మనలో బ్లయిండ్ స్పాట్స్ వున్నాయేమో!

పాశ్చాత్యదేశాలలో డ్రైవింగ్ శిక్షణ ఇస్తున్నప్పుడు బ్లయిండ్ స్పాట్స్ చూసుకోమ్మని బాగా చెబుతూవుంటారు. మనం లేన్ మారున్నప్పుడు కానీ, మలుపు తిరుగుతున్నప్పుడు కానీ ఇతర వాహనాలు ఏ అద్దంలోనూ కనపడని ప్రదేశాలు వుంటాయి - అటువంటి ప్రదేశాలని మనం తలతిప్పి చూసి పరిశీలించుకోవడాన్ని బ్లయిండ్ స్పాట్ చెకింగ్ అంటారు. ఇది డ్రైవింగులో చేయాల్సిన ముఖ్యమయిన పని.

మన దృష్టిలో కూడా ఇలాంటి స్పాట్స్ వుంటాయి. ఆ ప్రాంతం నిజానికి మన కళ్ళకు కనపడదు కానీ మిగతా చుట్టూ అంతా కనిపిస్తూనేవుటుంది కనుక ఆ ఏరియా కూడా మనకు కనపడ్డట్టే అనిపిస్తుంది కాబట్టి మనకు ఆ అనుమానం రాదు. ఒక్కో కన్నులో ఒక బ్లయిండ్ స్పాట్ వుంటుంది.

అలాగే మన జీవితాల్లో, వ్యక్తిత్వాల్లో అలాంటి గుడ్డి స్పాటులు వుంటాయి కానీ మనకు తెలియదు - అవి ఇతరులకు మాత్రమే తెలుస్తాయి. ఉదాహరణకు మీరు చెస్ ఆటనో, పేకాటనో, క్యారంస్ నో ఆడుతున్నారనుకోండి - ఆడుతున్న వారికంటే ఆట చూస్తున్నవారికి ఒక్కోసారి గొప్ప గొప్ప ఐడియాలు వస్తాయి.

అలాంటి మనలో మనకు తెలియని ఇటువంటి మూర్ఖపు విషయాలని మనకు తెలియజెప్పేవారినే నిజమయిన స్నేహితులు, శ్రేయోభిలాషులూ అంటాము. ఒక వ్యక్తి తెలిసి తెలిసి లేదా కావాలని కొన్ని పనులు చేస్తూ అవి మనకు మూర్ఖంగా అనిపిస్తే అవి వారి బ్లయిండ్ స్పాటులు అనలేము. వారి దృష్టిలో అవి సరి అయినవే కావచ్చు. ఉదాహరణకు లైంగిక విషయాల గురించి నేను రాయడాన్ని, మాట్లాడటాన్ని ఎవరయినా అది నాకు తప్పు అని ఎత్తిచూపితే అది నాలోని బ్లయిండ్ స్పాటును సూచిస్తున్నట్లు కాదు - ఎందుకంటే అటువంటి విషయాలు నాకు ఇష్టమయ్యి చేస్తున్నాను కాబట్టి.

నాలో వున్న నాకు తెలియని లోపాలని ఇతరులు ఎత్తి చూపితే అది నాలోని బ్లయిండ్ స్పాట్స్ ని తెలియచెప్పినట్లు. ఉదాహరణకు కొన్ని నెలల క్రితం ఒక బ్లాగర్ నాకు ఈమెయిల్ చేసారు. లైంగిక విషయాల గురించి సమాచారం, విజ్ఞానంపై లింకులు మీ సాధారణ బ్లాగులో ఎందుకండీ, వేరే అడల్ట్ బ్లాగులో పెట్టుకుంటే బావుంటుందేమో అని సూచించారు. అప్పటిదాకా నేనేమీ బూతు లింకులు ఇవ్వడం లేదు కదా, సభ్యమయిన సమాచారం, విజ్ఞాన పరమయినవే కదా ఆ లింకులు అని ఇస్తూ వచ్చాను. ఈమెయిల్ వచ్చాక ఆలోచించి వెంటనే ఆ లింక్స్ తీసివేసాను.

నిజానికి మనలోని లోపాలు మన మిత్రులు, శ్రేయోభిలాషులకంటే మరొకరు చక్కగా ఎత్తిచూపుతారు. ఎవరు వారు? ఊహించగలరా? అజ్ఞాతలు. చెబితే మనం నొచ్చుకుంటామనో లేదా మన మనస్సు గాయపడుతుందనో లేదా చెప్పిన వారి మీద చెడు అభిప్రాయం కలుగుతుందో ఏమో అని చాలామంది మిత్రులు మన లోపాలని మనకు చెప్పరు - పైగా కొంతమంది మనస్సులో హేళనగా నవ్వుకుంటారు. బ్లాగావరణంలో అజ్ఞాతలకి అటువంటి ఇబ్బంది వుండదు కాబట్టి హాయిగా చెప్పేస్తారు. మన శ్రేయోభిలాషులు కూడా ఎదురుగా చెప్పలేక అలా అజ్ఞాతంగా సూచిస్తారు. నెట్టులో కాబట్టి అజ్ఞాతం బాగానే వర్కవుట్ అవుతుంది కానీ నిజ జీవితంలో అలా అజ్ఞాత సలహాలు అందే అవకాశం తక్కువ.

ఇక బ్లాగావరణంలో కూడా ఈ మనిషి చెబితే సవరించుకుంటాడు అన్న అభిప్రాయం కలిగినప్పుడే అలాంటి సూచనలు వస్తుంటాయి. పొగరుగా వుంటే ఎవడు పట్టించుకుంటాడు - కావాలని కెలుక్కునే వాళ్ళు తప్ప. అలా అజ్ఞాతలనుండి నాకు చాలా విలువయిన సూచనలు, సలహాలు వచ్చాయి. వారికందరికీ ఈ సందర్భంగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. మీరు చెప్పినవన్నీ నాకు రుచించకపోవచ్చు కానీ వాటిల్లో ఏమాత్రం నిజం వుందనుకున్నా నేను మారాను, మారతాను కూడా. మీరు చెప్పినవన్నీ చేయకపోవచ్చు కానీ మీరు నా బాగుకోరి మీ సమయం వెచ్చించి హితం చెప్పారని గుర్తుంచుకుంటాను. ఇక దురుసుగా, తిట్లతో వచ్చే అజ్ఞాతలది వేరే విషయం. వాటిల్లో కూడా ఏమయినా విషయం వుంటే ఆలోచిస్తాను.

నాలో అయితే ఇతరులకు ఎలా లోపాలు కనిపిస్తాయో అలాగే ఇతరులలో నాకు లోపాలు కనపడటం సహజం కదా. ఒక బ్లాగరు సాధారణ జనాన్ని హేళన చేస్తూ వ్రాస్తూ మేధావిలాగా కనపడటానికి యత్నిస్తుంటారు - మరొకరు ఎప్పుడో సిస్టం ముందే కూర్చున్నట్లు అనిపించి కుటుంబానికి తగిన సమయం ఇవ్వగలుగుతున్నారా అనిపిస్తుంటుంది. ఇంకా అలా ఎన్నో. అవన్నీ నేను అజ్ఞాతంగా చెప్పలేను, ఎదురుగా చెప్పలేను - చెప్పినంత మాత్రం వింటారా - వారి ధోరణి, లోపాలు వారికి తెలియకనా అనిపిస్తుంది.

(Edited. ఈ టపాలోనే ఒక బ్లయిండ్ స్పాట్ వుందని కొంతమంది సూచించారు. అందుకని ఈ పేరాని, దానికి సంబంధించిన వ్యాఖ్యలని తొలగించడమయినది)

సో, ఎందుకయినా మంచిది మీలో ఏమయినా బ్లయిండ్ స్పాట్స్ వున్నాయేమో చూసుకోండి లేదా మీలో నాకేమయినా కనిపించేయేమో అడగండి :) - అలాగే నాలో ఏమయినా మీ దృష్టికి వస్తే నాకు చెబుతూ వుండటం మరచిపోకండేం!

