Rich Dad, Poor Dad

నల్లగొండ జిల్లా సూర్యాపేటకి దగ్గరలోని ఒక పల్లెటూరులో ఎల్లారెడ్డి, మల్లరెడ్డి అనే ఉపాధ్యాయులు వుండేవారు. ఎల్లారెడ్డి తన సంతానానికి డబ్బులు ఎలా సంపాదించాలో, ధనవంతులు ఎలా అవాలో నేర్పారు. మల్లారెడ్డి తన సంతానానికి మానవత్వం అంతే ఏమిటో, సమాజ శ్రేయస్సు కోసం ఎలా పాటుపడాలో నేర్పారు.  

ఆ మల్లారెడ్డి గారి రెండో అబ్బాయినే నేను. మా నాన్న (పేద?) మధ్యతరగతి వర్గానికి చెందినవారు. మా నాన్నగారిలాగే నాకూ రచనా వ్యాసంగమూ, సమాజ శ్రేయస్సు వంటపట్టింది కానీ డబ్బులు ఎలా జాగ్రత్త చేయాలో, ఎలా కూడబెట్టాలో వంటపట్టింది కాదు. మా నాన్నకు డబ్బులపై ధ్యాస, ఆ కళ లేకపోవడంతో మనకు అటువంటి లక్షణాలు వంటబట్టలేదు.    

సాధారణ సమాజంలో డబ్బుకి ఎంత విలువ వుందో తెలుసు నాకు. మనకంత (సంపాదించేంత) సీను లేదు కాబట్టి హాయిగా సమాజ సేవ చేసుకుంటూ ఈ జీవితాన్ని లాగించేద్దామని విజయవాడలోని ఆర్ధిక సమతా మండలి స్వఛ్ఛంద సేవా సంస్థ వారు సాంఘిక సేవలో ఇచ్చిన IRDP (Integrated Rural Development Project) ఒక ఏడాది  ట్రైనింగ్ తీసుకున్నాను.
 
ఇక సమాజసేవకి ఈ జీవితాన్ని అంకితం చేద్దాము అనుకుటున్న రోజుల్లో నా జీవితంలో ఒక ట్విస్ట్ వచ్చిపడింది. మా మరదలు ఒకరు నేను తనని ప్రేమిస్తున్నానంటూ (?) వెంటపడింది. అలాంటిదేమీలేదు నీతో నాది   సాధారణ స్నేహం అని చెప్పినా మొత్తం మీద నన్ను తన ప్రేమలోకి దింపింది. 'మరి నా సమాజసేవ ?' అని అడిగాను. '(మనస్సులో నవ్వుకొని - వుంటుంది) దాందేముంది ముందు 'మన' ('నా' అనుకొని - వుంటుంది)  సేవ చూసుకున్నాక/చేసుకున్నాక  తీరిగ్గా ఇద్దరం సమాజ సేవ చేసేద్దామేం' అంది. ప్రేమ కదా - ఆ అమ్మాయి మాటలు బోల్డంత నచ్చేసాయి.

జీవితంలో పైకి రావాలని లేదు కాబట్టి ఇంజనీరింగులు గట్రా చదవక (బోడి) బియ్యే పట్టాతో U టర్న్ ఇచ్చుకొని జీవితంలో స్థిరపడటానికి - అనగా ఒక చిరుద్యోగమయినా తెచ్చుకోవడానికి ప్రయత్నాలు ఆరంభించా. ఈలోగా తను ఇంకా బాగా చదివేసేసరికి ఆమెకు కళ్ళు నెత్తికి ఎక్కడంతో (ఇది నా వర్శన్ సుమీ)  మా మధ్య తేడాలు వచ్చి ఇద్దరమూ ప్రశాంతంగా మాట్లాడుకొని ప్రేమ క్యాన్సిల్ చేసుకునే విషయంలో  ఏకాభిప్రాయం సాధించాము. అప్పుడు ఇక సోషల్ సర్వీసులోకి వెళ్ళాలా లేక సాధారణ జీవితం గడపాలా అన్న మీమాంసతోనే కాలం గడుపుతూ కంప్యూటర్ కోర్సులు చేస్తూ, చిరు ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చాను.
 
