'వృద్ధనారీ పతివ్రత ' సామెత లాగా ఈ మధ్య పుస్తకాల మీదనే మనస్సు పడింది కాబట్టి వాటిమీదే వ్రాస్తున్నాను.
నాకు నచ్చిన పుస్తకాల్లో ఇది ఒకటి. స్వతహాగా కాస్త మొహమాటస్తుడిని కనుక అది అధిగమించడానికి ఈ పుస్తకం ఉపయోగపడింది. నన్ను నేను ఎజర్ట్ చేసుకోవడానికి ఇది ఉపకరించింది. నా గురించి, నా అభిరుచుల గురించి నన్ను నేను ఎలా ఎజర్ట్ చేసుకుంటానో బ్లాగ్లోకంలో చాలామందికి అర్ధమయ్యే వుంటుంది.
మనలో చాలా మంది వివిధ సందర్భాలలో వద్దు, లేదు అని స్పందించాలనుకున్నా అలా చేయలేరు. కారణం ఆత్మవిశ్వాసం తక్కువ - మొహమాటం ఎక్కువ. మన వ్యక్తిత్వాన్ని, హక్కులని మనం ఎలా కాపాడుకోవాలో, 'మొహమాటానికి పోతే కడుపు అయ్యిందన్నట్లుగా' కాకుండా మొహమాటం అనేది లేకుండా ఎలా జాగ్రత్త వహించడం ఎలాగో ఈ పుస్తకం సూచిస్తుంది. అహంభావానికీ, ఆత్మవిశ్వాసానికీ తేడాను ఈ పుస్తకం వివరిస్తుంది. పలు దైనందిన విషయాలలో మనం అనుసరించాల్సిన పద్ధతి తెలియజేస్తుంది.

Don't Say Yes When You Want to Say No: Making Life Right When It Feels All Wrong
ఈ పుస్తకం ఎప్పుడో చదివాను - పోగొట్టుకున్నాను కూడా. పోగొట్టుకున్న విధం బెట్టిదన - ఒకానొక మంచిరోజు ఓ చక్కని చుక్క (మా ఆవిడ ఫ్రెండు లెండి) మా ఇంటికి రావడం తటస్థించింది. నా పుస్తకాల దొంతర చూసి ఏం పుస్తకాలు ఇవీ అని అడిగింది. ఓ రెచ్చిపోయి నా పుస్తకాల గురించి పురాణం చెప్పేసాను. నేను చెప్పిన కథ - అందులో ముఖ్యంగా ఈ పుస్తకం గురించి నేను చెప్పిన విశేషణాలు బాగా అర్ధమయ్యి జీర్ణించుకున్నట్లుంది - మొహమాటం లేకుండా అడిగేసింది - ఈ బుక్కు. ఆమె అంత తీయగా అడిగితే 'నో...' చెప్పలేక ఇచ్చేసాను. అంతే సంగతులు. ఇచ్చిన పుస్తకాలు మళ్ళీ తిరిగివస్తాయా ఏమిటి?
3 comments:
శరత్ ఈ పుస్తకం ఎన్నిసార్లు చదివానో.. ఐనా సరే ఇప్పటికీ నొ అని చెప్పాలంటే ఎంత మొహమాటమో
ఈ పుస్తకం మీకు పెద్దగా ఉపయోగపడినట్టులేదు...ఎందుకంటే ఆమె పుస్తకం అడగగానే- You told "YES" when you actually wanted to say "NO" .... అయినా పుస్తకాల్లో చదివినవన్నీ చేస్తామా ఏంటీ..ప్రతిదానికీ కొన్ని exceptions ఉంటాయి... :D
:-)
బావుంది ఈ పుస్తకం
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి