ఇంత తెలంగాణా, ఆంధ్ర, సమైక్యాంధ్ర ఉద్యమాలు జరుగుతున్నా ఎక్కడో ఏదో మసలా తక్కువయినట్లుగా, కాస్త చప్పగా అనిపిస్తోంది. ఏంటని ఆలోచిస్తే జై హైద్రాబాద్ అనకుండా మజ్లిస్ కానీయండీ, (తీవ్ర) ముస్లిములు కానీయండీ గొడవ పెట్టకుండా గమ్మున వుండటం! ఇప్పటివరకు ఈ తెలంగాణా ఉద్యమాన్ని 3D లో చూస్తున్నాం - ఇక వాళ్ళు కూడా ఎంటరయితే ఎంచక్కా ఇక ఈ దృశ్యాన్ని 4D లో చూడొచ్చు కానీ వాళ్ళీ రారే? ఎందుకబ్బా?
వాళ్ళు ఇంత మౌనంగా వుండటం ఆశ్చర్యం అనిపిస్తోంది. సాధారణంగా దుందుడుకుగా అనిపించే మజ్లిస్ ఈ సారి మన్ను తిన్న పాములా అలా అలా పడి వుండటములో మతలబేంటో ఎంత బుర్ర గీక్కున్నా అర్ధం కావడం లేదు. టివి వాళ్లయినా ఎవరయినా వాళ్ళని ఇంటర్వ్యూ చేసి కూపీలాగుతారేమో అంటే నేను చూసే ఛానళ్ళలో లాంటిదేమీ కనపడలా.
బ్లాగర్ అప్పరావు శాస్త్రి మాత్రం దీని గురించి ఒక అభిప్రాయం ఇచ్చారు. తెలంగాణా ఏర్పడక పోతుందా అప్పుడు మేము చూసుకోకపోతామా అని ఎలాగయితే మావోయిస్టులు, ఇతర తీవ్రవాద వర్గాలవారుఎదురుచూస్తున్నారో అలాగే తెలంగాణా ఏర్పాటయాక అప్పుడు పండగ చేసుకుందాం అని వాళ్ళు ఎదురుచూస్తున్నారో ఏమో. లేకపోతే ఈ తెలంగాణా వచ్చేదా, సచ్చేదా - ఆ అంతకూ తెలంగాణా వస్తుందనుకున్నప్పుడు కే సీ ఆర్ భుజం మీద తుపాకీ పెట్టి హైదరాబాద్ పిట్ట కాల్చవచ్చునులే - ఇప్పటినుండే ఈ శోష ఎందుకులే అనుకుంటున్నారా ఏమిటీ?
ఇప్పటివరకు మాత్రం గ్రేటర్ హైద్రాబాద్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ తరఫునా, మోహన్ బాబు ముస్లిముల తరఫునా హైదరాబాద్ గురించి వకాల్తా పుచ్చుకొని మాట్లాడటమే కానీ అసలు నవాబులు ఎక్కడయా బాబూ? నోరు మెదపరేం? వాళ్ళు కూడా 'సందట్లో సడేమియా'లాగా మా హైద్రాబాద్ మాది అని బయలుదేరితే వుంటుందీ మజా. టివి ఛానళ్ళకి లాగా అబ్బ నాకూ, నా బ్లాగుకీ పండగే అనుకోండి.
ఆహా, అప్పుడు ఈ ఉద్యామాలని IMAX 3D లోనో 4D లోనో చూస్తూ పండగ చేసుకోవచ్చు. ఇప్పటికి దాదాపు నెలరోజుల నుండి వుంటున్న వినోదం ఇంకా అలా అలా నిరవధిక బందు ల్లాగా నిరవధికంగా సాగిపోతూనే వుండాలని నా ఆకాంక్ష. దీనినే అంటారు ఏడవలేక నవ్వడం అని. ఏం చేయమంటారు. రేప్ తప్పనిసరి అయినప్పుడు ఎంజాయ్ చెయ్యమని మా భవానీ శంకరం ఎప్పుడూ చెబుతూనే వుంటాడు. తెలంగాణా వాదుల ఎమోషనల్ బలాత్కారం - తప్పనప్పుడు, తప్పనిసరి అయినప్పుడు ఏదో విధంగా, ఇదో విధంగా నయినా పండగ చేసుకోవాల్సిందే. అదే నేనిక్కడ చేస్తూంట.
