సోమవారం 16 మార్చి 2009

ఈ శరత్ ప్రేమ కథ

నన్ను సీరియస్సుగా ప్రేమలో పడేసింది మా మరదలు రేఖ (పేరు మార్చాను). నా డిగ్రీ అయిపోయిన తరువాత సాంఘిక సేవ మీద ఆసక్తితో ఒక ఏడాది అది చేసి తరువాత గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటున్న రోజులవి.

ఒక రోజు రేఖ అడిగింది. "పెళ్లెప్పుడు చేసుకుందాం?"
"పెళ్ళి?"
"ఆహా. ఇన్నాళ్ళ నుండీ ప్రేమించుకుంటున్నాము కదా. మరి మన పెళ్ళి ఎప్పుడు?"
"ప్రేమ?"
"అదేంటీ అలా అంటావూ?"
"మరి? మన మధ్య ప్రేమ ఏమిటి?"
"నను ప్రేమిస్తూనేవున్నావుగా!"
"ప్రేమిస్తున్నానా!?"
"ప్రేమగా వుంటూ వస్తున్నావు కదా"
"నేను అందరు అమ్మాయిలతోనూ ప్రేమగానే వుంటాను"
"అందరితో అలాగే వుంటావా!"
"ఆహా"
"ఎందుకలా!"
"విశాల భావాలు మనవి. ప్రేమకి హద్దులు లేవని"
"సరే గానీ ఇకపై నన్ను ప్రేమించు"
"కుదరదు"
"ఏం?"
"సోషల్ సర్వీస్ చేయాలనుకుంటున్నా. ప్రేమలు, పెళ్ళిళ్ళు మనకు సరిపడవు"
"మరి నేను ఏమయిపోవాలేంటి?"
"నేను బాధ్యుడిని కాదు. ఒక్కసారన్నా నేను ప్రేమిస్తున్నానని చెప్పానా?"
"చెప్పలేదనుకో కానీ నువ్వు ప్రేమిస్తున్నావనుకొని నేను ప్రేమిస్తూవస్తున్నానే!"
"దాందేముంది. ఇప్పుడు ప్రేమించకు"
"అలా నాకు కుదరదు. జీవితంలో ఒక్కడినే ప్రేమిస్తా నేను. నిన్ను ఆల్రెడీ ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు కూడా నన్ను ప్రేమించు. మనం పెళ్ళి చేసుకుందాం. ఓ పని అయిపోతుంది"
"మరి నా సోషల్..."
"ముందు నా సర్వీస్ చేయి. ఆ తరువాత నీతో కలిసి నేనూ (సోషల్) సర్వీస్ చేస్తా"
"నిజ్జంగా!"

ఎటూ తేల్చుకోలేక మా ఇంట్లో అందరినీ కోర్చోబెట్టి సలహా అడిగేను. అందరూ రేఖకే వోటు వేసారు ఎందుకంటే మా ఇంట్లో నాకంటే రేఖకే ఎక్కువ గౌరవం కాబట్టి! నా తొట్టి గ్యాంగు (ఫ్రెండ్స్)ని అడిగాను. వారుకూడా ఆమెకే వోటు వేసారు - నువ్వు ప్రేమించే అమ్మాయికంటే నిన్ను ప్రేమించే అమ్మాయి - అందులో తెలివయిన అమ్మాయి దొరకడం నా అదృష్టం కాబట్టి నేను ఆమెతో లవ్వులోకి దిగాల్సిందేనట.

బాగానే వుంది. కాకపోతే చిన్న సమస్య.
అదే రేఖతో చెప్పాను. "నేను మంచి వాడిని కాదు"
"నాకు తెలిసీ నీలో మరీ గొప్ప అవ లక్షణాలులేవే!"
"మరదే. నాకు మండుద్ది. నాలో ఒకటి వుంది. నీకు నచ్చదు. ప్రేమ క్యాన్సిల్ చేస్కో"
"ఏంటది?"
చెప్పాను.
ఒక నిమిషం దీర్ఘ నిశ్వాస విడిచింది. ఓ రెండు నిమిషాలు ఆలోచించి అంది "ఇంతకుముందు సరే. ఇకనుండి మానివేయ్"
"నా వల్ల కాదు. అవి నా భావాలతో కూడుకున్న పనులు"
"అవుతుంది"
"కాదు"
"ఒక పనిచేయి. నాకోసం ఒక్క మూడు ఏళ్ళు ఆ అలవాట్లు మానివేయి. ఆ తరువాత నీ ఇష్టం"
"మూడు ఏళ్ళు!"
"అవును. మూడు ఏళ్ళు"
"ఆ తరువాత ఏమవుతుంది?"
"ఒక మూడు ఏళ్ళు నీ అలవాట్లు మానుకోగలిగితే జీవితాంతం మారే సమర్ధత నీకే వస్తుంది. అప్పుడు ఇంత మొండిగా మాట్లాడలేవు. నా ప్రేమతో నిన్ను ఈ మూడేళ్ళలో మార్చుకుంటాను"
"నిజంగా!"

మూడేళ్ళే అంది కదా అని ఒప్పుకున్నాను. తరువాత ఆమె ప్రేమలో పూర్తిగా తలమునకలయ్యి ఆమెకోసం ఎన్నెన్నో త్యాగాలు చేసాను. బుద్ధిమంతుడిగా మారాను. ఒక ఏడాదిన్నర తరువాత వేరే కారణాల వల్ల మామధ్య మనస్పర్ధలు వచ్చాయి. ప్రేమ క్యాన్సిల్ చేసుకున్నాము. గౌరవంగా విడిపోయాము.

అయినా సరే ఆమెకిచ్చిన మాటప్రకారం మిగతా ఏడాదిన్నర కాలం కూడా బుద్ధిగా మసిలాను. తరువాత నా రూటుకి నేను వచ్చేసాను.

5 comments:

చైతన్య చెప్పారు...

విడిపోయాక కూడా ఆమె మాటని గౌరవించానంటున్నారు.... అది నిజంగా గ్రేట్!

అజ్ఞాత చెప్పారు...

intaki mi aa alavatu manara maradalu velli poindani modatike vachhara ?

శరత్ 'కాలం' చెప్పారు...

@చైతన్య
మేము విడిపోయినా ఆమె అంటే గౌరవమే నాకు. క్రితం సారి ఇండియా వెళ్ళినప్పుడు ఆమెను కలిసి కొద్దిసేపు మాట్లాడివచ్చాను. కొన్ని ఏళ్ళు ఒకరిపట్ల ఒకరికి ద్వేషం వున్నా ప్రస్తుతం పరస్పర గౌరవం వుంది.

ఆ వాగ్దానానికి అప్పట్లో కట్టుబడి వున్నట్లు ఆమెకు చెప్పే సమయం ఇంకా నాకు చిక్కలేదు. ఈ సారి ఇండియా ట్రిప్ లో ప్రయత్నిస్తాను. మీలాగే ఆమెకూడా మెచ్చుకుంటుందని ఆశిస్తాను.

@ అజ్ఞాత
చివరి పేరా చదవలేదా :)

చైతన్య చెప్పారు...

తప్పకుండా మెచ్చుకుంటారు :)

చక్రవర్తి చెప్పారు...

ఇంతకీ ఏమి చెప్పారు? ఆ విషయం దాచేసారే!!!