నే వ్రాసిన ఒకే ఒక్క ప్రేమలేఖ

అప్పట్లో సూర్యాపేటలో వుంటుండేవారం. మా స్నేహితుడి ఇంట్లో ఆ అమ్మాయి వాళ్ళు కిరాయికి వుంటుండేవారు. కొద్దిగా స్నేహం ఏర్పడింది. డిగ్రీ చదువుతుందామె. నేను పూణే లో పి జి చేస్తూ సెలవుల్లో ఇంటికి వస్తుండేవాడిని. ఆమె డైనమిజం, ఉత్సాహం, చురుకుదనం నాకు బాగా నచ్చాయి. కొంతకాలం ఆమెని పరిశీలిస్తూ వచ్చాను. నా అభిరుచులకి తగ్గ అమ్మాయి అని ధ్రువీకరించుకొని ఒక ప్రేమలేఖ వ్రాసి పూణే నుండి సూర్యాపేటలో వున్న మా స్నేహితుడికి పోస్ట్ చేసి ఆమెకి అందించమని చెప్పాను.

సహజంగానే ఆత్రుత. కొద్దిరోజులయ్యక మా ఫ్రెండుకి ఫోన్ చేసి కనుక్కున్నాను - రిజల్ట్ ఏమయ్యిందనీ. నెగటివ్. ఇప్పట్లో ప్రేమించే ఉద్దేశ్యం లేదని ఆమె స్పందన. కాస్త నిరాశ పడ్డా ఆమె పై పీకలోతు ప్రేమలోకి ఏమీ మునిగిపోలేదు కాబట్టి పెద్దగా దాని గురించి బాధ పడలేదు. లైట్ తీసుకున్నాను. ఇంకేముంది - మరో చక్కని అమ్మాయి కోసం అన్వేషణ. ఆ అన్వేషణ నడుస్తుండగానే మా స్నేహితుల, బంధువుల ప్రోద్బలంతో కొన్ని పెళ్ళి చూపులు. ఆ విశేషాలు మళ్ళెప్పుడన్నా.


ఆ తరువాత కొద్ది నెలలకి సెలవుల్లో పూణే నుండి ఇంటికి వచ్చాను. ఒక రోజు సూర్యాపేటలో కాంగ్రెసు వారి ప్రతిష్టాత్మకమయిన రాష్ట్ర స్థాయి బహిరంగ సభ ఒకటి జరుగింది. దానికి కొంతమంది జాతీయనాయకులు కూడా వచ్చినట్టున్నారు. మా స్నేహితుని ఇల్లు ఆ సభ జరిగే ప్రదేశానికి దగ్గర్లో వుండటంతో మా ఫ్రెండుతో కలిసి వాళ్ల ఇంటి డాబా మీది నుండి ఆ సభని చూస్తూ వుండగా వెనుకనుండి నా తల మీద ఎవరో ఠపీ మని ఎవరో కొట్టారు! ఎవరా అని చూద్దునుకదా ఆ అమ్మాయి! ఆశ్చర్యపడి, సంతోషపడ్డాను. కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నాం. నా ప్రేమలేఖ ప్రస్థావన ఇద్దరమూ తేలేదు.

ఆ తరువాత కొద్ది నెలలకే నా పెళ్ళి జరగడమూ, కెనడాకి వెళ్ళడమూ జరిగిపోయాయి. ఇండియాకి వెళ్ళినప్పుడల్లా ఆ అమ్మాయి గురించి కనుక్కుంటూ వుంటాను. సూర్యాపేటలోనే వుంటూ అక్కడి దగ్గరి గ్రామంలో ఉపాధ్యాయురాలిగా చేస్తోందిట. క్రితం సారి ఇండియా వెళ్ళినప్పుడు మా ఇద్దరినీ కలపాలని మా ఫ్రెండు ప్రయత్నించాడు కానీ కుదరలేదు. ఈ సారి వెళ్ళినప్పుడు ఆమెను ఎలాగయినా కలవాలి. ఆమె సమక్షంలో కొద్దిసేపు ఆహ్లాదకరమయిన గతంలోకి వెళ్ళాలి. అప్పుడు నన్నెందుకు తిరస్కరించేవూ అని చిలిపిగా ఆరాలు తీయాలి.

19 comments:

 1. Gurtukostunnaayi.......Gurtukostunnaayi.....modati premalo tiyyandanamooo.......

  ReplyDelete
 2. మొదటి ప్రేమలేఖ పి.జి. వరకు రాయలేదా? మరి డిగ్రి లొ ఎమి చెస్తున్నారు? ఒన్లీ చూడటమేనా? :-))))

  ReplyDelete
 3. శరత్ గారు,
  నాకో డౌట్. మీ ఆవిడకు తెలుగు చదవడం వచ్చా? :)

  ReplyDelete
 4. @ Dr.Narahari
  ఇది మొదటి ప్రేమ ఏమీ కాదండీ. ఆల్రెడీ అప్పటికే ఒక అమ్మాయి ప్రేమలో పడి తేలాను. ఇది నాకు నేనుగా ప్రేమించిన వైనం. సాధారణంగా ఎంత మందినో ఇష్టపడుతూనే వుంటాం కానీ అందరికీ ప్రేమలేఖలు ఇవ్వం కదా.

  @Prasad
  పెళ్ళికి దారితీయదగ్గ ప్రేమల రొంపిలో దిగడం నాకు పెద్దగా ఇష్టం వుండదు సుమండీ. అందుకే నన్ను ప్రేమించిన వారిని తిరస్కరించాను. ఇక్కడ మాత్రం ప్రేమలో పడిపోయా.

  @ ఏకలింగం
  మీ వాక్శుద్ధి తగలెయ్య. ఎన్నడూ నా బ్లాగు చూడని మా ఆవిడ ఇప్పుడే ఫోన్ చేసి నాకు బాగా తలంటింది. ఇప్పటివరకూ నా బ్లాగు అడ్రసు తెలియని తను ఎలా తెలుసుకుందా అని అవాక్కయ్యా. ఫోను కట్ చేసి కామెంట్లు చూద్దును కదా మీ కామెంట్ వుంది.

  నా బ్లాగు చూసి మా ఆవిడ వేసిన మొదటి డవిలాగు ఏమిటో రేపు చెబుతా. రేపటి టైటిల్లోనే ఆ డైలాగ్ వుంటుంది. వేచి చూడండి.

  ReplyDelete
 5. ఆనందమానంద మాయెనే
  శరత్ నెత్తి బొప్పి కట్టెనే :)

  ఈ రోజు ఇంటికెళ్ళు.. రేపు ఆఫీస్ కు రాగలవో లేదో :)

  ReplyDelete
 6. హీ హీ హీ ! మీ శ్రీమతి కి నా ఫుల్ సపోర్టు ఎక్స్టెండ్ చేస్తున్నా.

  ReplyDelete
 7. ఆవిడ నెత్తిన ఒకటిచ్చుకున్నప్పుడే అడిగి ఇంకొక రెండు కొట్టించుకుంటే బాగుండేది కదండీ:):)

  ReplyDelete
 8. బాగుందండి, ఇలాంటివి ఎన్నో ప్చ్ ఎంటో జీవితం..ఒక్క అమ్మాయి కూడా అమ్మాయి లాగా కనబడట్లేదు ఈ బెంగలూరు లో.. ఎక్కడున్నావమ్మా వెంకమ్మ ఒక సారి కనపడచ్చు కదా :(

  ReplyDelete
 9. రామిరెడ్డి
  ఇంటికివెళ్లగానే నా బ్లాగు మీద మా ఆవిడ పరిశోధనా పత్రం సమర్పిస్తుందేమోనని భయంగానే వుంది.

  @ Sujata
  హుం. ఎంతయినా మీ ఆడాళ్ళు ఆడాళ్ళు ఒకటే లెండి!

  @ పద్మార్పిత
  ఈ సారి కలిసినప్పుడు మరో రెండు అడిగేస్తానండి :)

  @ రాఘవ
  బెంగుళూరులో ఏ అమ్మాయీ అమ్మాయిలాగా కనపడటంలేదా! ప్చ్. అలాయితే చాలా కష్టం. ఇండియాలో ఎప్పుడయినా ఉద్యోగం చేయాలనుకుంటే బెంగుళూరులోనే చేయాలనుకునేవాడిని. ఇప్పుడు ఆ సిటీ నా లిస్టులోంచి క్యాన్సిల్. కనీసం సౌందర్యోపాసనకి అయినా అవకాశం లేకుంటే ఎలా?

  ReplyDelete
 10. LoL!

  so in front crocodile festival anna maata !

  ReplyDelete
 11. ఇంకో రెండు ఆవిడెవరినో అడగాల్సిన పనేముందండి ఇంటికెళ్ళాకా ఆ నాలుగూ అడక్కుండానే పడతాయిలే.
  ఏడవుతుంది ఇంటికెళ్ళారా?:)

  ReplyDelete
 12. డైనమిజం, ఉత్సాహం, చురుకుదనం ఉన్న ఆడవాళ్ళు తిరస్కరిస్తే పెద్దగా బాధ వెయ్యదా?

  ReplyDelete
 13. :-O ఇంతవరకు మీ ప్రేమ(లేఖ)ల విషయం మీశ్రీమతికి తెలియదా?

  ReplyDelete
 14. "ఈ సారి వెళ్ళినప్పుడు ఆమెను ఎలాగయినా కలవాలి. ఆమె సమక్షంలో కొద్దిసేపు ఆహ్లాదకరమయిన గతంలోకి వెళ్ళాలి. అప్పుడు నన్నెందుకు తిరస్కరించేవూ అని చిలిపిగా ఆరాలు తీయాలి. "

  చిన్న సవరణ :

  "మా ఆవిడతో ఈ సారి వెళ్ళినప్పుడు ఆమెను ఎలాగయినా కలవాలి. ఆమె సమక్షంలో కొద్దిసేపు ఆహ్లాదకరమయిన గతంలోకి వెళ్ళాలి. అప్పుడు నన్నెందుకు తిరస్కరించేవూ అని చిలిపిగా ఆరాలు తీయాలి. "(ఆవిడకి పెళ్ళయి ఉంటుంది కదా. ఇహ చిలిపి ఆరాలు, ఆహ్లాదకరమైన గతం ... హ హ హ ఆలోచించండి)

  నేను కూడా మీ శ్రీమతిగారికి ఫుల్ సపోర్ట్.

  ReplyDelete
 15. @ అజ్ఞాత
  అలాగే అనుకున్నా కానీ మా ఆవిడ బ్యుజీ పనుల్లో పడి ఆ విషయమే మరచిపోయిందండీ :)

  @ రాధిక
  నిజమేనండీ. భయపడుతూనే ఇంటికి వెళ్ళాను. ఏంటో ఏమీ జరగలేదు - ఆ ప్రస్థావనే రాలేదు. మీ ఆడవారూ, సృష్టీ ఎప్పుడు అర్ధం కావాలి? ఎప్పుడో తాపీగా ఈ ఆయుధం బయటకి తీయకపోదు అనిత (అనగా మా ఆవిడ).

  @ నేస్తం
  :)
  మీ ప్రొఫయిల్ పిక్ కళ్ళు బావున్నాయి. ప్రపంచం లోనే అత్యంత అందమయిన కళ్ళు అవి అని నాకు గుర్తుకువుంది. అఫ్ఘనిస్తాన్/ పుష్టాన్ అమ్మాయి కదూ!

  @ నీహారిక
  సరేలెండి. భగ్న ప్రేమికుడిగా మారమంటారా ఏమిటీ? అప్పటికే ఓ అమ్మాయి నన్ను ప్రేమలో పడేసి పెద్దగా తన ప్రేమకి న్యాయం చేయలేకపోయింది. గౌరవంగా విడిపోయాము. అందువల్ల తరువాత్తరువాతి ప్రేమలను అంత గాఢంగా తీసుకోలేదు. ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి అనుకున్నాను కానీ తటస్థపడలేదు. చివరికి కుదిర్చిన పెళ్ళి అయిపోయింది.

  @ పానీపూరీ
  నేను ఎలాంటి వ్యక్తినో పెళ్ళికి ముందు రెండు ఇంటర్యూలలో (అనగా పెళ్ళి చూపులు) అన్నీ చెప్పేసాలెండి. ఇక్కడ అభ్యంతరం నా ప్రేమ పురణాలని అందరితో పంచుకోవడం. ఈ టపా తీసివేయమని ఆదేశం కానీ ఎలాగోలా కన్విన్స్ చేసా.

  @ రమణి
  ఇండియాకు వెళ్ళినప్పుడల్లా సాధ్యమయినంతవరకూ నేను ఒక్కడినే వెళతానండోయ్. కనీసం ఇండియాలోనన్న కాస్త గాలి పీల్చుకోవాలి కదా. ఆమెకు పెళ్ళయినా ఆమాత్రం మాట్లాడే ప్రైవసీ దొరకబట్టుకునే ఏర్పాట్లు అక్కడ వున్న మా ఫ్రెండు చేస్తాడు లెండి.

  క్రితం సారి ఇండియాకు వెళ్ళినప్పుడు నా మాజీ ప్రియురాలిని (ఈమె కూడా ఉపాధ్యాయురాలే) ఆమె పని చేస్తున్న పాఠశాలకు వెళ్ళి కలిసి కొద్దిగా కబుర్లాడి వచ్చాను.

  ReplyDelete
 16. ఇదన్యాయం ! నేనొప్పుకోను ! crocodile festival లేదా అయితే ?

  crocodile festival అని పండగ సంబరాలు జరుపుకునే ఛాన్స్ లేదా మీకు ? ప్చ్ ! I pity you !

  ReplyDelete
 17. తెల్లారిందా గురు? రాత్రంత ఇంటి చుట్టు తరిమించుకొని తరిమించుకొని.....

  ReplyDelete
 18. @ అజ్ఞాత
  ఇది తుఫాను ముందు ప్రశాంతత కావచ్చు. ఈ ఆయుధం ఇంట్లో ఎప్పుడు బయటకి తీస్తారో తెలియదు.

  @ శశాంక్
  అస్సలేమీ జరగలేదు. జరిగినా బావుండేది - ఓ పని అయిపోయి వుండేది.. ఇప్పుడు అదెప్పుడు జరుగుతుందో తెలియక టెన్షన్ :)

  ReplyDelete