అలా అలా రోజులు దొర్లిస్తూ పూణే యూనివర్సిటీ PGలో (Master Of Computer Management) చేరాను. సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు సరదాగా పెళ్ళిచూపులు చూసేస్తూ నిజంగానే బుక్కు అయ్యాను. పెళ్ళయాక ఖర్చుచేయడంలో మెళకువలు ఇంకా బాగా తెలవడంతో  నా పని పెనంలోంచి పొయ్యిలో పడినట్లయ్యింది. అందరూ డబ్బులు, ఆస్తులు వెనకేస్తుంటే నేను ముందు వెయ్యడం (అనగా క్రెడిట్ కార్డు బ్యాలన్స్ అన్నమాట) మొదలెట్టాను.   ఆ స్థితిలోనుండి పైకి రావడానికి చాలా ఏళ్ళు రకరకాలుగా కష్టపడ్డా ఏమీ ఫలితం లభించక పోగా ఇంకా లోపలికి పోయాను. ఎందుకలాగా అని అడక్కండి.

గత కొన్నేళ్ళనుండి కాస్త దారిలో పడి ఈమధ్యనే రిచ్ డాడీ తరహాలో ఆలోచిస్తూ కాస్తంత  ఆ పరంగా బాగుపడుతున్నాను. అలా పరిస్థితులు దారిలోకి తీసుకురావడం కోసం చాలా సాహసవంతమయిన చర్యలు తీసుకున్నాను.  ఏదో ఇహ తప్పదు కాబట్టి కాస్త సంపాదించే ప్రయత్నం చేయడమే కానీ నిజానికి నాలాంటి మనస్థత్వం వున్నవాడికి డబ్బు పడదు.   ఎంచక్కా ఆకులూ, అలములూ తింటూ గోదావరి తిన్నెల్లో పొద్దుపుచ్చుతూ ఏదో వ్రాసుకుంటూనో లేక స్వఛ్ఛంద సేవ చేస్తూనో వుండే  ప్రవృత్తి నాది. మా మరదలి నిర్వాకం వల్ల ఇలా జనజీవన స్రవంతిలో కలిసిపోయి ఇలా అవస్థలు పడుతున్నాను.  ప్చ్.   
 

సంపాదనలో అసమర్ధులు అయి ముందెయ్యకుండా (అనగా అప్పులు, క్రెడిట్ లలో పడకుండా)  ఇహనయినా వెనకెయ్యాలనుకుంటే, ధనవంతుల ఆలోచనా  సరళికి - మధ్యతరగతి ఆలోచనా సరళికి తేడా ఎక్కడ వుందో తెలుసుకోవాలనుకుంటే, మీ పిల్లలకీ ఎలా కూడబెట్టాలో నేర్పాలి అనుకుంటే ఈ క్రింది పుస్తకం చదవండి. నేను చదివాను - ఆచరించడం మొదలుపెట్టాను.

Rich Dad, Poor Dad: What the Rich Teach Their Kids About Money--That the Poor and Middle Class Do Not!

13 comments:

  1. Hi Sharat

    Nice Post.we are expecting more posts like this.Keep it up

    Regards

    Ali

    ReplyDelete
  2. శరత్ గారూ,

    మీ వెనక ఇంత story ఉంది అని తెలియదు.
    పోతే ఒక మంచి book గురించి కూడా చెప్పారు.

    -సురేష్

    ReplyDelete
  3. శరత్, అదేదో మీరు పాటించి మాక్కూడా కొద్దిగా చెబ్దురూ.. మీ పేరు చెప్పుకోని నాలుగు రూకలు వెనకేసుకుంటాను.

    ReplyDelete
  4. @ ఆలి
    ధన్యవాదాలు. ఇలాగే నేను చదివిన, చదువుతున్న, చదవబోతున్న పుస్తకాలని నా ఆలోచనలతో రంగరిస్తూ పరిచయం చేస్తుంటాను.

    @ సురేష్
    నా జీవితం లో చాలా డ్రామా వుందండి. ఈ టపాలో కూడా చాలా ముఖ్యమయిన జీవిత అనుభవాలు (డబ్బు విషయమీనవే లెండి) వ్రాయలేకపోయాను - నెత్తి మీద వెనుకనుండి మొట్టికాయలు పడుతాయని - అర్ధమయ్యిందనుకుంటాను.

    @ రామిరెడ్డి
    హమ్మా, అంత వీజీగా చెప్పేయడమే! మీరూ రిచ్చు అయిపోరూ. (అయినా మీకెందుకులెండి - మీరు ఆల్రెడీ రిచ్ అయ్యుండొచ్చు)

    ReplyDelete
  5. చక్కగా చెప్పారు.ఇప్పటి జీవన శైలిలో డబ్బే అన్నీనూ, స్నేహాలైనా, బంధుత్వాలైనా, డబ్బు లేకపొతే ఎవరికైనా మనుగడే లేదు. వెనకటి కాలంలో ఎంతో కొంత మేము మనుషుల్లా బ్రతుకుతాం అనే పిచ్చి వాళ్ళు కనీసం కొంత మందైనా ఉండేవాళ్ళు .ఇప్పుడు మేము మనుషులము కాదు అనే జనమే ఉన్నారు.

    ReplyDelete
  6. రిచ్, పూర్ కాకుండా మన దేశంలో ఇంకో క్లాస్ కూడా ఉంది, అదే మిడిల్ క్లాస్. వీళ్ళను మీరు రిచ్ అంటే ఒప్పుకోరు, పూర్ అంటే సహించరు. వీళ్ల అలోచనలు రిచ్ గా ఉన్నా ఆదాయం పూర్ గా ఉంటుంది (నా బోటి వాళ్లు). వీలయీతే వీళ్ల గురించి కూడా ఓ రెండు ముక్కలు వ్రాయండి.

    ReplyDelete
  7. @సునీత
    అవునండి. మానవసంబంధాలు రోజురోజుకీ కృత్రిమం అయిపోతున్నాయి.

    @ఏకలింగం
    అవును. పేదవాడు హాయిగా ఏ కలో, గంజో తాగి తృప్తిగా బ్రతికివేస్తాడు. ఇక ధనవంతులకి డబ్బు సమస్య వుండదు కాబట్టి వారూ హాయిగానే వుంటారు. ఎటూ ఇబ్బంది మధ్యస్తంగా బ్రతకలేని మనలాంటి మధ్యతరగతి వారికే.

    ReplyDelete
  8. nice post.
    నాకు ఇప్పటికీ చేతకాలేదు ఈ వెనకేసే విద్య.

    ReplyDelete
  9. ఇది నేను కూడా అభ్యసించని ఇకపై నేర్చుకోలేని విద్య.

    ReplyDelete
  10. శరత్ గారు, ఏకలింగం గారు చెప్పినట్టు, మధ్య తరగతి వాళ్ళ గురించి కూడా ఒక టపా వెయ్యండి (:- ?

    ReplyDelete
  11. శరత్ గారు,
    మంచి పుస్తకం పరిచయం చేసారు. నేను గత నెల కొన్నాను... కాని చదవడమే ఇంకా పూర్తి చేయలేదు... అన్నట్లు మిడిల్ క్లాస్ గురుంచి ఒక టపా రాసేయండి మాస్టారు.. ;)

    ReplyDelete
  12. @ కొత్తపాళీ
    నా కోవలో మరి కొంత మంది బ్లాగర్లూ వున్నారన్నమాట. హమ్మా. మీలాంటి 'పెద్ద' వారు కూడా అలా అంటే నమ్మడం కష్టమే :)
    @ ఉష
    ఆసక్తి వుంటే అభ్యాసం కష్టమేం కాదు గానీ మీకు అంత ఆసక్తి వుంటుందనుకోను.
    @ గణేష్
    మధ్య తరగతి వారి గురించి తెలియనిది ఎవరికి :) - ఈ పుస్తకం టైటిల్ లో పూర్ అని ప్రస్థావించినా అది మధ్యతరగతి వారికి కూడా వర్తిస్తుంది.

    @ నెలబాలుడు
    సంతోషం. ఆ పుస్తకం చదివాక మీ కోణంలో మీరు సమీక్షిస్తే ఇంకా బావుంటుంది.

    మిడిల్ క్లాస్ గురించి చాలా మందికీ ఆసక్తి వున్నట్లుందే! హ్మ్మ్. ఏం వ్రాయగలనో చూడాలి.

    ReplyDelete
  13. శరత్ మేము ఇప్పడేమిటి ఎప్పటికీ రిచ్ పీపుల్ మే.. డబ్బులో కాదు సుమా ;)

    ReplyDelete