శుక్రవారం 14 ఆగస్టు 2009

రిజర్వుడు వర్గాలా? అయితే ఇలా చేయండి!

ఒక బ్లాగులో వ్యాఖ్యానించడానికి నిబంధన ఇది. అయినా వ్యాఖ్యలు వేసేవారు అలాంటిదేమీ ప్రకటించకుండానే వేసేస్తున్నారు కానీ ఆ వ్యాఖ్యలు తొలగించబడటం లేదు.

ఎవరి బ్లాగు, వాళ్ళిష్టమే అనుకోండి. ఈ విషయం ఆసక్తికరంగా అనిపించి మీకు తెలియజేస్తున్నాను.

"మీరు 1950 నాటి భారతరాజ్యాంగం చేత గుర్తించబడిన రిజర్వుడు వర్గాల్లో ఏదైనా ఒకదానికి చెందినవారైతే ఆ విషయాన్ని వ్యాఖ్యతో పాటు తప్పనిసరిగా తెలియజేయండి. అంతకు ముందు ఎన్నిసార్లు తెలియజేసినప్పటికీ ప్రతి తాజా వ్యాఖ్యకీ ఆ విధంగా మళ్ళీ మళ్ళీ తెలియజేయవలసి ఉంటుంది. లేకపోతే ఆ వ్యాఖ్య ఇక్కడ ఉంచబడదు. అందుకు మీరే బాధ్యులు."

4 comments:

అజ్ఞాత చెప్పారు...

ఎవరిని ఏమన్నా, "కేస్ వేసుకొందాం రా" అంటున్నప్పుడు, ఇలాంటి నిబంధన పెట్టటంలో తప్పు ఉంది అంటారా?

ఇక కామెంట్ వేసే వాళ్లు ఎవ్వరూ disclaim చేయటం లేదంటారా, వాళ్ల ఇష్టం, disclaim చేయకపోవటం ద్వారా ఉత్తరోత్తరా మేము రిజర్వుడు వర్గాలం కాబట్టి, మీ మీద కేస్ వేస్తున్నం అని అనటానికి అవకాశం ఉండదని బ్లాగ్ స్వంతదారుని అలోచన కావచ్చు.

మా ఊర్లలో ఎందుకయినా మంచిదని ఆ రిజర్వుడు వర్గాల కు చెందిన వాళ్లను కనీసం ఒకలిద్దరిని రాజకీయనాయకులు ముందుగానే రిజర్వ్ చేసి పెట్టుకొంటున్నారు, అవసరం అయితే కేస్ లు పెట్టటానికి పనికివస్తారని. ప్రముఖ మంత్రి వర్యులు, క్రిష్ణా జిల్లాలో పాత్రికేయుల మీద ఇలాంటి కూలి జనాలతో, కేస్ వేయించి విజయవంతం అయ్యి, మన దేముడు గారి ప్రశంసలు పొందినప్పటినుండి ఎవరి జాగ్రత్తలలో వాళ్లు ఉంటున్నారు. రాజకీయ నాయ్కులకు ఉన్న ముందు చూపులో, మన బ్లాగర్లకు కనీసం ఓ శాతం అన్న ఉండకూడదా అంట?
my 2 cents

అజ్ఞాత చెప్పారు...

నేను ఇక నుంచి అన్ని బ్లాగుల్లో ఇలా కామెంటేద్దాం అని డిసైడ్ జేష్నా !

నేన్ భీ ఒక 'రిజర్వేడ్' వర్గానికి చెందుతా ! నేనేసే కామెంట్ బాలేదు అన్నా సరే, అనకపోయినా సరే కేసేట్టేత్తా, ఏమనుకుంటున్నారో ! హన్నా !

ఆదిత్య చెప్పారు...

అన్యా..
బ్లాగుల్లో రాసేదంతా అబిప్రాయాలే, అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు రాసుకుంటున్నారు.
ఒక్క ఇంట్లో ఉండే వాళ్ళలోనే ఓ దానిపై ఎన్నో అభిప్రాయ భేదాలుంటాయ్, ఇక ఇక్కడ చెప్పేదేముందు ఒకరి అభిప్రాయం ఇంకోరికి నచ్చదు.
నచ్చలేదంటే మనం ఊర్కోంగదా! ఎళ్ళి ఆడిబ్లాగులో మన అభిప్రాయాలు రాసి పడేసి ఆడి అభిప్రాయాలన్నీ తొక్కలోవి అని చెప్పి వచ్చేతాం :)

ఐతే అన్నాయ్ ఇక్కడ చిక్కంతా ఎక్కడవచ్చిందంటే

అనగనగా X తన బ్లాగులో ఓ అమూల్యాభిప్రాయం రాసుకున్నాడు వేంటనే M అక్కడికెళ్ళి X రాసిందాన్ని ని కెలికి తన అతి అమూల్యాభి ప్రాయం అక్కడ రాసేసి వచ్చాడు, ఇంకో B కూడా వేంఠనే వెళ్ళి అక్కడి M వ్యాఖ్య పై తన అమూల్యాభిప్రాయం రాశేసి వచ్చాడు.
అంతా ఓకే..
ఉప్పుడు M కి తన అభిప్రాయాన్ని వ్యతిరేకించాడని B పైన కోపం వచ్చేసిందనుకో

అందరి బ్లాగుల్లో దూరి తను వారి అభిప్రాయాలను ఖండిస్తూ వ్యాఖ్యలు రాస్తూ తన ప్రతిభను చాటుకుంటూ పోతుంటే ఈ తొక్కలో B గాడేంటీ తన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు రాస్తున్నాడు అని ఒళ్ళుమండి పోతుందనుకో తిరిగి వాదన ద్వార B ని ఓడించ లేకపోతున్నాడనుకో వాదించి గెలవలేక పోతున్నాడనుకో
అప్పుడు అప్పుడే
B నోరుమూయించటానికి తన దగ్గర దాచి ఉంచిన అస్త్రాన్ని బయటకి తీసి ప్రయోగించాడనుకో అదే రిజర్వేషన్ అనబడే అస్త్రం అనుకో..
అన్నాయ్, ఎదుటోడు మనతో చర్చలు చేసి గెలుస్తాడో లేకపోతే కేసులే ఏస్తాడో తెలియని అయోమయంలో బ్లాగులు రాసుడంటే కత్తిమీద సామేగదా!
మరి ఇందంతా తమ బ్లాగుల్లో జరిగితే బ్లాగులు రాసుకునే వోళ్ళు అట్టాంటి నిబంధనలు రాసుకోవాలా వద్దా నువ్వే చెప్పు :)

తాడేపల్లి చెప్పారు...

ఆ సూచన ఇటీవల కలగూరగంప బ్లాగులోంచి తొలగించబడింది.