పెళ్ళిచేసుకున్నాక... ఓ అయిదేళ్ళాగండి

మీరు పెళ్ళిచేసుకోవాలనుకుంటున్న వారు అయినా లేక ఈమధ్యనే పెళ్ళి అయిన వారు అయినా పిల్లలని కనడానికి ఓ అయిదు ఏళ్ళు వ్యవధి ఇస్తే బావుంటుంది. అయిదేళ్ళు ఎక్కువనిపిస్తే కనీసం మూడేళ్ళు అన్నా వ్యవధి ఇవ్వడం మంచిది.  పిల్లలు పుడితే మీ దంపతుల శ్రద్ధ పిల్లలమీదే వుండి మీలో ఒకరిమీద ఒకరికి శ్రద్ధ తగ్గిపోతుంది.    

అలా గ్యాప్ ఇస్తే పిల్లలు పుట్టేలోగా ఒకరి మనస్సులు ఒకరికి బాగా అర్ధమవుతాయి. ఒకవేళ ఆలోగా దంపతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిలో వారికి పొసగలేదనుకోండి - ఎంచక్కా విడాకులు తీసుకోవచ్చు. పిల్లలు పుట్టాక విడాకులు తీసుకోవాలంటే వ్యవహారం కుడితిలో పడ్డ ఎలుకలా అవుతుంది. పిల్లల మీద ప్రేమ - పార్ట్నర్ మీద ద్వేషంతో ఎటూ వీలుకాని పరిస్థితిలో వుండిపోతారు. పిల్లల కోసమయినా ఆ సంసారాన్ని లాగించాల్సివస్తుంది. బలవంతపు సంసారం ఎలా వుంటుందో చెప్పనక్కరలేదు.

కొన్ని ఏళ్ళ క్రితం మా ఫ్రెండు ఒకతను విడాకులు తీసుకున్నాడు. అప్పటికే ఆ దంపతులకి ఓ మూడేళ్ళ పాప వుంది. ఆ పాపను కాదు అనుకొని ఎలా విడాకులు ఇవ్వగలిగాడో నాకు అయితే అర్ధం కాదు. నాకు దగ్గరి మిత్రుడు కాకపోవడంతో వివరాలు తెలియవు. పిల్లల మీద అంతగా మమకారం లేకపోతే పిల్లలు పుట్టిన తరువాత కూడా బాగా మనస్పర్ధలు వస్తే విడిపోవచ్చేమో!   

ఒక్కోక్కప్పుడు పిల్లలు వున్నారని మనసు చంపుకొని బలవంతంగా కలిసివుండి ఇంట్లో అశాంతి, గృహ హింస పాలిట పడేదానికన్నా దంపతులు విడాకులు తీసుకుంటేనే పిల్లలు ఎవరిదగ్గరో ఒకరి దగ్గర ప్రశాంతంగా వుండవచ్చు.   

అసలు విడాకుల విషయమే పెద్ద సంక్లిష్ట వ్యవహారం అంటే పిల్లలు వుంటే పరిస్థితి ఇంకా క్లిష్టంగా  అవుతుంది. వ్యవహారం ఇక సులభంగా తెగదు - ముడివడదు. అందుకే ఇన్ని చిక్కులు రాకుండా వుండాలంటే పెళ్ళి అయాక వెంటనే పిల్లలని కనేసేయకుండా ఒక అయిదు లేదా మూడు ఏళ్ళన్నా ఆగితే ఆలోగా భార్యాభర్తలలో ఒకరి సంగతి ఒకరికి పూర్తిగా అర్ధం అవుతుంది. వారిలో ఏవయినా తేడాలు వచ్చి అస్సలే సర్దుకోలేకపోతే హాయిగా విడాకులు ఇచ్చేసుకోవడమే మంచిది. అలాచేయకుండా బలవంతంగా కలిసివుంటే రోజూ ముసుగులో గుద్దులాటలు తప్పవు.

రోజూ పోట్లాడుకుంటూవున్నా జంట కలిసేవుండాలనే చాదస్తుల, సనాతనుల మాటలు పట్టించుకోకండి.    

15 comments:

  1. కానీ పెళ్ళి అవగానే గర్భనిరోధాలు వాడటం వల్ల సంతానోత్పత్తి అవకాశాలు తగ్గిపోతున్నాయని పేపర్లలో చూస్తున్నాము. అపుడు అసలుకే ఎసరు అవుతుంది. అందుకే ఎక్కువ మంది మొదటి సంవత్సరంలోనే పిల్లలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

    ReplyDelete
  2. హ్మ్ హ్మ్... ;)

    ReplyDelete
  3. meeru cheppindi baagane undi...kakapothe pellayya 5 yrs tarvata nachhaka pothe vidipovam ante dating avutundi:)
    deniki inkedanna manchi solution vetukudam...

    ReplyDelete
  4. Interesting post.

    We had a gap of three years, not because of any mistrust, but just by choice. I was unemployed ( A research student) when I got married and wanted to wait for a couple of years and it got dragged on to 3 because of my shuttle service between India and the US those days. As of the understanding aspect, we had a gap of 9 months between the engagement and the marriage and that really helped us understand the likes and the dislikes of eachother and get adjusted by the time we got married (Not many adjsutments though .. one major adjustment was Garlic - she is a biiiiig fan of Garlic and I didnt like it much but then we climbed a step down each and it was cool .. hehe)

    ReplyDelete
  5. శరత్, రెండు మూడేళ్లలో తెలిసే సౌడభ్యానికి పెళ్లోకటి ఎందుకు పెళ్ళికి, పెటాకులకు బోల్డు కర్చు.
    కలిసి తిరిగి తేల్చుకొంటే పోలా ఇంగ్లీష్ వాళ్ళ లాగా .
    నిజం గా గొడవలు రావాలంటే అప్పడి దాకా బాగుండి పిల్లలు పుట్టాక రాకూడని లేదు.
    మీకు నాకే కాదు ప్రపంచమతా ఈ పిల్లల్ని వదిలి విడాకుల పద్దతి సరి కాదు అంటున్నారు మరి అలాంటప్పుడు గొడవలతో కలిసుండటం సరైన్దనా.. ఇది ఇంత సింపుల్ గా సిందాంతం చేసే విషయం కాదండి. ఎవడి గోల వాడు పడాలి.

    ReplyDelete
  6. అసలు మీరు "అయిదేళ్ళు ఎక్కువనిపిస్తే కనీసం మూడేళ్ళు అన్నా వ్యవధి ఇవ్వడం మంచిది" అనడం విడాకులకోసమా!! నేనింకా "పిల్లలు పుడితే మీ దంపతుల శ్రద్ధ పిల్లలమీదే వుండి మీలో ఒకరిమీద ఒకరికి శ్రద్ధ తగ్గిపోతుంది" కాబట్టి అనుకున్నానే :)

    "పెళ్ళి అయాక వెంటనే పిల్లలని కనేసేయకుండా ఒక అయిదు లేదా మూడు ఏళ్ళన్నా ఆగితే ఆలోగా భార్యాభర్తలలో ఒకరి సంగతి ఒకరికి పూర్తిగా అర్ధం అవుతుంది"
    మరే... పెళ్ళయ్యాక మూడేళ్ళపాటు ఒకరిగురించి ఒకరు అవగాహన ఏర్పరుచుకొనేందుకు ప్రయత్నించేకంటే. అదేదో ఏడ్చాకే పెళ్ళిచేసుకోవచ్చుకదా? లేదా ఏకంగా పిల్లలు పుట్టాకే "పరస్పరావగాహన పాదుకొల్పే చర్యలు" చేపట్టవచ్చుకదా?

    "ఒక్కోక్కప్పుడు పిల్లలు వున్నారని మనసు చంపుకొని బలవంతంగా కలిసివుండి ఇంట్లో అశాంతి, గృహ హింస పాలిట పడేదానికన్నా దంపతులు విడాకులు తీసుకుంటేనే పిల్లలు ఎవరిదగ్గరో ఒకరి దగ్గర ప్రశాంతంగా వుండవచ్చు."
    మీరు తొందర్లోనే భారతీయ వివాహ వ్యవస్థ మరియు దాని ఔన్నత్యము AND/OR పటిష్టత గురించి గట్టిగా స్పీచింపబడతారని ముందస్తుగా హెచ్చరిస్తూ మీతో అంగీకరిస్తున్నాను. ఈ లోగా చూడుడు సతీ సావిత్రి, సతీ అనసూయ et al.

    ReplyDelete
  7. chala correct ga chepparu. naku kuda appudappudu anipistundi. endukante mana attention motham babu /papa meeda vuntundi kani partner meeda vundau. inkoka chinna salaha.. okavela already oka papa/babu vunte inko 3-5 years varaku redo valla gurinchi alochinakandi.

    Sarath garu,
    meeru inka kochem eloberate ga rayochukada sir!!!

    ReplyDelete
  8. ఏంజెప్పినవనా..!!

    ఇయ్యాలరేపట్ల అందరుగూడ ముప్పై ఏండ్లు మీదవడ్డంకనే పెండ్లిజేసుకుంకున్నరు. వాల్లు ఇంకో ఐదేంద్లు ఆగితే అప్పుడు పిల్లలు పుడ్తరన్న గ్యారంటీ లేదు. అన్ని రోజుల తర్వాత విడాకులు తీసుకుంటే మళ్లీ పెళ్లి అవుతుందన్న బరోస లేదు.

    ఇంక ఏంజెయ్యమంటవో నువ్వే చెప్పు. (హాయిగా బ్లాగులు రాసుకుంటా కూర్చోవచ్చు)

    ReplyDelete
  9. @రౌడీ
    నిశ్చయానికీ, పెళ్ళికీ మధ్యన మీలో వుంది ప్రేమ. ప్రేమ ఒక భ్రాంతి - పెళ్ళి ఒక వాస్తవం. దీనిమీద ఒక టపాలో నా అభిప్రాయం వివరిస్తాను.
    @ సుజాత
    :)
    @ మైత్రేయి
    చాలా మంది అలా అంటూవుంటారు కానీ ఇర్రివోకబుల్ డిఫరెన్సెస్ వున్నప్పుడు విడాకులే ఉత్తమం
    విభేదాలు ఎప్పుడయినా రావచ్చు కానీ చాలావరకు విభేదాలు పెళ్ళి అయిన మొదటి కొన్ని ఏళ్ళలోనే తెలుస్తాయి.
    ఁఇనర్వా
    హెచ్చరించినందుకు ధన్య్వాదాలు :)
    అవును - మీరన్నట్లు అదేదో ఏడ్చాకనే పెళ్ళి చేసుకోవడం ఉత్తమం. ఓ మూడునాలుగేళ్ళు సహజీవనం చేసాక అన్నీ నచ్చితేనే పెళ్ళి చేసుకోవడం ఇంకా ఉత్తమం. ఒకరోజు రెండు రోజుల డేటింగ్ వల్ల పెద్దగా తెలిసేదేమీ వుండదు. మొదట్లో అందరూ బాగానే అనిపిస్తారు.

    ReplyDelete
  10. @ పానీపూరి
    :)

    @జీవని
    ప్రతి దానికీ కొన్ని సైడ్ ఎఫ్ఫెక్ట్స్ వుంటాయి. అవి కొందరికి ఎదురవచ్చు కానీ చాలామందికి ఎదురుకావు. ఉదాహరణకు కారులో వెళితే కొందరికి ప్రమాదం జరగవచ్చు - అలా అని అందరూ కారు ప్రయాణం మానుకోరుకదా.

    @ నెలబాలుడు
    హుం :)

    @ అజయ్
    అప్పుడు కూడా విడిపోకపోతే జీవితం నరకం అవుతుంది. ఏది బెటర్ - డేటింగా లేక నరకమా?

    ReplyDelete
  11. @ రౌడీ
    మీ దంపతుల మధ్య అలా 99% మానసిక సారూప్యత వుండటం చక్కటి విషయం. 1% గార్లిక్ చెడగొట్టింది.

    @ అజ్ఞాత
    ఇండియాలో అయితే రెండో సంతానానికి అంత గ్యాప్ ఇవ్వొచ్చు కానీ ఇతర దేశాల సంగతి తెలియదు కానీ కెనడా, యు ఎస్ లలో అంత గ్యాప్ ఇవ్వకూడదు. అందువల్ల వేరే సమస్యలు వస్తాయి. ఎందుకో ఒక టపాలో వివరిస్తాను.

    (ఆఫీసు నుండి) 'ఇంటికి వెళ్ళే రైలు' సమయం అవుతున్నందున అలా త్వరగా ముగించా :) ఇంట్లో బ్లాగులు వ్రాస్తూ సమయం వృధా చేయను!

    @ ఏకలింగం
    అంత పరిస్థితీ వస్తే నాలా 'బై' లా మారి అయినా రంధ్రాన్వేషణ చేసుకోవాలి ;))

    ReplyDelete