బుధవారం 12 ఆగస్టు 2009

స్వైన్ ఫ్లూ గురించి ఇండియాలో అంత కంగారు ఎందుకు?

స్వైన్ ఫ్లూ గురించి ఇండియాలో పడుతున్న కంగారు చూస్తుంటే నవ్వు వస్తోంది. ఇది సాధారణ ఫ్లూ కంటె తక్కువ భయంకరం అయినప్పుడు, సాధారణ ఫ్లూ కంటె తక్కువ మరణాలు సంభవిస్తున్నప్పుడు దీని గురించి మరీ అంత కంగాళీ, కంగారు ఎందుకు?

మొదట్లో మెక్సికోలో ఇది ప్రారంభమయినప్పుడు అక్కడి ప్రభుత్వం తప్పు లెక్కలు కట్టి మరణాలు విపరీతంగా ప్రకటించినప్పుడు ఇక్కడ కూడా అందరం కంగారు పడ్డాము. ఆ తరువాత ఆ లెక్కలు సవరించి ఈ ఫ్లూకి అంత దృశ్యం లేదని తేటతెల్లమయిన తరువాత దాని గురించి ఖంగారు పడటం మానివేసాం. ఏదో సాధారణ జాగ్రత్తలు తప్పితే నోటికీ,ముక్కుకీ గుడ్డలు కట్టుకొని ఎవరూ కనిపించరు ఇక్కడ. పబ్లిక్ ప్లేసులూ, పాఠశాలలూ మూసివేయరిక్కడ.

ఇదివరకు పాశ్చాత్యదేశస్తులే కంగారు మనుషులు, భయస్థులు, చిన్న విషయానికే పెద్దదిచేస్తారు అనుకునేవాడిని. ఇప్పుడు టివీ ఛానళ్ళు/ న్యూస్ ఏంకర్లు/పత్రికలు మొదలయిన వారి మితిమీరిన హడావిడితో భారత ప్రజలను వణికిస్తూ ప్రజలని పారనాయిడ్ లుగా చేసేస్తున్నారు.

ఇదే విధమయిన అభిప్రాయాలతో BBC లో ఒక విశ్లేషణ వచ్చింది చూడండి.
http://www.bbc.co.uk/blogs/thereporters/soutikbiswas/2009/08/the_swine_flu_vibe.html

దయచేసి ఇండియా బ్లాగర్లయినా ఇది గుర్తించి ఈ మితిమీరిన ధోరణిని తగ్గించేలా ఇతరులను ఎడ్యుకేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అంతేగాని అవాస్తవ వార్తా ప్రవాహాలలో కొట్టుకుపోతూ మీరు కూడా ఈ అనవసరపు ఆందోళనలను పెంచేలా టపాలు వ్రాయవద్దని, హిస్టీరియా పెంచవద్దని నా విజ్ఞప్తి.

స్వైన్ ఫ్లూ గురించి నా సూచన ఇది: సాధారణ ఫ్లూ రాకుండా ఎలా జాగ్రత్తపడాలో అలా జాగ్రత్త పడండి. చాలు.

7 comments:

అజ్ఞాత చెప్పారు...

>> ఏదో సాధారణ జాగ్రత్తలు తప్పితే నోటికీ,ముక్కుకీ గుడ్డలు కట్టుకొని ఎవరూ కనిపించరు ఇక్కడ..

అవునా గురువుగారు? తమరు చికాగో కానీ, న్యూ యార్క్ లో కానీ ఎయిర్ పోర్ట్ లు చూసి ఎంతకాలం అయ్యింది సార్? ఓ సారి లోపలకి వెళ్ళి చూడండి. ఎవరైనా నోటికీ,ముక్కుకీ గుడ్డలు కట్టుకొని కనిపిస్తే మళ్ళీ ఇంకో బ్లాగ్ రాయండి. ఓకే?

అజ్ఞాత చెప్పారు...

Thanks for the info, i thought H1N1 is the new visa type created by US for the new homosexual couples from india :)

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ అజ్ఞాత
నేను సరే శిష్యా పరమాణువా, మీరెంత కాలం అయ్యింది వెళ్ళి? నెలన్నర క్రితమే షికాగో విమానాశ్రయానికి వెళ్ళి ఒక మూడు గంటలు వున్నాను. ఒక్కరు కూడా అలా కనిపించలేదు.

@ అజ్ఞాత
H1N1 అనేది మీలా తింగరి వ్యాఖ్యలు చేసేవారికోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వీసా. అప్లయ్ చేసుకోండి - ఫలితం వుంటుంది.

భాస్కర్ రామరాజు చెప్పారు...

:):)

మంచు పల్లకీ చెప్పారు...

I have been to boston, pheonix and san fransisco in last week. I never seen a person with a mask.

srujana చెప్పారు...

ఎందుకో మీరే సెలవీయండి!!!!

రవి చెప్పారు...

:-)) ఇక్కడ బెంగళూరులో వాతావరణం బాగుండక, జనాలకు ముఖ్యంగా చిన్నపిల్లలకు జ్వరాలు పడుతున్నాయి. ఈ పందిఫ్లూ గురించి సరిగ్గా తెలిసి చావక, జనాలు వణుకుతున్నారు.

ఇంకొక విషయం ఏమంటే, ఇక్కడ ఆసుపత్రికి వెళితే అక్కడ నుండీ జ్వరాలు వస్తున్నాయట. అందుకనే ఎటూ తోచక అల్లాడుతున్నారు.