సినిమా సాంకేతికంగా అద్భుతంగా వుంది. అందులో సందేహం లేదు కానీ ఎమోషన్స్ కొద్దిగా వున్నా అవి పండలేదు. హృదయాన్ని ఏమాత్రం తాకలేదు. అలా అనిపించడానికి కారణం మరి నా 'దృష్టి' లోపమో లేక సినిమాలోని లోపమో మరి. లేక సినిమా మీద రివ్యూలు, అభిప్రాయాల విషబీజాలు నాటుకున్నందువల్ల అలాంటి రంధ్రాన్వేషణ చేసేనేమో మరి! నాకు ఎందుకు అలా అనిపించిందో, ఎక్కడ అనిపించిందో వివరంగా చెప్పి ఇకముందు సినిమా చూడబొయేవారిని నేను కూడా స్పాయిల్ చెయ్యదలుచుకోలేదు.
మా ఇంట్లో వారి అభిప్రాయాలు:
చిన్నపాప: It's so cool. I loved it. నచ్చిన/కదిలించిన దృశ్యాలు: హీరోయిన్ తండ్రి చనిపోయిన సంఘటన, చివరి దృశ్యాలు
పెద్దపాప: బావుంది. రెండు సార్లు ఏడ్చిందిట! నవి ల చెట్టు కూలగొడుతున్న దృశ్యాలు, హీరోయిన్ తండ్రి చనిపోయిన దృశ్యాలలో ఏడ్చిందిట. మా పాప నెగటివ్ బౌన్సర్లు వెయ్యలేదు - సంతోషం.
మా ఆవిడ: బాగానే వుంది
నేను: బావుంది. టెక్నికల్ వండర్
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి