నచ్చావు బావా!

అందరిలాగే నాకూ కొన్ని ప్రేమ కథలు వున్నాయి. డిగ్రీ వెలగబేడుతున్న రోజుల్లో మా పక్కింటి అమ్మాయి నా డైరీ తీసుకొని అందులో ఇలా వ్రాసింది: "బావా నువ్వు నాకు నచ్చావు, నా కలల రాకుమారుడివి నీవే. ఐ లవ్ యూ". బావుంది. సహజంగానే నేను సంతోషించాను. ఆ అమ్మాయి చదివేది 9వ తరగతి. బంధువులేమీ కారుగానీ వరుస అయితే వుంది.

ఆ తరువాత ఆ అమ్మాయిని అడిగాను. "నాలో ఏం చూసి ప్రేమించావు?"
"నీ మంచి తనాన్ని చూసి"
"ఛ! నేను అంత మంచోడిని ఏమీ కాదు"
"లేదు. నువ్వు మంచాడివే"
"నిజంగా! హు! సరే. ఓ పనిచేయి. ఒక ఆరు నెలలు నా మంచితనం ఎంత మంచిదో గమనించు. ఆ తరువాత కూడా నేను నచ్చితే అప్పుడు ఆలోచిద్దాం"

ఆ తరువాత రెండు నెలలకి వారి కుటుంబం ఖమ్మం మారింది. మరో ఆరు సంవత్సరాలదాకా ఆ అమ్మాయి కనపడలేదు నాకు. అప్పటికి మరో అమ్మాయి ప్రేమలో పీకల్దాకా నిండివున్నాను.

4 comments:

  1. "బంధువులేమీ కారుగానీ వరుస అయితే వుంది"....ఇదేం లాజిక్ అండీ!?

    ReplyDelete
  2. @ చైతన్య
    మనకు బంధువులు కాకపోయినా పక్క ఇంటివారిని, తెలిసిన వారిని పిన్నీ, బాబాయి అంటూ వుంటాము కదా. అలాంటి పక్కింటివారి బంధువులు వీళ్ళు. వీళ్ళు కూడా వచ్చి మా పక్కింట్లో చేరారు. అలా వరుస కలిసింది.

    ReplyDelete
  3. అంతేలెండి... అమ్మాయి ఉన్న వాళ్ళైతే అత్తా మామ అవుతారు... లేదంటే పిన్ని బాబాయి అవుతారు... అంతేగా :D

    ReplyDelete
  4. @ చైతన్య
    అంతే అంతే :))
    వరుస కుదరకపోవడం వల్ల మా బంధువుల్లో నాకు బాగా నచ్చిన ఓ అమ్మాయిని పెళ్ళిచేసుకోలేకపోయానని ఇప్పటికీ చింతిస్తుంటాను.

    ReplyDelete