22 comments:

 1. మీ పోస్ట్ చాలా బాగుందండి.
  ఎవరి అభిప్రాయాలూ వాళ్ళు రాసుకుంటూ ఉంటారు.
  అవతల వాళ్ళని నొప్పించని కామెంట్లు పెట్టాలి కానీ దురుసుగా ప్రవర్తించ కూడదు అనేది నా పర్సనల్ అభిప్రాయం.

  ReplyDelete
 2. Sharat

  చాలా బాగా చెప్పారండి.సరదాగ వ్రాస్తునె చాలా Depth ఉన్న విషయం చెప్పారు.ఈ Post మీ యొక్క one of the Post అవుతుంది.

  Thanks

  Ali

  ReplyDelete
 3. @ కత్తి
  ప్రస్తుతానికి అలా నా దృష్టిలో ఏ బ్లాగరూ లేరండీ. ఎవరూ ఎలా వ్రాసినా ఫర్వాలేదా - టర్రరిస్టులూ వ్రాసుకున్నా పర్లేదా అని ఎవరయినా విమర్శిస్తారేమోనని ముందు జాగ్రత్తగా అది తగిలించానంతే.

  ఈ మధ్య మీ వ్యాఖ్యలు నా బ్లాగులో చూడక కేసు ఎపిసోడు తరువాత నన్ను మీ బ్లాక్ లిస్టులో వేసుకున్నారేమో అనుకున్నా :)

  ReplyDelete
 4. *త్తి - నీకు నువ్వు ఎలా కనిపిస్తావ్?

  ReplyDelete
 5. @కత్తి:ఈ దేశద్రోహులెవరబ్బా నా
  అబ్బా, దేశద్రోహులెలా ఉంటారో అస్సలు తెలియనట్లే, సరసం !

  ReplyDelete
 6. "ఒక బ్లాగరు సాధారణ జనాన్ని హేళన చేస్తూ వ్రాస్తూ మేధావిలాగా కనపడటానికి యత్నిస్తుంటారు - మరొకరు ఎప్పుడో సిస్టం ముందే కూర్చున్నట్లు అనిపించి కుటుంబానికి తగిన సమయం ఇవ్వగలుగుతున్నారా అనిపిస్తుంటుంది"

  యీళ్లెవురోజెప్పేస్తే పాపం వోళ్ళు తెలుసుకుంటారు కదా. చెప్పండి. ఆపైన వారిష్టం :)

  ReplyDelete
 7. Section 124A. Sedition
  1[124A Sedition


  Whoever, by words, either spoken or written, or by signs, or by visible representation, or otherwise, brings or attempts to bring into hatred or contempt, or excites or attempts to excite disaffection towards. 2[* * *] the Government established by law in 3[India], 4[* * *] shall be punished with 5[imprisonment for life], to which fine may be added, or with imprisonment which may extend to three years, to which fine may be added, or with fine.

  Explanation 1-The expression "disaffection" includes disloyalty and all feelings of enmity.

  Explanation 2-Comments expressing disapprobation of the measures of the attempting to excite hatred, contempt or disaffection, do not constitute an offence under this section.

  Explanation 3-Comments expressing disapprobation of the administrative or other action of the Government without exciting or attempting to excite hatred, contempt or disaffection, do not constitute an offence under this section.

  ReplyDelete
 8. Edited. ఈ టపాలోనే ఒక బ్లయిండ్ స్పాట్ వుందని కొంతమంది సూచించారు. అందుకని ఈ పేరాని, దానికి సంబంధించిన వ్యాఖ్యలని తొలగించడమయినది
  ???
  సమఝ్గాలే!!!

  ReplyDelete
 9. @ రామరాజు
  సమఝ్ కాకపోవడమే మంచిది లెండి :) ఒకరిపై హాస్యం ఆడబోతే అపహాస్యం అయిపోయింది. అందుకే తొలగించాను.

  ReplyDelete
 10. Super comedy Mahesh garu. You are the best! More please.

  ReplyDelete
 11. ఈ సెక్షన్ లూ, law లూ ఎందుకు, మన నోరు మంచిది అయితే, ఊరు మంచిది అవుతుంది అన్న సామతె చాలదా!! కె. బ్లా. సా. భాష లో అయితే, ఒక్కళ్లని కెలక్కు, కెలికించుకోకు అంటె చాలదా.

  శరత్ గారు, నేను పట్టుకొన్న కుందేలుకు ఒక కాలే అనకుండా మన అందర్లో blind spots ఉంటాయి, వాటిని చూసుకొంటూ , సరిచేసుకొంటూ పోవాలన్న మీ అభిప్రాయం మాత్రం చాలా బాగుంది.

  ఇక నా కామెంట్ బాలేదు అంటె మాత్రం, కేసు వేస్తా, మొన్నే ఒకల్లిద్దరిని, కూలికు కూడా మాట్లాడుకొన్న మా పెనమలూరి MLA స్పూర్తి తో, ఇక మీ ఇష్టం :))

  ReplyDelete
 12. మంచి టపా ఇందులో సంశయం లేదు. చలం మైదానం రాసేనాటికి రమణాశ్రమం చేరిన తరువాతి రాతలకి చాలా తేడా కనిపిస్తుంది. అలా మీ రాతలు కూడా మారిపోతున్నాయి. ఈ మార్పు ఎటువైపు పయనిస్తుందో? :))

  ReplyDelete
 13. "ఒక బ్లాగరు సాధారణ జనాన్ని హేళన చేస్తూ వ్రాస్తూ మేధావిలాగా కనపడటానికి యత్నిస్తుంటారు"
  ---
  ఒక్కరేన్టండి బాబు... ఇలాటి సరసులు చాలామందే ఉన్నారు.
  @జీడిపప్పు
  :)

  ReplyDelete
 14. @ విశ్వామిత్ర,
  హమ్మా! మెచ్చుకుంటూ మెచ్చుకుంటూ నన్ను నెమ్మదిగా, నెమ్మదిగా మఠంలో కలిపేద్దామనే! మీ పప్పులేం ఉడకవు. నేను జనజీవన స్రవంతిలోనే వుంటా.

  @ ఏకలింగం
  వున్నారు, వున్నారు. కాకపొతే వాళ్ళని మనమనుకుంటాం అలాగే మనని వాళ్లనుకుంటారేమో.

  @ గణేష్, ఆలి, అజ్ఞాత
  మీ ప్రశంసకి ఆనందపడ్డాను.

  ReplyDelete
 15. sarat gaaruu ii madhya mii raatalloa caalaa maarpu kanipistundi.raastunna vishayaalaloanuu alaagea vyaktiikarana loanuu kuuDaa.caalaa mamci pariNaamam.

  ReplyDelete
 16. 'అజ్ఞాత'ల నుండి వచ్చే వాటివల్ల ఉపయోగం ఏమిటో బాగా చెప్పారు.

  ReplyDelete
 17. @ రాధిక
  మీ ప్రశంసకి సంతోషించాను. అప్పుడప్పుడు చిలిపి టపాలు వేయకుండా మానలేనులెండి :)
  @ వాసవ్య
  అవునండీ. నేర్చుకోవాలనుకోవాలే కానీ ప్రతి మనిషినుండీ ఎంతో కొంత వుంటుంది కాదూ!

  ReplyDelete
 18. blind spots లేకుండా ఎవరు వుంటాము శరత్.. అందరికి తప్పని కోణం అది అందుకే గా జీవితమనే పోలీస్ అప్పుడు అప్పుడు భారి జరిమానా తో సత్కరిస్తుంది చూసుకోనందుకు.. (మరీ భారమయ్యిందా ) :-) మన బలహీనతలు చెప్పే మిత్రులు వుండటం కూడా అదృష్టమే

  ReplyDelete
 19. @ భావన
  అవును. జీవితం ఏ ఒక్కరి అనుభవాలతోనో పరిపూర్ణం కాదు. మిగతావారి అనుభవాలను కూడా ఉపయోగించుకోగలగాలి. అనుభవం వున్నవారే మన బ్లయిడ్ స్పాట్స్ గుర్తిస్తారు కదా.

  ReplyDelete