మొదట్లో వీటి గురించి సరిగ్గా తెలియక బ్రెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అని అనుకునేవాడిని. ఈ వసతిలో ముఖ్య సౌకర్యం ఏమిటంటే ఉదయం ఉపాహారం కూడా వాళ్ళే ఏర్పాటు చెస్తారు. మరొక చక్కటి విషయం ఏమిటంటే ఇలాంటి వసతులు సాధారణంగా ఇళ్ళల్లోనే వుంటాయి కాబట్టి వారి జీవిత విధానాన్ని మనం పరిశీలించడానికి వీలవుతుంది. ఏదో ఒక లాడ్జిలోనో , హోటల్ లోనో వున్న భావన లేకుండా ఒక కుటుంబంతో కలిసి వున్న భావన వుంటుంది. ఇలాంటి వసతి గృహాల్లో చక్కటి అనుభూతి పొందాలంటే పట్టణాలలో వుండేవాటికన్నా పల్లెటూరులు, టవున్లలో వుండేవాటిలో బసచేస్తే బావుంటుంది. పట్టణాలలో వుండే వసతులలో కుటుంబ వాతావరణం తక్కువ, వ్యాపార ధోరణి ఎక్కువ వుండి మనకు హోటలుకి వీటికి పెద్దగా తేడా అనిపించకపోవచ్చు.
నేను కెనడాలో వున్న రోజుల్లో తరచుగా కుటుంబ సహితంగా వెళ్ళి వీటిల్లో బస చెస్తుండేవారం. అమెరికా కెనడాలలో ఏ ప్రదేశం అయినా సందర్శించాలనుకుంటే అక్కడ బస చేయాలంటే ఇతర వసతులతో పాటుగా ఈ వసతిని కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. ఇతర పాశ్చాత్య దేశాలలో ఈ వసతులు వున్నయో లేవో, వున్నా వీటిని అక్కడ ఏమని పిలుస్తారో నాకు తెలియదు. సాధారణంగా మిగతా వసతులతో పోలిస్తే కాస్త తక్కువ ధరకే ఈ రకమయిన వసతి లభిస్తుంది.
వీటిల్లో వుండే మరొక ముఖ్యమయిన ప్రయోజనం ఏమిటంటే ఇవి రకరకాల వర్గాలను బట్టి బట్టి కూడా వుంటాయి. మనకు నచ్చిన వర్గానికి సంబంధించిన బి & బి కి వెళ్ళవచ్చును. ఉదాహరణ్కు మేము కెనడాకి వచ్చి పట్టణాల్లో వుంటూ పల్లెటూరులను, వ్యవసాయ క్షేత్రాలకు దూరం అయ్యాము కాబట్టి ఫార్మ్ హౌజ్ బి & బిలు ఇంటర్నెటులో వెతుక్కొని వెళ్ళేవారం. అక్కడ వారు చేసే వ్యవసాయం, జీవన పద్ధతులు, ఇండియాలోని, వ్యవసాయానికి ఇక్కడి వ్యవసాయానికి తేడాలను గమనించేవారం. అక్కడ వున్న పశుపక్ష్యాదులతో పిల్లలు బాగా ఆడుకునేవారు. రాత్రి కాగానే ఆ ఇంటివారు చలికాచుకొవడానికి ఇంటిముందు మంట వెలిగిస్తారు. ఆ చల్లగాలిలో వెచ్చని మంట కాగుతూ వారితో ముచ్చట్లు చెబుతూవుంటే కాలమే తెలియదు.
ఇటువంటి వాటిలో భోజన సౌకర్యం వుండదు కాబట్టి భోజనం కోసం ఎ రెస్టారెంటుకయినా వెళ్ళిరావడమో లేదా ఇంటిదగ్గరి నుండే భోజనం తెచ్చుకొవడమో చేయాలి. ఉదయం లేవగానే అల్పాహారం సిద్ధంగా వుంటుంది. వ్యవసాయక్షేత్రాలలో బసచెస్తే అక్కడ పండిన పంటల్లోంచే అల్పాహారంచెస్తారు కాబట్టి చాలా రుచికరంగా అనిపిస్తాయి. ఇలా ఫార్మ్ హవుజ్ బి & బి లే కాకుండా సరస్సు పక్కవి, బీచ్ ప్రక్కవి, నది ప్రక్కవి, పురాతన కట్టడాల దగ్గర వుండేవి, పర్యటన ప్రాంతాల దగ్గర వుండేవి ఇలా ప్రత్యేక వర్గాలుగా వుంటాయి. మనకు నచ్చిన వర్గంలోవి బి & బి వెబ్ సైట్లలో చూసుకొని వెళ్ళాలి.
1 comments:
Interesting info.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి