అదేంటో గానీ నాకు కవితలు, కవిత్వాలు అంతగా బుర్రకి ఎక్కవు. అయితే మన బ్లాగ్లోకంలో చిన్నా చితకా దగ్గరి నుండి బాగా వ్రాసే కవులూ/కవయిత్రులూ చాలామందే వున్నారు. ఎంచక్కా వారి పద్ధతిలో వారు వ్రాసుకుంటుంటారు. నేనూ ఓ కవిని కాకపోతినా అని అప్పుడప్పుడు కించింతిస్తూ వుంటాను. బాగానే వుంది. అయితే వచ్చిన ఇబ్బంది ఎక్కడ?
సహజంగానే వీరిలో సృజనాత్మకత ఎక్కువ కాబట్టి సాధారణంగా చక్కటి టైటిల్ పెడుతుంటారు వాళ్ళ టపాలకి. వాళ్ళ టైటిల్ చూసి ఆసక్తి ఏర్పడి ఆ లంకె నొక్కి అనవసరంగా హిట్టిచ్చా అని ఉడుక్కున్న సందర్భాలు ఎన్నో వున్నాయి. అలా నాలాంటి వారు ఇచ్చిన హిట్లని చూసి హిట్లని పట్టించుకునే కవి రాజులు/రాణులు వాపుని బలుపుగా అనుకునే అవకాశమూ వుంది.
జల్లెడనో, హారమో చూస్తే స్నిప్పెట్ వుంటుంది కాబట్టి ఏది కవితో కాదో తెలుసుకోవచ్చు కానీ కూడలి ప్రధానపేజీ చూస్తే ఏది ఏదో అర్ధం కాదు కాబట్టి అలా లంకెలని నొక్కి ఊప్స్ అనుకొని గురితప్పిన బూమరాంగులా హడావిడిగా బయటికి వచ్చిన సందర్భాలు నా వరకయితే ఎక్కువే.
అందుకే మై డియర్ కవులూ/కవయిత్రులూ, మీ టపా శీర్షికలో ముందు 'కవిత ' అని తగిలిస్తే నా బోటి వారికి సౌకర్యంగా వుంటుంది/మీకు నిజమయిన ట్రాఫిక్ వస్తుంది. ఏమంటారు? వీరే కాకుండా అందరం కూడా ఆయా టపాల వర్గాన్ని సముచితమయిన శీర్షికల ద్వారా సూచిస్తే ఏ టపా ఏ తరహాదో అర్ధమయ్యి ఇతరులకి సులువుగా వుంటుంది కాదూ?

12 comments:
మీరే కూడలిలో "మరిన్ని" నొక్కి చూసుకోవచ్చుగా.
వాళ్ళందరూ కవిత అని పెట్టాలా?
ఇలా అనటం మీకు భావ్యమా!!
@ భవాని
నేనేమయినా ఈ-ఫత్వా జారేచేసేనా :) విన్నపమే కదా - కొంతమంది అయినా మన్నిస్తారేమో చూద్దాం. కూడలిని నొక్కిన ప్రతిసారీ "మరిన్ని" నొక్కాలంటే... హ్మ్మ్.
అందుకే కూడలి నుంచి జల్లెడకో , హారానికో మారిపోండి
ఆ మధ్య కూడలి మీద వళ్ళు మండి అలా ప్రయత్నించాను కానీ వేరే సంకలినులకు అలవాటు పడటం అంత సులభం కాదనీ - కొన్ని విషయాలు నచ్చకపోయినా దిన పత్రికలలో ఈనాడు అయితే ఎలా ముఖ్యంగా చదువుతామో కూడలి కూడా ఒక వ్యసనం లాగా అయ్యిందనీ అర్ధం అయ్యింది :)
కూడలి ముఖ్య పేజీ చూడటానికి ఆహ్లాదంగా అనిపిస్తుంది. హారాన్ని కూడా అంతకంటే ఆహ్లాదంగా తీర్చిదిద్దమని హారం-రామిరెడ్డి గారిని కోరాను.
