మంగళవారం 26 మే 2009
జయహో వై ఎస్/సబిత/రోజా
రెండవసారి అధికారంలోకి వచ్చాక వై ఎస్ తీసుకున్న మంచి నిర్ణయాలలో ఒక స్త్రీని హోం మంత్రిగా చేయడం ఒకటి. మొదటి మహిళా హోం మంత్రిగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా మహిళలకు చక్కటి రక్షణను, భద్రతను ఆమె అందిస్తారని ఆశిస్తాను. నాకు సబితా ఇంద్రారెడ్డి గురించి, ఆమె సామర్ధ్యం గురించి ఎక్కువగా తెలియదు కానీ మొత్తం మీద ఇంద్రారెడ్డి తరువాత రాజకీయాలో నిలద్రొక్కుకొని 'చేవెళ్ళ చెల్లెమ్మ' ఈనాడు హోం మంత్రి కావడం చక్కని విషయం. అలాగే పార్టీలకు అతీతంగా ఈ విషయంలో చక్కగా స్పందించిన రోజాని కూడా అభినందించలేకుండా వుండలేకపోతున్నాను.
పండుగ చేసుకుంటున్న షికాగో భారతీయులు
రిలయన్స్ వారి బిగ్ సినిమాస్ వారి కొత్త థియేటర్ ఒకటి ప్రారంభించారు. ఒక వారం అంతా ఫ్రీ సినిమాలే సినిమాలు. సినిమా థియేటర్ కూడా బావుంది. హిట్టు సిమాలు కూడా ఉచితం కావడంతో వాటికి టికెట్లు దొరకడంలేదు. లాంగ్ వీకెండులో 'ఆకాశమంతా' చూద్దామంటే టికెట్లు దొరకలేదు. 'ద్రోణ' లాంటి సినిమాలు ఉచితమే అయినా ఎందుకులే తలనొప్పి అని ఊరుకున్నాం. 'మనోరమ' చూసాము - బాగానే వుంది - ఛార్మి నటన ఏమోగానీ కొత్త హీరో చాలా చక్కగా నటించాడు. పేరెంటో?
ఈ థియేటరులో మొత్తం అయిదు హాళ్ళు వున్నాయి. అన్ని భారతీయ భాషల సినిమాలు కూడా వస్తాయి. హిట్టు సినిమాలే కాకుండా ఫట్టు సినిమాలు కూడా వస్తున్నాయి. ఇక్కడి థియేటర్లలో సీట్లు సాధారణంగా ఇండియాలోలాగా లగ్జరీ గా వుండవు కానీ ఈ హాళ్ళలో మంచి సీట్లు వున్నాయి. మనోరమ సినిమా చూడ్డానికి వెళ్ళినప్పుడు యథాపలంగా వెనక్కి ఆనుకొని గాభరాపడ్డాను. ఎందుకంటే సీట్ వెనక్కి వాలింది. అమెరికన్ సినిమా హాళ్ళలో అటువంటి సీట్లు ఆశించకపోవడంతో అలా కంగారు పడ్డాను. అమెరికన్ హాళ్లలో కూడా ఇండియా హాళ్ళలొ వుండే లగ్జరీ సీట్లు పెడుతున్నందుకు - ఆ రకంగా యు ఎస్ కూడా ఇండియాలా అభివృద్ధి చెందుతున్నందుకు ఆనందించాను.
మందు ప్రియులకు శుభవార్త - ఈ థియేటరులో బార్ & రెస్టారెంటు కూడా వుంది. ఎంచక్కా ఓ పెగ్గు వేసుకొని వెళ్ళి సినిమా చూడొచ్చు. మొత్తం మీద షికాగో మంచి థియేటర్లు రెండు అయ్యాయి. రేకుల డబ్బాలాంటి థియేటర్లలో తెలుగు సినిమాలు చూడాల్సిన అవస్థ తప్పింది కానీ జేబుకి బాగానే చిల్లిపడేట్లుగా వుంది. తెలుగు సినిమాలు ఎక్కువగా రాబోతుండటం - అదీ మంచి మంచి థియేటర్లకి రాబోతుండటం - మాకు కాస్త దగ్గరగానే అవి వుండటం - సినిమాలకి తీసుకెళ్ళాల్సిందిగా ఇంట్లో ఒత్తిడులు/అలకలు పెరగడం ఖాయంగా అనిపిస్తోంది.

బుధవారం 20 మే 2009
'ప్రజారాజ్యం' చిత్ర సమీక్ష
ఈ సమీక్ష నాకు నచ్చింది - మీకూ నచ్చుతుందనే తెలియజేస్తున్నాను :)
http://www.vilekhari.com/politics/praja-rajyam-review/

మంగళవారం 19 మే 2009
మంచి తెలుగు సైట్లు సూచించండి

తెలుగు పోర్టల్స్ లలో గ్రేట్ ఆంధ్రా, దట్స్ తెలుగు చూస్తుంటాను. తెలుగులో డాట్ కాం చూద్దామంటే దానితో పాటు ఏవో వైరసులు వస్తుంటాయి. దట్స్ తెలుగుతో పాటు కూడా వైరస్ రావడానికి ప్రయత్నిస్తుంటుంది కానీ నేను వాడే అవస్ట్ వాటిని నిభాయిస్తుంది. ఇహ ఆయా సైట్లలో విషయం తక్కువ - పుకార్లు ఎక్కువ అని తెలిసిందే కదా. రోజూ ఎన్నో కొత్త సైట్లు పుట్టుకొస్తున్నాయి. వాటిల్లో మంచివి నేనేమయినా మిస్సవుతున్నానా అనిపిస్తుంటుంది.
వీటికంటే మాంఛి పోర్టల్స్ ఏవయినా వున్నాయా? మీరు తరచుగా ఏవి చూస్తుంటారు? తెలుగువి మాత్రమే నాకు సూచించండి. మీరు సూచించినవి మిగతా వారికి కూడా ఉపయోగపడవచ్చు. కేవలం పోర్టల్సే కాకుండా మీకు బాగా నచ్చే తెలుగు సైట్లు చెబితే మాకూ అవి నచ్చవచ్చు. పుకార్లు తక్కువ - విషయం ఎక్కువ వున్న సైట్లు అయితే బావుంటుంది. కొన్ని సైట్లలో అయితే రంగులెక్కువయ్యి, ఇరుకు ఇరుకుగా అనిపిస్తాయి. ఆ సైట్లు చూడటానికి ఆహ్లాదంగా వుండవు. కొన్ని సైట్లలో పస తక్కువ - ప్రకటనలు ఎక్కువ. ఇక మరికొన్ని సైట్లు తరచుగా అప్డేట్ కావు - మరికొన్నింటిలో ఫాంట్ బావుండదు. ఇలాంటి లోపాలు లేకుండా వున్న చక్కటి పోర్టల్స్ ఏమయినా వున్నాయా అనేది నా సందేహం.
మొత్తం మీద పూర్తిగా కాకపోయినా బాగా సంతృప్తి పరచిన తెలుగు పోర్టల్ నాకయితే ఇంతవరకు కనపడలేదు. మరి మీకు?
కవులకు, కవయిత్రులకు చిన్న మనవి

అదేంటో గానీ నాకు కవితలు, కవిత్వాలు అంతగా బుర్రకి ఎక్కవు. అయితే మన బ్లాగ్లోకంలో చిన్నా చితకా దగ్గరి నుండి బాగా వ్రాసే కవులూ/కవయిత్రులూ చాలామందే వున్నారు. ఎంచక్కా వారి పద్ధతిలో వారు వ్రాసుకుంటుంటారు. నేనూ ఓ కవిని కాకపోతినా అని అప్పుడప్పుడు కించింతిస్తూ వుంటాను. బాగానే వుంది. అయితే వచ్చిన ఇబ్బంది ఎక్కడ?
సహజంగానే వీరిలో సృజనాత్మకత ఎక్కువ కాబట్టి సాధారణంగా చక్కటి టైటిల్ పెడుతుంటారు వాళ్ళ టపాలకి. వాళ్ళ టైటిల్ చూసి ఆసక్తి ఏర్పడి ఆ లంకె నొక్కి అనవసరంగా హిట్టిచ్చా అని ఉడుక్కున్న సందర్భాలు ఎన్నో వున్నాయి. అలా నాలాంటి వారు ఇచ్చిన హిట్లని చూసి హిట్లని పట్టించుకునే కవి రాజులు/రాణులు వాపుని బలుపుగా అనుకునే అవకాశమూ వుంది.
జల్లెడనో, హారమో చూస్తే స్నిప్పెట్ వుంటుంది కాబట్టి ఏది కవితో కాదో తెలుసుకోవచ్చు కానీ కూడలి ప్రధానపేజీ చూస్తే ఏది ఏదో అర్ధం కాదు కాబట్టి అలా లంకెలని నొక్కి ఊప్స్ అనుకొని గురితప్పిన బూమరాంగులా హడావిడిగా బయటికి వచ్చిన సందర్భాలు నా వరకయితే ఎక్కువే.
అందుకే మై డియర్ కవులూ/కవయిత్రులూ, మీ టపా శీర్షికలో ముందు 'కవిత ' అని తగిలిస్తే నా బోటి వారికి సౌకర్యంగా వుంటుంది/మీకు నిజమయిన ట్రాఫిక్ వస్తుంది. ఏమంటారు? వీరే కాకుండా అందరం కూడా ఆయా టపాల వర్గాన్ని సముచితమయిన శీర్షికల ద్వారా సూచిస్తే ఏ టపా ఏ తరహాదో అర్ధమయ్యి ఇతరులకి సులువుగా వుంటుంది కాదూ?

తొడకొట్టిన జూనియర్

గ్రేట్ ఆంధ్రా సైటులో ఒక జోకు వచ్చింది. మీలో కొంతమంది అయినా ఆ joke SMS చూసేవుండవచ్చు. ఆ మధ్య జూనియర్ NTRకి రోడ్డు ప్రమాదం జరిగింది కదా. దానికి కారణం నల్లగొండ జిల్లాలోని మోతె గ్రామం వద్ద తన కారుకి కుక్క అడ్డంపడినందువల్ల అని వార్తలు వచ్చాయి కదా. అలా కుక్క తన కారుకి అడ్డంపడితే బ్రేకు కొట్టే బదులు తొడగొట్టాడట - అలవాటులో పొరపాటుగా!
శుక్రవారం 15 మే 2009
హిప్పర్ అనే కెనడియన్ మార్జాలం కథ - 1

ఒక శుభ ముహూర్తాన మా ఇంటి హోం మినిస్టర్ గారి అభ్యంతరాలను పక్కకు పెట్టి పిల్లిని కొనాలనుకున్నాము. మన దేశపోళ్ళకి, అందునా ఆడవారికి మూఢనమ్మకాలు ఎక్కువ కదా - పిల్లిని పెంచుకుంటే ఏదో అశుభం గట్రా అని ఇంట్లో మా ఆవిడ అసమ్మతి. మా పిల్లలకీ, నా భార్యామణికీ అసెంబ్లీలోలా వాదం. మొత్తమ్మీద మా పిల్లలతో నేనూ కలిసి మెజారిటీ సంపాదించి అసమ్మతిని ఎదుర్కొని పిల్లిని తేవడానికి వెళ్ళాము.
ఈ కెనడియన్ కథల్లో వెతలు కూడా చెప్పాలంటే అప్పుడప్పుడు ఈ పిల్లల పరిస్థితి చూస్తుంటే బాధేస్తుంటుంది. ఇండియాలోలాగా వీళ్లకు ఇక్కడ ఇంట్లో ఆడుకోవడానికి పెద్దగా పిల్లలు దొరకరు, వృద్ధులూ దొరకరు. ఇక వుండే మాలాంటి వారమేమో ఇలాగున బ్లాగులకో, టివి లకో అంకితం. మన చిన్నప్పుడు పల్లెటూర్లలో ఎన్నో పశు పక్ష్యాదులు వుండేవి - వాటితో ఎంచక్కా గడిపేవారం. అవన్నీ ఇక్కడి పిల్లలు కోలోతున్నారు. ఇక్కడి వారికయితే ఇంట్లో కాలక్షేపానికి పెట్స్ అన్నా వుంటాయి. మన దేశీలకి రకరకాల కారణాల వల్ల, మూఢ విశ్వాసాల వల్ల జంతువులని పెంచుకోవడం అంటే ఛీత్కారం.
పిల్లల ఇబ్బందులు నాకు తెలుసు కాబట్టి నేను వారికే వత్తాసు పలికాను. జయహో అనుకుంటూ పెంపుడు జంతువులను అమ్మే షాపులోకి వెళ్ళాము. ఓ మార్జాలం అనగా పిల్లిని ఎన్నుకున్నాం. దానికివ్వాల్సిన ఫుడ్డు గురించి మేము అడగకముందే తన బాధ్యతగా పిల్లిని అమ్మినామె చెప్పింది. వాటికి ప్రత్యేక ఆహారం కొనాలిట. హతోస్మి. ఏం, మే ఇంట్లో గతికే ఫుడ్డు పెట్టకూడదా అంటే ససేమిరా వీలు లేదండి. మీరు ఎటుపోయినా ఫర్వాలేదు కానీ పిల్లి ఆరోగ్యం బావుండాలి - మీరు తినే నానా చెత్తా దానికి పెట్టొద్దంది.
అప్పటిదాకా మేము తినే ముద్దలే ఓ నాలుగు ముద్దలు పాలు కలిపి దానికీ పడేద్దాం అనుకున్న మాకు అది ఆశానిపాతంలా అయ్యింది. ఎందుకంటే మా ఫైనాన్స్ మినిస్టరు కూడా అయిన మా ఆవిడ పిల్లిని కొనేంతవరకే బడ్జెట్ ఆమోదించింది - అదీ కష్టకష్టంగా. పిల్లిని కొన్నాము బానే వుంది - హిప్పుడు దానికి ఫుడ్డేట్లా? పిల్లలు నేను తీసుకోబోయే ప్రగాఢ నిర్ణయం కోసం చూస్తున్నారప్పుడు. ఒక దీర్ఘ నిశ్వాస తీసి ఏం ఫర్వాలేదులే - ఇంట్లో ఎలాగోలా మేనేజ్ చేస్తాలే అని పిల్లలకి అభయహస్తం ఇచ్చాను.
ఆ పెట్స్ పిల్ల మరో సంగతీ చెప్పింది. పిల్లికి అస్సలు పాలు పోయద్దంది. పిల్లికి పాలు పోయకపోవడం ఏంటీ నీ బొంద అని గయ్ మందామనుకుని శాంతంగా అడిగాను - ఎందుకూ అని. విరోచనాలు అవుతాయిట. ఛ అని మనస్సులో అనుకొని బయటకి నోరు మూసుకొని తల ఊపాను. అంతటితో ఊరుకుందా - చావు కబురు మెల్లగా చెప్పినట్లు దానికి వేయించాల్సిన టీకాలు, చేయించాల్సిన వేసెక్టమీ, చూపించాల్సిన వెటరనేరియన్ ( మా అమ్మమ్మ భాషలో 'గొడ్ల డాక్సరి '), వీటన్నింటికీ అందాజాగా అయ్యే ఖర్చూ అన్నీ చెప్పింది. నేను ఏడవలేక నవ్వుతూ అన్నింటికీ సరే అన్నాను. అవన్నీ ఇప్పటిదాకా కుక్కలకే అవసరం అనుకుని పిల్లులయితే ఆ ఖర్చు తప్పుతుంది కదా అనుకున్నాను. అదేం కుదరదని చెప్పింది ఆ అమ్మడు.
పిల్లిని ఎలాగూ తీసుకున్నాము కనుక ఇంట్లో ఈ ఖర్చులని ఎలా మేనేజ్ చేయాలో పిల్లలతో రాజకీయనాయకుల్లాగా వ్యూహాలూ, ఎత్తుగడలూ పన్నాను. వాళ్ల మమ్మీకి ఇంట్లో ఏ విషయం ఎప్పుడు చెప్పాలి, ఏ ఖర్చు గురించి ఎప్పుడు చెప్పాలి గట్రా మా ఎత్తుగడలు అన్నమాట. మా ఆవిడని మాతో పాటు ఈ పెట్ షాపుకి తీసుకురాకపోవడం మంచిదయ్యింది. ఆమె వచ్చివుంటే ఈ ఖర్చులన్నీ చూసి పిల్లి అనే మా ప్రాజెక్టుకి వీటొ చేసివుండేది - అసలే పిల్లి అంటేనె ఎదవగోల అనుకుంటోంది.
అంతటితో అయిపోయిందా? ఊహు. ఇంకా చాలా కొనాల్సి వచ్చింది. దానికో పాయిఖానా, అందులోకి పోయడానికి లిట్టర్, దాని షిట్టు ఎత్తడానికి ఒక ప్రత్యేకమయిన గంటె, అది ఆడుకోవడానికి బొమ్మలు గట్రా గట్రా. ఇంటికి వస్తున్న దారిలో పిల్లలిద్దరూ బాగా ఆలోచించి 'హిప్పర్ ' అని నామకరణం చేసారా మార్జాలానికి. ఇంటికి వచ్చాక మా ఆవిడ చిరచిరలాడుతూనే దానిని ఆహ్వానించింది. ఆమె కళ్ళలోకి చూడటానికి భయమేసి మా పిల్లల కళ్లళ్ళొ వెలుగుని చూసి ఆనందపడ్డాను. పిల్లలు మాత్రం చాలా సంతోషపడ్డారు. దాంతో నేనూ అమితంగా ఆనందపడ్డాను.
ఆ ఆనందం అలాగే నిలిచిందా, ఆవిరి అయ్యిందా అన్నది తదుపరి భాగంలో!
గురువారం 14 మే 2009
భువనగిరి గుట్ట మీద (ఆత్మ)హత్య - ముగింపు - ఈ కోడ్ మీరు ఛేదించగలరా?
అలా అప్పుడు భోనగిరి గుట్ట మీద విశాల స్మృతుల్లోకి వెళ్ళి బయటకి వచ్చాము. "విశాల వ్రాసిన కోడ్ నీ దగ్గర వుందా?" అని సందీపుని అడిగాను. వేరే పెళ్ళి కాగానే విశాల ఉత్తరాలు అన్నీ చింపేసాననీ, వాటితో పాటుగా ఆ కోడ్ కూడా పోయిందనీ చెప్పాడు. నేను ఆ కోడును భద్రపరిచానని చెప్పి, దానిని డీకోడ్ చేయడానికి చేసిన ప్రయత్నాలని వివరించాను. చీకటి పడుతుండటముతో గుట్ట దిగిపోయాము.
విశాల మరణంపై రకరకాల పుకార్లు:
- వెంకటే విశాలని చంపాడు.
- సందీప్ నే ఆమెని చంపాడు. వెంకట్ పాత్ర ఇందులో లేదు - పోలీసుల వత్తిడిపై ఆ నేరాన్ని కొంత ఒప్పుకున్నాడు.
- విశాలతో గొడవపడి వెంకట్ గుట్ట దిగివెళ్ళిన తరువాత ఎవరో విశాలని ఏదో చేసి గుండంలోకి తోసేసారు
- చెల్లె కనపడకపోవడముతో రకరకాల పుకార్లు విని ఆమె కోసం వెతుకుతున్న విక్రంకి గుట్టమీద ఒంటరిగా వున్న విశాల కనిపించింది. ఇలాంటి పనులు చేస్తున్న చెల్లె మీది ఆగ్రహంతో విక్రమే ఆమెని నీళ్లలోకి తోసేసాడు.
- ఇవేవీ జరగలేదు. జీవితం మీది నిస్పృహతో విశాలనే గుట్టమీదికి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది. దానికి కారణం రెండు సార్లు విఫలమయిన తన ప్రేమలు. తద్వారా వచ్చిన గర్భం. రెండో సారి అప్పటికే పెళ్ళి అయిన వ్యక్తి ప్రేమలో పడిందనేది ఇక్కడ గమనించాల్సిన విషయం.
ఎవరేం చేస్తున్నారిప్పుడు?
విక్రం: ఎక్కడున్నాడో తెలియదు.
వైదేహి: ప్రత్యూష (అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన సినిమా తార) ట్రస్టులో పనిచేస్తున్నట్లుగా చివరి సమాచారం. ఈ ట్రస్టుని కాంటాక్ట్ చేయడం కోసం బాగా ప్రయత్నిస్తున్నాం కానీ తెలియడం లేదు. ఎవరికయినా ఫోను, అడ్రసు వివరాలు తెలిస్తే ఇవ్వగలరు.
సందీప్: సూర్యాపేటలో ప్రభుత్వ ఉద్యోగం
వెంకట్: సమాచారం లేదు
ఈ సంఘటన సుమారుగా పద్ధెనిమిది ఏళ్ళ క్రితం జరిగింది. ఖచ్చితమయిన సంవత్సరం, తేదీ నాకు గుర్తులేవు. సందీపుకి ఏమయినా గుర్తుకువున్నాయేమో కనుక్కోవాలి.
ఇక ముందు: హతురాలు అందించిన కోడును ఎవరయినా ఛేదించగలిగితే అందులో పనికివచ్చే సమాచారం ఏమయినా వుంటే ఆ దిశగా ఏమయినా ప్రయత్నాలు చేయవచ్చు. ఈ సారి నేను ఇండియా వచ్చేలోగా వైదేహిని కనుక్కుంటానని సందీప్ అన్నాడు. ఆమె ద్వారా మరిన్ని వివరాలు, విశాల మరణించిన ఖచ్చితమయిన స్థలం తెలిస్తే మరో సారి గుట్టమీదికి వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించి వస్తాం. విశాల పేరు మీద ఒక ట్రస్టు పెట్టి కొన్ని మంచి పనులు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాము కానీ ఇంకా కుదిరింది కాదు. ఈ సంఘటన ఆధారంగా ఒక వీడియో ఫిల్మ్ తీయించాలని అనుకున్నాను కానీ అదీ కుదరలేదు. వెంకట్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలని, అతని మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఇంకా అప్పుడప్పుడు సందీప్ ఉబలాటపడుతూనేవున్నాడు.
కొన్ని ముఖ్య విషయాలు:
- విశాలకి ఇదివరలోనే ప్రేమ, పెళ్ళీ అయ్యిందని వెంకట్ వాళ్ళకు బహుశా ఇప్పటికీ తెలియదు.
- తనకీ, విశాలకీ ఎందుకు ముఖ్యంగా తేడాలొచ్చాయో నాకు తెలుసునన్న విషయం, మీకూ తెలుసన్న విషయం సందీపుకి తెలియదు. అతనికి బ్లాగులు చదివేంత దృశ్యం లేదు కాబట్టి ప్రస్తుతానికి ఓకె. తెలిసినా ఏముందిలెండి.
- అన్నట్లు చెప్పడం మరిచేపోయాను - వైదేహి నన్ను ఇష్టపడుతుండేది. నాకూ అమె అంటే కొంత ఇష్టమే వుండేది కానీ అప్పట్లో ఇంకా స్థిరపడకపోయినందున ఈ ఇష్టాలని పెద్దగా పట్టించుకోలేదు.
కోడ్: ఈ క్రింద ఇచ్చిన కోడును ఛేదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలం అయ్యానని మీకు తెలుసుకదా. దయచేసి మీరూ ప్రయత్నించండి - సరదాగా అయినా - సీరియస్సుగా అయినా. మీకు ఇంకా ఏమయినా వివరాలు కావాలంటే అడగండి. విశాల అప్పట్లో చదివింది ఇంటర్ బై పి సి. ఏదయినా కెమిస్ట్రీ కోడులో వ్రాసిందేమో అనికూడా చూసాము.
17, 29, 38 P 1 17 P 5 50 P 4 29 P 5 45 P 1 46 P 10 36 ? 5 (29 P 3. 29 P 3. 50 P 4.)
P అంటే to the power of అని చదువుకోగలరు. దానికి అర్ధం to the power of అనో కాదో తెలియదు కానీ క్రింది అంకెలకు పైన కొద్దిగా కుడి ప్రక్కన విశాల అలా వ్రాసింది. ? తరువాత వున్న 5 సంఖ్యనేమో 36 క్రింద కొద్దిగా పక్కకు వ్రాసింది. ఆ కన్వెన్షన్ ను ఏమంటారో తెలియక ? నేనే పెట్టాను. 36 తరువాత వున్న అంకె 5 కావచ్చు లేదా మరొకటి కావచ్చు. నేను భద్రపరచిన కాగితం అక్కడ కొద్దిగా తడిచి అంకె సరిగ్గా కనిపించడం లేదు. నాకు అయితే 5 లాగే అనిపిస్తోంది.
మీరు ఎప్పుడయినా భోనగిరి గుట్ట/కోట ఎక్కడం తటస్థించితే ఈ మీ మిత్రుడి కోసం చిన్న పని చేయండి. నా మిత్రురాలు విశాల కొసం ఓ క్షణం శ్రద్ధాంజలి ఘటించండి. భోనగిరికి దగ్గర్లో వున్నవారు, హైదరాబాదులొ వున్నవారు ఒకసారి అయినా అక్కడికి పిక్నిక్ గా వెళ్ళడం చక్కగా వుంటుంది. అలా వెళ్ళి ఆ కోట చరిత్రలోకి, ఈ 'విశాల ' చరిత్రలోకి వెళ్ళి రావడం మీకు ఓ మంచి అనుభూతిని ఇవ్వగలదు. ఎవరయినా వెళ్ళినప్పుడు నాకూ తెలియపరిస్తే నా చక్కటి మిత్రురాలు గడిపిన ఊరిలో, గడిపిన ప్రదేశాల్లో మీరూ తిరుగాడారన్న విషయం నన్ను ఆహ్లాదపరుస్తుంది. మరచిపోకండేం!

బుధవారం 13 మే 2009
భువనగిరి గుట్ట మీద (ఆత్మ)హత్య - పార్ట్ 5
విక్రం వాళ్లకి ఇచ్చిన మరో మాట ప్రకారం విశాల మరణం విషయం నా స్నేహితుడు మరియు విశాల మాజీ భర్త అయిన సందీపుకి నేను చెప్పలేదు. అప్పట్లొ అతను నాకు పెద్దగా టచ్ లో కూడాలేడు. దానికి ఒక కారణం వుంది. విశాలను సందీపు అతను పెళ్ళి చేసుకొని వచ్చాక వాళ్ళ ప్రేమకి సహకరించిన నన్ను, మరో మిత్రుడినీ అతను కొంత దూరంగా వుంచుతూ వుండడముతో మేమూ అతడిని అప్పట్లో పెద్దగా పట్టించుకోవడం మానివేసాము. సందీప్ అలా ఎందుకు కాస్త దూరంగా వుంటున్నాడో మాకు పెద్దగా అర్ధమయ్యేది కాదు. బయట బయటనే కలిసేవాడు, ఇంటికి పిలిచేవాడు కాదు. సంకుచిత మనస్థత్వంతో అలా ప్రవర్తిస్తున్నాడని అనుకున్నాం.
అయితే అసలు విషయం కొన్నాళ్ళ తరువాత తెలిసింది. విశాల భోనగిరిలో వుంటున్నరోజుల్లో విశాల అమ్మగారు అయిన వాణి ఆంటీ అవో ఇవో పనుల నిమిత్తం సూర్యాపేటకి వస్తుండేది. ఒకరోజు నన్ను ఆమె కలిసి విశాలకీ, సందీపుకీ జరిగిన గొడవల గురించి చెప్పింది. అందులో ముఖ్యంగా జరిగిన గొడవ గురించి విని నేను అవాక్కయ్యాను. ఆ విషయం మీకు వెళ్ళడించడం సముచితంగా వుంటుందో లేదో అని తటపటాయిస్తూ ఈ భాగం వరకు ఆగాను. మీరు వాస్తవ పరిస్థితి అర్ధం చేసుకోవడం కోసం ఇప్పటికీ తటపటాయిస్తూనే వెళ్ళడిస్తున్నాను.
విశాలకీ, సందీపుకీ ముఖ్యంగా గొడవ నా గురించే జరిగేదట! నాతో విశాల చాలా సన్నిహితంగా వుంటుండేదని అతని అనుమానమట!! అలా నామీది అనుమానాలతో విశాలను అతను చాలా వేధించాడట. అతని వేధింపులకి తట్టుకోలేక, విసిగిపోయి విశాల ఒకసారి అతని అనుమానాలని అంగీకరించి 'అవును, శరత్ తో సన్నిహితంగా వుండేదానిని. సరేనా! ఇక ఏం చేస్తావో చేసుకో' అని అక్కడనుండి వచ్చేసిందిట.
సందీప్ అనుమానం వాస్తవమేనా అని అడిగింది వాణి ఆంటీ. ఏమాత్రమూ వాస్తవం లేదని చెప్పాను. అటువంటి విషయాలు అప్పట్లో నాకు సాధారణమే అయినా విశాలతో అంత సాన్నిహిత్యం లేదు నాకు. ఆమె నాకు ఓ చక్కటి మిత్రురాలు అంతే. ఇలాంటి అనుమానం వున్నవాడు మరి విశాలను ఎందుకు పెళ్ళిచేసుకున్నాడో అర్ధం అయ్యింది కాదు. పెళ్ళి చేసుకున్నాక ప్రేమ మత్తు దిగి ఏవేవో సందేహాలు బయల్దేరి వుంటాయి. వాళ్ళిద్దరూ విడిపోక ముందు సందీపు నన్ను అడిగితే అతని అనుమానాలని నివృత్తి చేసివుండేవాడిని.
ప్చ్. నేను చేసిన పెళ్ళి నా వల్లనే పెటాకులవడం నాకు బాధ కలిగించింది. నా పొరపాటు వున్నా లేకున్నా నా వల్ల ఆమెకు తీరని అన్యాయం జరిగింది కాబట్టి దీనికి పరిష్కారం ఒకటి అప్పట్లో ఆలోచించాను. నావి ఎలాగూ విశాలభావాలే కాబట్టి నేను స్థిరపడిన తరువాత ఆమెకు ఇష్టమయితే పెళ్ళి చేసుకోవాలని. అయితే నా వుద్దేశ్యాన్ని ఆమెకు ఎప్పుడూ తెలియపరచలేదు. అంతలోకే ఆమె మరణించడం జరిగింది. ఇలా ఎందుకు చేసావంటూ సందీపునీ నేను ఎప్పుడూ అడగలేదు. వాళ్ళు విడిపోయాక ఇవన్నీ తవ్వుకొని ఏం ప్రయోజనం అనుకొని, అతని నిజ స్వరూపం తెలిసి కాస్త దూరంగా వుంటూ వచ్చాను. విశాల మరణ వార్త అతనికి చెప్పకపోవడానికి కారణం ఇదీ.
రెండు మూడు నెలల తరువాత విశాల మరణవార్త సందీపుకి చేరి నిజమా కాదా తెలుసుకోవడానికి నా దగ్గరికి వచ్చాడు. నిజమే అని చెప్పాను. ఈ పరిస్థితులల్లో భోనగిరికి వెళ్ళి ఈ విషయాలని కలబెడితే పోలీసులు అనుమానంతో నిన్నే అరెస్టు చేసే అవకాశం వుంటుందని చెప్పి అతనిని అటువైపు వెళ్ళకుండా ఆపాను. విశాలను హత్య చేసిన వెంకట్ మీద ఎలాగయినా ప్రతీకారం తీర్చుకోవాలని ఆవేశపడ్డాడు. తరువాత కూడా అప్పుడప్పుడూ వెంకట్ మీద ప్రతీకారం తీర్చుకొని విశాలకు ఆత్మశాంతి కలిగించాలని అంటుండేవాడు.
సందీప్ నన్ను తన ఇంటికి పిలిచాడు. విశాల భోనగిరిలో వుంటున్నప్పుడు తమ మధ్య మళ్ళీ నడిచిన ప్రేమాయణం, లేఖల గురించి చెప్పుకువచ్చాడు. చివరి లేఖలో ఆమె కోడ్ పద్ధతిలో వ్రాసిన సందేశం చెప్పాడు. దానికి డీకోడ్ చేయడం అతని వల్ల కాలేదు. ఆ లేఖ నాకూ చూపించాడు. 'బావా ఒక రహస్యం చెబుతున్నాను. కనుక్కో' అని వ్రాసింది. డీకోడ్ చేయడానికి నేనూ శత విధాలా ప్రయత్నించాను కానీ అర్ధం కాలేదు. ఆమె మరణించిన కాలంలో గర్భవతి అయి వుండవచ్చు. ఆ విషయం ఏమన్నా చెప్పిందా? లేక వెంకట్ గురించి ఏమయినా చెప్పిందా? ఆ కోడ్ ఛేదిస్తే తన మరణ రహస్యం ఏమయినా బయటపడుతుందా?
ఆ కోడును నేను భద్రంగా వ్రాసుకొని జాగ్రత్త చేసాను. యు ఎస్ కు వచ్చిన తరువాత చాలా ఏళ్ళకు ఆ కోడుని చిన్నపాటి హ్యాకర్ అయిన నా మేనల్లుడికి, అతని మిత్రులకీ ఇచ్చి ఛేదించమన్నాను. వాళ్ల వల్ల కూడా కాలేదు.
నేను కెనడా నుండి, యు ఎస్ నుండి ఇండియాకు సెలవుల్లొ వచ్చినప్పుడు సందీపుని కలుస్తుండేవాడిని. మళ్ళీ బాగా సన్నిహితం అయ్యాడు. విశాల మరణించిన ప్రదేశానికి వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించి రావాలని ఎప్పుడూ అనుకునేవారం. అది ఇప్పుడు కుదిరింది.
ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది.
హతురాలు ఇచ్చివెళ్ళిన కోడ్, విశాల మరణంపై ఇతర సందేహాలు/పుకార్లు , ఇంకా ఏమయినా మరచిపోయిన ముఖ్యవివరాలతో ముగింపు వచ్చే భాగంలో.

మంగళవారం 12 మే 2009
హిప్నటైజ్ చేయడం ఎలా? - పార్ట్ 1
దీనిమీద మీరు ఏ గూగులమ్మనో అడిగితే చాలా వివరాలు తెలియకపోవు. అయితే ఒకప్పటి హిప్నటిస్టుగా నా అనుభవాలని రంగరించి ఇక్కడ రాయాలనేది నా వుద్దేశ్యం.
నేను ఇంటర్ చదువుతున్నరోజుల్లో యండమూరి, తదితరులు వ్రాసిన నవలల్లోనూ, నాస్తిక హేతువాద పత్రికలలోనూ హిప్నటిజం గురించి, హిప్నటిస్టుల గురించి తరచుగా వినిపిస్తూ నాలో దీనిమీద ఆసక్తి పెరిగింది. అలా గుంటూరులోనో ఏలూరులోనో వున్న హిప్నటిస్టు దగ్గరికి వెళ్ళి నేర్పమని కోరాను కానీ ఆయనకు వీలుకాలేదు.
మిగతా ఇక్కడ చదవండి:
http://sainyam.in/?p=254

భువనగిరి గుట్ట మీద (ఆత్మ)హత్య - పార్ట్ 4
విక్రం ఇంటిలోకి వెళ్ళాను. జరిగినదంతా తెలుసుకున్నాను. అయిదురోజుల క్రితం రోజూలాగే స్కూల్ కి వెళ్ళిన విశాల ఆరోజు ఎంతకూ తిరిగిరాలేదట. వారినీ వీరినీ విచారించగా ఒకరిద్దరు గుట్టమీదికి ఎక్కుతుండగా చూసామని చెప్పారంట. విక్రం గుట్ట మీదికి ఎక్కి వెతికాడు. ఒకచోట గుండం వద్ద చెప్పులు మాత్రం కనిపించాయట - మనిషి మాత్రం కనిపించలేదు. అప్పటికే చీకటి పడటముతో భయం వేసి వెతుకులాట ఆపి విక్రం క్రిందకు వచ్చాడట.
మరుసటి రోజు ఉదయం అందరూ వెళ్ళి వెతికితే విశాల ఎక్కడా కనిపించలేదు. ఈతగాళ్లని పెట్టించి చెప్పులు కనిపించిన దగ్గరి గుండంలో వెతికించితే విశాల శవం బయటపడింది. పోలీసులు విచారణ జరిపి అనుమానంతో వెంకటును అరెస్ట్ చేసారు. విశాల కనిపించకుండా పోయిన రోజు విశాలతో పాటుగా వెంకట్ కూడా గుట్ట ఎక్కాడని పుకారు. వీరిద్దరి మధ్య ఎప్పటినుండో ప్రేమ నడుస్తున్నదనీ, ఏవో తేడాలు వచ్చి విశాలని వెంకట్ హత్య చేసాడనీ అభియోగం. విశాలతో గుట్టమీదికి ఎక్కిన విషయం నిజమేననీ, వాదులాట జరిగాక తాను తిరిగివచ్చాననీ, విశాలను తాను హత్య చేయలేదనీ వెంకట్ ఒప్పుకోలు. ఇది అయినా నిజమేనా లేక పోలీసుల టార్చర్ భరించలేక ఇంతమాత్రమయినా ఒప్పుకున్నాడా అనేది మనకు తెలియదు.
ఆ రోజు సాయంత్రం విక్రం వాళ్లతో కలిసి వారి దగ్గరి బంధువుల ఇంటికి వెళ్ళాను. అక్కడ ఆందరు నన్ను బ్రతిమలాడి ఒక విషయాన్ని నాతో ఒప్పించారు! విశాల సందీపుల ప్రేమ, పెళ్ళి వ్యవహారం భోనగిరిలో ఎవరికీ తెలియదు. ఇప్పుడు నేను ఆ విషయం ఇక్కడ ఎవరికయినా బయటపెడితే విశాలకు చెడుపేరు వస్తుంది - వెంకట్ మీది అభియోగం తేలిక అవుతుంది - కేసు పక్కదారి పడుతుంది. సందీపు గురించి మౌనంగా వుండటానికి నేను అంగీకరించాను.
మరుసటి రోజు నేను వెళతానంటే విశాల వ్యవహారం ముగిసేదాకా నన్ను అక్కడే తోడుగా వుండమని అందరూ అన్నారు. వారి ఇంటిలోనే కొద్దిరోజులు వున్నాను. వెంకట్ వాళ్ళు వీరితో రాజీకి వచ్చారు. నష్టపరిహారంగా కొంత డబ్బు ఇస్తామన్నారు కానీ విక్రం వాళ్ళు ఒప్పుకోలేదు. నాలుగయిదు రోజులు అలా రకరకాల చర్చలూ, వాదోపవాదాలు, వ్యూహాలూ జరిగాయి. మహిళా హక్కుల సంఘం వారు కూడా వచ్చి విచారించారు. అప్పటి భోనగిరి మేయర్ (పేరు నాగేందర్ అనుకుంటా) కూడా పరామర్శించడానికి వచ్చి తమ సంతాపం, సహకారం ప్రకటించారు. ఆశ్చర్యకరంగా ఆ పట్టణ మేయర్ మా నాన్న గారి ప్రియ శిష్యులలో ఒకరు! విశాల వాళ్ళు మాకు బాగా తెలిసినవారు అని అర్ధం అవడముతో ఈ విషయంలో మేయర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
చివరికి అందరూ కలిసి వెంకట్ వాళ్లకీ, విక్రం వాళ్లకీ రాజీ కుదిరించారు. నష్టపరిహారం క్రింద వెంకట్ వాళ్ళు కొంత డబ్బు చెల్లిస్తారు - విక్రం వాళ్లు వెంకట్ మీద కేసు తీయించేస్తారు. వెంకట్ ప్రభుత్వ ఉద్యోగి/ టీచర్ కాబట్టి ఈ విధంగా తన ఉద్యోగం ఊడకుండా వుంటుంది. ఇలా విషయాలన్నీ ఒక కొలిక్కి రావడంతో నేను భోనగిరి నుండి సూర్యాపేటకి తిరిగివచ్చాను.
అయితే ఇంతకీ విశాలది హత్యనా, ఆత్మహత్యనా? హత్య అయితే చేసింది ఎవరు? వెంకట్ మాటల్లో నిజం వుందా? అతను చెప్పిందే నిజమయితే అతను గుట్ట దిగి వెళ్ళిన తరువాత ఒంటరిగా వున్న విశాలను మరెవరన్నా ఎందుకన్నా హత్య చేసారా? లేక విశాలనే వెంకటుతో జరిగిన గొడవతో కలత చెంది ఆత్మహత్య చేసుకుందా? ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి వేరే బలీయమయిన కారణాలు వున్నాయా? ఈమె మరణంలో సందీప్ పాత్రం ఏమయినా వుందా? లేక స్వంత అన్న విక్రం పాత్ర ఏమయినా వుందా? ఇలాంటి శేష ప్రశ్నలు వున్నాయి. మరణించడానికి కొద్దిరోజులకు ముందు హతురాలు కొన్ని క్లూస్ విడిచిపెట్టింది. ఆ వివరాలన్నీ వచ్చే భాగంలో.

సోమవారం 11 మే 2009
తరచుగా జలుబు చేస్తోందా?
శీతాకాలంలో బయట బాగా చలిగా వుండి కిటికీలు, తలుపులు తెరచి వుంచము కాబట్టి ఇంట్లోని నీటి వినియోగం వల్ల తేమ బాగా పెరుగుతుంది. అలా హ్యుమిడిటీ బాగా పెరగడం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. చలి ప్రాంతాల్లో వుండేవారు చలికాలాల్లో ఇంట్లో తేమ పెరగకుండా చూసుకోవాలి. అందుకు గాను డి-హ్యుమిడిఫైయర్లు వుంటాయి కానీ ....
మిగతా ఇక్కడ చదవండి:
http://sainyam.in/?p=262
మిగతా ఇక్కడ చదవండి:
http://sainyam.in/?p=262
భువనగిరి గుట్ట మీద (ఆత్మ)హత్య - పార్ట్ 3
ఫ్లాష్ బ్యాక్:
మేము సూర్యాపేటలో వుంటున్నప్పుడు ఒక ఆంటీ మా ఇంటికి వచ్చింది. మనకు బాగా తెలిసినవారు అని చెప్పింది మా అమ్మ. ఆంటీ కూడా అల్లుడా అల్లుడా అంటూ ఆప్యాయంగా మాట్లాడింది. వాళ్ళ ఇంటికి రమ్మంది. వెళ్ళాను. ఆమెకు ఇద్దరు అమ్మాయిలు, ఒక కొడుకు. భర్త జరిగిపోయాడు. పెద్ద అమ్మాయి (విశాల), కొడుకు (విక్రం) ఇంటర్ మొదటి సంవత్సరం - గ్రూపులు వేరే. చిన్నకూతురు వైదేహి ఏడు చదువుతుండేది. ఆ కుటుంబం చూపినే ఆప్యాయత, ఆదరణ నాకు బాగా నచ్చాయి. త్వరలోనే అందరమూ బాగా సన్నిహితం అయ్యాము. విక్రం, విశాలలు మా ఇంటి దగ్గరే వున్న లెక్చరర్ దగ్గరికే ట్యూషనుకి వస్తుండటముతో వారి స్నేహితులు కూడా నాకు బాగా పరిచయం అయ్యారు.
నాకు విశాల బాగా నచ్చింది. మరీ గొప్ప అందగత్తె కాకపోయినా చక్కటి వ్యక్తిత్వం. ప్రేమిస్తే పోలా అనుకునేవాడిని కానీ ఇప్పుడే ఎందుకులే అని ఆమెను పరిశీలిస్తూ వుండిపోయాను. అలా కొన్నాళ్ళు గడిచాయి. విశాల ఇంటర్ రెండో సంవత్సరంలోకి అడుపెట్టింది. ఆమె ఫ్రెండు అయిన సందీప్ నాకు కూడా బాగా క్లోజ్ అయ్యాడు. అతను ఒకరోజు తనకు - విశాలకి వున్న ప్రేమ బంధాన్ని చెప్పి నా సహకారం అడిగాడు. అలా నేను ప్రేమించాలనుకున్న ప్రేమను త్యాగం చేసేసి వారిద్దరి ప్రేమకు నేను క్యారెక్టరు (ఆర్టిస్ట్) అయ్యాను.
ఇంకేముంది - వారిద్దరి ప్రేమ కథ శరా మామూలే. కులం తేడాల వల్ల అటు వైపు, ఇటు వైపు పెద్ద వారు ఒప్పుకోకపోవడముతో వాల్లకూ వీళ్ళకూ సర్దిచెప్పలేక నాకూ, ఇంకో ఫ్రెండుకూ తలలు బొప్పికట్టాయి. గొడవలు, వాదులాటలు, ఆత్మహత్యా ప్రయత్నాలు మామూలు అయ్యాయి. ఇలా లాభం లేదని ఒక శుభ ముహూర్తాన ఆ ప్రేమ జంటను బస్సెక్కించి మేము ఇద్దరమూ ఏమీ ఎరగనట్టు నటించాము.
వీళ్ళిద్దరూ ఎక్కడున్నారో చెప్పమంటూ పెద్దల వేధింపులు మా మీద ఎక్కువయ్యాయి. ఈలోగా ఆ ప్రేమ జంట ఏ గుళ్ళోనో పెళ్ళి చేసుకుంది. సందీప్ తల్లితండ్రులు కాస్త మెత్తబడి అబ్బాయినీ, కోడలినీ ఇంటికి పిలిచారు. అలా సందీప్ కాపురం మొదలయ్యింది. విశాల తల్లిగారి కోపం మాత్రం తొందరగా తగ్గలేదు. కొన్ని నెలల్లోనే సందీపుకీ, విశాలకీ పొరపొచ్చాలు రావడం మొదలయ్యి విశాల తల్లికి దగ్గరయ్యి నెమ్మదిగా తల్లి దగ్గరే వుండటం మొదలుపెట్టింది. వారిద్దరినీ కలపడానికి మిత్రులం కొన్ని ప్రయత్నాలు చేసాము కానీ ఫలించలేదు. వారిద్దరి కాపురం విచ్చిన్నం అయ్యింది.
ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడవుంటే బావుండదనుకొని విశాల వాళ్ళు భోనగిరికి మారారు. ఇటు వారి కుటుంబంతో అటు సందీపుతో నా స్నేహం చక్కగానే సాగుతుండేది. విక్రం (విశాల అన్న) ఆహ్వానంపై ఒక సారి భోనగిరికి వెళ్ళి విశాల వారి ఇంట్లొ కొన్ని రోజులు గడిపివచ్చాను. అక్కడ విక్రం తమ ఎదురింటిలో వుండే వెంకట్ సారుని పరిచయం చేసాడు. ఆ సారు చక్కటి వ్యక్తి అని చెప్పాడు. వారితో చాలాసేపు మాట్లాడాను.
దూరంగా వున్నందుకేమో ఈలోగా మళ్ళీ విశాల, సందీపుల మధ్య రహస్య అనుబంధం మొదలయ్యింది. ఉత్తరాలు మొదలయ్యాయి. అప్పుడప్పుడూ సందీప్ భోనగిరికి వెళ్ళి రహస్యంగా విశాలతో గడిపి రావడం నాకు తెలుసు. అలా కొంతకాలం గడిచింది.
ఒకరోజు ఈనాడు నల్లగొండ జిల్లా సంచికలో ఒక చిన్న వార్త చూసాను. భోనగిరి గుట్టమీద యువతి శవం. పేరు, వయస్సు ఇచ్చి ప్రైవేటు టీచరుగా పనిచేస్తున్నదని తెలిపారు. నా గుండె గుభేలుమంది. కొంపదీసి ఈ విశాలనే కాదు కదా. అప్పుడు వారికి ఫోనులేదు కాబట్టి విషయం నిర్ధారించుకోవడం కోసం వెంటనే భోనగిరి బయలుదేరి వెళ్ళాను. విశాల ఇంటికంటే ముందే వెంకట్ ఇల్లు వుండడముతో ముందస్తు సమాచారం కోసం వెంకట్ ఇంటికి వెళ్ళాను. వెంకట్ ఇంట్లో లేడు అని అతని భార్య, తల్లిదండ్రులు చెప్పారు. ఎందుకు అని అడిగారు ఆత్రుతగా. సూర్యాపేట నుండి వస్తున్నానని, పేపర్లో విశాల గురించి వార్త చూసానని, అది ఈ విశాల గురించేనా కాదా అని తెలుసుకోవడానికై వారి ఇంటికి వెళ్ళే ముందు మీ ఇంటికి వచ్చానని చెప్పాను. ఏంటో వారు అంతా కంగారు కంగారుగా, అరకొరగా సమాధానం ఇచ్చారు.
చిత్రంగా వుందే అనుకుంటూ వాళ్ళింటిలోనుండి బయటకు వస్తుండగానే విక్రం తన ఇంటినుండి బయటకి వెళుతూ నన్ను చూసాడు. అతని ముఖంలో ఎప్పుడూ వుండే చిరునవ్వు లేదు. నాకు విషయం రూఢి అయ్యింది. వెంకట్ వాళ్ళింటికి ఎందుకు వెళ్ళావు అని అడిగాడు. చెప్పాను. చెల్లెని చంపింది వాడే - వాడిప్పుడు పోలీసు కస్టడీలో వున్నాడు అని చెప్పాడు!

గురువారం 7 మే 2009
హిప్నటిస్ట్ శరత్
మనలో ఈ కోణం కూడా వుందండోయ్. డిగ్రీ చదువుతున్నరోజుల్లోనే తెనాలి వెళ్ళి ఒక హిప్నటిస్టు ఇంట్లో ఓ అయిదురోజులు వుండి నేర్చుకుని వచ్చాను. యండమూరి నవలలు గట్రా చదువుతుండేవాడిని కాబట్టి ఎలాగయినా హిప్నటిజం నేర్చుకోవాలని ఆరాటం వుండి అది నేర్చేసుకున్నాను. దానిమీద పుస్తకాలు సేకరించాను.
కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు నాకు తెలిసిన అందరినీ హిప్నటైజ్ చేసేస్తూవుండేవాడిని. కొంతమంది అయేవారు - కొంతమంది కాకపోయేవారు. అప్పట్లో మా మరదలు, ఆమె ఫ్రెండ్స్ మా ఇంట్లోనే ఎక్కువగా గడిపేవారు. ఆమె స్నేహితురాళ్ళనందరినీ హిప్నటైజ్ చేసాను కానీ మా మరదలు హిప్నటైజ్ కావడానికి ససేమిరా ఒప్పుకోలేదు. ఏదో గొప్ప ప్రమాదం శంకించి వుంటుంది. అటువంటి ప్రమాదాలు ఇందులో ఏమీ జరగవని చెప్పినా వినలేదు. అలా మా బంధువులనీ, మిత్రులనీ హిప్నటైజ్ చేస్తూ, వాటిల్లో ఎన్నో ప్రయోగాలు చేస్తూ కాలక్షేపం చేస్తుండేవాడిని. కొంతకాలం తరువాత దానిమీద ఆసక్తి తగ్గిపోయి పక్కకు పెట్టేసాను.
ఆ తరువాత ఒక సారి విజయవాడలో ఒక ప్రముఖ హిప్నాటిస్ట్ (టి ఎస్ రావు అనుకుంటా పేరు) ఇచ్చిన ప్రదర్శనలో పాల్గొని హిప్నటైజ్ అయ్యాను. నామీద అప్పుడు కొన్ని హిప్నటిజం ప్రయోగాలు చేసారు. త్వరగా, గాఢంగా నేను హిప్నటైజ్ అవుడం గమనించి ఆ ప్రదర్శనలో నామీదనే ఎక్కువ ప్రయోగాలు చూపించారు.
మళ్ళీ నాలోని విద్యని బయటకి తీసి మా ఆవిడ నామాట విననప్పుడల్లా ఆమె మీద ప్రయోగించాలని వుంటుంది కానీ అది జరిగేపని కాదులెండి.

భువనగిరి గుట్ట మీద (ఆత్మ)హత్య - పార్ట్ 2

(యదార్ధ సంఘటణ ఇది. భువనగిరి లేదా పరిసర ప్రాంతం చదువరులు ఎవరయినా వుంటే ఈ ఘటణ మీకు తెలిసే వుండవచ్చు - స్పందించండి. ఆ గుట్ట ఎక్కిన వారు వున్నా స్పందించండి. వ్యక్తుల అసలు పేర్లు ఉపయోగించలేదు. ఇవాళే సందీప్ తో ఫోనులో మాట్లాడి తన కథ బ్లాగుతున్నానని చెప్పా. వైదేహి ట్రేస్ కొంచెం తెలిసిందనీ ఎలాగయినా ఆమెను కలుస్తానని చెప్పాడు. )
సందీప్ చాలా విచారగ్రస్తుడయ్యాడు. భోనగిరి గుట్టమీద గుండంలో విశాల శవం బయటపడిందని నాకు తెలుసుగానీ ఖచ్చితంగా గుట్టమీద ఏ ప్రాంతమో, ఏ గుండమో నాకు తెలియదు. అదే విషయం సందీప్ కు చెప్పాను. ఇంకా పై గుట్టమీద కొన్ని కొలనులు, గుండాలు వున్నాయని ఒకవేళ అక్కడేమయినా బయటపడిందేమో నాకు తెలియదని చెప్పాను. చాలావరకు ఇక్కడి గుండాల్లోనే ఏదో ఒకటి అయ్యుంటుందని చెప్పాను.
ఇద్దరం కలిసి అక్కడవున్న గుండాల్లో ఏ గుండంలో విశాల ఆత్మహత్యకి పాలుపడివుండవచ్చో లేదా ఆమె హత్య జరిగివుండవచ్చో పరిశీలించాము. ఒక రెండు గుండాలు అటువంటి పరిస్థితులకు అనువుగా అనిపించాయి. అలా చర్చ జరుగుతునంతసేపు అతని ముఖాన్ని జాగ్రత్తగా గమనించాను. ఏమో ఎవరు చెప్పొచ్చారు? ఈ సందీప్ నే ఆ అమ్మాయిని హత్య చేసి వుండవచ్చుకదా. చెప్పలేం. నా దగ్గర అమాయకత్వం నటిస్తున్నాడేమో. చాలా దగ్గరి స్నేహితుడే కానీ ఇటువంటి విషయాలలో అందరూ నిజం చెబుతారా?
ఒకవేళ సందీప్ నే ఆ హత్య చేసివుంటే ఆ గుండాల్లో నన్నూ తోస్తాడేమో - నామీద అతనికి కొన్ని అనుమానాలున్నాయని తెలుసు. లేక నన్నూ అతను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడేమో! కొంపదీసి ఈ హత్య చేసింది నేనే అని సందీప్ అనుకోవడం లేదు కదా. అలాంటి ఏ మూర్ఖపు అనుమానంతోనో లేక నిజంగా తనే హంతకుడు అయివుండి తనలో వున్న అనుమానాలతోనో, మరెందుకో నన్ను ఈ గుండాల్లో తోసినా తోస్తాడు అని ఎందుకయినా మంచిది అని అక్కడ వున్నంతసేపు వళ్ళు దగ్గరపెట్టుకొని జాగ్రత్తగా వున్నాను. అతని కదలికల్ని ఓరకంటా గమనిస్తూ మరీ గుండాలకి దగ్గరగా వెళ్ళకుండా అప్రమత్తంగా వున్నాను. అసలే వేరే ఎవరికీ చెప్పకుండా ఈ గుట్ట ఎక్కాము మేము. చుట్టూ చూసాను - వేరే ఎవరూ లేరు - గుట్టమీది ఆ ప్రాంతంలో.
మరి అతను కూడా అలాగే నాపట్ల సందేహంతో వుండి జాగ్రత్తగా మసలుకుంటున్నాడేమో తెలియదు. ఒకవేళ నిజంగానే సందీపునే హంతకుడయితే విశాలలాంటి చక్కటి అమ్మాయిని హత్యచేసినందుకు గానూ అతన్ని ఆ గుండాల్లోకి తోసినా తప్పులేదు! నేను తనని అనుమానిస్తున్నానని సందీపుకి తెలుసు.
విశాలను హత్యచేసిన వెంకట్ ను ఇక్కడే బొందపెట్టాలని ఆవేశంగా మాట్లాడాడు సందీప్. అతన్ని అనునయించాను నేను. ఆ తరువాత గుట్ట పై భాగం మీదికి వెళ్ళాము. అక్కడ రాజభవనం, కొలనులు, గుండాలు వున్నాయి. నా స్నేహితురాళ్లతో, స్నేహితులతో అక్కడ గడిపిన క్షణాలు గుర్తుకువచ్చాయి. అక్కడ వున్న గుండంలోంచి ఏనుగులతో నీళ్ళు తోడించేవారు అని ప్రతీతి. ఆ మధ్య కూడా ఇద్దరు అబ్బాయిలు ఆ గుండంలో మునిగి చనిపోయారు. పక్కనే వున్న కొలను చూసాము. అక్కడే నా చిన్నప్పుడు ఫ్రెండ్సుతో పిక్నిక్ చేసుకున్నాను. ఆ కొలనులోనే విశాల చనిపోవడానికి అవకాశం వుందన్నాడు సందీప్. అలా అయివుండకపోవచ్చు అన్నాను నేను. ఆమె చనిపోయినప్పుడు గుండంలో చనిపోయిందని విన్నాను కానీ కొలనులో అని కాదు. కొలను అంత లోతుగా వుండకపోవచ్చు - పైగా ఏటవాలుగా, విశాలంగా వుంది - తేలిగ్గా అందులోనుండి బయటకు రావచ్చు.
తరువాత అక్కడ వున్న గుండం శ్రద్ధగా పరిశీలించాము. అక్కడ ఇంకా కొంతమంది సందర్శకులు కూడా వున్నారు. విశాల చాలావరకు ఇక్కడే పోయివుండవచ్చని సందీప్ తీర్మానించాడు కానీ నేను అంతగా కన్విన్స్ కాలేదు. నా అనుమానం అంతా గుర్రాల శాలల దగ్గర వున్న గుండాల మీదే. ఈ టపాలో వున్న ఫోటోలు ఆ గుండాలవే. విశాల చెల్లెలు వైదేహి మాతో పాటు గుట్టమీదికి వచ్చివుంటే తన అక్కయ్య ఎక్కడ చనిపోయిందో మాకు సరిగ్గా చూపించివుండేది. ఆమెకోసం భోనగిరిలో వెతికాము కానీ దొరకలేదు.
ఎత్తయిన గుట్టమీద వున్నాం కనుక చల్లగాలి రివ్వున వీస్తోంది. వర్షం వచ్చే సూచనలు కనిపించాయి. తరువాత రాజభవనం అంతా తిరిగిచూసి అక్కడ గోడల మీద కూర్చొని భువనగిరి టవునును చూస్తూ విశాల గురించి మాట్లాడుకుంటూ అమె స్మృతులలోకి వెళ్ళిపోయాము.
వచ్చే టపాలో ఫ్లాష్ బ్యాక్.

బుధవారం 6 మే 2009
నా యూట్యూబ్ వీడియో బ్లాగ్/ఛానల్
http://www.youtube.com/sarathn
నా ఆసక్తులలో మార్పు రావడం వల్ల, అడల్ట్ కాంటెంట్ తో ఎక్కువగా వీడియోలు అందివ్వలేకపోతున్న కారణంగా లైంగికత్వానికి సంబధించిన వీడియోలు తీసివేసాను. దీనిని ఒక సాధారణ వీడియో బ్లాగుగా బాగా విస్తరించాలని ఆలోచిస్తున్నాను.
నాకు బాగా నచ్చిన ఇతర బ్లాగర్ల టపాలని వీడియో రూపకంగా ఈ ఛానల్లో అందివ్వాలని చూస్తున్నాను. ఆయా బ్లాగర్లని సంప్రదించిన పిమ్మట వారి అనుమతి వుంటేనే వారికి క్రెడిట్స్ ఇస్తూ నా ఛానల్లో అందించే వుద్దేశ్యం వుంది.
నా వీడియో బ్లాగు గురించి పలురకాల ఆలోచనలు వున్నాయి. నెమ్మదిగా వివరాలు తెలియజేస్తాను. నా వీడియోలలో ఆసక్తి వున్నవారు సూచనలు, సలహాలు అందజేయవచ్చును.
sarathn Channel Statistics:
Video Views: 299,850
Channel Views: 9,649
Subscribers: 114

యదార్ధ సంఘటణ - భువనగిరి గుట్ట మీద (ఆత్మ)హత్య - పార్ట్ 1

(గమనిక - వ్యక్తుల అసలు పేర్లు ఇవ్వలేదు)
నల్లగొండ జిల్లా లోని భోనగిరి/భువనగిరి గుట్టను చాలామంది హైదరాబాదుకి రైల్లో వెళుతూ చాలామంది చూసి వుండవచ్చు. ఒకేరాయితో అంత పెద్ద గుట్ట తయారవడం విశేషం. పర్యాటక శాఖ పట్టించుకోనందున ఆ చక్కటి, విశేషమయిన గుట్టగురించి ప్రచారం లేకపోవడముతో ఎక్కువమందికి ఈ గుట్ట గురంచి తెలియదు. అక్కడవున్న నిర్మాణాలని పట్టించుకున్నవారెవరూ లేకపోవడముతో రోజురోజుకీ అవి శిధిలావస్తకి చేరుకుంటున్నాయి.
ఏకశిల అనే పేరు భువనగిరి గుట్టకు రావాల్సిందని, అనవసరంగా వరంగల్లుకు వచ్చిందని మా నాన్నగారు అంటుండేవారు. భోనగిరిలో మా నాన్నగారు ఉపాధ్యాయులుగా పనిచేసినందున అక్కడే గంజ్ ప్రభుత్వ పాఠశాలలో నేను కూడా ఎనిమిది, తొమ్మిది తరగతులు చదివాను. సరదాపుట్టినప్పుడల్లా భోనగిరి గుట్టను మిత్రులతో సహా ఎక్కుతుండేవాడిని. అక్కడి కోట, రాజ భవనాలు, సొరంగాలు, ఆయుధశాలలు, గుర్రపు శాలలు మొదలయినవి అచ్చెరువొందిస్తూవుండేవి. ఆ గుట్టమీద కొలనులు, గుండాలు కూడా వున్నాయి. మా క్లాస్మేట్లందరమూ - అమ్మాయిలతో సహా కలిసి ఆ గుట్ట మీదికి పిక్నిక్ వెళుతుండేవారము.
అలా చిన్నప్పుడు వెళ్ళడమే తప్ప ఆ గుట్ట ఎక్కడానికి మళ్ళీ రెండు సంవత్సరాల క్రితమే వీలుపడింది. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మా మిత్రులు, నేను ఎన్నిసార్లు ఎక్కాలనుకున్నా అప్పటికి మాత్రమే వీలుపడింది. అలా నల్లగొండనుండి నా మిత్రుడు సందీప్ నేనూ అక్కడికి వెళ్ళాము. అక్కడ వైదేహి అనే ఆమె అడ్రస్సు కోసం వెతికాముగానీ దొరకలేదు. ఆమె ఇల్లు ఖాళీచేసి వెళ్ళిందని ఎక్కడికి మారిందో తెలియదనీ ఆ ఇంటి ఓనర్ చెప్పారు. భువనగిరి గుట్ట ఎక్కినప్పుడు ఆమెకూడా వెంట వుంటే చాలా ప్రయోజనకరంగా వుండేది కదా అని అనుకున్నాము.
మేము ఇద్దరమూ గుట్ట ఎక్కసాగాము. నేను చాలాసార్లు ఆ గుట్టని చూసినా నా ఫ్రెండుకి అదే మొదటిసారి కావడముతో చాలా ఆసక్తిగా గుట్ట గురించిన విశేషాలు నన్ను అడుగుతూ, గుట్టని చాలా ఆసక్తిగా చూస్తూ వచ్చాడు. నాకు తెలిసిన వివరాలన్నీ చెబుతూవచ్చాను. ఈ భువనగిరి గుట్ట అంటే సందీప్ కి ఒక బంధం, ఆర్ద్రత వుంది. అందుకే గుట్టని ఆత్మీయతా భావంతో పరిశీలిస్తూవచ్చాడు. ఇదివరకు నేను గుట్టని చూసినదానికీ, ఇప్పుడు చూసినదానికీ ఒక తేడా వుంది. అందుకే నేనూ అర్ద్రమయిన మనస్సుతో, ఆలోచనలతో గుట్ట ఎక్కనారంభించాను.
సగం ఎక్కాక గుర్రపు శాలలు కనిపించాయి. వాటిగురించి అతనికి వివరించాక అక్కడికి దగ్గర్లో వున్న గుండాల దగ్గరికి తీసుకువెళ్ళాను. చిన్నవీ, పెద్దవీ కలుపుకొని ఏడెనిమిది గుండాలు వున్నాయక్కడ. కొన్ని బాగా లోతుగా, నీళ్ళ మీద పొదలు అలుముకొని భీతి కొలిపేలా వుంటాయి. ఈ గుండాల్లోనే ఏ గుండం లోనో విశాల యొక్క శవం బయటపడింది అని సందీప్ కి చెప్పాను.
Bhongir Fort Link: http://en.wikipedia.org/wiki/Bhongir
(ఇంకా వుంది)
శుక్రవారం 1 మే 2009
ధారావాహిక - ఏం జరుగుతోంది? - పోస్ట్ మార్టం
అసంపూర్తి నవల: ఒక నవలను వివిధ రకాలుగా ముగించవచ్చును. అసంపూర్తిగా ముగించడం అన్నది ఒక టెక్నిక్. ఈ సీరియల్ కు అలాంటి ముగింపును ఎంచుకున్నాను - అంతే కాని పూర్తిగా ముగించలేకకాదు అని గమనించగలరు. ఈ పద్ధతిలో రచయిత పాఠకుడికి వివిధ కోణాలను చూపించి ముగింపుని పాఠకుడి ఊహకే వదిలివేస్తాడు. అలాగే ఈ నవలలోని సంఘటనలు అలా ఎందుకు జరిగాయో మీ ఊహకే వదిలివేస్తున్నాను.
ఆబ్సర్డ్ నవల: ఇక అసలు ఈ నవలలోని ప్లాట్ పూర్తి అసంబద్ధంగా అనిపించిందా? ఫర్వాలేదు. ఇదో ఆబ్సర్డ్ (అసంబద్ధ) టెక్నిక్ తో వ్రాసిన రచనగా మీరు భావించవచ్చు. అలాంటి తరహా రచనలలో కథ కంటే కథనానికే ప్రాధాన్యం వుంటుంది. ఈ సీరియల్ లోని కథనమూ మీకు నచ్చలేదూ - నా మరో రచనకోసం చూడండి. ఇందులో జరిగిన లోపాలని సవరించుకుంటూ మరింత మెరుగ్గా వ్రాయడానికి ప్రయత్నిస్తాను.
ఎత్తుగడలలో లోపం:
పాసివ్ హీరో: బలమయిన పరిస్థితులను, ప్రభుత్వాన్ని, సైన్యాన్ని ఎదుర్కోవడానికి కథానాయకుడు ఏమాత్రమూ కృషిచేయడు/ చేయలేడు. ఫలితంగా సంఘర్షణ లేక హీరో పాసివ్ గా మిగిలిపోవడం ఈ నవలలోని ప్రధాన లోపం.
ప్రధమ పురుష: బ్లాగు రచనలు అన్నీ సాధారణంగా ప్రధమ పురుషలోనే ( ఫస్ట్ పర్సన్) వుంటాయి. ఈ నవలనూ అలాగే వ్రాయడంతో వైవిధ్యం లోపించింది.
మెటా బ్లాగింగ్: ప్రధమ పురుషలో మళ్ళీ మెటా బ్లాగింగ్ చొప్పించడముతో టపాలకీ, సీరియల్ కీ బొత్తిగా తేడా లేకుండా అయ్యి పాఠకులు గందరగోళంలో పడ్డారు
జెనర్: మొదటి కొన్ని భాగాలు థ్రిల్లర్ గా నడిపించి తరువాత భాగాలు సాంఘికంగా నడవడముతో మొదట కలిగించిన అంచనాలని అందుకోలేకపోయాను
మొత్తానికి సీరియల్స్ కి కొంత అయినా ఆదరణ వుందని అర్ధమయ్యింది. సరాసరిన ఓ యాభయి మంది అయినా ఈ రచనను అనుసరిస్తున్నట్లుగా అర్ధమయ్యింది. ఈ సీరియల్ కి వచ్చిన స్పందనల వల్ల పాఠకుల ఆదరణ, అభిరుచుల మీద కొంత ఆవగాహన వచ్చింది.
ఈ సీరియల్ ను ప్రోత్సహించిన వారికీ, సద్విమర్శలు చేసిన వారికి ధన్యవాదములు. శ్రద్ధతో ఈ సీరియల్ ని అనుసరించిన చైతన్య గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను.
నానో: తదుపరి సీరియల్ ఒక క్రొత్త సైటులో నానో టెక్నాలజీ మీద వ్రాయబోతున్నాను. వివరాలు త్వరలో.

ధారావాహిక - ఏం జరుగుతోంది? - పార్ట్ 12 - ఉపసంహారం
50 ఏళ్ల తరువాత:
రాగ తొమ్మిది గంటల వరకల్లా తయారయ్యి పి టీ ఎస్ (పర్సనల్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టం)ని సిద్ధంగా వుంచాల్సిందిగా మాటల ద్వారా సెంట్రల్ మేనేజమెంట్ సిస్టంకి ఆజ్ఞ ఇచ్చింది. బీప్ మనే శబ్దంతో PTS వచ్చి ఆగింది. వెళ్ళాల్సిన ప్రదేశం ఏమిటో మాటల ద్వారా PTS కి సూచించింది. PTS నెమ్మదిగా బయలుదేరి క్రమంగా వేగం పుంజుకుంది. ఆ ప్రదేశానికి చేరే సరికి అర గంట పడుతుంది. వెనక్కిపోతున్న భవనాలను, ప్రదేశాలను, ఇతర PTS లను చూస్తూ రాగ నెమ్మదిగా కళ్ళు మూసుకొని గత జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయింది.
ఈ రోజుకోసం తను చాలా ఏళ్ళనుండి ఎదురుచూస్తున్నది. అమ్మ చనిపోతున్నప్పుడు ఈ విషయం తప్పక కనుక్కుంటాను అని తను అమ్మకి మాట ఇచ్చింది. యాభై ఏళ్ళ క్రితం నాన్నగారు ఒక విచిత్రమయిన పరిస్థితుల్లో చనిపోయారు. అప్పటి విషయాలు కొద్దిగా గుర్తుకువున్నాయి. అప్పుడు ఆరేళ్ళది తను. పెద్దయింతరువాత అమ్మ, అన్నయ్య, ఇతరులు అప్పుడు జరిగిన సంఘటనలను ఇంకా విశదీకరించారు.
ఆ రోజు ఏదో పనిమీద పడక గదిలోకి వెళ్ళిన అమ్మ కెవ్వున కేకవేసింది. ఏమిటా అని అన్నయ్య, నేనూ ఉరికివెళ్ళి చూసాము. నాన్నగారు విరుచుకుపోయి పడివున్నాడు. నాన్నగారు చనిపోయారని తెలిసింది. ఆ రోజు నాన్ననే కాకుండా ఆ కమ్యూనిటీలో ఇంకా చాలా మంది మధ్యవయస్కులూ, వృద్ధులూ దాదాపు 70 మంది చనిపోయారు. ముఖ్యంగా సరస్సు చుట్టూ ఇళ్ళలో వున్నవారు ఎక్కువగా చనిపోయారు.
ఆ సరస్సు వున్న ప్రదేశాన్ని సైన్యం ఆధీనంలోకి తీసుకొని అది కనిపించకుండా తెరలుకట్టింది. ఆ తెరల మాటున గుట్టుగా కొన్ని పనులు జరిగాయి. ఒక పదిరోజులు అలా సైన్యం స్వాధీనంలో వుంచుకొని ఆ సరస్సును పూడ్చివేయించిది. ప్రెసిడెన్షియల్ ఎక్సిక్యూటివ్ ఆర్డర్ మీద అక్కడ ఏం జరిగింది, ఎందుకు కొంతమంది చనిపోయారు అన్న విషయాలు ప్రభుత్వం బయటకి రానీయలేదు. దేశ భద్రతకి సంబధించిన విషయంగా అధికార రహస్యాల చట్టం క్రింద కోర్టు కేసులూ వీగిపోయాయి. విచిత్రంగా యు ఎస్ పత్రికలు, టివి ఛానళ్ళు కూడా ఈ విషయం మీద మౌనం వహించాయి. బయటి దేశాలలో మాత్రం ఈ విషయమై కొంత రాద్ధాంతం జరిగింది కానీ ఇక్కడి ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. ఒక మూడు సంవత్సరాలలో అందరూ ఈ విషయం మరిచేపోయారు. ఈ విషయం మాత్రం మిస్టరీ గానే మిగిలిపోయింది.
నాన్నగారు నన్ను ఎంత ఆప్యాయంగా చూసుకునేవారో లీలగా గుర్తుకువుంది. అదే విషయం అమ్మ తరుచుగా నాకు చెబుతూవుండేది. నాన్నగారు తనకు ఇష్టమయిన పుస్తకాలలో ఒకటయిన 'వడ్డెర చండీదాస్' విరచిత 'అనుక్షణికం' నవలలోని హీరోయిన్ పేరు '(స్వప్న) రాగలీన' నాకు పెట్టేరంట.
ఎలాగయినా అప్పుడేం జరిగిందో తెలుసుకోవాలని అమ్మతో బాటుగా మరికొంతమంది ప్రయత్నించారు కానీ అధికార రహస్యాల చట్టం వల్ల వీలు కాలేదు. అందరికీ అప్పటికి లభించిన సమాధానం ఒక్కటే. ఆ చట్టం ప్రకారం ఈ విషయాలు యాభై ఏళ్ళు దాటాక మాత్రమే తెలుసుకోవచ్చు. ఈ విషయం తెలుసుకునేదాకా బ్రతికి వుండాలని అమ్మ అనుకుంది కానీ అనారోగ్యంతో జరిగిపోయింది. ఈ రహస్యం తెలుసుకునే బాధ్యత నాపై పెట్టింది. నేను స్వతహాగా జర్నలిస్టును అవడముతో నాకూ నాన్నగారి గురించిన ఈ విషయం తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా వుంది. రణిల్ అన్నయ్యకు ఎలాగూ ఇటువంటి విషయాల మీద శ్రద్ద లేదు కాబట్టి అమ్మ వాడికి ఈ పని చెప్పలేదు.
నాకు ఇప్పుడు 56 ఏళ్ళు నిండాయి. గత యాభై ఏళ్ళలో ఎన్నో ఘటణలు జరిగాయి. అప్పటి అధ్యక్షులు ఒబామా రెండవ టెర్ములో తీవ్రవాదులు పాకిస్తానును పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ విషయమై పాకిస్తానును ఏం చేయాలా అని యు ఎస్ ప్రభుత్వం తర్జన భర్జన పడుతుండేలోగానే పాకిస్తాన్ నుండి వచ్చిన తీవ్రవాదులు అణ్వాయుధాలతో న్యూయార్కు మీద దాడి చేసి దాదాపు 23,000 మందిని చంపారు. దానికి ప్రతీకారంగా అమెరికా చేసిన దాడుల్లో పాకిస్తాన్ చాలా వరకు ఛిద్రం అయ్యింది. అలా అలా ఎన్నో విషయాలు జరిగాయి. ఇప్పుడు ఒబామా చిన్న కూతురు సాషా అధ్యక్షురాలు అయ్యింది.
నాన్నగారు చనిపోయిన రోజు సంఘటనలకు సంబంధించి వివరాలు కావాలని ప్రభుత్వానికి ఆర్జీ పెడితే ఈ రోజు అప్పాయింట్మెంట్ ఇచ్చారు. అందుకే ఈ ప్రయాణం. బీప్ అనే శబ్దంతో PTS ఆగింది. ఆలోచనల నుండి బయటకి వచ్చింది రాగ.
అది గవర్నమెంట్ అఫీషియల్ రికార్డ్స్ వారి ఆఫీసు. ఇరిస్ సెక్యూరిటీ సిస్టం వద్ద కనుగుడ్డు చూపించింది. రాగ అని ధ్రువపడ్డ తరువాత ద్వారాలు తెరచుకున్నాయి. అప్పాయింట్మెంటుకి ఇంకా సమయం వుండడంతో రెసెప్షనులో కూర్చుంది. ఆమెతో పాటు మరో ముగ్గురు అక్కడ వున్నారు. వారు వేరే పనుల మీద వచ్చివుండవచ్చు. సరిగ్గా పది గంటలకు స్పీకరులో ఆమె పేరు వినిపించింది. రాగ వెళ్ళాల్సిన గది అంకె చెప్పారు. అక్కడికి వెళ్ళి కూర్చుంది.
ఆమె ముందు ఒక పలుచని అద్దం వుంది. అందులో ఒక వైపు మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. రాగ అటువైపు కూర్చున్న వారికి కనిపిస్తుంది కానీ అటువైపు కూర్చున్న వారు అస్పష్టంగా రాగకు కనిపిస్తారు. ప్రభుత్వ అధికారుల గుర్తింపు బయటపడకుండా రూపొందించిన జాగ్రత్తల్లో ఇది ఒకటి. కొన్ని ఏళ్ళ క్రితం తీవ్రవాదులు ప్రభుత్వ అధికారులని లక్ష్యం చేసుకొని చంపివేస్తుండటంతో ఈ జాగ్రత్త పాటిస్తున్నారు.
అటువైపు ఒక ఆఫీసర్ వచ్చి కూర్చున్నాడు. "చెప్పండి మీకు ఏం కావాలి?" అని అడిగాడు.
ఆ సంఘటనను వివరించి అప్పటి అధ్యక్షుడు ఒబామాకీ, తన భద్రతా సలహా సంఘానికీ ఈ విషయమై జరిగిన చర్చల వివరాలు, మినిట్స్ కావాలంది రాగ.
ఆ ఆఫీసర్ తన సిస్టంలో సమాచారం వెరిఫై చేసుకొని "మీకు ఎందుకు ఈ సమాచారం" అని అడిగాడు
నాన్నగారు ఈ సంఘటనలో మరణించారు అని వివరాలు చెప్పింది.
"మీ నాన్నగారి పేరు ?"
రాగ చెప్పింది.
అటువైపు కొన్ని క్షణాలు నిశ్శబ్దం. "ఈ సమాచారాన్ని ఏం చేస్తారు మీరు?"
"నేను జర్నలిస్టుని. అమెరికన్ టైమ్స్ పత్రికలో దీనిగురించి ఒక వ్యాసం వ్రాసి మా నాన్నగారికి ఆ విధంగా శ్రద్ధాంజలి ఘటిస్తాను. ప్రభుత్వం పరంగా తప్పులు జరిగివుంటే విమర్శిస్తాను"
ఒక నిముషం నిశ్శబ్దం. "ఒక్క క్షణం ఆగండి. మీకు ఆ సమాచారం ఇస్తాను" అని లేచి వెళ్ళి ముద్రించిన కాగితం ఒకటి అద్దం క్రింది నుండి ఈమెకు అందించాడు.
ఆత్రుతతో గబగబా చదివింది అది. తను ఆశించినన్ని వివరాలు లేవు అందులో. కొన్ని ముఖ్యమయిన విషయాలు నల్లగా చేసివున్నాయి. దేశ భద్రతకు సంబధించిన విషయమై చాలా దీర్ఘంగా అధ్యక్షుడు తన భద్రతా సలహా బృందంతో చర్చించినట్లు తెలుస్తోంది కానీ అసలు విషయాన్ని మరుగు పరిచారు అందులో.
ఆ మినిట్స్ లోని కొన్ని భాగాలు:
సలహాదారు - టాం మార్నిక్: ఈ విషయాన్ని మీడియ ఎలాగూ ప్రసారం చేస్తుంది కదా
అధ్యక్షుడు: ఈ విషయాన్ని పట్టించుకోవద్దని మీడీయాకు ఎక్సిక్యూటివ్ ఆర్డర్ జారీ చేద్దాం.
సలహాదారు: ప్రైవేటు సైట్లు, బ్లాగరు, యూట్యూబ్ మొదలయిన వాటిని ఏం చేద్దామంటారు?
సెక్రటరీ ఆఫ్ స్టేట్ - హిల్లరీ క్లింటన్: వాటికి ఆర్దర్లు పాస్ చేయలేము కాబట్టి సింపుల్గా వాటిని పట్టించుకోకుండా వుంటే సరి
అధ్యక్షులు: మంచి ఆలోచన
సలహాదారు - కేథరిన్ క్లార్క్: ఇతర దేశాలు ఏదో జరుగుతోందని గొడవ చేస్తాయేమో
ఉపాధ్యక్షులు - జో బిడెన్: ఖండిస్తాం !
ఇదంతా చదివి పెదవి విరిచి "ఇందులో అసలు విషయం లేదు. అసలు నిజాలని బ్లాక్ ఎందుకు చేసారు?" అని అడిగింది అ ఆఫీసరుని
"అధికార రహస్యాల చట్టమే కాకుండా స్పెషల్ ప్రెసిడెన్షియల్ ఎక్షిక్యూటివ్ ఆర్డర్ SPEO 20091034C ప్రకారం అసలు విషయాన్ని ఇప్పుడే బయటపెట్టలేము"
"మరి ఈ విషయం ఎప్పుడు తెలుసుకోవచ్చు నేను?"
"మరో 50 ఏళ్ళ తరువాత"
"అప్పటికి నేను వుండను" ఆగ్రహాన్ని అదుముకుంటూ చిరాకుగా అంది రాగ
"మీ పిల్లలని తెలుసుకోమండి"
"నాకు పిల్లలు లేరు!"
భుజాలు ఎగిరేసాడు ఆ ఆఫీసర్.
(గమనిక: అసంపూర్తి ముగింపు అనే టెక్నిక్ తో ఈ నవల ముగించబడింది. మరిన్ని వివరాలకు ఈ నవలపై వచ్చే పోస్టుమార్టం చదవండి)

దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)