నేనూ మఠంలో చేరిపోతా..చేరిపోతా.. నన్ను ఆపేదెవరు?

ఈ మధ్య బైరాగులు, మఠం, బైరాగుల మఠం మన బ్లాగావరణంలో చాలా ఫేమస్ అయిన విషయం అందరికీ తెలిసేవుంటుంది. ఈ మధ్య రమణి, మార్తాండల వివాదం తరువాత నాకు జీవితం అంటే చాలా విరక్తిగా అనిపించింది. జీవితం ఏంటో నిస్సారంగా జిందగీ ముష్కిలే - కమాల్ హై అనిపిస్తోంది. అందుకే నేనూ మఠంలో చేరిపోవాలనుకుంటున్నాను. సరేలే మరీ అంత తొందరేం వచ్చిందని నిన్న నిగ్రహించుకున్నా ఇవాళ ఉదయం లేచేసరికి మార్తాండ గారి ప్రతిరూపం అయిన నాదెండ్ల గారి పోస్టు, దానికి వచ్చిన 60 పైచిలుకు వ్యాఖ్యలు చూసిన తరువాత నాకు విరక్తి ఎక్కువయ్యింది. నేను చేరిపోతా. దయచేసి నన్నాపకండి. ప్లీజ్. సన్యాసులు కూడా బ్లాగులు రాయొచ్చో లేదో ఇంకా గూగుల్ లో రిసెర్చ్ చేయలేదు - ఈ టపా అయిపోయాక అదేపనిలో వుంటాను.

నాకెందుకో నాదెండ్లా, మార్తాండా ఒక్కరేనని అనిపిస్తోంది. నిజమే అంటారా లేక నా కళ్ళకి ఏమయినా మాయ మార్తాండ మబ్బులు కమ్మాయేమో అర్ధం కావడం లేదు సుమీ.

నేను బైరాగుల మఠంలో చేరాలని ఆలోచిస్తున్నానని ఇదే సందనుకొని కొన్ని విదేశీ శక్తులతో సహా కొన్ని కె బ్లా స స్వదేశీ శక్తులూ నన్ను అందులోకి తోసేయడానికి ప్రయత్నించవచ్చు. వాళ్ల కుట్రలు గమనిస్తూ వుండమని మీకు విజ్ఞప్తి. అధ్యక్షుల వారికి నేను ఎక్కడ పోటీగా తయారవుతానేమో అని కాస్త బెదురుగా వున్నట్లు అభిజ్ఞ వర్గాల ద్వారా భోగట్టా. అలాగే మరి కొందరికి సిద్ధాంతకర్త పదవి మీద కన్ను పడి నన్ను ఎలాగయినా సన్నాసుల్లో కలపాలని కొంతమంది లింగమంతులు చాలాకాలం నుండి కుట్రలు కుతంత్రాలు చేస్తూనేవున్నారని మీకు ఈ సందర్భంగా సవినయంగా మనవిచేసుకుంటున్నాను. వీళ్లందరికీ పాదాబివందనాలు చేసే సీను లేదు కానీ పదవి అంటే మాత్రం మోజు. ఎనీ వే, వీళ్ళ కలలు ఈ సరికొత్త వివాదం కారణంగా తీరుతున్నాయి.

నాకో మాంఛి మఠం సూచించండి. చలం లాగా రమణశ్రమంలో చేరమంటారా? అందులో అందమయిన సన్యాసినులు వుంటారంటారా? అహ ఏమీ లేదు మాటవరుసకి అడుగుతున్నానంతే. మఠంలో చేరేముందు మా కుటుంబ సభ్యులకు ఒక లేఖ వ్రాసి పెట్టి వెళతాను. నేను సన్యాసుల్లో కలవడానికి మార్తాండ, రౌడీ, ఏకలింగం గట్రాలు బాధ్యులనీ కావాలంటే వారిమీద కేసేసుకోవచ్చనీ వ్రాసివెళతాను.

ప్లీజ్. నన్నాపకండి. మీరు ఏమాత్రం ఆపాలని ప్రయత్నించినా నేను U టర్న్ తీసుకొని మళ్ళీ జనజీవన స్రవంతిలో కలిసే అవకాశాలు పుష్కలంగా వున్నాయి.

46 comments:

  1. "నాకెందుకో నాదెండ్లా, మార్తాండా ఒక్కరేనని అనిపిస్తోంది."

    I don't have any doubts on that..! This guy is having serious psychological issues. Some one should help him to show the way to Visakhapatnam from Srikakulam..!!

    ReplyDelete
  2. neneltaa..neneltaa elli potaa baboo (brahmanandam gurtochchaadu)...baagundi,

    'lingamantulu' maryadagaa chepparu hilarious

    ReplyDelete
  3. ఆహా.. ఎంత చల్లని వార్త చెప్పారు శరత్ గారు..:)

    ReplyDelete
  4. ఎంత అన్యాయమండి ఏదో మీ బావ పాపం త్రిబుల్ యాక్షన్ చేసి కస్టపడుతుంటే మీరు కూడ ఒక చేయి వేసి సాయం చెయ్యాలి కాని సన్యాసమంటారా?

    ReplyDelete
  5. నేను ఈ తెలుగు బ్లాగుల ప్రపంచం లోకి కొత్తగా వచ్చాను. ఇప్పటివరకు కత్తి గారి పర్ణశాల బ్లాగులు చదివి సరదాగా నవ్వుకున్నాను (హాస్యాస్పదం!). కొంచెం ఆ మార్తండ నాదెండ్ల బ్లాగుల లంకెలు పంపండి. పని ఎక్కువ లేక ఖాళీగా ఉన్నాను మీ పేరు చెప్పుకొని టైమ్ పాస్ చేస్తాను!

    ఈలోగా నేను గూగుల్ లో వెతికి పట్టుకోడానికి ట్రై చేస్తాను.

    ReplyDelete
  6. చలం గారు రమణాశ్రమంలో చేరడాన్ని చాలామంది అర్థం చేసుకోలేదు. మరి బ్యాంక్ ఆఫీసర్ల అబ్బాయి సన్నాసుల ఆశ్రమంలో చేరితే ఎవరు అర్థం చేసుకుంటారు?

    ReplyDelete
  7. @ అజ్ఞాత
    యెస్ సర్

    @చారి
    :)

    @ రామిరెడ్డి
    ఈ టపా వెనుక నాదో పెద్ద కుట్ర దాగివుంది. ష్. ఎవరికీ చెప్పకండి. నాకు అసమదీయులెవరో, తసమదీయులు ఎవరో తెలుసుకోవడం. మిమ్మల్ని తసమదీయుల లిస్టులో చేర్చా ఈ వార్తకి మీ సంతోషం చూసి.

    ఒక సారి దిల్బర్ట్ కార్టూనులో ఇలా వుంటుంది. ఒక తుఫాను వచ్చిన సందర్భంగా నాన్ ఎసెన్షియల్ ఎంప్లొయీస్ అందరినీ ఇంటికి వెళ్ళిపోవచ్చని చెప్పి ఎవరెవరు వెళ్ళిపోతున్నారా అని పైనుండి బైనాక్యులర్స్ తో చూస్తుంటాడు వాళ్ల బాస్ - ఆ ఉద్యోగులందరూ ఎలాగూ ఎసెన్షియల్ కాదు కాబట్టి ఫైర్ చేయొచ్చని. నేను కూడా ఇప్పుడు అలాగే అందరినీ దుర్భిణి పెట్టి చూస్తున్నా.

    ReplyDelete
  8. మొత్తానికి మిమ్మల్ని సన్యాసుల్లో కలిపేయాలని, మాడా లాంటి సన్నాసులు కుట్రలు పన్నుతున్నారన్నమాట. :)

    మిమ్మల్ని నేను ఆపాలని ప్రయత్నిస్తున్నాను. వెంటనే 180 డిగ్రీలు టర్నింగిచ్చుకోండి మరి. :)

    ReplyDelete
  9. ఏంటి మీ అందరికి సన్యాసులు బైరాగులంటే అంత చులకనగా ఉందా??సన్యాసులు బైరాగులు మర్తాండ లాగా పని పాట లేని వాళ్ళనుకున్నారా?మళ్ళి ఎవరైనా సన్నాసుల్లో చేరతా అంటే కేస్ వేస్తా.

    సెక్షన్ ఏది అని అంటారా?? మా బైరాగి లాయర్ని సంప్రదించి చెప్తా

    ReplyDelete
  10. అజ్ఞాత
    ఎలాగూ మా బావ ఏ ఛాలెంజ్ లోనో ఓడిపోయి మఠంలో చేరుతాడు కదా. ఈలోగా నేను మఠంలో చేరి అక్కడ గ్రవుండ్ వర్క్ చేసి వుంచుతా. అదీ అమ్మా ప్లానూ. ఎంత మా బావ మీద ఆపేక్ష లేకపోతే ఇంత త్యాగం చేస్తానూ?

    @అజ్ఞాత

    ప్రస్తుతానికి ఈ క్రింది వాటితో కానివ్వండి. ప్రవీన్ టాక్సూ, మార్క్సిస్ట్ వ్యాఖ్యలు చదవండి.
    http://www.sumamala.info/2009/07/blog-post_15.html

    http://www.sumamala.info/2009/07/blog-post_01.html

    http://nadendla-guntur.blogspot.com/2009/07/blog-post_3746.html

    Related post:

    http://dhanarajmanmadha.blogspot.com/2009/07/2.html


    @ నాదెండ్ల
    హమ్మ మార్తాండా. ఖచ్చితంగా నువ్వే. ఇలా పొంతనలేని సమాధానాలు మా బావ తప్ప ఎవరు ఇవ్వగలరు తెలుగుమాలోకంలో!

    @ నాగప్రసాద్
    మీరు నా శ్రేయొభిలాషులు అని అర్ధమయ్యింది. మిమ్మల్ని అసమదీయుల జాబితాలో వుంచేసా. తసమదీయుల జాబితా అయ్యాక వారి ఐపిలనన్నింటినీ నా సర్వర్ల నుండి బ్లాక్ చేస్తా.

    ReplyDelete
  11. మీకు రజనీష్ ఆశ్రమం అయితే సరిగ్గా సూటవుతుందనుకుంటున్నా మాష్టారూ. వచ్చేపనైతే చెప్పండి పూనాలో ఘనస్వాగతానికేర్పాట్లు చేయిస్తా :)

    ReplyDelete
  12. నేనేమీ అతన్ని సపోర్ట్ చెయ్యలేదు. అతను కూడా చలంలా బైరాగి అయిపోతున్నాడని చెపుతున్నాను. అంతే.

    ReplyDelete
  13. ఇంతకీ నన్నే జాబితాలో వేస్తున్నారు? ఆశ్రమంలో చేరమన్నందుకు తస్మదీయుల్లోనా, రజనీష్ ఆశ్రమం సజెస్ట్ చేసినందుకు అస్మదీయుల్లోనా లేక 1.5 నా?

    ReplyDelete
  14. "ఆది నేనే, అంతం నేనే.."
    "టపా నాదే, స్పందనా నాదే.."
    "సంసారిని నేనే, సన్నాసిని నేనే.."
    "వైరాగిని నేనే, బైరాగినీ నేనే.."
    "సినిమా నాదే, ప్రేక్షకున్నీ నేనే.."

    దేవదేవా....బ్లాగ్ లోకమంతా నిండివున్న నీ దివ్యమంగళ స్వరూపాన్ని గాంచుటకు కన్నులు చాలకున్నవి. "అహం బ్లాగాస్మి" అని నీవు చూపించు నీ విశ్వరూపము తిలకించుటకు ఇంద్రునివలె వళ్లంతా కాన్నులు చేసుకొని రావాలని ఉంది. కాని కొన్ని దుశ్టశక్తులు నన్ను ఆడ్డుకొనుచున్నవి.


    పాహిమం... పాహిమాం..

    ------------------------
    వీకెండ్ సంబరాలకు స్వాగతం... :)

    ReplyDelete
  15. @శరత్ aithe ok :)

    ReplyDelete
  16. @ నాదెండ్ల
    హమ్మ మార్తాండా. ఖచ్చితంగా నువ్వే. ఇలా పొంతనలేని సమాధానాలు మా బావ తప్ప ఎవరు ఇవ్వగలరు తెలుగుమాలోకంలో!


    Hmmm.., you proved the assumption..:-)

    ReplyDelete
  17. @ఏక లింగం
    >>టపా నాదే, స్పందనా నాదే.
    హ్హ హ్హ కెవ్వ్ వ్వ్ వ్వ్

    ReplyDelete
  18. ఒకవేళ అతను నిజంగా సన్యాసంలో కలిసిపోతే కొన్నేళ్ళ తరువాత మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. అతని పేరెంట్స్ బ్యాంక్ ఆఫీసర్స్ అని చెప్పుకున్నాడు కదా. ఇంత కాలం మెయిన్ స్ట్రీమ్ లైఫ్ లో సుఖంగా బతికినవాడు హిమాలయాలలో మఠం పెట్టుకుని ఎంత కాలం బతకగలడు? అతను విరక్తి వల్ల సన్యాసం పుచ్చుకుంటాను అని చాలెంజ్ చేసి ఉంటాడు. అంతే.

    ReplyDelete
  19. హాయ్ గైస్ అపరిచితుడు సినిమా చూస్తారా? ;p

    http://nadendla-guntur.blogspot.com/2009/07/blog-post_3746.html

    ReplyDelete
  20. ప్రవీన్ టాక్సూ, మార్క్సిస్ట్ వ్యాఖ్యలు okarenani ...asalu ithanu marthanda ani teliyani kotha reader ni nenu Ramani gari post ki comment chesinappudu ...so ala...marthanda inko word press blog lo ..parts raasaadu ...akkada kooda marthanda ani teleeka ...chaaki revu petta ...nenu asalu ramani nem analedu andi ...aame rasindi tappu kaadu asalu annnantha pani chesaadu ....nilakada leni vedhava ...

    enta yevvaru ban cheyyatledu veedini ani , ayina inko peru tho start chestaru ilanti vaalu ani ardham ayyi ....light teeskodam elaga...kanipinchina manchi post nalla kelukute anukonna...kani ippudu nadendla ane person kooda same aa....god good ...


    konnalu chalam anna vallandarini ( kotha blogs) ...marthanda ani anali ....appudu marthanda muruggunta lo dakkuntadu ( nenu just reader ni andi ..kani sindhu ane ammayini, ramani ni ila entha mandi pranam tinnado ani baadha ..anthe )

    ReplyDelete
  21. తసమదీయుడు గారూ మీ కళ్ళు బాగానే వున్నాయి కదా? దుర్భిణి అవసరమయ్యేలా మిమ్మల్ని కుళ్ళ బొడుస్తున్నారా :) . సరే ఇంతకీ ఏ ఆశ్రమం.. రజనీషా లేక రమణాశ్రమమా? చెప్తే మేము కూడా ఒక చాప దిండు తెచ్చుకుంటాము.( అక్కడ నిన్ను ప్రశాంతంగా బతకనిస్తామా..ఎంత ఆశ)

    ReplyDelete
  22. intha kee choodaledandi naaku marthanda ani telika atani blog lo comment cheste ...matham lo cherali ani challenge chesadu ...

    ithanu anni chotla ilage bairagi sutthi matladuthada...leka aa goppa thanam naa coments thone bayatiki vachindaa ani doubt ????

    ReplyDelete
  23. కె. బా స కి అధ్యక్ష పదవి మీదేనండి ఇక తిరుగు లేదు మీకు. నా బ్లాగు లింకులు ఇచ్చేసి మరీ అధ్యక్ష పదవి చేజిక్కించేసుకొన్నట్లున్నారుగా. చాలా కిటుకులు తెలుసు మీకు. ఏకలింగం గారు , రౌడీ గారు కొంచం జాగ్రత్త వహించాల్సింది. మార్కులు శరత్ గారు కొట్టేస్తున్నారు ఇక్కడ పదవికోసం, (kidding)