శరత్ గారు,
కవితలు రాసే టపాలపై ఎంత కుట్ర పన్నారు?
శరత్ చంద్రికా వెలుగులే ప్రసరింపక
కావ్యకన్యకకు కృతి భర్తలెవరు?
శితల సువర్ణ కాంతి కిరణమ్ములే లేక
కవిరాజ బ్లాగులకు ఆదరణ ఏలగలుగు?
పూర్ణ చంద్రికా తళుకులు జాలువారక
కవయిత్రుల వాక్కులకు తళుకులేల గలుగు?
మీనుంచి కవితా బ్లాగులకు హిట్లు రాకపోయాయో.. ఏమిచేస్తామో తెలుసా? ముందు ఒక పారా వచనము రాసి అప్పుడు కవితలు రాసుకుంటాము :)
ఇకపోతే హారంగురించి.. మీ సపోర్టుకు సత్ విమర్శకు బ్లాగుముఖంగా కృతజ్ఞతలు. లాంగ్ వీకెండ్ వస్తుందికదా, కంప్యూటర్ తో సహా అట్లాంటిక్ సిటీకి వెళ్ళి అట్లాంటిక్ సముద్రపు ఒడ్డున ఇసుకలో కూర్చొని అప్పుడు UI డిజైన్ చేసుకొని వస్తాను.
చిన్న టైపో ....
"శితల సువర్ణ కాంతి కిరణమ్ములే లేక" దీన్ని
"శీతల సువర్ణ కాంతి కిరణమ్ములే లేక"
అని చదువుకోగలరు.
"కవిత్వమొక శుద్ధదండగ" అని ఈ మధ్య చాలా మంది సాహితీవేత్తలే అంటున్నారు. కొంపదీసి ఆ విషయం మీదాకా పాకలేదుకదా!
please visit my new blog- http://apaksha.blogspot.com and give your opinion
Thanks
apaksha
yes my friend sarath ! there is no stuff even in senior poets.There is only 20 poets in andhrapradesh from the time of Gurajaada.The remaining people think theirselves that they are poets.if you seen in aadivaaram vaartha and aadivaaram andhra jyothi you may conformed that it is enough to wrote line by line it makes poem.Is'nt it ?
------- RAVI
@ రామిరెడ్డి
మీరు (ఆశు)కవులు కూడా అన్న సంగతి నాకు ఇదివరలో తెలియదు - ఇప్పుడు తెలిపించారు (= తెలియజేసారు) :)
@ కత్తి
లేదండీ. నేను ఇంకా అంత ముదరలేదు :)
@ అజ్ఞాత రవి
నాకూ దేనిని కవిత్వం అంటారో/అనరో అని చాలా సందేహాలు వున్నాయి. అప్పుడప్పుడు కవిత్వం వ్రాయాలని ఉబలాటం పుడుతుంది కానీ ఆ సందేహంతోనే ఆగిపోతుంటా. కవిత్వం అని దేనిని అంటారు అనే విషయమై ఏదయినా చక్కటి వ్యాసం/ టపా సూచించకూడదూ.
@ అందరికీ
నేను డయల్ చేసిన పూర్తి స్థాయి కవులు/కవయిత్రులు ఎవరూ కూడా ప్రస్తుతం ఈ టపాకి స్పందించుటలేదు :( లాభంలేదు - ఈ-ఫత్వా జారీ చేయాల్సిందే!
నాక్కూడా కవితలంటే ఇష్టం ఉండదు.కానీ స్నేహమా,మరువం మాత్రం చదవడానికి బాగుంటాయి.
నాక్కూడా కవితలంటే ఇష్టం ఉండదు.కానీ స్నేహమా,మరువం మాత్రం చదవడానికి బాగుంటాయి.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి