రిలయన్స్ వారి బిగ్ సినిమాస్ వారి కొత్త థియేటర్ ఒకటి ప్రారంభించారు. ఒక వారం అంతా ఫ్రీ సినిమాలే సినిమాలు. సినిమా థియేటర్ కూడా బావుంది. హిట్టు సిమాలు కూడా ఉచితం కావడంతో వాటికి టికెట్లు దొరకడంలేదు. లాంగ్ వీకెండులో 'ఆకాశమంతా' చూద్దామంటే టికెట్లు దొరకలేదు. 'ద్రోణ' లాంటి సినిమాలు ఉచితమే అయినా ఎందుకులే తలనొప్పి అని ఊరుకున్నాం. 'మనోరమ' చూసాము - బాగానే వుంది - ఛార్మి నటన ఏమోగానీ కొత్త హీరో చాలా చక్కగా నటించాడు. పేరెంటో?
ఈ థియేటరులో మొత్తం అయిదు హాళ్ళు వున్నాయి. అన్ని భారతీయ భాషల సినిమాలు కూడా వస్తాయి. హిట్టు సినిమాలే కాకుండా ఫట్టు సినిమాలు కూడా వస్తున్నాయి. ఇక్కడి థియేటర్లలో సీట్లు సాధారణంగా ఇండియాలోలాగా లగ్జరీ గా వుండవు కానీ ఈ హాళ్ళలో మంచి సీట్లు వున్నాయి. మనోరమ సినిమా చూడ్డానికి వెళ్ళినప్పుడు యథాపలంగా వెనక్కి ఆనుకొని గాభరాపడ్డాను. ఎందుకంటే సీట్ వెనక్కి వాలింది. అమెరికన్ సినిమా హాళ్ళలో అటువంటి సీట్లు ఆశించకపోవడంతో అలా కంగారు పడ్డాను. అమెరికన్ హాళ్లలో కూడా ఇండియా హాళ్ళలొ వుండే లగ్జరీ సీట్లు పెడుతున్నందుకు - ఆ రకంగా యు ఎస్ కూడా ఇండియాలా అభివృద్ధి చెందుతున్నందుకు ఆనందించాను.
మందు ప్రియులకు శుభవార్త - ఈ థియేటరులో బార్ & రెస్టారెంటు కూడా వుంది. ఎంచక్కా ఓ పెగ్గు వేసుకొని వెళ్ళి సినిమా చూడొచ్చు. మొత్తం మీద షికాగో మంచి థియేటర్లు రెండు అయ్యాయి. రేకుల డబ్బాలాంటి థియేటర్లలో తెలుగు సినిమాలు చూడాల్సిన అవస్థ తప్పింది కానీ జేబుకి బాగానే చిల్లిపడేట్లుగా వుంది. తెలుగు సినిమాలు ఎక్కువగా రాబోతుండటం - అదీ మంచి మంచి థియేటర్లకి రాబోతుండటం - మాకు కాస్త దగ్గరగానే అవి వుండటం - సినిమాలకి తీసుకెళ్ళాల్సిందిగా ఇంట్లో ఒత్తిడులు/అలకలు పెరగడం ఖాయంగా అనిపిస్తోంది.
3 comments:
బాగుంది! ఇక చికాగో వస్తే మాకు పండగే!
మీరు చెప్పేది ఆడ్లాబ్స్ థియేటర్ గురించా..ఒకే.మరి ఆ రెండో మంచి థియేటర్ ఏమిటి/సత్యం థియేటరా?
అమెరికా కూడా ఇండియా లాగా అభివృద్ధి చెందుతున్నందుకు సంతోషం :D
మనోరమ చూడడం అనుకున్నా కానీ చూడలేకపోయాను... ఆ మూవీ రివ్యూ రాయండి వీలైతే...
కొత్త హీరో పేరు 'ప్రదీప్' అనుకుంటా...
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి