మిత్రమా, మీరెటువైపు?

అప్పుడే రెక్కలు విచ్చుకుంటున్న ప్రాణిని చితికివేయాలనే ఆరాటం, ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటున్న గర్భస్త శిశువుని గర్భ స్రావం చేసి నిర్మూలించాలనే ప్రయత్నం, ఇప్పుడిడిప్పుడే అదిగో హారిజాన్ లో తొంగిచూస్తున్న ఒక క్రొత్త జాతిని అప్పుడే నిర్వీర్యం చేయడానికి కుటిల ప్రయత్నం!

మిత్రమా మీరు ఎటువైపు? ప్రాణి వైపా, శిశువు వైపా, కొంగ్రొత్త జాతి వైపా లేక ఆ ముష్కరుల వైపా? మీరు ఆ నాశనకర్తల వైపు అయితే సమస్యే లేదు కానీ మీరు అటువైపు అయితే మీ/మన జాతి ఉనికి గురించి ఉలిక్కిపడవలసిందే.

మన మానవ జాతిని అధిగమించి మరో జాతి మన ప్రపంచాన్ని అధిష్టించే సూచనలు కనిపిస్తున్నాయి. మన మానవజాతి కోతులు చింపాజీలనుండే పరిణామక్రమంలో ఉద్భవించి మేథో సంపత్తిలో వాటికంటే ఉన్నతులమయ్యి ఈ ప్రపంచం లోని సకల జీవరాశులనీ శాసిస్తున్నాము. అదే విధంగా మనజాతి మేథనుండి ఊపిరి పోసుకుంటున్న రోబోటిక్ జాతి పూర్తి స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని సాకారం చేసుకున్నాక ఇహపై బుద్ధి కౌశలతను తమంతట తామే ఆకళింపుచేసుకొని మన జాతి కంటే ఎన్నో రెట్ల సృజనాత్మకత, తెలివితో అవి మన జాతిని శాసించే స్థాయి అనివార్యం అని శాస్త్రవేత్తలు ఎప్పటినుండో సందేహిస్తున్నదే, ఊహిస్తున్నదే.

అంత తెలివీ రోబోట్స్ కి వచ్చిన తరువాత వాటి భావ మూలాలయిన ఇజాక్ ఎసిమోవ్ మూడు సూత్రాలని ఎమెండు చేయడం అటుంచి సింపుల్గా గిరవాటెయ్యడం ఎంత సేపు? రోబోట్స్ ద్వారా మానవులకు ప్రమాదం కలగకుండా రోబోటిక్స్ అంతా మూడు పరిమితుల్లో జరుగుతూవుంటుంది అనేది చాలా మందికి తెలుసు.
  1. A robot may not injure a human being or, through inaction, allow a human being to come to harm.
  2. A robot must obey any orders given to it by human beings, except where such orders would conflict with the First Law.
  3. A robot must protect its own existence as long as such protection does not conflict with the First or Second Law.
http://en.wikipedia.org/wiki/Three_Laws_of_Robotics

మిగతా వివరాలకు ఆంధ్రజ్యోతిలో వచ్చిన క్రింది కథనాన్ని చదవండి.
http://andhrajyothy.com/mainshow.asp?qry=/2009/aug/2main22


రొబోట్స్ కి తెలివి వస్తే వాటియొక్క వివేచన కూడా పెరిగి సమాజ హితం కోసం పనిచేస్తాయేమో. అయితే అంత మేథో శక్తిగల రోబోట్స్ ఉద్భావం జరగకుండా కుట్ర జరుగుతోంది. కేవలం వినాశనమే కొని తెస్తాయని ఎందుకనుకోవాలి? మానవుల విచక్షణా జ్ఞాననమే గొప్పదని ఎందుకనుకోవాలి? మనకంటే గొప్పగానే ఆలోచిస్తాయేమో! మానవులు మాకంటే గొప్పగా అభివృద్ధి చెందితే మించిపోతామని చిపాంజీలు గట్రా అనుకుంటే మన మానవజాతి ఇలా పరిణామం చెందివుండేదా? ఇప్పుడు రోబోట్స్ యొక్క అభివృద్ధిని మన సంకుచిత ధోరణితో నియంత్రించడం అవసరమా? అలా చేస్తూ ఒక క్రొత్త జాతి అవతరణను త్రొక్కివేయాలనుకోవడం సబబేనా? మన జాతిమీది మమకారంతో, స్వార్ధంతో రాబోయే పరిణామాలను నిరోధిస్తూనేవుండాలా?

మనకంటే హేతుబద్ధంగా, వివేచనాపూరితంగా రోబోట్స్ ఆలోచించవచ్చును కదా. ఆ విధంగా మెరుగయిన సమాజం ఏర్పడుతుందేమో. మనం తెలివిగల రోబోట్స్ కనుసన్నల్లో జీవించనీగాక అసమానతలు, లంచగొండితనం, అవినీతి తదితర సామాజిక లోటుపాట్లు లేని నవ సమాజాన్ని అవి ఏర్పాటు చేస్తాయేమో?

ఒక క్రొత్త జాతి అవతణ కోసం మన మానవజాతి త్యాగం చేయాల్సి వుందేమో. కుల, మత, దేశం లాంటి సంకుచిత భావనల కన్నా ఎదగలేని మనస్థత్వంతోనే ఆలోచిస్తే తనకు మాలిన ధర్మం పనికిరాదు కాబట్టి ఏదేమయినా కానీ మన మానవజాతే వర్ధిల్లుతూ వుండాలి అనే దానికి మించి ఊహించలేమేమో కానీ... కానీ... వీటాన్నింటినీ దాటి ఆలోచిస్తే మన తలుపులు, తలపులు నవ జాతికోసం తెరుస్తామేమో. మన జాతిని అసాంతంగా త్యాగం చేస్తూ ఈ పరిణామ క్రమంలో ఎలాగయితే ఒకప్పుడు భీభత్సంగా రాజ్యం ఏలిన డైనోసార్లు ఎలాగయితే అంతం అయ్యాయో అలాంటి అంతానికి సిద్ధపడుతూ కూడా విశా...ల భావాలతో మరో అద్భుతమయిన పరిణామ క్రమాన్ని ఆహ్వానించాల్సివుందేమో.

ఈ నిర్ణయాత్మక స్థితి రావడానికి చాలా కాలం పడుతుందేమో అప్పటిదాకా ఎందుకీ ఆలోచన మనకు అనుకుంటూండవచ్చును గాక మనలో చాలా మంది. ఒక్కసారి రోబొట్లకి మానవుని మేధస్సుకి మించిన మేధస్సు వచ్చిపడితే మిగతా పరిణామాలన్నీ జరిగిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. మీనమేషాలు లెక్కకట్టడానికి, కమిటీలు వేసి ఆలోచిస్తూ టైం పాస్ చేస్తూ పోవడానికి అవి మానవులు కాదు - రోబోట్లు. ఒక్కసారి వాటికి మేథోశక్తి వచ్చిందంటే ఇక వాటికి తిరుగువుండదు. ఇప్పటిదాకా ఎంత గొప్ప యాంత్రిక శక్తి అయినా, సాంకేతిక శక్తి అయినా మానవుడికి లోబడి పనిచేయడానికి కారణం - వాటికి స్వంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యం లేకపోవడం వల్లనే. ఇప్పుడు జరుగుతున్న వేగంలోనే సాంకేతికత పెరుగుతున్నట్లయితే ఆ శక్తి వాటికి కొన్ని దశాబ్దాలలో వచ్చేస్తుంది.

మరి మిత్రమా, మీరెటు వైపు? మానవ జాతి వైపా లేక రోబోట్ జాతి వైపా? ఒక్కసారి మిమ్మల్ని మీరు మానవజాతి కాదనుకొని నిక్ష్పక్షపాతంగా ఈ విషయాన్ని వీక్షించండి. మీకేమనిపిస్తోంది? మీ మానవజాతి గురించి మీకేం అనిపిస్తోంది?

