బొజ్జ భారతం

గత వారం పిట్స్బర్గ్ లో ఒక ఫంక్షనుకి వెళ్ళాను. అక్కడ బంధుమిత్రులందరూ కలిసారు - నన్ను చూసి బక్కగా అయ్యావన్నారు - సంతోషమనిపించింది. ఎందుకంటే నా శరీరానికి రోజుకి 1700 కాలరీలు అవసరం (ఒక సగటు వ్యక్తికి రోజుకి 2000 క్యాలరీలు అవసరం). డైటింగ్ చేసో, ఎక్సరసైజులు చేసో మొత్తం మీద నా శరీరానికి అంతకంటే తక్కువ కాలరీలే అందిస్తూ సన్న బడుతూ వున్నాను. తక్కువ తినేవారే ఎక్కువ కాలం బ్రతుకుతారనీ నిన్ననే మళ్ళీ ధ్రువీకరింపబడిందనేది మీకు తెలుసా?

సన్నబడటం సంతోషమే కానీ నాకున్న చిన్ని బొజ్జ మాత్రం తగ్గిందని ఎవరూ అనలేదు. ఆ కాస్త బొజ్జనీ తగ్గించమని ఎప్పటినుండో మా ఆవిడ నస. ఆ పనిలోనే వున్నాను కానీ మిగతా శరీరం అంతా తగ్గుతోంది కానీ బొజ్జమాత్రం తగ్గడం లేదు :(

ఒక రోజు రెస్టు రూములో తపస్సు చేస్తూ నాకు ఈ చిన్ని బొజ్జ ఎక్కడినుండి వచ్చిందా అని పరిశోధిస్తూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయాను.

ఫ్లాష్ బ్యాక్:
నేను చిన్నప్పటినుండీ చాలా సన్నంగా వుండేవాడిని. యుక్తవయస్సులో కూడా అలాగే పీలగా వుంటూ వుండటంతో నామీద నాకే వళ్ళు మండి ఎలాగయినా కండలు పెచాలని డిసైడ్ అయిపోయా. అసలు వంట్లో ఏమన్నా వుంటే కదా కండలు తయారయ్యేది! ముందు వళ్ళు పెంచి ఆ తరువాత ఆ వళ్ళుని కండలుగా మార్చాలని తీర్మానించా. దానికి ఒక వ్యూహం పన్నాను. ఏమిటంటే నెయ్యి, వెన్న, బీరు, మాంసం బాగా తీసుకోవాలని. భోజనంలో నెయ్యి బాగా వేసుకుంటే కూర బాగా చప్పగా అనిపించేది. అందుకో ఉపాయం పన్నాను - పెరుగుతో పాటుగా బోల్డెంత నెయ్యి కుమ్మరించుకునేవాడిని.

మా క్లోజ్ ఫ్రెండ్ రమేష్ కి ఒక బార్ షాప్ వుండేది. అక్కడ తెగతింటూ, తాగుతూ బాగా లావవుతూ సన్నబడాలని అనుకునేవాడు. వాడికి ఒక ఐడియా ఇచ్చి అది నీ జీవితాన్నీ, నా జీవితాన్నీ మార్చేస్తుందని చెప్పాను కానీ విన్నాడు కాదు.

వాడికి నేను ఇచ్చిన ఐడియా ఇది. రోజూ నీ బీర్ షాపులోనుండి ఒకటో రెండో బీర్లు నాకు తాగించు - ఉచితంగా నేను రోజూ మీ షాపులోని బీర్లు తాగేస్తున్నాననే బాధతో నువ్వు సన్నబడతావు. తేరగా వస్తున్న బీర్లు రోజూ తాగి నేను లావు అవుతాను.


మొత్తం మీద రోజూ నెయ్యి, మాంసం, బీర్లు, స్వీట్లు గట్రా ఆరగించే కార్యక్రమం కొన్ని నెలలపాటు దిగ్విజయంగా నడించింది. ఎంత ప్రయత్నించినా వళ్ళు మాత్రం పెరగలేదు - పొట్ట మాత్రం బాగా పెరిగింది. ఆ పెరిగిన పొట్టతో వ్యాయామం చేయడం కష్టం అనిపించి ఆ ఆలోచన పక్కకుపెట్టేసాను.
ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది.

ఆ పొట్టనే ఇన్నాళ్ళూ మోసుకుతిరుగుతున్నననే విషయం జ్ఞానోదయం అయ్యింది. అప్పుడే కనుక అలా పెరుగులో నెయ్యోసుకొని లాగించి వుండకపోతే ఇప్పుడు ఎంచక్కా ఫ్లాట్ టమ్మీతో వుండేవాడిని కదా అని రెస్టు రూములో మౌనంగా రోదించి కళ్ళు తుడుచుకొని బయటికి వచ్చాను.

బొజ్జవుంటే ముందు ముందు రకరకాల గుండే జబ్బులూ, చెక్కెర వ్యాధి గట్రా వస్తాయిట. తగ్గించాలి -తగ్గించాలి - అదే పని మీద వున్నాను. అప్పుడప్పుడు నా ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయని కుశలం అడుగుదురూ.

నీతి: పెరుగులో నెయ్యి వేసుకొని భోజనం లాగించరాదు - ముందు ముందు గుండె జబ్బులు, చక్కెర వ్యాధి వచ్చును.

7 comments:

  1. GRRRRRRR U didnt even let me know about the trip .. I was out of town of course .. but would have atleast planned something

    ReplyDelete
  2. Even if you exercise and do excellent you can die in a car accident tomorrow. What is the point of all this?

    Enjoy life. ;-)

    ReplyDelete
  3. సారూ - అదే ప్రాబ్లం! చాలామంది వెన్న నెయ్యి తింటే వళ్ళు వస్తుంది దాన్ని కండలకింద మార్చచ్చు అనుకుంటారు గానీ వాటి వల్ల వచ్చేది FAT గానీ MUSCLE కాదు. కండలు రావడానికి అప్పుడు రెండింతలు కష్టపడాలి - కొవ్వు కరగడానికి కొంతా, కండ పెరగడానికి మిగతాదీ హీ హీ. Low Carb and High Protein diet is the best!

    ReplyDelete
  4. మళ్లీ ఆవిరి స్నానాలు మొదలు పెట్టక పోయారా? వంట్లో ఉన్న నెయ్యి కరుగుతుందేమో?

    ReplyDelete
  5. మీరు డైటింగ్ మానెసినా.. కంటిన్యూ చెసినా..పొట్ట తగ్గడానికి చెయ్యల్సింది పొట్ట వ్యాయామాలు. మీరు రోజు రన్నింగ్ , వాకింగ్ చెసినా మొత్తం బరువు తగ్గుతారు కానీ, పొట్ట -బాడి రెషొ మాత్రం మారదు. సొ మీరు ఆ రెషొ మర్చాలి అంటె జస్ట్ రొజుకి ఒక 30 abdominal crunchs చెయ్యండి .. రెండు నెల్లల్లొ పలితం చూడంది.

    giri

    ReplyDelete
  6. బాసూ!!
    ఇక్కడ షేం టూ షేం కాకపోయినా, నాల్గు వారాల్లో 9 పౌండ్లు తగ్గా.
    పొట్ట - రౌడి భాయ్ చెప్పినట్టు లో కార్బ్, లో కాల్, లో సోడియం, రిచ్ ప్రోటీన్ తిని - రోజుకి ఓ గంట నడవాలి.


    అసలు పెరుగన్నంలో నెయ్యి ఎట్టాతింటారూ భాయ్?

    ReplyDelete
  7. @ రౌడీ,
    మా బంధు మిత్రులను కెలుక్కోవడానికే సరిపోయింది - మీతో కెలుక్కొవడానికి సమయం చిక్కలేదు. మీకు ఫోన్ చేద్దామనుకుంటూనే కుదరలేదు.

    కండల గురించి - ఇంత విజ్ఞానం నాకు అప్పుడు వుంటే బాగానే వుండేది కానీ తెలియక నెయ్యిలో చెయ్యేసా.

    @ అజ్ఞాత
    అలా అంటే ఎలా సారూ. నేను చాన్నాళ్ళు బ్రతకాలి - మనుషులని హింసించాలీ.

    @ఏకలింగం
    ఆవిరి స్నానాలతో కొవ్వు కరుగుతుంటారా!! ఆ అత్యాశతోనే ఆ గదుల్లో కూర్చుంటూనేవున్నాను.

    @అజ్ఞాత

    మీరు చెప్పినట్లుగా చెస్తే పైపైన కండలు ఫ్లాట్ అయి అలా అనిపిస్తుంది కానీ వంట్లో పొట్టలో వున్న కొవ్వు మాత్రం తగ్గదని సరికొత్తగా చెబుతున్నారు. వంట్లోని కొవ్వు కరగదీస్తుంటే చివరికి పొట్టలొని కొవ్వు కూడా కరుగుతుందంట.

    @ రామరాజు

    మీరు మళ్ళీ లావు అవాలనుకున్నప్పుడు చెప్పండి - పెరుగన్నంలో నెయ్యి వేసుకొని ఎలా తినాలో వివరంగా చెబుతా.

    ReplyDelete