హిప్నటిస్ట్ శరత్

మనలో ఈ కోణం కూడా వుందండోయ్. డిగ్రీ చదువుతున్నరోజుల్లోనే తెనాలి వెళ్ళి ఒక హిప్నటిస్టు ఇంట్లో ఓ అయిదురోజులు వుండి నేర్చుకుని వచ్చాను. యండమూరి నవలలు గట్రా చదువుతుండేవాడిని కాబట్టి ఎలాగయినా హిప్నటిజం నేర్చుకోవాలని ఆరాటం వుండి అది నేర్చేసుకున్నాను. దానిమీద పుస్తకాలు సేకరించాను.

కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు నాకు తెలిసిన అందరినీ హిప్నటైజ్ చేసేస్తూవుండేవాడిని. కొంతమంది అయేవారు - కొంతమంది కాకపోయేవారు. అప్పట్లో మా మరదలు, ఆమె ఫ్రెండ్స్ మా ఇంట్లోనే ఎక్కువగా గడిపేవారు. ఆమె స్నేహితురాళ్ళనందరినీ హిప్నటైజ్ చేసాను కానీ మా మరదలు హిప్నటైజ్ కావడానికి ససేమిరా ఒప్పుకోలేదు. ఏదో గొప్ప ప్రమాదం శంకించి వుంటుంది. అటువంటి ప్రమాదాలు ఇందులో ఏమీ జరగవని చెప్పినా వినలేదు. అలా మా బంధువులనీ, మిత్రులనీ హిప్నటైజ్ చేస్తూ, వాటిల్లో ఎన్నో ప్రయోగాలు చేస్తూ కాలక్షేపం చేస్తుండేవాడిని. కొంతకాలం తరువాత దానిమీద ఆసక్తి తగ్గిపోయి పక్కకు పెట్టేసాను.

ఆ తరువాత ఒక సారి విజయవాడలో ఒక ప్రముఖ హిప్నాటిస్ట్ (టి ఎస్ రావు అనుకుంటా పేరు) ఇచ్చిన ప్రదర్శనలో పాల్గొని హిప్నటైజ్ అయ్యాను. నామీద అప్పుడు కొన్ని హిప్నటిజం ప్రయోగాలు చేసారు. త్వరగా, గాఢంగా నేను హిప్నటైజ్ అవుడం గమనించి ఆ ప్రదర్శనలో నామీదనే ఎక్కువ ప్రయోగాలు చూపించారు.

మళ్ళీ నాలోని విద్యని బయటకి తీసి మా ఆవిడ నామాట విననప్పుడల్లా ఆమె మీద ప్రయోగించాలని వుంటుంది కానీ అది జరిగేపని కాదులెండి.

7 comments:

  1. శరత్....మాకు నేర్పుతారా ?

    ReplyDelete
  2. ఈ విషయంలో కూడా ప్రావీణ్యం ఉందా?
    ఆ ఆత్మహత్య గురించి కొంచెం వేగంగా చెప్పేయండి. ఈ మద్య అందరూ ఈ సస్పెన్సుల్లో ఎందుకు పెడుతున్నారో తెలియటం లేదు.

    ReplyDelete
  3. నిజంగా హిప్నటైజ్ అవుతారా? లేకపోతే అదంతా నాటకమా?
    ఆ మధ్య ఏదో పత్రికలో ముప్పయి రూపాయిలకోసం వేళ్ళపై సూదులు గుచ్చించుకున్నానని ఎవరో వ్రాసారు.
    మీరైనా నిజం చెప్పండి.

    ReplyDelete
  4. హిప్నాటిజం గురించి ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. వాటిని పోగొట్టడానికి ఒకట్రెండు టపాలు రాస్తే బాగుంటుంది.

    ReplyDelete
  5. హిప్నాటిజం మీద మీకు తెలిసిన వివరాలతో... వివరంగా పోస్ట్ చేయండి...దాని గురించి తెలుసుకోవటం ఎవరికైనా ఆసక్తికరంగానే ఉంటుంది...

    ReplyDelete
  6. @ మంచు పల్లకి
    మీరు అడిగిన తరువాత ఆ పాఠాలు వ్రాయాలనే ఆలోచన వచ్చింది. www.sainyam.in లో మొదలెట్టాను - చూడండి.

    @ భవాని
    అవునండీ :) బ్లాగర్లలో కథకులు ఎక్కువయ్యారు మరి.

    @ భోనగిరి
    నిజంగానే హిప్నటైజ్ అవుతారండీ. ఇది శాస్త్రీయమయిన విషయం. కొంత మంది దొంగ హిప్నాటిస్టులు కూడా వుంటారు లెండి.

    ReplyDelete
  7. @ నాగన్న, చైతన్య
    సైన్యం అనే కొత్త వెబ్ జైన్ లో ఈ విషయం గురించి వ్రాస్తున్నానండి.

    www.sainyam.in

    ReplyDelete