బుధవారం 29 జూలై 2009

కబుర్లు - జులై 29, 2009


అద్బుత సౌందర్య రాశి రాణి గాయత్రీ దేవి మరణం వార్త విని సంతాపం ప్రకటిస్తున్నాను. ఆమె మీద తీస్తున్న సినిమాలో గాయత్రి దేవి పాత్ర మరొక అద్భుత లావణ్యవతి ఐశ్వర్యా బచన్ ధరిస్తున్నదని తెలిసింది. గాయత్రీ దేవి పాత్రకి ఐశ్వర్య కన్నా గొప్పగా ఇంకెవరు సరితూగగలరు?

--------------------------------------------------------------
హారీ పోటర్ - హాఫ్ బ్లడ్ ప్రిన్స్ పై అభిప్రాయాలు

మా మామగారు: పాతాళ భైరవిలా వుంది (వారు సినిమాలు చూసేది తక్కువ, అందునా ఇంగ్లిష్ సినిమాలు చూసేది ఇంకా తక్కువ. హారీ పోటర్ చూడటం ఇదే మొదలు) !
చిన్న పాప : కొద్ది సేపటికే పడుకుంది!
పెద్ద పాప: ప్చ్
శ్రీమతి: ప్చ్
నేను: ప్చ్

హీరోయిన్ హీరోని ప్రేమించక కమెడియన్/సహ హీరోని ప్రేమించడం మాకెవరికీ జీర్ణం కాలేదు. హ్యారీ మీద ఆసక్తి పెంచుకున్న అమ్మాయి బావోలేదు.
--------------------------------------------------------------
బ్యాక్ టు బేసిక్స్ - పల్లెకు పోదాం పదండి

ఆధునికత ఏమాత్రం దరిచేరని ప్రశాంతమయిన పల్లెటూరిలో కొంతకాలమయినా సేదదీరాలని వుంటుంది. మీకో? అక్కడ సెల్ ఫోన్లు పనిచేయకూడదు, టివిలు వుండకూడదు, ఎలాంటి ఉపకరణాలు వుండకూడదు, అసలు విద్యుత్తే వుండకూడదు. ఈ సారి భారత్ వచ్చినప్పుడు అలా వుండాలని వుంటుంది కానీ కుదరదేమో - సుడిగాలి పర్యటనలతోనే సరిపోతుంది కాదూ.

ఈ టివిలు గట్రాలేని రోజుల్లో ఎంచక్కా కబుర్లు చెప్పుకునే వారం. డాబా/మిద్దెలు వుంటే అవి ఎక్కి ఆకాశాన్నీ, మేఘాలనూ, చుక్కల్నీ, చందమామనీ చూస్తూ, చక్కటి పిల్ల గాలులకు పరవశిస్తూ ప్రియమయిన వారితో ఊసులాడిన రోజులు ఎంత బావుండేవో కదా.
---------------------------------------------------------------------
నా మూడు జీవిత లక్ష్యాలు

మన లక్ష్యాలు పెద్దగా వుండాలంటారు కదా. అందుకే పేద్దవి పెట్టుకున్నాను.

జీవితకాలంలోగా
1. చంద్రమండలంలో పర్యటించి రావాలి.
2. హెలికాప్టర్ లేదా చిన్న విమానం కొనుక్కోవాలి (నేను కొనుక్కునేటప్పటికి చుట్టూ చూస్తే అవి అందరికీ వుంటాయేమో! నాకు తెలిసిన బంధువులమ్మాయి ఒక అయిదు ఏళ్ళలో చక్కటి కారు కొనుక్కుంటా అని శపథం చేసింది - కొనుక్కుంది - ఏం లాభం, అప్పటికి చుట్టూ వున్నవారు అందరూ కూడా కొనేసుకున్నారు)
3. చెప్పనుగా! ఇది కూడా ఆస్ట్రొనమికల్ రేంజిలో వుంటుంది కానీ చెప్పేది కాదు. పెద్దలకు మాత్రమే తరహాది. చిన్న క్లూ ఇవ్వాలని వుంది కానీ రౌడీ లాంటివారు పట్టేసి కెలికినా కెలుకుతారు - నాతో ఓ ఆటాడుకుంటారు. వద్దులెండి.
-------------------------------------------------------------------
మళ్ళీ రసజ్ఞ

రసజ్ఞ అనే నా అడల్ట్ బ్లాగులో మళ్ళీ వ్రాయాలనుకుంటున్నాను. కొన్ని సమాకాలీన ఆంశాలపై కొన్ని అపోహలని పటాపంచలు చేసేటటువంటి నా అనుభవాలు, ఇతరాలు వ్రాయదలుచుకున్నాను. ఆసక్తి వున్నవారు లింక్ కోసం నా ప్రొఫయిల్ చూడగలరు. ఆ బ్లాగు తెలుగు అగ్రిగేటర్లలో రాదు కాబట్టి గూగుల్ రీడర్ లాంటివాటిల్లో జతచేసుకోవాల్సిందిగా మనవి.
------------------------------------------------------------------
జాగ్రత్తగా ట్వీట్ చేయండి లేదా ఇలా షికాగోలో జరిగినట్లుగా దావా పడవచ్చు.
http://news.bbc.co.uk/2/hi/technology/8173731.stm

3 comments:

చైతన్య చెప్పారు...

కబుర్లు బాగున్నాయి...
మీరు 'చెప్పిన' లక్ష్యాలు బాగున్నాయీ... పెద్దగా :D

a2zdreams చెప్పారు...

కబుర్లు బాగున్నాయి...

శరత్ 'కాలమ్' చెప్పారు...

@చైతన్య
Thanks :)

@a2ZDreams
Thanks.