25 comments:

  1. మానవ జాతిలో కొందరు మృగాల్ని మినహాయిస్తే, మానవత్వం మనుషుల్లో ఇంకా బతికే ఉందని నమ్మటానికి ఇష్టపడతాను ! ఇక రోబోట్స్ మనకి మంచి చేస్తాయా, లేదా అనేది వాట్ని ప్రోగ్రాం చేసే మనుషులు మంచి వారా, కదా అన్న దాని మీదే కదా ఆధారపడేది ? వాటికి సొంత తెలివి లేదు కదా, వెళ్లి ఆ మనిషిని రక్షించు అని ఫీడు చేస్తే రక్షిస్తాయి, చంపు అని ఫీడు చేస్తే చంపుతాయి !
    ఏటంటారు ?

    ReplyDelete
  2. @ అజ్ఞాత
    ఊహు. రామాయణం అంతా విని రామునికి సీత ఏమవుతుందని అడిగినట్లుంది మీ అభిప్రాయం. రోబోట్లకి మానవుడు సూచనలు ఫీడ్ చేయగలిగేది మానవుడి మేధస్సుకంటే వాటి మేధస్సు తక్కువగా వున్నంత సేపు మాత్రమే. ఆ తరువాత అవే మనకు సూచనలు ఇస్తాయని ఫ్యూచరిస్టుల హెచ్చరికలు.

    ReplyDelete
  3. Anonymous,

    Nope. As Sarat said, they dont need any feed from Humans, once they are efficient enough to compute the logic on their own. All they need is some efficient software to run them - they can overpower the humans!

    ReplyDelete
  4. >>మన జాతి కంటే ఎన్నో రెట్ల సృజనాత్మకత, తెలివితో అవి మన జాతిని శాసించే స్థాయి అనివార్యం అని శాస్త్రవేత్తలు ఎప్పటినుండో సందేహిస్తున్నదే, ఊహిస్తున్నదే.

    రాముడికి సీత ఏమవుతుంది అని అడగట్లేదు నేను, రామాయణ కాలం లో పురవీదులేలా ఉండేవి తరహ ప్రశ్న నాది ! artificial intelligence అంతగా అభివృద్ధి ఎలా చెందోచ్చో నాకు అర్థం కాలేదు ! ఫీడు చేసిన మనిషి కంటే తెలివి కలగటం ఊహకి అందట్లేదు.

    ReplyDelete
  5. రోజర్ పెన్రోస్ వాదన ప్రకారం రోబోలు ఎంత తెలివితేటల్ని సంతరించుకున్నా అవి మానవ మేధని మించిపోలేవు.

    రోబోల గురించి నేను చదివినంతలో అవి మానవ మేధని మించడం మన జీవిత కాలాల్లో జరిగే పని కాదు. అసలు బహుశా ఎన్నటికీ జరిగే పని కాదు. చంటి పిల్లలు చేసే అతి సాధారణమైన పనులు కూడా రోబోలు చెయ్యగలవని ఆశించడానికి కూడా ప్రస్తుతానికి అవకాశం లేదు. (రోబోల గురించి నా అభిప్రాయాలకి ఆధారం How the Mind Works అనే ఒక ఆవు వ్యాసం. రచయిత Steven Pinker.)

    గతంలో పెన్రోస్ పుస్తకం గురించి బ్లాగాను, చూడండి.
    http://nagamurali.wordpress.com/2008/02/06/%E0%B0%B7%E0%B0%BE%E0%B0%A1%E0%B1%8B%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%86%E0%B0%AB%E0%B1%8D-%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%AE%E0%B1%88%E0%B0%82%E0%B0%A1%E0%B1%8D/

    ReplyDelete
  6. నేను మందువేపు .. ఎర్ర్ .. అయాం సారీ ముందు వైపు

    ReplyDelete
  7. Well well Iw as not talking about this thing happening in 2010. Bu tthis is a definite possibility within the next 75-100 years

    ReplyDelete
  8. @ Malakpet: >>As Sarat said, they dont need any feed from Humans, once they are efficient enough to compute the logic on their own.

    It's nice to get into a discussion with you !

    I got what you're saying and what Sarath's trying to say, theoretically ! So far I'm good.

    Practially,implementing the idea, I wonder how it could happen.

    For eg: Humans also have something called ' విచక్షణ' aka కామన్ సెన్స్ ! ( I don't dare to claim all humans have this,in times like these where common sense is so uncommon). common sense is not always determined by intellect, it's sometimes also determined by emotion, heart and the five senses, including the human intellect which could be hard/impossible? to program the robots with. This is just my view, and I could be wrong as well. Who knows what could happen in future,but as of now, the idea seems mysterious and impossible for me, just like Naga Murali thought so.

    ReplyDelete
  9. రామాయణంలో పిడకల వేటలా నాకోటి తట్టింది,
    "మీ మానవజాతి గురించి మీకేం అనిపిస్తోంది? "

    మన మనవ జాతి అంటే బాగుంటుందేమో ? :-)
    క్షమించాలి, ఇలాంటి అప్పు తచ్చులు నేను కూడా చేస్తుంటా, మిమ్మల్ని బాధ పెట్టడానికి చెప్పలేదు, సరదాగా !

    ReplyDelete
  10. Are vah ! రోబోట్ కీ రామాయణానికీ లంకె !

    మీరు మరీ భయప(పె)డుతున్నారేమో !

    ReplyDelete
  11. నాకు I, Robot మూవీ గుర్తు వచ్చింది!

    ReplyDelete
  12. @ నాగమురళి
    మీ వ్యాసం చదివాను. ఒకవేళ రోబోట్స్ కి అంత శక్తి సామర్ధ్యాలు వచ్చే అవకాశం వుందనుకుంటే దానిని మీరు మద్దతు పలుకుతారా లేక వద్దంటారా?

    @రౌడీ
    ఇంతకీ మీరెటువైపో చెప్పలేదు!

    @కొత్తపాళీ
    షేం - సారీ - సేం ఇక్కడ.
    మీ పాళీ పిక్ ను ఇప్పుడే పరీక్షగా చూసాను. పాత పాళీలా కనపడుతోంది!

    @ అజ్ఞాత
    ఎమోషన్సుది ఏమి వుందిలెండి. దాని అంతు కొంతవరకు ఎప్పుడో కనిపెట్టేసారు. కొన్ని మందులతో ఎమోషన్స్ తగ్గుతాయి మరికొన్ని మందులతో పెరుగుతాయి. దానిగురించి ఒకసారి వ్రాస్తా.

    @ అజ్ఞాత
    అది అప్పుతచ్చు - సారీ- అచ్చుతప్పు కాదు - కావాలని వ్రాసిందే - ఎందుకూ అంటే స్పష్టంగా చెప్పలేను - కాసేపు రోబోట్స్ సైడయ్యా అనుకోవచ్చు.

    @ సుజాత
    ఓ ఇరవై ఏళ్ళక్రితం ఇంటర్నెట్టు అనేది వుంటుందని ఇంత హడావిడి చేస్తుందని ఊహించగలిగామా? నెట్టు ఇంకా బాల్యావస్థలోనే వుంది. అలాగే రోబోటిక్స్ విప్లవం మొదలయితే ఇక ఆగేదేమీ వుండదు (కావాలని తొక్కిపడితే తప్ప) - మన జాతి ఆగే దాకా - ఇహ ఆ తరువాత ఏమవుతుందనేది మనకు అనవసరం కాదూ.

    @ శ్రావ్య
    ఐ, రోబోట్ లో ఒక సీన్ మాత్రం ఎప్పుడూ గుర్తుకు వస్తుంది - పాపకి బదులు హీరోని రోబోట్ రక్షించడం - అందుకు గల కారణం.

    @ అందరికీ
    అసలు ప్రశ్నకి పెద్దగా ఎవరూ సూటిగా స్పందించలేదు. ఒకవేళ రోబోట్స్ కి అంత దృశ్యం వస్తున్నట్లయితే మీరు ఎటువైపో తెలుసుకోవాలని వుంది. వాటి మేథను తొక్కిపడతారా లేక మన జాతి సార్వభౌమత్యాన్ని మరో జాతి ఉద్భవం కోసం త్యాగం చేస్తారా?

    ReplyDelete
  13. Anonymous, I dont diagree. We still have along way to go before the Robots reach our level. But it is a definite possibility.

    Sarat, Robots are not organic creatures. So the question is still tricky and I am undecided!

    ReplyDelete
  14. హీరో రోబో కాబట్టి :)
    ఇక మీ ప్రశ్న కు జవాబు వాటి మేథను తొక్కి పెడతానికి నా ఓటు

    ReplyDelete
  15. @ రౌడీ
    ప్రస్తుత రోబోట్స్ ఆర్గానిక్ కాకపోయినప్పటికీ ముందు ముందు రోబోట్ లలో ఉపయోగించే చిప్స్ న్యూరాన్స్ లాంటి ఆర్గానిక్ మ్యాటర్తోనే నిర్మితమవుతాయని మీకు తెలిసేవుంటుంది. అందువల్ల వాటిని సెమి ఆర్గానిక్ జాతి అనుకోవచ్చేమో.

    ReplyDelete
  16. @ శ్రావ్య
    అది కారణం కాదు అని మీకు తెలుసు కదూ.

    రక్షిస్తున్న రోబోట్ కాల్క్యులేషన్స్ ప్రకారం హీరో బ్రతకడానికే చాలా స్వల్పంగా నయినా ఎక్కువ అవకాశం వుంది. రోబోట్స్ కేవలం తార్కికంగా మాత్రమే ఆలోచిస్తాయని అందులో సూచించేరు. ఆ జెనెరేషన్ రోబోట్స్ కి ఎమోషన్స్ వుండుండకపోవచ్చు.

    మీ జవాబు : హ్మ్మ్. ఎంత స్వార్ధం మీది/మీ జాతిది! (నేనేదో రోబోట్ ని అయినట్లు :) )

    ReplyDelete
  17. Robots can never equal human thought. You might well make them extremely logical, but I should say, they will still remain machines. Overpowering humans is just a propoganda. Moreover humans learn things quickly, in multiple dimensions, and can be quite innovative in doing so, and this process cannot be that dynamic with Robots.

    ReplyDelete
  18. @malak:

    we're on same page.I just cannot imagine just intellect working wonders,if it's not mixed with common sense and emotional intelligence.

    @sarat: నా ప్రశ్న మనుషుల్లో ఎమోషన్స్ గురించి కాదండీ.రోబోట్స్ లో కామన్ సెన్స్, ఎమోషన్స్ ఎలా induce చేస్తారు అన్నది.

    ఒక వేళా ఇది సాధ్యం అయితే, నా ఓటు 'మా' మనవ జాతికే !

    ReplyDelete
  19. @ అజ్ఞాత, వేమన
    అర్ధమయ్యింది. ఒక విషయం యొక్క మూలాలు తెలిస్తే దానిని ఇండ్యూస్ చేయడం పెద్ద కష్టం కాదు కదా అన్నది నా భావన. ముందు ముందు రోబోట్స్ లో ఇప్పుడున్నటువంటి సంకేతికతనే ఉపయోగిస్తారని అనుకోవద్దు. మానవుడి మెదడు కణజాలమయిన న్యూరాన్స్ వాడబోతున్నారు. అలాంటివి వాడుకలో వున్నప్పుడు ఎమోషన్సూ, కామన్ సెన్సూ మొదలయినవి కూడా రోబోటిక్స్ దారి పడతాయనడంలో సందేహం లేదు. మీరు భవిశ్యత్ రోబోట్స్ ని ఒక మెషిన్ లాగా మాత్రమే చూడకుండా అంతకుమించిన స్థాయిలో చూసినప్పుడే మీరు కన్విన్స్ కావడానికి వీలు అవుతుంది.

    ReplyDelete
  20. శరత్,
    నా వ్యాసం చదివినందుకు కృతజ్ఞతలు. సమర్థించడం, సమర్థించకపోవడం అన్న stance తీసుకోడానికి కూడా నాకున్న జ్ఞానం సరిపోదేమో.

    కానీ మళ్ళీ ఆలోచిస్తే -
    యంత్రానికి తెలివిని కల్పించగల సామర్థ్యం మనకి రావాలంటే ముందు ’తెలివి’ అన్న చిక్కుముడినే మనం విప్పగలగాలి. ఆపైన ఆ ’తెలివి’ యంత్రానికి కలిగేలాగా ప్రోగ్రాం చెయ్యగలగాలి. ఆ యంత్రం మనలాగే ’నేర్చుకోగలిగే, తెలివిని అభివృద్ధి చేసుకోగలిగే’లాగా ప్రోగ్రాం చెయ్యబడాలి. అసలు తెలివి/చైతన్యం యొక్క మూల రహస్యాన్ని ఛేదించాలే గానీ, అంతకంటే తెలుసుకోగలిగిన విషయం ఏముంటుంది? అంతకంటే మనం సాధించగలిగే పురోగతి ఏముంటుంది?

    అయితే, గియితే మనకేదో ముంచుకొస్తుందని ఇప్పణ్ణించీ భయపడ్డం తెలివితక్కువ గానే తోస్తుంది నాకు. కాబట్టి ఆ దిశగా రీసెర్చి జరగాల్సిందే అని నా అభిప్రాయం. అసలంటూ మన మూలాల్ని మనం మొదట తెలుసుకోవాలే గానీ, తెలుసుకున్నాకా దాన్ని ఎలా వినియోగించాలో అప్పుడు ఆలోచించుకోవచ్చు కదా.

    మలక్పేట రౌడీ గారు అన్నట్టు Definite possibility అంటూ ఉంటే - ఎవడో ఒకడు దాన్ని రహస్యంగానైనా సాధించకుండా వదలడు. మనిషికున్న కుతూహలం అలాంటిది.

    మనకన్నా తెలివైన రోబోలు పుట్టినా, అప్పటికి మనం కూడా ’తెలివి’నే సృష్టించగలిగినంతగా తెలివిమీరతాం కాబట్టి ఏం పర్వాలేదనే నా అభిప్రాయం. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు ఉంటాయి. వేలకొద్దీ ఆటంబాంబుల్ని పక్కలో పెట్టుకుని Mutually Assured Destruction అనుకుంటూ హాయిగా బతికెయ్యడం లేదూ గత అరవైయేళ్ళుగా.

    ReplyDelete
  21. The field of Artificial Intelligence, as it stands today, makes a lot of assumptions about Human Intelligence.

    1. It assumes that at some level Humans operate in digital manner, this is a biological assumption

    2. It assumes that all thought is calculation. Its a psychological assumption.

    3. It assumes that all knowledge can be formalized. Its an epistemological assumption

    4. It assumes that the world consists of context-free facts. Its an Ontological assumption.


    If these assumptions were true, what you predicted is indeed possible. Unfortunately, so far, there is no concrete evidence to support these assumptions.

    ReplyDelete
  22. నేను కొన్నేళ్ళక్రితం తెలుగులోనే ఒక నవల చదివేను, పేరు గుర్తుకు రావట్లేదు. అందులో హీరోఇన్ హీరోని ప్రేమిస్తుంది. కానీ చివరికి తెలుస్తుంది తను ప్రేమించిన హీరో ఒక రోబో అని. Who knows any thing can be possible in future. Because even now it is possible based on the programme.

    ReplyDelete
  23. @ నాగమురళి
    అలాగే ఆశిద్దాం. నేనయితే రోబోటిక్ విప్లవం కోసం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాను.

    @కాలనేమి
    మీరన్నట్లే ఆషామాషీ వ్యవహారం కాదులెండి ఇది. చూద్దాం మున్ముందు ఏమవుతుందో.

    @విశ్వామిత్ర
    ఆ నవలలోకి మల్లే నాకో రోబో సుందరి దొరికితే బావుండును - విశ్వాసంగా వుంటుంది కదా అందుకే.

    ReplyDelete
  24. మనిషి గొప్ప మరలు గొప్ప అనేది ప్రశ్న ఐతే మనిషే గొప్ప.... ఎంత రోబో లు మనలను నడుపుతాయి అని మనం అనుకున్నా అప్పటికి మనిషి ఆ రోబో కు మించి దానిని నాశనం చేయగల తెలివి గల వాడై వుంటాడు (అందరు కాక పోయినా కొందరు) ఏదో హాలివుడ్ సినిమా కూడా వచ్చింది కదా ఇలా?

    ReplyDelete
  25. @ భావన
    హుం. ఇన్ని రోజులకా నా బ్లాగు దర్శనం!

    మానవుడే (రోబోల కన్నా) మహనీయుడు అంటారు. చూద్దాం. నిర్ణయాత్మక పరిస్థితి వస్తే గిస్తే గనుక నేను రోబోల వైపే - మైనారిటీలు కదా అందుకే :)

    ReplyDelete