కెలకండయ్యా బాబులూ, ఎవరయినా ముస్లిముల్నీ, మజ్లిస్సునీ కెలకండి! రాష్ట్రంలో ముసలం పుట్టే ఏర్పాట్లు చేయండి!
జై హైద్రాబాద్!!
జై పాతబస్తీ!!!

9 comments:
Honestly, What I didn't understand is how come VH had given feast while there are several students on fasting.
http://thatstelugu.oneindia.in
మీరు కోరుతున్నది గతం లో వై ఎస్ ఆర్ చేసినట్టు మతకల్లోలలు రావాలంటావు ఇది న్యాయమేనా ఇంత రాక్షసత్వం మీ మనసుల్లో దాగుండి కనుకనే తెలంగాణ వారు మీతో మేము ఇమాడలేము అంటున్నారు.
@ శ్రీనివాస్
నిజమే. అసంబద్దంగానే వుంది.
@ వీరగోని
ముస్లిములంటే ఇక మత కల్లోలాలేనా? నేను వాంఛిస్తున్నది మరింత రాజకీయ సంక్షోభం. తెలంగాణా కనుక ఇచ్చేట్లయితే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి కావాల్సిందే!
తెలంగాణా కనుక ఇచ్చేట్లయితే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి కావాల్సిందే!
ee vaakyaniki neenu ekibhavistunnanu. telangana iste maa uru maaku kaavali.. maadi hyderabadu hai.. maaki hyderabaadu maaki ivvandi. migita pradesalu kottuku chaavandi. i dont give a s**t
@వీరగోని,
మీ వీరనాయకుడు VCR మరియు ఆయన ఎడమచెయ్యి, కుడిచెయ్యి ఐన మరీచరావు స్రుష్టించాలని చూసే అల్లర్లు మతకల్లోలాలకంటే తక్కువేమి కాదులే.
Sarath gaaroo... hyd lo masala takkuva emee ledu. TV llo meeru choosevaatikante ekkuve ikkada jaruguthunnaayi. Samanya janala meeda jaruguthunna daadini inkaa evaroo choopinchatam ledu kaanee telanganaa districts registration kaakunda coastal & rayala seemaa districts lo registration ayina vehicles meeda velle vaalla meeda daadula meeda inkaa media focus cheyyaledu. rojoo roddu meeda alaanti badhithulani choosthunnaanu.
హ్మం... టీవిలో చూసినా ఇదే... బ్లాగుల్లో చూసినా ఇదే...!
@ శశాంక్
హా. మాకీ హైద్రాబాద్ మాకీ కవలీ.
@ డల్లాస్
కదా!
@ స్నేహితుడు
నిజమా!! ఈ లెక్కన ముందు ముందు తెలంగాణా అని పచ్చబొట్టు పొడిపించుకోకపోతే తన్నేటట్టు వున్నారు నాయాళ్ళు.
@ చైతన్య
ఏం చేద్దాం చెప్పండి. యథా ప్రజా తధా బ్లాగులు.
పద్మకళ గారు - మీరేమ్మంది ఇక్కడ మాకు అనవసరం. మీరు మాస్ ని అన్నారు. అందుకే మీమీద ఓ రెండు "కేసులు" వేస్తున్నా. అలాగే మా మాస్ హృదయాలని గాయపరిచిన మీ క్లాస్ జనం మా మాస్ ప్రదేశ్ నుండి వెళ్ళండి. ఎలాగో పులి ఆమరణ నిరాహారదీక్ష చేసి చాలా రోజులైంది.. మళ్ళ షురు చేయిస్తాం.
అనట్టు చెప్పడం మరిచా.. ఈ మధ్యే మా జాతీయ గీతాన్ని "ఆ అంటే అమలాపురం" నుండి "రింగ రింగ" కి మార్చాము. :)
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి