మంచి తెలుగు సైట్లు సూచించండి


తెలుగు పోర్టల్స్ లలో గ్రేట్ ఆంధ్రా, దట్స్ తెలుగు చూస్తుంటాను. తెలుగులో డాట్ కాం చూద్దామంటే దానితో పాటు ఏవో వైరసులు వస్తుంటాయి. దట్స్ తెలుగుతో పాటు కూడా వైరస్ రావడానికి ప్రయత్నిస్తుంటుంది కానీ నేను వాడే అవస్ట్ వాటిని నిభాయిస్తుంది. ఇహ ఆయా సైట్లలో విషయం తక్కువ - పుకార్లు ఎక్కువ అని తెలిసిందే కదా. రోజూ ఎన్నో కొత్త సైట్లు పుట్టుకొస్తున్నాయి. వాటిల్లో మంచివి నేనేమయినా మిస్సవుతున్నానా అనిపిస్తుంటుంది.


వీటికంటే మాంఛి పోర్టల్స్ ఏవయినా వున్నాయా? మీరు తరచుగా ఏవి చూస్తుంటారు? తెలుగువి మాత్రమే నాకు సూచించండి. మీరు సూచించినవి మిగతా వారికి కూడా ఉపయోగపడవచ్చు. కేవలం పోర్టల్సే కాకుండా మీకు బాగా నచ్చే తెలుగు సైట్లు చెబితే మాకూ అవి నచ్చవచ్చు. పుకార్లు తక్కువ - విషయం ఎక్కువ వున్న సైట్లు అయితే బావుంటుంది. కొన్ని సైట్లలో అయితే రంగులెక్కువయ్యి, ఇరుకు ఇరుకుగా అనిపిస్తాయి. ఆ సైట్లు చూడటానికి ఆహ్లాదంగా వుండవు. కొన్ని సైట్లలో పస తక్కువ - ప్రకటనలు ఎక్కువ. ఇక మరికొన్ని సైట్లు తరచుగా అప్డేట్ కావు - మరికొన్నింటిలో ఫాంట్ బావుండదు. ఇలాంటి లోపాలు లేకుండా వున్న చక్కటి పోర్టల్స్ ఏమయినా వున్నాయా అనేది నా సందేహం.


మొత్తం మీద పూర్తిగా కాకపోయినా బాగా సంతృప్తి పరచిన తెలుగు పోర్టల్ నాకయితే ఇంతవరకు కనపడలేదు. మరి మీకు?

11 comments:

 1. "మొత్తం మీద పూర్తిగా కాకపోయినా బాగా సంతృప్తి పరచిన తెలుగు పోర్టల్ నాకయితే ఇంతవరకు కనపడలేదు. మరి మీకు? "

  ఒకటి తయారు చేద్దామా? ;)

  ReplyDelete
 2. @ Yogi,
  నిజమే. ఈ ఆలోచన సైన్యం కంటే ఎగ్జయిటింగ్ గా అనిపిస్తోంది. వివరంగా గ్రూపులో మాట్లాడుకుందాం :)

  ReplyDelete
 3. పుకార్లు, గాసిప్, యాడ్ లు లేకుండా హిట్ అవ్వడం కష్టమేమో?

  ReplyDelete
 4. మద్దెలో ఈ సైన్యవేటండీ బాబో.... (కోటా శ్రీనివాసరావు ఇస్టైల్లో).
  "సైన్యం"అనగా నేమి? దాని భౌతిక, రసాయనిక ధర్మములను వివరింపుము?(వ్యాస రూప సమాధాన ప్రశ్న).

  ReplyDelete
 5. "మంచి" అంటే ఏమిటో మొదట చెప్పండి. తరువాత అలాంటివి ఎక్కడున్నాయో వెతుకుతాము.

  ReplyDelete
 6. @minerva

  సైన్యం = http://sainyam.in

  ReplyDelete
 7. vebtoday.com chuusaaraa?

  chaalaa telusu. avi meekuu telisi

  undavachhani chinna sandeham.

  ReplyDelete
 8. malli nenu.

  saradaga.com

  akhilandhra.com

  namasthe.com
  ciickandhra.com

  topandhra.com
  andhravilas.com

  inkaaa yenno

  anni meeku telusaa ayyo bhanga paatu.
  cool.

  ReplyDelete
 9. aadivaaram.com

  andhralekha.com

  supertelugu.com

  completetelugu.com

  sasesham.

  ReplyDelete
 10. @ పానీపూరీ
  కష్టమే. పోర్టల్స్ అంటే కేవలం సినిమాలు, రాజకీయలు మాత్రమే అనిపించేలా వుంది పరిస్థితి.
  @ మినెర్వా,
  http://sainyam.in లో 'గురించి' చదవండి :)
  @ కత్తి
  మంచి - హ్మ్మ్ - ఏం చెప్పమంటారు - మీకు తెలియనిదా?
  @ అజ్ఞాత
  చాలా ధన్యవాదాలండి. నాకు తెలియని సైట్లు ఎన్నో చెప్పారు.

  ReplyDelete
 11. greatandhra(idi rasevadiki mind vuntundo ledo teleedu),thatstelugu (boothu comments) chadavadam chala kastam andi.ippudu hayiga blogs anni oka sari lekapoteh inkosare chadukondi.

  ReplyDelete