ప్రేమ ఒక భ్రాంతి - పెళ్ళి ఒక వాస్తవం

పరిస్థితులు ఏవయినా సరే ఒక జంట ప్రేమలో వున్నారనుకోండి - వారి మధ్య చాలావరకు అన్నీ బాగానే వున్నట్లు అనిపిస్తాయి. ఒకరిలోని లోపాలు మరొకరికి ఆ మత్తులో తెలిసిరావు - తెలిసినా అవి అంత పెద్ద విషయంగా అనిపించవు.  కానీ ఇది పెద్దలు కుదిర్చిన వివాహం కంటే చాలా బెటర్. దీనిలో కొంత అయినా ఒకరి మీద ఒకరికి అవగాహన ఏర్పడుతుంది.  నిశ్చయం నుండి పెళ్ళి నిశ్చయింప బడ్డ జంట మధ్య వుండేది కూడా ప్రేమ, అనురాగం అనే అనుకోవాలి. కాబోయే భర్త/భార్య మీద చాలా మమకారం వుండటం సహజమే కదా.

డేటింగ్ వల్ల కూడా అంత లాభం లేదు. అయితే దానివల్ల పరస్పరం మరికొన్ని విషయాలు తెలుస్తాయి కానీ మనిషి మీద పూర్తి అవగాహన రాదు. మనిషి ఎక్కువగా తెలియకపోతే తను కాస్త నచ్చాక సాధారణంగా అన్నీ బాగానే అనిపిస్తాయి. మనిషి బాగా తెలిస్తే మాత్రమే అసలు మనిషి బయటపడుతాడు. 


అసలు వ్యక్తిత్వం ప్రేమ లోనూ, డేటింగ్ లోనూ తెలియదు. సహజీవనంలోనో లేదా  పెళ్ళి అయాకనో బోధపడ్తుంది. వీటిల్లో కూడా వెంటనే బయటపడవు - వీటిల్లోని తొలి మాధుర్యం కరిగిపోయాక, మబ్బులు విచ్చుకున్నాక పెళ్ళాం/మొగుడు పాత చింతకాయ పచ్చడి అయ్యాక అసలు రంగులు ఒకరికి ఒకరివి తెలుస్తుంటాయి. ప్రేమికులు ఇద్దరూ సహజీవనం చేస్తున్నా ఇది వర్తిస్తుంది.

కొన్నేళ్ళు పెళ్ళి అయాక లేదా కొన్ని ఏళ్ళు సహజీవనం  చేసాక కూడా వారిలో అనురాగం వెల్లివిరుస్తూవుంటేనే అది నిజమయిన ప్రేమగా భావించవచ్చు. అంతేగాని ప్రేయసి ప్రియులు రోజుకొకసారి గంటకొకసారి తియ్యటి ఊసులు మాట్లాడుకున్నంత మాత్రాన అది నిజమయిన ప్రేమ అవ్వదు. తమది నిజమయిన ప్రేమ అనే భ్రమలో వుంటారు ఆ జంట. అందుకే ప్రేమించి పెళ్ళిచేసుకున్న కొన్ని జంటలు  భ్రమలు కరిగిపోయి వాస్తవ వ్యక్తిత్వాలు బయటపడ్డాక విడిఫోతుంటాయి.  ఒకసారి వెడ్‌లాక్ అయ్యాక ఇక వాళ్ళు జీవితాంతం లాక్ అయినట్లే కాబట్టి పెద్దగా చేసేదేమీ వుండదు. ధైర్యం వున్నవారు ఆ బంధం నుండి బయటపడుతారు - ధైర్యం లేని వారు తమ బంధాన్ని ఏదో రకంగా సమర్ధించుకుంటూ జీవితాలు ఏదోరకంగా లాగిస్తుంటారు.     
 
మరి దీనికి పరిష్కారం? అందరికీ సాధ్యపడదు ఇది కానీ సాధ్యపడినవారు, ఇష్టపడిన వారు, ధైర్యం వున్న జంటలు ఇలా చేయొచ్చు. అదే సహజీవనం.  కనీసం మూడు ఏళ్ళన్నా కలిసివుంటే అసలు వ్యక్తిత్వాలు బయటపడుతాయి. ఈ లోగానే మనస్సులు సరిపడవని బయటపడితే ఎంచక్కా విడిపోవచ్చు. ఓ మూడేళ్ళయాక కూడా వారిలో ఇంకా ప్రేమ వుంటే భేషుగ్గా పెళ్ళి చేసుకోవచ్చు. మరి ఆ తరువాత వారిలో విభేదాలు రావని గ్యారంటీ ఏమిటీ? నేను పెర్ఫెక్షనిస్టును కాను - ఇది గ్యారంటీ. మీరు కూడా పరెఫెక్షనిస్ట్ కాకండి - అదొక మానసిక జాడ్యం!  

జంటల మధ్య విభేదాలు రావడానికి అందులో ఇద్దరో ఒక్కరో దుర్మార్గులే కానక్కరలేదు. ఇద్దరు చాలా మంచివారయినంత మాత్రాన వారి మధ్య హార్మోనీ వుండాలని ఏమీలేదు - వైరుధ్యాలు రాకూడదనీ లేదు.  రెండు జంటలు నిలబడాలంటే వారి మధ్య ముఖ్యంగా వుండాల్సింది మానసిక సారూప్యత - మంచితనమో, లేక ఏదోరకంగా గొప్పతనమో కాదు.   ఒక జంటలో సారూప్యత వుందీ లేనిదీ తెలుసుకోవాలంటే దానికి అందుబాటులో వున్న పరిష్కారం సహజీవనమే కానీ ఇది చాలామంది ఒప్పుకోరు, అంగీకరించరు - దీనికంటే ఏదోలా బ్రతుకు లాగెయ్యడమే బెటర్ అంటారు. జావితాన్ని ఏదో ఒక విధంగా లాగించివేద్దాం అనుకునేవారికి ఇవన్నీ అవసరం లేదు - జీవితాన్ని జీవించేద్దాం అనుకునేవారు పెళ్ళి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పెళ్ళి చూపుల్లో ఓ గంట చూసి ఓ అరగంట మాట్లాడి అంతా అర్ధం అయ్యిందనుకుంటే మున్ముందు జీవితంలో వచ్చేది ఆనందం కాదు - అనర్ధం కూడా అవచ్చు. 

కెనడాలో ఒక ఫ్యామిలీ వుండేది. ఆ జంట కొన్ని ఏళ్ళుగా నాకు బాగా పరిచయం. వారిది ప్రేమ వివాహం (ఒకే కులం). వారికి టీనేజీ పిల్లలు వున్నారు. ఒక రోజు భర్త ఫోన్ చేసి విడాకులు తీసుకోవాలనుకుంటున్నాము అని చెప్పి నా సలహా అడిగాడు. పెళ్ళి అయి ఇన్నేళ్ళుగా మీలో సర్దుబాటు లేనప్పుడు ఇంకా ఈ దాంపత్యాన్ని పొడిగించడం అనవసరం - తటపటాయించకుండా విడాకులు తీసుకోండి అని చెప్పాను. అదే రోజు భార్య కూడా నాకు ఫోన్ చేసి అదే విషయంలో నా సలహా అడిగింది. ఆమెకూ తన భర్తకు ఇచ్చిన సలహానే ఇచ్చాను. మొత్తం మీద వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. పిల్లలకి తండ్రి అంటే ఇష్టం లేదు - తల్లి దగ్గరే వుంటున్నారు. అతను మరో పెళ్ళి చేసుకున్నాడు. విడాకులు తీసుకోవడమే  మంచి పని అయిందని ఇప్పుడు హాయిగా జీవితం వెళ్ళదీస్తున్నామనీ వారిద్దరూ నాకు చెప్పేవారు.     

అసలు పెళ్ళే అవసరం లేదు - ఎంచక్కా సహజీవనం చేస్తూనే వుంటామనుకుంటే అది ఇంకా చక్కని విషయం. పెద్దగా బాదరబందీలు వుండవు. ప్రతి దాంట్లోనూ చిన్న చిన్న సమస్యలు వుంటాయి కాబట్టి ఎలాగోలా పరిష్కరించుకోవచ్చు.
సహజీవనంలో వీరికి పిల్లలు పుట్టాక విడిపోవాల్సి వస్తేనో? పిల్లల సంక్షేమం  దృష్ట్యా ఎవరి దగ్గర వుంటే బావుంటుందో వారు ఎక్కువగా పిల్లల బాధ్యత తీసుకోవాలి. ఖర్చులు భరణం రూపేనా ఇద్దరూ భరించాలి. ఎలాగూ సహజీవనం చేస్తూ విడిపోయారు కాబట్టి  భార్యకు ఇవ్వాల్సిన భరణం వుండదు.  ఇద్దరిలో పిల్లలు ఒకరి దగ్గర వున్నప్పుడు మరొకరు పిల్లల భరణం చెల్లించాలి.  

7 comments:

  1. Yes sir. Excellent sir. The only problem is that you try 3 years with kamala, 3 years with kalpana, 4 years with appalamma, 2 years with lankhini, 1 year with tATaki what heppens then is you will beget one mArIcha, one ravana and one subahu and then remain unmarried even at 52 years and yet be free. Any indians reading this blog? Please follow this advice.

    ReplyDelete
  2. చాలా నిజాలు చెప్పేసారు. కానీ ఇవన్నీ అనుభవంలోకి వస్తే కాని అర్ధంకావు...ప్రేమించుకున్నవాళ్ళకైతే మరీనూ...ఎవరి అనుభవం ద్వారా వాళ్ళు తెలుసుకోవలసిందే.
    కానీ మీ సలహాతోనే నాకు కొన్ని ప్రాబ్లంస్ ఉన్నాయి.

    1. మీరు సూచించినట్లుగా సహజీవనం చేస్తే ఎవరూ భరణం ఇవ్వరు. అందరూ కాదు. విడాకుల కేసులు చూస్తున్నాం కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరి మీదో పిల్లల యొక్క బాధ్యతలు పడతాయి. వాళ్ళని పెంచగలిగే శక్తి ఉంటే సరే. లేకపోతే పిల్లల భవిష్యత్తు నాశనమయిపోతుంది.

    2. ఒకరితో విడిపోయి ఇంకొకరితో సహజీవనం చేస్తే అంతా మనకు నచ్చినట్లే ఉంటుందా? ఇక్కడ పొందని ఆనందం అక్కడ పొందేస్తామన్న గ్యారంటీ ఉందా? ఇంకెప్పటికీ అలా ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ పోవటమేనా? (మరీ భయంకరమైన విభేదాలుండేవాళ్ళ గురించి చెప్పటంలేదు. కానీ చిన్న చిన్న పొరపచ్చాలు....ఈ మద్య అలా విడిపోయిన రెండు జంటలను చూసాన్లెండి.).

    ReplyDelete
  3. @అజ్ఞాత
    మంచి విషయాలు సూచించారు. తప్పకుండా అలాగే చేద్దాం.

    @భవాని
    1.ఇండియాలోనూ, ఇతరదేశాల్లోనూ పిల్లల సంరక్షణ మీద ఈ విషయం లో ఎలాంటి చట్టాలు వున్నాయో నాకు తెలియదు. అభివృద్ది చెందిన దేశాల్లో చట్టాలు చాలావరకు పిల్లల బాగోగులను దృష్టిలో పెట్టుకునేవుంటాయి. పెళ్ళి అయినా కాకపోయినా జంటలో ఇద్దరికీ బాధ్యత వుంటుంది. అసలు సహజీవనం మీద ఇండియాలో చట్టం వుందో లేదో నాకు తెలియదు.

    2. చర్చ కోసం మీరన్నట్లు జరిగే అవకాశం వున్నా నిజానికి అలా జరిగే సందర్భాలు చాలా తక్కువ. నేను చూసిన సహజీవనం జంటలు ఎవరూ అలా చేయలేదు.

    మీరు ఒక రూం మేటుతో వుండి తనతో పడలేదనుకోండి. ఏం చేస్తారు? భేదాలు చిన్నవయితే సర్దుకుంటారు - పెద్దవయితే మరో గదికి మారి మరో రూమ్మేటును చూసుకోవాలనుకుంటారు . అక్కడా సరిపడకపోతే? అది ఎంతో ఇదీ అంతే. మరో రూం మేట్ ని చూసుకుంటారా లేక అలా చూసుకున్నా అక్కడ కూడా ఇలాగే వుండవచ్చని ఎన్ని భేదాభిప్రాయాలున్నా, ఎన్ని అవమానాలు, చికాకులు వున్నా అలాగే సర్దుకుపోతారా? పిరికివారు, రిస్క్ తీసుకోని వారు అలాగే వుండిపోతారు. ధైర్యవంతులనే విజయం,ఆనందం వరిస్తుంది. ధైర్యం అంటే రిస్క్ తీసుకోవడం కూడా వుంటుంది.

    ReplyDelete
  4. @anonymous: "...and then remain unmarried even at 52 years."

    The whole point of living is to get "married" isn't it? :). Dear friend, what one should be concerned about is to make it sweet and think about the rest (In fact, thats what we do but don't wanna appear so).

    @Sarath: I abhor the very idea of arranged marriages to me they are a kinda business dealings. But live-in relations are a bit too much aren't they?

    ReplyDelete
  5. భారతీయత అంటే కుటుంబ వ్యవస్థ. అమ్మ, నాన్న, అన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఇలాంటి బంధాలు, అనుబంధాలతో రూపుదిద్దుకున్న వ్యవస్థ.

    మీరు చెప్పినట్టు పెళ్ళంటే మానసిక సహజీవనమే.కాని పెళ్ళంటె ఒక బాధ్యత కూడా.భరణం కాదు.

    ఒక జంట విడిపొతే కేవలం ఎవరు ఎంత భరణం ఇవ్వల్సి వస్తుంది? ఆ భరణం తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయాలు ఏమిటి? అని ఆలోచించడం కంటె వాళ్ళు విడిపోవడం వల్ల కలిగే ఇతర అనర్ధాలు (బలహీనమయ్యే మానవ సంబంధాలు, భార్యా భర్తల బంధమొకటే కాకుండా వారిద్దరితోనూ కలిసివున్న మిగిలిన బంధాలు) మాటేమిటి?

    భార్యా భర్తల బంధమే సరిగా లేనపుడు ఇతరబంధాల గురించి ఆలోచించడం ఎందుకు? అనే వాదనా రావచ్చు.కాని కుటుంబ వ్యవస్తే ప్రమాదంలో పడుతోంది కదా.

    జీవితం అంటే కొంతవరకు సర్దుకుపోవడం. Perfectionism ఒక మానసిక జాడ్యం అని చెప్పిన మీరే perfectionism కోసం ఆలో చిస్తున్నారేమో?????????

    ReplyDelete
  6. హలో, శరత్ గారు నాపేరు ramgopal నేను తెలుగులో బ్లాగ్ను వ్రాస్తున్నాను. నేనుకూడా వల్లి గారి వ్యాఖ్యతో ఎకిబవిస్తున్నాను .
    అలాగే నేటి సామాజిక పరిష్టితుల్పై కొన్ని విషయాలు నా బ్లాగ్లో వ్రాశాను వీలుంటే నా బ్లాగు కూడా చుడండి.
    ramgopal-s.blogspot.com

    ReplyDelete
  7. పెళ్లి వాస్తవం అయినప్పుడు విడాకులు సహజీవనాలు అవసరమా?..."నేను "అని ఆలోచించుకునేవారికి పిల్లల భవిష్యత్తు వదిలేయడమేగా.....విడిపోయి తండ్రిని తేగలరా అలానే తల్లిని తేగలరా ?పెళ్లి అంటేనే ఒక కుటుంబం ఏర్పాటు ,భాద్యత తో కూడిన ''భంధం ''......పరస్పర సర్దుబాటు ....తప్పనిసరి పరిస్థితుల్లోనే విడాకులు ...సాద్యమైనంతవరకు ప్రాబ్లం సొల్వె చేసి వివాహం బ్రేక్ కాకుండా సలహాలు ఇచ్చేవారు చూడాలి .
    మీ ఆర్టికల్ ,వివాహవ్యవస్థని కూల్చేట్లుంది కాని నిలబెట్టేట్లు లేదు (పెళ్లి వాస్తవం )

    ReplyDelete