శుక్రవారం 20 మార్చి 2009

కెనడాకెళ్ళొస్తా

పిల్లలకు స్ప్రింగ్ బ్రేక్. కెనడా నా స్వదేశం కాబట్టి అక్కడ కొన్ని పనులు వున్నాయి. అవి చక్కపెట్టుకొని అక్కడి మిత్రులని, మిత్రురాళ్ళని కలిసిరావడానికి కుటుంబసమేతంగా రేపు బయలుదేరి వెళుతున్నాను. కెనడాలొ టొరొంటో, సయింట్ క్యాథరిన్స్ మరియు నయాగరా ఫాల్స్ సిటీలకు మేము వెళతాము. కెనడాలో ఎవరయినా బ్లాగర్లు వున్నారో లేదో తెలియదు. నేను పేర్కొన్న ప్రదేశాలల్లో ఎవరయినా బ్లాగర్లు వుంటే మనం కలవవచ్చు. ఆసక్తి వుంటే sarathn@hotmail.com కి ఈమెయిల్ చేయండి.

ప్రయాణాలల్లో వుంటూ పెద్దగా బ్లాగగలననుకోను. ఒక పదిరోజులవరకు నా ధారావాహికలు ఏం జరుగుతోంది, ఉరి లు సశేషంగా వుంటాయి.
ఏం జరుగుతోంది చదువుతున్న వారికి: ఆ కుటుంబానికి కనిపించినదేమిటో సీరియల్ లో వున్న క్లూల ద్వారా ఊహిస్తూవుండండి.
ఉరి చదువుతున్నవారికి: అతగాడు ఇంతకీ ఉరి వేసుకుంటాడా లేదా?

5 comments:

anveshi చెప్పారు...

happy/safe journey.enjoy ur vacation.

చైతన్య చెప్పారు...

నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి... ఇలా సస్పెన్స్ లో మా మానాన మమ్మల్ని వదిలేసి మీరు హాయిగా తిరగటానికి వెళ్తున్నారా!

నయాగారా ఫాల్స్ చూడాలనేది నాకు ఎప్పటి నుండో ఉన్న కోరిక... ఈ జన్మకి తీరుతుందో లేదో!

చైతన్య చెప్పారు...

శరత్ గారు,
మీకు, మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలండి :)

చైతన్య చెప్పారు...

పది రోజులైపోయిందిగా.. వచ్చేసారా.... ఎలా జరిగింది మీ ట్రిప్?
ఇక సస్పెన్స్ ముగించండి ఇప్పుడైనా!

శరత్ 'కాలం' చెప్పారు...

@ అన్వేషి,
థేంక్యూ.

@చైతన్య

వెకేషన్లో వుంటూ మీ వ్యాఖ్యలు చూడటం అప్పుడప్పుడు చూడటం సంతోషంగా అనిపించేది - కానీ బ్యుజీగా వుండి రిప్లయ్ ఇచ్చే సమయం వుండేది కాదు. మన మీద శ్రద్ధ వహించేవారు ఒకరంటూ వుండటం హాయి అనిపిస్తుంది కదా.

వెకేషన్ నుండి తిరిగివస్తూనే వైరల్ ఇంఫెక్షన్ పట్టేసింది. మా కోలీగ్ వెళ్ళిపోయాడు కాబట్టి ఆఫీసులో కాస్త పని ఎక్కువ అయ్యింది - బ్లాగుల్లో వ్రాత తక్కువయ్యింది. మళ్ళీ నెమ్మదిగా బ్లాగావరణంలో పడుతున్నాను.