భువనగిరి గుట్ట మీద (ఆత్మ)హత్య - ముగింపు - ఈ కోడ్ మీరు ఛేదించగలరా?

అలా అప్పుడు భోనగిరి గుట్ట మీద విశాల స్మృతుల్లోకి వెళ్ళి బయటకి వచ్చాము. "విశాల వ్రాసిన కోడ్ నీ దగ్గర వుందా?" అని సందీపుని అడిగాను. వేరే పెళ్ళి కాగానే విశాల ఉత్తరాలు అన్నీ చింపేసాననీ, వాటితో పాటుగా ఆ కోడ్ కూడా పోయిందనీ చెప్పాడు. నేను ఆ కోడును భద్రపరిచానని చెప్పి, దానిని డీకోడ్ చేయడానికి చేసిన ప్రయత్నాలని వివరించాను. చీకటి పడుతుండటముతో గుట్ట దిగిపోయాము.

విశాల మరణంపై రకరకాల పుకార్లు:
- వెంకటే విశాలని చంపాడు.
- సందీప్ నే ఆమెని చంపాడు. వెంకట్ పాత్ర ఇందులో లేదు - పోలీసుల వత్తిడిపై ఆ నేరాన్ని కొంత ఒప్పుకున్నాడు.
- విశాలతో గొడవపడి వెంకట్ గుట్ట దిగివెళ్ళిన తరువాత ఎవరో విశాలని ఏదో చేసి గుండంలోకి తోసేసారు
- చెల్లె కనపడకపోవడముతో రకరకాల పుకార్లు విని ఆమె కోసం వెతుకుతున్న విక్రంకి గుట్టమీద ఒంటరిగా వున్న విశాల కనిపించింది. ఇలాంటి పనులు చేస్తున్న చెల్లె మీది ఆగ్రహంతో విక్రమే ఆమెని నీళ్లలోకి తోసేసాడు.
- ఇవేవీ జరగలేదు. జీవితం మీది నిస్పృహతో విశాలనే గుట్టమీదికి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది. దానికి కారణం రెండు సార్లు విఫలమయిన తన ప్రేమలు. తద్వారా వచ్చిన గర్భం. రెండో సారి అప్పటికే పెళ్ళి అయిన వ్యక్తి ప్రేమలో పడిందనేది ఇక్కడ గమనించాల్సిన విషయం.

ఎవరేం చేస్తున్నారిప్పుడు?
విక్రం: ఎక్కడున్నాడో తెలియదు.
వైదేహి: ప్రత్యూష (అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన సినిమా తార) ట్రస్టులో పనిచేస్తున్నట్లుగా చివరి సమాచారం. ఈ ట్రస్టుని కాంటాక్ట్ చేయడం కోసం బాగా ప్రయత్నిస్తున్నాం కానీ తెలియడం లేదు. ఎవరికయినా ఫోను, అడ్రసు వివరాలు తెలిస్తే ఇవ్వగలరు.
సందీప్: సూర్యాపేటలో ప్రభుత్వ ఉద్యోగం
వెంకట్: సమాచారం లేదు

ఈ సంఘటన సుమారుగా పద్ధెనిమిది ఏళ్ళ క్రితం జరిగింది. ఖచ్చితమయిన సంవత్సరం, తేదీ నాకు గుర్తులేవు. సందీపుకి ఏమయినా గుర్తుకువున్నాయేమో కనుక్కోవాలి.

ఇక ముందు: హతురాలు అందించిన కోడును ఎవరయినా ఛేదించగలిగితే అందులో పనికివచ్చే సమాచారం ఏమయినా వుంటే ఆ దిశగా ఏమయినా ప్రయత్నాలు చేయవచ్చు. ఈ సారి నేను ఇండియా వచ్చేలోగా వైదేహిని కనుక్కుంటానని సందీప్ అన్నాడు. ఆమె ద్వారా మరిన్ని వివరాలు, విశాల మరణించిన ఖచ్చితమయిన స్థలం తెలిస్తే మరో సారి గుట్టమీదికి వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించి వస్తాం. విశాల పేరు మీద ఒక ట్రస్టు పెట్టి కొన్ని మంచి పనులు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాము కానీ ఇంకా కుదిరింది కాదు. ఈ సంఘటన ఆధారంగా ఒక వీడియో ఫిల్మ్ తీయించాలని అనుకున్నాను కానీ అదీ కుదరలేదు. వెంకట్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలని, అతని మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఇంకా అప్పుడప్పుడు సందీప్ ఉబలాటపడుతూనేవున్నాడు.

కొన్ని ముఖ్య విషయాలు:
- విశాలకి ఇదివరలోనే ప్రేమ, పెళ్ళీ అయ్యిందని వెంకట్ వాళ్ళకు బహుశా ఇప్పటికీ తెలియదు.
- తనకీ, విశాలకీ ఎందుకు ముఖ్యంగా తేడాలొచ్చాయో నాకు తెలుసునన్న విషయం, మీకూ తెలుసన్న విషయం సందీపుకి తెలియదు. అతనికి బ్లాగులు చదివేంత దృశ్యం లేదు కాబట్టి ప్రస్తుతానికి ఓకె. తెలిసినా ఏముందిలెండి.
- అన్నట్లు చెప్పడం మరిచేపోయాను - వైదేహి నన్ను ఇష్టపడుతుండేది. నాకూ అమె అంటే కొంత ఇష్టమే వుండేది కానీ అప్పట్లో ఇంకా స్థిరపడకపోయినందున ఈ ఇష్టాలని పెద్దగా పట్టించుకోలేదు.

కోడ్: ఈ క్రింద ఇచ్చిన కోడును ఛేదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలం అయ్యానని మీకు తెలుసుకదా. దయచేసి మీరూ ప్రయత్నించండి - సరదాగా అయినా - సీరియస్సుగా అయినా. మీకు ఇంకా ఏమయినా వివరాలు కావాలంటే అడగండి. విశాల అప్పట్లో చదివింది ఇంటర్ బై పి సి. ఏదయినా కెమిస్ట్రీ కోడులో వ్రాసిందేమో అనికూడా చూసాము.

17, 29, 38 P 1 17 P 5 50 P 4 29 P 5 45 P 1 46 P 10 36 ? 5 (29 P 3. 29 P 3. 50 P 4.)

P అంటే to the power of అని చదువుకోగలరు. దానికి అర్ధం to the power of అనో కాదో తెలియదు కానీ క్రింది అంకెలకు పైన కొద్దిగా కుడి ప్రక్కన విశాల అలా వ్రాసింది. ? తరువాత వున్న 5 సంఖ్యనేమో 36 క్రింద కొద్దిగా పక్కకు వ్రాసింది. ఆ కన్వెన్షన్ ను ఏమంటారో తెలియక ? నేనే పెట్టాను. 36 తరువాత వున్న అంకె 5 కావచ్చు లేదా మరొకటి కావచ్చు. నేను భద్రపరచిన కాగితం అక్కడ కొద్దిగా తడిచి అంకె సరిగ్గా కనిపించడం లేదు. నాకు అయితే 5 లాగే అనిపిస్తోంది.

మీరు ఎప్పుడయినా భోనగిరి గుట్ట/కోట ఎక్కడం తటస్థించితే ఈ మీ మిత్రుడి కోసం చిన్న పని చేయండి. నా మిత్రురాలు విశాల కొసం ఓ క్షణం శ్రద్ధాంజలి ఘటించండి. భోనగిరికి దగ్గర్లో వున్నవారు, హైదరాబాదులొ వున్నవారు ఒకసారి అయినా అక్కడికి పిక్నిక్ గా వెళ్ళడం చక్కగా వుంటుంది. అలా వెళ్ళి ఆ కోట చరిత్రలోకి, ఈ 'విశాల ' చరిత్రలోకి వెళ్ళి రావడం మీకు ఓ మంచి అనుభూతిని ఇవ్వగలదు. ఎవరయినా వెళ్ళినప్పుడు నాకూ తెలియపరిస్తే నా చక్కటి మిత్రురాలు గడిపిన ఊరిలో, గడిపిన ప్రదేశాల్లో మీరూ తిరుగాడారన్న విషయం నన్ను ఆహ్లాదపరుస్తుంది. మరచిపోకండేం!

13 comments:

  1. క్లూ కష్టంగానే ఉంది... అయినా ప్రయత్నించి చూస్తాను...

    క్లూ ఇస్తూ రాసినదే తన చివరి ఉత్తరమా? ఆ ఉత్తరం రాసాక ఎంత కాలానికి ఆవిడ మరణించారు?
    అన్నట్టు అసలు విశాల గారు క్లూ ఎందుకు ఇచ్చారు?
    అంటే తను చనిపోతారని తనకి ముందే తెలుసా?
    లేదంటే అలా సరదాకి క్లూస్ ఇవ్వటం లాంటి అలవాటు ఆమెకి ఉండేదా?

    నేను ఉండేది హైదరాబాద్ లోనే... భోనగిరి వెళ్లాను (యాదగిరిగుట్టకి వెళ్ళే మార్గంలో) కాని ఎప్పుడు కోట వైపు వెళ్ళలేదు. తప్పకుండా వెళ్ళటానికి ప్రయత్నిస్తాను.

    ReplyDelete
  2. ఈ కోడ్ గురించి తన ఉత్తరంలో తను ఏమని ప్రస్తావించారు?
    అంటే... 'ఫలానా విషయం గురించి క్లూ ఇస్తున్నాను కనుక్కో'... అలా ఏమైనా అన్నారా?

    ReplyDelete
  3. ఇదేదో నాకు అంకెల గారడీగా వుంది.



    తెలుగు వర్ణమాల లో అక్షరాలకు అంకెలు వేయండి. అలాగే తలకట్టు,దీర్ఘము,గుడి,గుడిదీర్ఘము... ( గుణింతాలు ) మొదలైన వాటికి కూడా అంకెలు ఇచ్చుకోండి. అలాగే వత్తులకు కూడా అంకెలు ఇవ్వండి.



    ఇప్పుడు క్రిందగా వ్రాసిన అంకెలను ఆ అక్షరాలతో , టుదిపవర్ ఆఫ్ అన్న వాటిని ఆ అక్షర గుణింత అక్షరంతో, టుదిబేస్ ఆఫ్ అన్నవాటిని వత్తు అక్షరంగా మార్చి చూడండి. ఏమైనా క్లూ దొరుకుతుందేమో !!!

    ఆమె తెలుగు కు మొత్త 50 అక్షరాలనే పరిగణించినట్టుంది.

    అంటే .. ఇప్పుడు క కి 17, డ కి 29 అయితే మొదటి రెండక్షరాలు " కడ " అన్నమాట. 17 P 5 = కీ



    సరదా సూచన మాత్రమే.. !!!

    ReplyDelete
  4. @ చైతన్య
    త్వరగా స్పందించినందుకు ధన్యవాదాలు. భోనగిరి టవున్ని ఆనుకునే ఆ కోట వుంటుంది కాబట్టి అది మీరు చూసే వుంటారు. మీరు వెళ్ళే ప్రయత్నం చేస్తాననడం సంతోషంగా అనిపించింది :)

    చాలా ఏళ్ళు అయ్యింది కాబట్టి అప్పటి విషయాలు స్పష్టంగా గుర్తుకులేవు. అదే చివరి ఉత్తరమో లేక చివరి మూడు ఉత్తరాల్లో ఒకటో అయి వుండవచ్చు. నాకు గుర్తుకు వున్నంతవరకు ఆ ఉత్తరం వ్రాసిన కొన్ని వారాలు, లేదా నెల చుట్టుపక్కల మరణించింది. ఆమెకు అలా క్లూలు ఇచ్చే అలవాటు లేదు - సందీప్ కూడా అలా ఏమీ అనలేదు. తను ఆ క్లూ ఎందుకిచ్చిందో కూడా తెలియదు. ఫలానా విషయం అనీ చెప్పలేదు. మిగతా ఉత్తరం సాధారణంగానే అనిపించింది - పెద్దగా విశేషంగా ఏమీ అనిపించలేదు. చివరకు మాత్రం ఒక విషయం/రహస్యం (సరిగ్గా ఏ పదం వుపయోగించిందో గుర్తుకులేదు) చెబుతున్నాను కనుక్కో అని వుంది.

    ReplyDelete
  5. @ రామిరెడ్డి
    నేను మీ అందరికీ పనిబెడితే మీరు మళ్ళీ నాకే పనిపెట్టారు కదా :) మీ ఐడియా బావుంది. ఆ రకంగా అప్పుడు ప్రయత్నించామా లేదా అన్నది గుర్తుకులేదు. ఇక మరచిపోయిన తెలుగు అక్షరాలను గుర్తుకు తెచ్చుకొని కుస్తీపడతాను.

    ReplyDelete
  6. మీరేదో డిటెక్టివ్ నవల చదివి ఆ ప్రయోగం మా మీద చేస్తున్నట్లుంది ...పేర్లు మార్చి రాసుంటారు :) అన్నట్లు మీరుకాని మల్లాది గారి శిశ్యులా:)

    ReplyDelete
  7. @ చిన్ని
    లేదండీ :) ఇది నిజంగానే జరిగింది. భోనగిరిలో పెద్ద వాళ్ళకి చాలామందికి ఈ సంఘటన గుర్తుండే వుంటుంది. విశాల గుర్తుగా నష్టపరిహారంగా వచ్చిన డబ్బుతో గుట్ట మొదట్లో ఒక స్మృతి కట్టిస్తానంది వాళ్ళ అమ్మ కానీ ఆ పని చేసినట్లులేదు.

    ReplyDelete
  8. ఆమె కిష్టమైన పుస్తకంలో పేజీ నంబర్లు మరియు పేరా నంబర్లు ఎందుకు కాకూడదు ?
    లేదా
    ఆ ఉత్తరంలోని అక్షరాలకు పాయంటర్లెందుకు కారాదు ?

    ReplyDelete
  9. @ ఫణి ప్రదీప్
    మీకు వచ్చిన ఆలోచన లాంటిదే ఇవాళ నాకు వచ్చింది. కొన్ని అంకెలను కలిపి గూగుల్ చేస్తే బైబిల్లోకి తీసుకువెళ్ళింది! విశాల పుస్తకాల పురుగు కాదు - మహా అయితే సాధారణ పత్రికలు చదువుతుండేది అనుకుంటా. ఆమెకో ప్రత్యేకంగా ఇష్టమయిన పుస్తకం వుందని అనుకోను.

    సందీప్ దళిత క్రిస్టియన్. ఈమె హిందువు. వీరిది కులాంతర/మతాంతర ప్రేమ/పెళ్ళి. బైబిల్ మీద అంత అవగాహన/ఆసక్తి ఈమెకు వుంటుందనుకోను - ఒక వేళ బైబిల్ పేరాలని ఉటంకించింది అనుకోవడానికి. ఎందుకయినా మంచిది బైబిల్ మీద అవగాహన వున్నవారు ఎవరయినా ఒకసారి చూడగలరు.

    ఉత్తరంలోని అక్షరాలకు పాయింటర్లు: హుం. ఏమో మరి. అలా అయితే విషయం తెలిసే అవకాశం లేదు. సందీప్ ఎప్పుడో ఆ ఉత్తరాలని ధ్వంసం చేసాడు.

    ReplyDelete
  10. పుస్తకాల పురుగు కాని పక్షంలో ఇక మిగిలింది ఆ ఉత్తరమే!!!
    అయితే మీకా క్లూ అయితే దొరకపోవచ్చు ఇక. :(

    ReplyDelete
  11. మీరిచ్చిన కోడ్ లో బ్రాకెట్టులో ఉన్న కోడ్ చూస్తే నాకు రెండు ఊహలు వస్తున్నాయి
    1. బ్రాకేట్టులోనిది పదమైన పక్షంలో, మొదటి రెండక్షరాలు ఒకటే. అలాంటి పదాలు ఇంగ్లీషులో చాలా తక్కువ. తెలుగులో చూస్తే "పాపాయి" "బాబాయి" లాంటివి కనిపిస్తున్నాయి. ఆ రకంగా బ్రాకేట్టులోనిది ఒక పేరు అయ్యే అవకాశాలున్నాయి.
    2. బ్రాకేట్టులోనిది వాక్యమైన పక్షంలో ??? నాకలాంటి వాక్యాలు తట్టడం లేదు ప్రస్తుతం. ఆలోచిస్తే తట్టవచ్చేమో...
    ఎందుకంటే మొదటి రెండు పదాలు ఒక్కటే ఉన్న వాక్యం కదా. అలాంటి వాక్యం గుర్తించడం కష్టమే.

    ReplyDelete
  12. @ఫణి ప్రదీప్,
    మీరూ బాగా ప్రయత్నిస్తున్నందుకు సంతోషం. కామాలు, పుల్స్టాపులు కూడా మనం దృష్టిలో వుంచుకోవాలి. మొదటి రెండు అంకెల తరువాత కామాలు వున్నాయి. బ్రాకెట్లలో వున్న అంకెల తరువాత పుల్స్టాపులు వున్నాయి.

    ReplyDelete