    మఠాలకి వెళ్ళాలంటే రుష్యత్వం సిద్ధించాలిట. ఆవేశకావేశాలు తగ్గించుకొని ముక్కు మూసుకొని తప్పస్సు చేయాలట. మరి మీరేమో ఎటు గాలేస్తే అటు వెళ్తున్నారు. పదవీ కాంక్ష ఉండకూడదు ఇంకా దేశముదురు పాత్ర కూడా వేసేస్తానంటున్న్నారు. ఈ శరీరం అంతా మట్టే అనేంత వైరాగ్యం వచ్చిన తరువాత చూడండి ఆ మఠాల సంగతి. మనలో మన మాట అప్పుడెప్పుడో మీ స్నేహితురాలి వ్యక్తిత్వం గురించి వ్రాసారు ... నేనే కామెంటాను కూడా మీ స్నేహితురాలిలో వ్యక్తిత్వం బాగా అంచనా వేసారు అని... ఇప్పుడే టర్న్ తిరుగుతారు? :) :)

    ReplyDelete
  24. హమ్మ శరత్ గారూ,

    మీరు కూడా సన్న్యాసుల మీద పడ్డారా? Grrrrrrrrr

    అదే నేనైతేనా సంసారుల్లో కల్సిపోతానని శపథం చేసేవాడిని. ;-)

    @మార్తాండా/నాదెండ్ల,

    ఇంత అర్జంట్ గా ఈ గుంటూరు బ్లాగర్ ఎందుకు వచ్చాడో మాకు తెలుసు కానీ,

    ఇంగ్లాండు 420+ స్కోర్ కొట్టింది. మొన్నీ మధ్యే రాఫేల్ నాదాల్ మళ్ళా ఆడతాను అని అంటున్నాడు. ఇవాళ కత్తి గారు మూడు టపాలు రాశారు. పార్కర్ పెన్నుకి అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసడర్ గా ఉన్నాడు. కానీ రేనాల్డ్స్ కి ఎవరో నాకు తెలియదు. ఆస్ట్రేలియా 144/6 చేసింది.

    ఇంతే సంగతులు చిత్తగించ వలయును.

    ReplyDelete
  25. మీరీ కామెంట్ పబ్లిష్ చేయకపోతే ప్రవీణ్ టాక్స్ సన్న్యాసం పుచ్చుకుంటాడు.

    ReplyDelete
  26. వెనకటికి మీలాంటివాడె ఎవడో "కధాలేదు... విమర్శాలేదు... పుచ్చుకోవడానికి మాత్రం సన్యాసం" అన్నాడట. ముందు కధలు రాయండి... కం సే కం విమర్శించండి సన్యా/న్నాసిగా అవడం అదే జరిగిపోతుంది. ఈ మాత్రానికి ప్రయత్నమెందుకు? దండగ.
    :)

    ReplyDelete
  27. అయ్యగారు చేతులెత్తేసారు.
    ఈ రెండు లింక్స్ ఒక్కడివే.

    http://nadendla-guntur.blogspot.com/2009/07/blog-post_3508.html

    http://stalin-mao.net/?p=3

    ReplyDelete
  28. మరి లేడీస్ కోటా ఉందాండి?

    ReplyDelete
  29. >> సన్యాసులు కూడా బ్లాగులు రాయొచ్చో లేదో ఇంకా గూగుల్ లో రిసెర్చ్ చేయలేదు.

    I do not know about sanyAsulu but all sannAsulu can do blogs and comments in blogs (like this one). Go ahead for Matham. BTW better inquire if they will let you in ;-) or you need to take a written test like EAMCET. Hmmm...

    ReplyDelete
  30. ణాదెండ్ల బ్లాగ్లో స్క్రీన్ షాట్స్ చూసారా?? లినక్సులో ఫైర్ఫాక్స్ వాడేది మార్తాండ కాదు. అతను విండోస్ లో సఫారి వాడుతాను అని ఒక బ్లాగ్లో చెప్పాడు. మీ అభియోగాలు ఆధారం లేనివి.

    సూపర్ కదా. ఒకవేళ మన మార్తాండ బావ నేను అపరిచితుడ్ని కాదు అని వాదించాలంటే ఎలా మాట్లాడతాడో ట్రై చేసా. ఇంకా బావైతే ఏ పోస్ట్ లో అలా అన్నడో ఒక లింక్ కూడా ఇస్తాడు.

    ReplyDelete
  31. వాహ్. ఈ టపాకి ఇంత స్పందనేంటండీ బాబూ. ఎంతయినా మార్తాండ పాపులరిటీనే వేరు. ఇప్పటిదాకా జిమ్ముకి వెళ్ళి 140 కాలరీలు కరిగించి రావడంతో కామెంట్స్ అప్రూవ్ చేయడం ఆలస్యం అయ్యింది. 140 నేనా అని దీర్ఘాలు తీయకండి - ఆ విషయం మరోసారి చూసుకుందాం.

    ఈ టపా వరకు కామెంట్స్ కి పూర్తిగా గేట్లు ఎత్తితే బావుండును కానీ ఇదే సందనుకొని అజ్ఞాతలు నా మీద అసభ్యంగా విరుచుకుపడితే కూడలి వారు మరో సారి నా బ్లాగు పీకేయగలరు. అందుకే అలా తెరవట్లా.

    ఒక సవరణ: ఇప్పుడు లెవెల్ పెరిగింది. సన్నాసుల్లో కలవడం, మఠం లో చేరడం అన్నది చాలెంజ్ కాదు - మఠం మొదలుపెట్టడం. రౌడీ గారికి మార్తాండ చాలెంజ్ ఇది:
    "సరే. మీరు చాలెంజ్ లో ఓడిపోతే గంగోత్రి దగ్గర మఠం పెడతారా? యమునోత్రి దగ్గర మఠం పెడతారా?"

    @రాధిక, రౌడీ, మార్తాండ: మీలో ఎవ్వరు ఓడిపోయినా - బాబ్బాబూ చికాగోలో మీ మఠం ప్రారంభించండి - నాకు సౌకర్యంగా వుంటుంది. ఫ్రీనే కదా. ఫీజులు, ఎవరో కామెంటినట్లూ ఎంట్రెన్స్ టెస్టులూ, లంచాలు లాంటివి ఏమీ వుండవు కదా. కె బ్లా స సిద్ధాంతకర్త హోదాలొ మీరు పిలవకపోయినా వచ్చి రిబ్బను కట్ చేసి మరీ జాయిన్ అవుతా.

    అన్నట్లు ఇక్కడ బ్రాహ్మనికల్ ఆటిట్యూడులూ దళితికల్ ఆటిట్యూడులూ కాస్త గౌరవంగానే కాట్లాడుకుంటున్నాయి. వీలయితే ఓ చూపు చూడండి.

    http://girishavedi.blogspot.com/2009/07/blog-post_16.html

    ReplyDelete
  32. ఇదేంటి సార్... మీరు ఇంత తొందరగా ఈ లొల్లికి భరతవాఖ్యం పలికితే ఎలా? మీరు దీన్ని ఇంకా లాగీ...లాగీ...మరో మూడు నాలుగు టపాలు పీకుతారనుకున్నాను. కానీ మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఫుల్‌స్టాప్ పెట్టేలా ఉన్నారు. అప్పుడే ప్రత్యర్థిని తోకముడిచేలా చేసారు. మా వీకెండ్ ఏంకావాలి.. వ్వా.....


    మీరిలా లేడీ బ్లాగర్ల మద్దతు కూడగట్టుకొని కె.బ్లా.స అద్యక్ష పదవికి ఎసరుపెట్టడం ఏమైనా బాగుందా?? ఆహా..బాగుందా అని.

    ReplyDelete
  33. అదేదో సినిమాలో చంద్రమోహన్ మఠంలో జేరతాడు. అక్కడి బాధలు తట్టుకోలేక బ్లా బ్లా బ్లా!! శుభోదయం అనుకుంటా

    ReplyDelete
  34. @ బ్లాగాగ్ని
    పదిహేనేళ్ళ క్రితం పూణే లో పి జి చేసేను. మా హాస్టల్ లో అప్పుడు ఓషో ఆశ్రమంలో సంగీత ప్రదర్శనలిచ్చే స్టుడెంట్స్ కూడా వుంటుండేవారు. ఒక రోజు మిత్ర బృందంతో కలిసి ఓషో ఆశ్రమం చూడటానికి వెళ్ళాము. ఏదో పైపైన చూపించి పంపించారు. అసలు విషయం కన్నా ధ్యానమే ఎక్కువున్నదని అనిపించి దానిపై ఆసక్తి కలగలేదు. వారి పుస్తకాలు కొన్ని చదవబోయాను కానీ తలకు ఎక్కక విరమించాను. మీరన్నట్లే నా వరకు మిగతావాటికంటే భోగిలా అదే బెటరేమో. నాకు తగ్గ మఠం సూచించారు కాబట్టి మీరు మాకు అసమదీయులే.

    తీస్ మార్ స్వాగతం ఏర్పాటు చేయించండి అది అయితే బావుంటుంది.

    @ నాదెండ్ల
    బావా! ఇవన్నీ వదిలిపెట్టు కానీ నెట్టు సెంటర్ మూసేసావుకదా. ఎలా పొద్దు పోతోందీ? ఇలాగేనా?

    @ ఏకలింగం
    అంతా మాయ. ప్చ్! ఏం చేస్తాం.

    @ అజ్ఞాత
    అలాగలాగే :)

    @ కొల్లి
    :)

    @ టెస్టింగ్ వీల్
    కొంతమందిని వెధవ అదీ ఇదీ అని అనకూడదు. కొత్తవారు. మీకిక్కడి విషయాలు ఇంకా తెలియవు. తెలుగు బ్లాగ్లోకంలో జాగ్రత్తగా వుండండి.

    @ రామిరెడ్డి
    లేటెస్టుగా పిట్స్బర్గులో ఆశ్రమం తయారయే అవకాశం వుంది. అందరం కలిసి మార్తాండకి మోరల్ సపోర్ట్ ఇచ్చి రౌడీగారిని ఓడిస్తే అది సాధ్యం అవుతుంది. రౌడీ గారు ఓడాలంటే ఏకలింగం, రౌడీ ఒక్కరే అవాలి. ఫేక్ స్క్రీన్ షాట్లతో ఏమన్నా అలా నిరూపించవచ్చేమో చూడండి.

    ReplyDelete
  35. @ ఏకలింగం
    మీరు నా వ్యాఖ్యలని మరోలా అర్ధం చేసుకున్నారు. నేను ఆలోచించింది కామెంట్లకి మోడరేషన్ తీసివేయాలని అంతే గానీ కామెంట్స్ క్లోజ్ చేయడం కాదు. ఏం పర్లేదు - ఈ వీకెండ్ పండగే పండుగ. అధ్యక్షులవారు కూడా తొడగొడ్తున్నారు - మీసం లేకపోయినా దువ్వుతున్నారు. ఇక వీకెండ్ అంతా జజ్జనకరిజనారే!

    ReplyDelete
  36. This comment has been removed by the author.

    ReplyDelete
  37. @ రమణి
    మా అధ్యక్షులవారు పెద్ద జిడ్డులెండి. ఎంత అసమ్మతి చెలరేగినా కుర్చీ వదలరు. మహా అయితే రాజీ నామా డ్రామాలాడుతారు.

    మీరా అప్పుడు ఆ కామెంటు వేసింది!! నేను వేరే లేడీ బ్లాగర్ అనుకున్నాను. సంతోషం :) మీ చక్కటి వ్యాఖ్యకి మరోసారి ధన్యవాదములు.

    మేము ప్రత్యేక అజండాతో మఠాల్లో చేరుతున్నామండీ. సన్నాసులను అందరినీ అన్నలుగా చేయాలని కంకణం కట్టుకున్నాం. ముందు వారి బోధనలు విన్నట్టు నటించి నెమ్మదిగా మఠంలో విప్లవం తెచ్చి అందరినీ సన్నాసన్నలుగా చేస్తాం. మీకేమయినా అభ్యంతరమా? సన్యాసులకయితే వేరే వ్యాపకాలు, ఆసక్తులు వుండవు కాబట్టి సమసమాజం కోసం చిత్తశుద్ధిగా పోరాటం చేస్తారు. ఎలా వుంది మా వ్యూహం?

    @ మన్మధ
    నేను ఆల్రెడీ సంసారినేనండీ - ఇంకా ఏం కలుస్తాం మళ్ళీ ఆ సాగరంలో? శరతుకి వద్దు పెళ్ళి-ప్రతి గల్లీలో మళ్ళీ మళ్ళీ - మఠమే ముద్దు మరి. ఏదో ఈ శోష జీవితాన్ని రాధా, గోపికా అంటూ ఆశ్రమంలో గడిపివేస్తాను.

    ReplyDelete
  38. డియర్ శరత్. నీ బూతు బ్లాగుల స్క్రీన్ షాట్ లు నా దగ్గర ఉన్నాయి. అవి బయట పెట్టడం నాకు కష్టం కాదు.

    ReplyDelete
  39. దూకు దూకు మనేవాళ్ళు గాని, దూకే వాడు ఒక్కడూ లేడు :-P

    ReplyDelete
  40. sarath garu,

    nenu last minute lo gamaninchanu andi ...kani enduko aa word teeseyyaleka poyanu ...ante sannasi anna ve*** anna kunchem atu ituga same kadandi ...

    btw nakkoda chalenge/ yekkado cheratam ani naa peruthO oka post chesaru ....

    so indumulam gaa vaariki mee blog mukham ga ilaa teliyachesu kontunnanu :

    @ Marthanda alias *.*

    first meeru fool kaadu ani prove chesikonandi …..100 bloggers daggara….oka time pass kadha ni godavani saaga deese munduga meeru ila cheste andariki baguntundi mari. ….


    oka vela prove chesikoleka poyina ..meerekkadiki vellakkaraledu ...andariki sorry cheppeyyi ...

    ReplyDelete
  41. @ నాదెండ్ల
    వెరీ గుడ్. మొత్తం మీద బ్లాగావరణమ్లో నా సీజన్ మళ్ళీ మొదలయినట్లుందే.

    అని స్క్రీన్ షాట్లూ పెట్టు. ఏం ఫర్వాలేదు. అవి బ్లాగులు కావు, నెట్వర్కిగ్ సైట్లు. అవన్నీ నా సైట్లు కావు. లైంగిక సమాచారం, విజ్ఞానం, పోకడలు వివరించేందుకు ఆ సైట్లు ప్రారంభించి నిర్వహణ ఎప్పుడో వేరే వారికి బదలాయించాను. ఇప్పుడు ఓనర్ వేరే. ఆయా ఓనర్ల ఇష్టం ప్రకారం ఆ సైట్లు నడుస్తాయి - వాటికి నేను బాధ్యుడిని కాదు.

    ఆయా ఆంశాలతో ఇదివరకు ఒక బ్లాగు నడిపేవాడిని కానీ కూడలి వారు దానిని తొలగించడంతో ధర్నా చేసిన విషయం బ్లాగు లోకపు పిల్ల కాకులకి తెలియకపోవచ్చు. ఈ టపాలో కొని వివరాలు కనిపిస్తాయి.

    http://veeven.wordpress.com/2008/09/09/koodali-perspective/

    ReplyDelete
  42. నీకు సిగ్గు లేనప్పుడు మహిళలని ఉద్దరిస్తున్నట్టు నటించడం ఎందుకు నాయనా?

    ReplyDelete
  43. చాలా తప్పండి నాదెండ్ల గారు...
    1. సిగ్గు లేదని ఎలా చెప్పగలరు?
    2. మహిళలను ఉద్ధరిస్తున్నట్టు శరత్ కాలం గారు చెప్పలేదు కదా. అలా నటిస్తున్నట్టు మీకు ఎందుకు అనిపించింది?
    ఏదో నాకు తోచింది అడిగాను, ఏమీ అనుకోకండి నాదెండ్ల గారు.

    ReplyDelete
  44. మాడా మామిడితాండ్రకి అలాగే అనిపిస్తుంటుంది. అననికి Hallucination ఉన్నాయి అనుకుంటా.

    ReplyDelete
  45. గురు - ఇంక ఆలశ్యం చేయమాక. నీకు మొదటి చిప్ప నేనే స్పాన్సర్ చేస్తా.

    సన్యాసినులా? పురి చిత్రాలు చూస్తే ఇలానే ఉంటది పెతీ సన్యాసిని నీకు మోట్వాని లానే కనిపిస్తది. అయినా నువ్వు ఇవేమి పట్టించుకోకు.. సీకాకులం, రాజం లో ఓ ఆశ్రమం ఉంది చేర్తావేటి? అక్కడైతే నీ మనసుకి ప్రశాంతత ఉంటది..

    ReplyDelete