండా లాగించేయ్యోచ్చు కదా" ఆ సంగతి పెళ్ళయ్యాక బాగా అర్ధం అయ్యింది :)

ద్రౌపది - ఈ ప్రయత్నాలకి సమానాతరంగా ఆ ప్రయత్నాలూ జరిగాయి కానీ వివిధ కారణాలవల్ల అవి ఫలించలేదు. వాటి గురించి వ్రాస్తానంటే సెన్సారోళ్ళు ఒప్పుకోరు! నా పరిచయస్థులతో పెళ్ళి యత్నాల గురించి ఈ సిరీసులో వ్రాయలేదు. కేవలం అఫీసియల్ పెళ్ళి చూపుల గురించే వ్రాసినందువల్ల మీకు అలాంటి అపోహకి ఆస్కారమయ్యింది. ఇకపోతే నా బ్యాగ్ ఎపిసోడ్ గురించి చాలా అపోహలు వున్నట్లున్నయ్యే మీకు? త్వరలో రసజ్ఞలో వివరంగా వ్రాస్తాను చూడండి :)

మీలాంటి వారికి ఆ టైటిల్ అపోహ కలిగిస్తున్నది కనుకనే టైటిల్ మార్చాను - గమనించండి.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ రమణి
:) అంత లేదండీ. టైటిల్ మార్చాను - గమనించండి.

నాగన్న చెప్పారు...

విషయం, రచనా శైలి రెండు ఆసక్తిగా ఉన్నాయి. మీ మామ గారి జీవిత పుస్తకం నుండి కొన్ని పేజీలు గ్రహించడం మంచిది అనే నిర్ణయానికి వచ్చాను. బాగుంది.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ నాగన్న
హమ్మ, హమ్మ, కొంపదీసి మీకు మా మామగారి విధానాలు నచ్చలేదు కదా :))

అసలు ఒక అద్భుత అవకాశం మిస్సయ్యింది. మా మామగారు ఇక్కడ యు ఎస్ లో వున్నప్పుడు మీ ఊరు వచ్చి మిమ్మల్ని కలవాలని అనుకున్నాము కానీ మనకు కుదరలేదు కదా. మా మామగారు కూడా మీలాగే అధ్యాత్మిక వాక్చతురులు. మీ ఇద్దరి చర్చలు వాదోపవాదాలు వింటూ మేము పండగ చేసుకోవాలనుకున్నాం కానీ కుదరలేదు!

అజ్ఞాత చెప్పారు...

>>ఆడ భావాలు...దీనిని బట్టి నాకు చాలా అర్ధమయ్యింది :)

నా ఉద్దేశ్యం - ఆడ, మగా తేడాల్లేకుండా మనోభావాలు అంటూ ఉంటె, అవి strong గానే ఉంటాయి అని కవి హృదయం.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ అజ్ఞాత
అర్ధమయ్యిదండీ - అందుకే నాకు బాగా అర్ధమయ్యిందని వ్రాసాను. అక్కడ పొరపాటుగా వ్రాసాను. అలా వ్రాయడం అంత సబబు కాదని తెలిసినా నేను వ్రాయదలుచుకున్నదానికి సరి అయిన పదం దొరక్క అలా లాగించాను. ఏ పదం ఉపయోగిస్తే బావుంటుందబ్బా? ఆ దొరికింది - వాక్యమే సవరించాను.

మీ సవరణకు ధన్యవాదాలండీ.

అజ్ఞాత చెప్పారు...

"నా మనోభావాలు కొంతకాలం సైబర్నేట్ అయిపోయాయి."

is it hibernate /sybernate( if so, spelling please?)?

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ Ajnaata
cy⋅ber⋅nate
  /ˈsaɪbərˌneɪt/ Show Spelled Pronunciation [sahy-ber-neyt]
–verb (used with object), -nat⋅ed, -nat⋅ing.
to control by cybernation.

కొంతకాలం కంట్రోల్ అయిపోయాయి - నా భార్య ద్వారా నియంత్రించబడ్డాయి అన్నది నా ఉద్దేశ్యం. హైబర్నేట్ అయ్యాయి అన్నది కూడా వాస్తవమే.

అజ్ఞాత చెప్పారు...

Thanks sarat.

cybernation- the use of computers to control automatic processes.

she's not a computer right ? so,I think hibernate ( to be in an inactive state) is the right word.Sorry to make this a vocabulary discussion, but I'm doing it 'coz I know you're open to suggestions.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ అజ్ఞాత
మీరు చెప్పింది కరెక్ట్.
సవరిస్తున్నాను.