అవార్డ్ వాలే భాగో భాగో


(Edited)


ఈ మధ్య తమకు తాము క్లాసు అనుకొనే జనాలకు మాస్ అంటే చాలా లోకువ అయిపోయింది. బ్లాగ్లోకంలో ఎక్కడ చూసినా మా లాంటి మాసోళ్ళ మీద చులకనగా మాట్లాడేస్తున్నారు.  వాళ్లకు నచ్చినట్లుగా రిక్షా పుల్లర్లూ, ఆటో ద్రైవర్లు  మరియు నా బాపతు లాంటి మాస్ జనాలందరూ కూడా అవార్డ్ సినిమాలే చూడాలంట. కాస్తంత వినోదం కోసం ఐటెం సాంగులు చూస్తే అది సెక్స్ కి మొఖం వాచి చూసినట్లట. ఇదివరకటి రోజులే బావుండేవేమో. ఎంచక్కా ఊర్లల్లో భోగం మేళాల డ్యాన్సులూ, రికార్డింగ్ డ్యాన్సులూ, మధ్యలో కేతిగాడి కవ్వింపులూ ఏ మేధావులూ కనుచూపుమేరలో లేకుండా హాయిగా, మనస్ఫూర్తిగా పెద్దలూ, పిన్నలూ ఆనందించేవారు.  

ఇప్పుడవన్నీ పోయినాయి పోనీ కనీసం సినిమాల్లో కూడా అలాంటి ఐటెం సాంగులు చూడొద్దంటున్నారు (Edited). ఇప్పటికీ తెలుగు ఛానళ్ళలో ఒద్దున అంతా భక్తి కార్యక్రమాలతొ చావగొడుతున్నారు. రోజంతా అవే వుండాలనీ లేదా రోజంతా అవార్డ్ సినిమాలూ, అవార్డ్ గీతాలు మాత్రమే వుండాలని (edited) అభిప్రాయమేమో. 'రింగా రింగా' . 'ఆకలెస్తే అన్నం పెడతా' లాంటి మాస్ పాటలని, సినిమాలని నిషేధించి కేవలం క్లాస్ సినిమాలనే ప్రజలు చూసేట్టుగా చేయాలనీ దాదాపుగా తీర్మానించేస్తారులాగుంది. మన అదృష్టం బావుండి వీళ్ళ చేతిలో సినిమా రంగం లేదు గానీ వుంటే ఓ ఫత్వా అర్జంటుగా పాస్ చేద్దురు వీళ్ళంతా. 

మాస్ కూ మనస్సు వుంటుంది, దానికి వినోదం కావాలి అని కాలం గారు ఎన్నడో చెప్పారు. ఈ కాలం ఎవ్వర్ అని మధ్యలో కుశంకలు తీయకండి. నేను ఇటు క్లాసు, అటు మాసు. నేను సమైక్యవాదిని. నా మనో భావాలు అర్జంటుగా గాయపడ్డాయి. నాలో ఆత్మన్యూనత ఎక్కువయ్యింది. నాకు అర్జంటుగా ఓదార్పు, సానుభూతి కావాలి. ప్లీజ్.    

ఈ బ్లాగ్లోకంలో అందరూ తెగ చదివినవారే ఎక్కువకావడంతో మేధావులతో పాటు మేతావులు కూడా చాలా మందే వుంటుండటంతో మాస్ కి రిప్రజెంటేషన్ లేకుండా పోయింది. అందుకే అఖిలాంధ్ర మాస్ జనాల పక్షాన నేను ఒక సంస్థను స్థాపించి అధ్యక్షుల వారిగా ప్రకటించేసుకుంటున్నాను. దానిపేరు మాస్ ప్రజా హక్కుల సమితి. మాస్ అన్నా ప్రజలే కదా మళ్ళీ ఆ పేరులో ప్రజలెందుకు అని చొప్పదంటు ప్రశ్నలేయకండి. ఏ పేరులోనయినా ప్రజా అనేది వుంటేనే ప్రజలకి కిక్కు, కక్కు వస్తుంది. అనగా భావోద్వేగాలు బాగా పుడతాయన్నమాట. 

మాలాంటి మాస్ జనాల మీద అవాకులూ, చవాకులూ వ్రాస్తే బ్లాగుల్లో టపాలు కత్తిరిస్తాం (నాలుకలు కత్తిరిస్తాం అన్న టైపులో చదువుకోవాలని మనవి). ఏంటో ఇంకా నాకు కే సీ ఆర్ స్టైల్ బూతులు అలవాటు పడలేదు. 'తెలంగాణా బూతులు ఫర్ ఇడియట్స్' అన్న పుస్తకం చదివి ప్రాక్టీసు చేసి త్వరలో మీమీదకి వదులుతా. 

మా MPHS (మాస్ ప్రజా హక్కుల సమితి) తరఫున కొన్ని ఫత్వాలని జారీ చేస్తున్నాను:
- అవార్డ్ సినిమాలను నిషేధించాలి ( అంటే నాకు వ్యక్తిగతంగా అవార్డ్ సినిమాలు, క్లాస్ సినిమాలు అంటే ఇష్టం లేదని కాదు గానీ చంద్రబాబు లాగా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాను. అలా వుండకపోతే నేనూ అవార్డువాదినని మాసువాదులు నా తోకలు కత్తిరిచ్చేస్తారు - అధ్యక్షులవారిని అని కూడా చూడకుండా. ష్! ) 
- ప్రొద్దుటే భక్తి కార్యక్రమాలకు బదులుగా మాస్ సినిమాలు ప్రసారం చేయాలి. లేకపోతే కేబుల్ వైర్లు కట్.
- మాస్ కు అంతటికీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలి. మరీ క్లాస్ వాళ్ళని పాకీస్థాన్ పంపించివేయాలి.
- గట్రా, గట్రా, గట్రా.... 

6 comments:

  1. పులి అన్న బ్లాగేస్తే మాస్
    పులి అన్న కామెంటేస్తే మాస్
    మ మ మాస్
    గివన్నీ గాదన్నా, మనకొక ప్రత్యేక రాష్ట్రం గావల్సిందే. అయ్యలారా, అమ్మలారా మీ క్లాసోళ్ళందరిని వినమ్రంగా వేడుకుంటున్నాం.. మా మాస్ గాళ్ళకు మా రాష్ట్రం ఇచ్చెయ్యండి. మా సినిమాలేవో మమ్మల్ని చూడనివ్వండి. లేకుంటె మీ క్లాసోళ్ళ రీళ్ళు, నాలుకల్లాగా కోసేస్తాం.

    ReplyDelete
  2. @ డల్లాస్
    ఎయ్యి మల్ల :))

    ఈ సో కాల్డ్ క్లాస్ జనాలకు మాస్ సినిమాలంటే అంత మంట ఎందుకో. మళ్ళీ అదే బూతు ఏ మోడర్న్ పెయింటింగులోనో, అవార్డ్ సినిమాలోనో చూపిస్తే లొట్టలు వేసుకుంటూ చూస్తూ చొంగ కారుస్తారు. ప్రతీదానికీ ఓ క్లాస్ కలరింగ్ వుండాలి వీళ్లకి - లేకపోతే అది బూతు అని ఛీత్కరిస్తారు. అవార్డ్ సినిమాలలో అదే బూతు కనిపిస్తే అది ఆర్ట్ అంటారు.

    @ భా రా రే
    :)

    ReplyDelete
  3. భాయ్!
    మన ఈ స్టేట్ ల నాకు భి ప్లేస్ ఉంచురి! వస్తా

    ReplyDelete
  4. ఆమె చెప్పిన దాంట్లో క్లాస్-మాస్ గురించి ఏమీ చెప్పలేదే, మీరెందుకు మాస్ అని అంటున్నారు? ఆమె చెత్త పాటలు,బూతు పాటల గురించి మాత్రం అన్నారు. అవి క్లాసా, మాసా అనేది చెప్పలేదు. మీ ఉద్దేశ్యం లో మీకు నచ్చినవ్వన్నీ మాసు, నచ్చనివి క్లాసా?? :) :) అంటే మిమ్మల్ని మీరు "బ్లాగ్లొక అపర మాస్" గా డిక్లేర్ చేసుకున్నారా??? Lol పోటి పెట్టకుండా డిక్లరేషన్లు చేస్తే అసలు ఒప్పుకోం.. అసలు మీ ఉద్దేశ్యం ఏమిటి? దానికి సిద్దాంత కర్త ఎవరు? రాద్దాంత కర్త ఎవరు? ఇవన్ని నాకు తెలియాలి తెలియాలి తెలియాలి తెలియాలి


    అన్నట్టు, ప్రమాదవనం లో మెటా కెలికింగ్ చేయబొయేది మిమ్మల్నేనటగా?? అందుగురించే రౌడిగారు ఫుల్లు హోం వర్క్ చేస్తున్నారట?

    మీరొకసారి ప్ర.పీ.స.స.కు రాకూడదు, ఈ మధ్య కామెంట్లు తగ్గుతున్నాయి.. మీలాంటి పెద్దలు వస్తే మేమూ కొంచెం హేపీస్!!

    ReplyDelete
  5. నా ఓటు కూడా మాస్‌కే. ఏదో అప్పుడప్పుడూ క్లాస్‌కు. అసలు మాస్ అనేదే లేకుంటే, మెగాస్టార్ లేడు, గిగాస్టార్ లేడు. అదీ మాస్‌కున్న పవరు. ప్రత్యేక "మాస్" రాష్ట్రానికి నా మద్ధతు కూడా ప్రకటించేస్తున్నా.

    "మాస్" అభిమానులందరూ కూడా మా "జాయింట్ ఏక్షన్ కమిటీ" (జేఏసీ)లో చేరాలని అల్టిమేటం జారీ చేస్తున్నాము. :) :)

    "మాస్"కు ప్రత్యేక మద్ధతు ప్రకటించని పక్షంలో కూడలిలో నిరవధికంగా మాస్ టపాలు వేస్తాం. అన్ని టపాల్లోనూ మాస్ వీడియో క్లిప్పింగ్‌లు తప్పనిసరి.

    "మాస్" అభిమానులందరూ తమ తమ బ్లాగుల్లో "మాస్" వీడియోలను తప్పనిరిగా ప్రచురించాలి.

    జై మాస్
    జై జై మాస్

    ReplyDelete
  6. @ ఫణి
    అఛ్ఛా హై భాయ్ సాబ్.

    @ కార్తీక్
    మాసున్నర మాసుగా నన్ను నేనే డిక్లేర్ చేసిన.
    రాద్ధాంతకర్త - ఈ పదవి పేరేదో బావున్నాట్టుందే - ఇకపై దీనినే వాడుదాం

    వాళ్ళు కెలికేది ప్రముఖ బ్లాగర్నంట. మనం కాదుగా. మనం జూ బ్లాగర్లం కదా. అయినా కె బ్లా స అదక్షుల వారయిన నన్నే మెటా కెలకడానికి ఎన్ని గుండెలు వుండాలి. నన్ను కెలికేసి పదవి నుండి దింపేసే తెరవెనుక కుట్ర ఏమయినా జరుగుతుందా ఏమిటీ?

    మీ ప్ర.పీ.స.స లో మీతో ఎక్కడ పోటీపడగలములే బాబూ. మరీ ఒక్కడినే కెలుకుతూ నా శక్తి సామర్ధ్యాలను వృధాచేయదలచుకోలేదు. మనిసన్నాక కాస్తంత కలాపోసన వుండాలి అలాగే ఎవరినో ఒకరిని కెలుకుతూ వుండాలి. అందుకే నేను బయట చూసుకుంటా మీరు అతగాడిని చూసుకోండి.

    ReplyDelete