O Shit! - మరోసారి


గమనిక: ఈ టపా తెలంగాణా ఆంశానిది కాదు.

కెనడా ఫోర్ట్ ఎరీ (నయాగరా ఫాల్స్) లో వుంటూ యు ఎస్ బఫెలో సిటీలో పని చేస్తున్న రోజులవి. రెండు దేశాల మధ్య ప్రయాణమే అయినా మా ఇంటినుండి ఆఫీసుకి కారు ద్వారా 5 నిమిషాల దూరం. అలా నాలుగేళ్ళు పని చేస్తూ ప్రతి పని రోజూ బోర్డర్ దాటుతుండేవాడిని. బోర్డర్ మామలతో, ఆంటీలతో అనగా అఫీసర్స్ తో కొన్ని గుర్తుంచుకోదగ్గ స్మృతులు వున్నాయి. వాటినన్నింటినీ మరోసారి పంచుకుంటాను కానీ ఒక సంఘటన మాత్రం ఇప్పుడు చెబుతా. 

ఎప్పుడన్నా అక్కడెక్కడో ఏ లాడేనో తుమ్మితే ఇక్కడ అమ్రికాలో జలుబుచేస్తుంది కదా. అప్పుడు బోర్డర్ ఆఫీసర్సుకి పూనకం వస్తుంది. కుక్కలని పట్టుకొని కార్లలో చిచ్చుబుడ్లలాంటి మందుగుండు సామాగ్రి ఏమయినా వుందా అని వాసన చూస్తుంటారు. ఓ సారి కుక్క ఆఫీసర్ నా కార్లోకి ఎక్కింది. ఎంతకూ ఆ కుక్క దిగి వెళ్ళిపోదే! ఎదో వాసన తెగ చూస్తోంది. ఆ కుక్క గారిని వదిలిన ఆఫీసర్లేమో ఎంచక్కా ముచ్చట్లు పెట్టుకుంటూ దీని విషయమే మరిచారు. నా మినీ వ్యానులో అది ఏం వాసన చూస్తూ తన్మయత్వం చెందుతుందో నాకు కనపడక నా గుండెల్లో రైల్లు పరిగెత్తాయి.  కొంపదీసి నేను ఇలా రోజూ బోర్డర్ దాటుతానని తెలిసిన ఏ తీవ్రవాదన్నా నా కార్లో ఏమన్నా పెట్టలేదు కదా?

కుక్క గారు ఎంతసేపటికీ బయటకి రాకుండా, మొరగకుండా అక్కడే వాసన చూస్తూ వుండటంతో బయట నిలబడి వున్న ఆఫీసర్సుకి చిరాకేసి బయటకి రమ్మని అదిలిస్తే గానీ ఆ కుక్క గారు కారు దిగి క్రిందికి వెళ్ళలేదు. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఆఫీసుకి వచ్చి కార్ పార్క్ చేసి ఆ కుక్కగారు అంతగా ఏం వాసన చూసి వుంటుందా అని సీట్ల క్రింద పరిశీలించాను. చిన్న పాప వాడేసిన డయపర్ వుందక్కడ! 

9 comments:

  1. మీరు, మీ కుక్క గారు.. చివరివరకు ఏం జరుగుతుందో అనుకునేల సస్పెన్సె పెట్టారు.. ;)

    ReplyDelete
  2. అప్పటికింకా పెళ్ళికాని బ్రహ్మ చారి
    కారు లోకి అదెలా వచ్చిందా ? అని
    కుక్కకి అనుమానం వచ్చి వుంటుంది
    అందుకే దిగలేదేమో ?

    ReplyDelete
  3. చాల బాగా వుంది....ఇలాంటి టపా లు వ్రాస్తూ వుండండి అంతే కానీ తెలంగాణా మీద వ్రాయకండి ఎందుకంటే మీకు తెలంగాణా మీద అంత knowledge లేదని అనిపిస్తుంది ....

    ReplyDelete
  4. Praveen CommunicationsDecember 19, 2009 at 12:00 AM

    కుక్క వాసన చూడడం వెనుక ఫెనిమిస్తూ గతి తార్కిక వాదన ఉంది ఉండవచ్చు. నేను సేసురితి ఆఫీసర్స్ ఉన్నప్పుడు షాపు తీయను టైపు చేయను. ఇంట్లో ఉంటాను. సమైక్యవాదులు దీనిని ఒక చెంప పెట్టు లాస్వీకరించాలి

    ReplyDelete
  5. @ భరద్వాజ్, నెలబాలుడు, సతోష్, నాగప్రసాద్
    :)

    @ అజ్ఞాత
    పెళ్ళి కాని బ్రహ్మచారి? అప్పటికి నాకొక్క పెళ్ళి మాత్రం అయ్యింది బాబు గారూ.
    @ కొత్త పాళీ
    హి హి. బహుశా పై కామెంటు గురించి అంతగా నవ్వారనుకుంటా!

    @ విజయమోహన్
    టైటిల్లోనే క్లూ ఇచ్చాకదండీ!

    @ ప్రవీణ్ (ఫేక్)
    అవును. కుక్క దాని పుట్టు పూర్వోత్తరాలు చదివి గతి తార్కిక వాదం కుక్కల్లో ఎలా వుంటుందో అవగాహన తెచ్చుకోవాలి. అప్పుడు గానీ కుక్కల్లోని హెగెలియన్ తత్వశాస్త్రం కూడా నాకు బాగా వంటబట్టుతుంది.

    ReplyDelete