ఈ పుస్తకం గురించి వినుకొండ నాగరాజు గారి వెరయిటీ పత్రికలో ఈ పుస్తకం యొక్క స్వేఛ్ఛానువాదం చూసినప్పుడు తెలిసింది. చాలా ఏళ్ళ క్రితం సంగతి లెండి అది. ఈ పుస్తకం చాలా నచ్చి సంబరపడుతూ మా నాన్న గారికి చెప్పాను. మా నాన్నగారు నవ్వి ఈ పుస్తకం యొక్క గొప్పతనం తనకు ఇదివరకే తెలుసనీను, అంతకుముందు చాలా ఏళ్ళ క్రితమే ఒక తెలుగు పత్రికలో స్వేఛ్ఛానువాదంగా ధారావాహికగా వచ్చిందనీను చెప్పడమే కాకుండా ఆ పత్రిక ప్రతులు తీసి నాకు చూపించారు. ఆ విషయం తెలిసి చాలా అబ్బురపడ్డాను.
ఆ తరువాత ఈ ఇంగ్లిష్ పుస్తకం కొనుక్కున్నాను. అది చదివిన తరువాత నా వ్యక్తిత్వంలో చాలా మార్పులొచ్చాయి. నన్ను అత్యంత ప్రభావితం చేసిన పుస్తకాలలో మొదటిదిగా నేను భావిస్తాను. ఈ పుస్తకం ఎప్పుడూ నా లైబ్రరీలో వుంటుంది. అప్పుడప్పుడు తీసి చదువుతూ నన్ను నేను మెరుగుపరచుకుంటాను.
దీనిని ఏదో సాధారణ పుస్తకంలాగా చదివి అవతల పడేస్తే లాభం లేదు. ఒక వర్క్ బుక్ గా దీనిని పాటిస్తూ నిబద్దతతో మీ వ్యక్తిత్వంలో ధనాత్మక మార్పులు కోరుకుంటేనే ఫలితం వుంటుంది. సరళమయిన, ఆహ్లాదకరమయిన, నిజాయితీ పరమయిన, చిరు హాస్యంతో కూడిన ఈ పుస్తకం చదువరులను కట్టిపడేస్తుంది. ఈ పుస్తకం ప్రపంచంలోని మహామహులెందరినో ప్రభావితం చేసి వారి వ్యక్తిత్వానికి వన్నెలు దిద్దింది.
ఆ మధ్య పుస్తకం డాట్ నెట్ లో ఈ పుస్తకం పై తాడేపల్లి గారి సమీక్ష వచ్చింది కానీ పెద్దగా ఎవరూ స్పందించలేదు. ప్చ్! మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవాలని ఏమాత్రం ఆలోచన వున్నా ఈ పుస్తకాన్ని వదిలిపెట్టకుండా చదవండి. మంచి వ్యక్తిత్వం అంటే ఏమిటో, ఎలా వుంటుందో తెలుసుకోవడం కోసమయినా ఈ పుస్తకం చదవవచ్చు. ఈ పుస్తకంలో సూచించిన మెళుకువలు ఇంకా బాగా పాటిస్తూవుంటే నా వ్యక్తిత్వం ఇంకా మెరుగుపడేదేమో కానీ రకరకాల కారణాల వల్ల అన్నీ సాధ్యపడవు కదా. ఈ పుస్తకం చదివాక నాలో వచ్చిన మూడు ముఖ్యమయిన మార్పులు మాత్రం మీకు ఉదాహరణగా చెబుతాను.
1. ఎవరితోనయినా మాట్లాడుతున్నప్పుడు చాలావరకు అంతా నాగురించి మాట్లాడుతుండేవాడిని. హు కేర్స్ అని అర్ధమయ్యింది. అటుపై ఎవరితోనన్నా మాట్లాడుతున్నప్పుడు నా సోది చెప్పుకోకుండా ఎదుటివారి గురించే ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాను.
2. నా తప్పులని, పొరపాట్లని తెలుసుకున్నాక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, నిర్ద్వందంగా అంగీకరించడం అలవాటు అయ్యింది.
3. ఏవయినా సమస్యలు వచ్చినప్పుడు ఎదుటి వారి దృక్కోణంలో ఆ సమస్యలను అవలోకిస్తూ వారిని అర్ధం చేసుకోవడం అలవాటు అయ్యింది.
ఇలాంటివే ఇంకా ఎన్నో మార్పులు. నిజాయితీగా, ధారాళంగా ఇతరుల గొప్పదనాన్ని ప్రశంసించడం ఒకటి. ఎదుటివారు నాకు శత్రువులయినా సరే వారిలో వున్న గొప్పదనాన్ని ప్రశంసించేంత హృదయం నాకు అబ్బింది.నా జీవితంలోని ముఖ్యమయిన వారిలో ఒకరిద్దరి పట్ల మాత్రం ఈ పద్ధతులు పాటించేంత ఓపిక, మనస్సు నాకు వుండవు ఎందుకో. నాకు అర్ధం కాని విషయాలలో అదొకటి.

How to Win Friends & Influence People
తప్పక చదవండి ఈ పుస్తకాన్ని. సరదా, కాలక్షేపం కోసం చదవాలనుకున్నా ఈ పుస్తకం మిమ్మల్ని నిరాశ పరచదు. మీ జీవితంలో మిస్ కాకూడని పుస్తకాలు పది వున్నట్లయితే అందులో ఇది ఒకటిగా ఖచ్చితంగా అవుతుంది. ఇకపై మీ ఇష్టం.
6 comments:
meeru raasindi chadivaaka tappaka chadavaalsina book anipisthundi. twaralone chadivi naa abhipraayaanni meeku teluputhaanu.
ఈ పుస్తకం నేనూ చదివాను చాలా సంవత్సరాల క్రితం. ఈ పుస్తకం నా దృక్పథంలో కుడా ఎన్నో మార్పులు తెచ్చింది. అయితే మీరన్నట్టు దీన్ని చదివి వదిలి వేయకుండా మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం చేకూరుతుంది.
నేనూ మీలాగే ‘వినుకొండ నాగరాజు’ గారి స్వేచ్ఛానువాదాన్నే ‘వెరయిటీ’ లోనే మొదట చదివాను. డేల్ కార్నెగీ రాసిన ఈ పుస్తకం తెలుగులో పూర్తి అనువాదంగా కూడా వచ్చింది. అనువాదకురాలు: శాంతసుందరి గారు. మంచి పుస్తకం గురించి రాశారు. అభినందనలు!
ఎంత మంచి విషయం జ్ఞాపకం చేశారు. 70ల చివర్లో 80ల మొదట్లో వచ్చిన వెరయిటీ పత్రిక గురించే కదూ మీరు చెబుతుండేది. నాకూ గుర్తుంది. అన్నీ అని చెప్పలేను కాని ఆ పత్రికలోని కొన్ని వ్యాసాలు మాత్రం అప్పట్లో విపరీతంగా చదివాను.డేల్ కార్నగీ రాసిన మరో పుస్తకం కూడా అప్పట్లోనే వెరయిటీలో వచ్చినట్లుంది. 30 ఏళ్ల నాటి జ్ఞాపకాలు తిరిగి గుర్తు చేశారు. ఈ పుస్తకాన్ని ఎవరయినా తెలుగులో తిరిగి ముద్రిస్తే శాశ్వతంగా పదిలపర్చుకోవచ్చు. వ్యక్తిత్వ వికాసం పేరుతో వస్తున్న సవాలక్ష స్వార్ధ ప్రయోజనాలకు సంబంధించిన పుస్తకాలతో పోలిస్తే ఇది చాలా మెరుగైందనుకుంటాను.
పరిచయం చేసిన మీకూ, వ్యాఖ్యాతలకు అభినందనలు
కొడవటిగంటి కుటుంబరావు గారి అమ్మాయి శాంతసుందరి గారేనా ఈ పుస్తకం అనువాదం చేసింది. మరీ బాగుందండి. ఈ పుస్తకం ఇప్పుడు దొరుకుతుందా..చెప్పండి.
ఈ పుస్తకం తెలుగులో “అందరినీ ఆకట్టుకునే కళ” పేరుతో తెలుగులోకి వచ్చింది. ప్రముఖ పుస్తకాల షాపుల్లో దొరుకుతోంది.
న్యూఢిల్లీకి చెందిన మంజుల్ పబ్లిషింగ్ హౌస్ ప్రచురణ. కొ.కు. గారి కూతురు శాంతసుందరి గారే అనువాదకురాలు. పుస్తకం డాట్ నెట్ లో తాడేపల్లి గారి పరిచయం కింది లింక్ లో చూడొచ్చు.
http://pustakam.net/?p=1716
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి