కెనడా కబుర్లు:
ఓ పదిరోజులు కెనడాకి సెలవులకని వెళ్ళొస్తానని నేను అన్నది గుర్తుకువుండే వుంటుంది. కొన్ని కబుర్లు ఇవండీ. కొంతమంది బంధుమిత్రులను కలుసుకున్నాం - మరికొంత మందిని కలుసుకోలేకపోయాం.
ఇదివరలో మేము గడిపిన టొరొంటో డవుంటవున్ చూద్దామ అనుకున్నాం కానీ కుదరలేదు. కొత్తగా కట్టిన స్వామీ నారాయణ గుడి చూసాము (నేను నాస్తికుడినే అయినా మా ఆవిడకి కార్ డ్రైవరుగా ఇలాంటి గుడుల దర్శన భాగ్యం లభిస్తూవుంటుంది!). గుడి బావుంది - విశాలంగా - పాలరాతితో. ప్రతి పాలరాతి స్తంభం వద్దా 'తాకరాదు ' అని బోర్డులు. తాకాలనే కొరికను అధిగమించడం కష్టమయ్యింది.
నయాగరా జలపాతాలు మరోసారి చూసాం. అలాంటి ఆహ్లాదకరమయిన ప్రదేశాలలో వెచ్చని ప్రియురాలు ప్రక్కన వుంటే బావుంటుంది కాదూ. ప్చ్.
ఆర్ధిక మాంద్యం ప్రభావం అక్కడ కూడా బాగానే వుంది. నేను కలుసుకున్నవారిలో కొంత మంది ఉద్యోగాలు పోయి క్రిందా మీదా పడుతున్నారు.
యు ఎస్ లో స్టేటస్ మీద వుండి వుద్యోగ భద్రత లేనివారికి ఒక చిన్న శుభవార్త. కెనడాలోని ఆల్బర్టా ప్రొవిన్స్(రాష్ట్రం) అటువంటి వారికొసం ఒక ప్రత్యేక వలస విధానం ఏర్పాటుచేసిందంట. ఆ పద్ధతిలో త్వరగా కెనడాకి వలస వెళ్ళవచ్చు. అక్కడ ఏదో ఒకటి చేసుకుంటూ బ్రతికేయవచ్చు - కాకపోతే ఆ రాష్ట్రంలో చలి ఎక్కువ.
5 comments:
స్వాగతం దొరా సుస్వాగతం.
ఇల్లాలితో వెళ్లి ప్రియురాలు పక్కనుంటే బావుంటుందంటారా .....మీ ధైర్యానికి నా జోహార్లండీ శరత్ గారూ ! :) :)
welcome back శరత్ గారు :)
వీలైతే నయాగరా గురించి ఒక పోస్ట్ రాయండి... ఇంకా ఫొటోస్ కూడా పోస్ట్ చేయండి...
pakkane bharya kuda jalapatam chuda daniki vachhinappudu priyu ralu kuda vaste ade jala patam loki tosestundemo . mi adrusta vashattu vechhani priyu ralu leka povadam to batiki batta kattaru .
@మహేశ్
:)
@పరిమళం, అజ్ఞాత
లాభం లేదు - మీ అపోహలు తొలగిపోవాలంటే నా పెళ్ళి చూపులపై ఒక పోస్టు త్వరగా వ్రాయాల్సిందే :))
@చైతన్య
ధన్యవాదాలండి. తప్పకుండా వ్రాస్తాను - ఓ నాలుగు ఏళ్ళు నయాగరా ఫాల్స్ సిటీ (దగ్గర) లోనే వున్నాము కాబట్టి మా అనుభూతులు చెప్పుకోవచ్చు.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి