అవెటారం 'అనుభవించు' రాజా!


నేను నాస్తికుడినే కానీ జీవితంలో మహా బాగా కష్టాలు వచ్చినప్పుడు మాత్రం ఆదేవదేవుని వేడుకుంటూవుంటాను. అలాంటి మహా కష్టం ఇప్పుడొకటి వచ్చి పడింది. వచ్చే ఆదివారం అవెటార్ (అవతార్ అందామంటే మా చిన్న పాప ఒప్పుకోవడం లేదు) సినిమా చూడాలని డెసైడ్ చేసాం. IMAX 3D కి అడ్వాన్సుడ్ టికెట్లు కూడా బుక్ చేసాం. ఇంకేదిరా భై హాయిగా చూడుర భై అంటున్నారు కదా భాయ్ సాబ్. అక్కడె వచ్చింది చిక్కు. ఎలా చూడాలి ఈ సినిమాను? చూడాలా అనుభవించాలా? చూస్తే రంధ్రాన్వేషణ చేస్తూ విమర్శకుడిలా చూడాలా లేక సాధారణ ప్రేక్షకుడిలా సినిమా చూస్తూ కళ్ళు తేలవేయాలా? మెసేజీ కోసం చూడాలా మాస్ సినిమా చూసినట్లు చూడాలా? సినిమా చూసిన ఒక్కొక్కరు తమ తమ అమూల్యమయిన అభిప్రాయాలను సెలవిచ్చారు. ఇప్పుడు నేను ఏ అభిప్రాయంతో చూడాలి? కొంతమంది అయితే ఎంచక్కా కథ అంతా చెప్పెసారు. కొంతమంది కథే లేదు పొమ్మన్నారు. కొంతమంది మెసేజ్ లేదన్నారు, కొంతమంది ఏలియన్స్ అంటారు కానీ అవి కాదన్నారు. కొంతమంది  హీరోవి తారక రత్న హావభావాలు అన్నారు. అసలెవరూ హీరోయిన్ను గురించి మాట్లాడలా. అసలు ఈరోయిన్ను వుందాలేదా? ఈరోయిన్ను లేకపోతే ఇంకా సినిమా ఎందుకు చూడటం?


కొంతమంది ఆ ఏముంది మన పురాణాలూ, మన నీలి కిష్టుడే గదో అన్నారు. మన తోకల కోతులే - వానర సైన్యం అన్నారు. ఇంకా ఎవరెవరో చిత్రాన్ని అనుభవించకుండా మేధావితనం మహా బాగుగా పెట్టి మరీ 'చూసి' రంధ్రాన్వేషణ బాగానే చేసారు. ఇన్ని అభిప్రాయాలు చదివి ఇన్ని కుశంకలతో సినిమాకి వెళ్ళి నా మొఖం ఇంకా నేను అనుభవించేదేమిటి? సున్నా నేమో. సినిమా చూడటం అనే కళ ఏమాత్రం తెలియని వారు సినిమాలు చూసి సినిమాలోని లోపాలు మహా గొప్పగా విశదీకరించారు. ఇవన్నీ మనస్సులోకి రాకుండా మానసిక నిగ్రహంతో ఈ సినిమా చూడటం ఎలా గబ్బా. ఇంకో చిన్న ఇబ్బందీ వుంది. ఎలాంటి రివ్యూలూ, అభిప్రాయాలూ చూడని, చదవని నా భార్య సినిమాను 'అనుభవిస్తుంటే' నాకు మాత్రం సినిమా 'చూడాల్సిన' అగత్యం పడుతుందేమోనని నాకు యమ కుళ్ళుగా వుంది. నోరు తెరచుకొని మా ఆవిడగారు సినిమా చూస్తుంటే నోరు మూసుకొని సినిమాను చూడాల్సిన ఖర్మ పట్టదు కదా అనేది నా బెంగ.

అందుకే అదేదో సినిమాలో భోజనానికి ముందు వెంకటేష్ దైవ ప్రార్ధన చేసినట్లు ఈ నా ఘోర కష్టాన్ని తీర్చవలసిందిగా సినిమా ప్రారంభానికి ముందు ఆ దేవదేవుని ప్రార్ధించదలచుకున్నాను. నా ప్రార్ధన డ్రాఫ్ట్ ఇదీ. దయచేసి ఈ ప్రార్ధనకు మెరుగులు దిద్దండి. ఈ సినిమాను నేను అనుభవించే మాహాద్భాగ్యం నాకు కలిగేలా మీరూ తోడ్పడండి. మనకు ఇంకా ఈ ఆదివారం మధ్యాహ్నం  దాకా సమయం వుంది.

"ప్రభూ, సినిమా చూసేటప్పుడు కేవలం మంచి విషయాల మీదే  నా మనస్సు నిలిచేలా చూడు ప్రభూ. మేతావితనం కానీ, మేధావితనం గానీ సినిమా చూసేంత సేపూ నా మనస్సులోకి దరిచేరనీయకు స్వామీ. రంధ్రాన్వేషణ దురద నా మనస్సులోకి రానీయకుండా చూసే బాధ్యత మీదే ప్రభువా. అవార్డ్ సినిమలా కాకుండా మామూలు సినిమా అంచానాతో వెళుతూ సగటు ప్రేక్షకునిలా అబ్బురపడే అదృష్టం కలగనీయి స్వామీ. 'రంధ్రం ఎక్కడున్నదీ' అని నేను వెతుక్కోకుండా 'హృదయం ఎక్కడున్నదీ' అని సినిమాలో నా హృదయం పెట్టి చూడనీయి స్వామీ. తొక్కలో లాజిక్కులు నా మనస్సు దరిదాపులలొకి కూడా రాకుండా చూసి నన్ను సినిమాను అనుభవించనీ దేవా.  మా   ఆవిడ కంటే, పిల్లల కంటే చక్కగా ఈ సినిమాను చూసి అబ్బురపడే భాగ్యం కలిగించు స్వామీ.  సినిమా చూసింతతరువాత మహా మేధావి అయిన మా పెద్ద పాప నెగటివ్ కామెంట్స్ వేసి ఒక అద్భుతాన్ని చూసిన ఆనందాన్ని క్షణభంగురం కానీయకుండా చూసే బాధ్యత  కూడా మీదే దేవా! సినిమా పూర్తి అయిన తరువాత సినిమా ఎంత గ్రేట్గా వుందో అని చిన్న పాప అంటూ వుంటే నాకు అంత థ్రిల్లు కలగక బిక్క మొగం వేసుకునే పరిస్థితి రానీయకు దేవా. సినిమా ఎక్కడెక్కడ ఎంజాయ్ చేసానో అని మా ఆవిడ వర్ణిస్తూ వుంటే ఆ సన్నివేశాలలో ఏమేం లోపాలు వున్నాయ్యో స్ఫురణకు వచ్చే దౌర్భాగ్యం కలగనీయకు ప్రభువా.

ఆమెన్" 


ఈ ప్రార్ధన అంత గొప్పగా రాలేదని నాకు తెలుసు. అందుకే దానిని మోడిఫై చేసే బాధ్యత మీకు ఇచ్చాను. అన్నట్లు ఈ సినిమా చూసే విషయంలో ప్రాంతీయ అభిమానం కూడా వుందండోయ్. దర్శకుడు జేమ్స్ కేమరూన్ మావాడే. కెనడియన్.  


మీటప్: అన్నట్లు ఇంకో విశేషం కూడా వుందండోయ్. ఈ మూవీకి మీటప్ సభ్యులతో కలిసి వెళుతున్నాం. మా మీటప్ గ్రూపులో మేము తప్ప అందరూ ఇక్కడి అమెరికన్సే. దాదాపు ఒక నలభై మంది ఈ సినిమా చూడటానికి రాబోతున్నారు. 12 గంటలకు సినిమా అయితే అందరూ 11 గంటలకే వచ్చేస్తారు. 11 నుండి లైనులో నిలబడి కబుర్లు చెప్పుకోబోతున్నాము. హాలులో అందరమూ ఒకదగ్గరే కూర్చొని సినిమా ఎంజాయ్ చేస్తాము. మూవీ అయిన తరువాత ఒక రెస్టారెంటుకి వెళ్ళి భోంచేస్తూ ఈ సినిమా అబ్బురాన్ని, అద్భుత క్షణాలనీ అందరం నెమరువేసుకోబోతున్నాము.      

13 comments:

  1. aa tarvaata yen cheyya botunnaro kudaa raasi vunte avataram rakti kattedi kada saratbabu

    ReplyDelete
  2. అజ్ఞాత,
    అంతలేదు. ఆ మీటప్పులు వేరే, ఈ మీటప్పులు వేరే :) అవీ ఇవీ కలపకండి. ఇవి సాధారణ గెట్టుగెదర్లు.

    ReplyDelete
  3. That is why I don't read reviews before watching the movie. I copy all the links and review the reviews after watching the movie.

    - Shiv.

    ReplyDelete
  4. It is a nice movie. I like it and I watched last sunday night 10:20PM show.

    ReplyDelete
  5. @శివ్
    మహాప్రభో మీకెంత ఓపిక, తీరిక!!

    ReplyDelete
  6. @ ఈశ్వర్
    ఎలాంటి సినిమా చూసారు? 2D/3D/real 3D/IMAX/IMAX 3D ?

    ReplyDelete
  7. శరత్ గారూ... మీరు ఎంత గొప్ప అంచనాలతో వెళ్ళినా మీకు ఈ సినిమా తప్పక సంతృప్తి ని ఇస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. ఐతే ఒక్కటే... జస్ట్ సినిమా చూడొద్దండి... IMAX & 3D ఐతేనే చూడండి. అప్పుడే బాగా ఎంజాయ్ చెయ్యగలుగుతారు. అవతార్ మైనస్ 3D మైనస్ IMAX = చాలా సాదా సీదా సినిమా ! ఈ సినిమా కు హంగులు చేర్చింది ముఖ్యంగా సాంకేతిక పరిఙానమే ! నా ఉద్దేశం లో సినిమా మొదటి నుండి చివరి దాకా మీరు సినిమా చూడరు. సినిమాలోనే ఉంటారు ! 2 గంటలా నలభై నిముషాల సేపు 3D లో, అదీ IMAX లొ సినిమా చూడడం నిజంగా ఒక చక్కటి అనుభవం. ఇంకేమీ ఆలోచించకండి... ! వెళ్ళి బాగా ఎంజాయ్ చెయ్యండి..

    మరో ముఖ్య గమనిక ఏంటంటే.. సినిమా చూసేటప్పుడు సాధ్యమైనంత తక్కువ డిస్ట్రాక్షన్స్ ఉండేలా చూసుకోండి. అలాగే సినిమా షో టైం కు కనీసం గంట ముందు వెళ్ళండి ( బాగా జనాలు ఉంటారని ఊహించి చెపుతున్న విషయం ఇది..), ఎందుకంటే.. IMAX సినిమాను మీరు నిజంగా ఫీల్ అవాలి అంటే... మీరు సినిమా హాల్ మధ్యలో కూచోవాలి. ( సినిమా హాల్ దీర్ఘ చతురస్రాకారం లో ఉంటుంది అనుకొంటే, వాటి కర్ణాలు (డయగొనల్స్) కలిసే చోటు లో కూచుంటే, మాక్సిమం ఫీల్ ఉంటుంది).

    ReplyDelete
  8. మీకు నచ్చుతుంది. కామరాన్ మీవాడైనా, కాకపోయినా. రివ్యూలు చదివినా, చదవకపోయినా. మీరూ అనుభవించి తీరతారు - చూస్కోండి :-)

    కొందరన్నారు 'ఎమోషన్లు' లేవూ ఈ 'ఏవటార్'లో అని. సంగతేంటంటే, ఎంత సేపూ హీరోలతోనూ/హీరోయిన్లతోనూ ఐడెంటిఫై చేసుకోటానికి అలవాటు పడిపోయిన సగటు ప్రేక్షకులని కామరాన్ ఉన్నట్టుండి ఈ సినిమాలో bad guys తో ఐడెంటిఫై చేసుకోవాల్సిన పరిస్థితిలోకి నెట్టిపారేశాడు. దాంతో, సినిమా చూసేంత సేపూ మనకి కలిగే ఒకే ఒక ఎమోషన్ 'అపరాధ భావన' అనబడే గిల్టీ కాన్షస్‌నెస్. అది మరీ ఎక్కువైనోళ్లకి ఈ సినిమా నచ్చదుగాక నచ్చదు ;-)

    Btw, ఉచిత సలహా అనుకోకపోతే .... మీ శైలి భలే సరదాగా ఉంటుంది. దాన్ని మంచి మంచి టపాలకి వాడొచ్చు కదా - అదో రకం వాటి కోసం కాకుండా.

    ReplyDelete
  9. నాకు అవెటార్ real 3D లో చూసే అవకాసం కలిగింది. It was a spectacular experience.
    BTW, Sharat, నా ఈ తెలుగు టైపింగ్ అంతా మీ సలహానే.నెనర్లు.

    ReplyDelete
  10. నేను వెళ్తున్నాననొచ్ ఈ మంగళవారం IMAX డ్ లొ.. ;)

    ReplyDelete
  11. @ వరుణుడు
    మీరుచెప్పినట్లే సినిమా చూడటానికి ప్రయత్నించామండి. ఎంతో ముందుగా వెళ్ళినా వెనుక, మధ్య సీట్లు ఫుల్ అయిపోయాయి. కాస్త పక్కగా సర్దుకోవాల్సివచ్చింది. సినిమా సాంకేతికంగా అద్భుతంగా వుంది. మీ సూచనలకు ధన్యవాదాలు.

    @ అబ్రకదబ్ర
    సినిమాను 'సాంకేతికంగా' అనుభవించామండీ!

    నేను మొదట మరొక రకం - తరువాతనే అసలు రకం. అసలు రకం మీద వ్రాయడానికి, సరదాగా, వ్యంగ్యంగా వ్రాయడానికీ చాలా మందే వున్నారు. కనీసం మరొకరకమయిన నేనన్నా మరొక రకం వాటిమీద టపాలు వ్రాయకపోతే అది మరొక చారిత్రిక తప్పిదం అయ్యి మరొక చరిత్ర నన్ను భవిష్యత్తులో క్షమించదండీ :))

    సలహాలు, సూచనలకు ఎల్లప్పుడూ ఆహ్వానమే.

    ReplyDelete
  12. @ వాసు
    ఇక దంచేయండి తెలుగులో :)

    @ నెలబాలుడు
    చూసాక మీకు ఎలా అనిపించిందో మాకూ చెప్పండి.

    ReplyDelete