మంగళవారం 26 మే 2009

జయహో వై ఎస్/సబిత/రోజా

రెండవసారి అధికారంలోకి వచ్చాక వై ఎస్ తీసుకున్న మంచి నిర్ణయాలలో ఒక స్త్రీని హోం మంత్రిగా చేయడం ఒకటి. మొదటి మహిళా హోం మంత్రిగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా మహిళలకు చక్కటి రక్షణను, భద్రతను ఆమె అందిస్తారని ఆశిస్తాను. నాకు సబితా ఇంద్రారెడ్డి గురించి, ఆమె సామర్ధ్యం గురించి ఎక్కువగా తెలియదు కానీ మొత్తం మీద ఇంద్రారెడ్డి తరువాత రాజకీయాలో నిలద్రొక్కుకొని 'చేవెళ్ళ చెల్లెమ్మ' ఈనాడు హోం మంత్రి కావడం చక్కని విషయం. అలాగే పార్టీలకు అతీతంగా ఈ విషయంలో చక్కగా స్పందించిన రోజాని కూడా అభినందించలేకుండా వుండలేకపోతున్నాను.

1 comments:

చైతన్య చెప్పారు...

నాకు రాజకీయాలకి సంబంధించిన విషయాలపై అంతగా ఆసక్తి ఉండదు కాని... ఒక స్త్రీ ని హోం మంత్రి గా చేయటం మాత్రం అభినందించకుండా ఉండలేకపోతున్నాను...